How is Share Price Calculated? Let’s find out!

Podcast Duration: 5:53
షేర్ ప్రైస్ ను ఎలా లెక్కించాలి? తెలుసుకుందాం? ​హాయ్ ఫ్రెండ్స్, ఏంజిల్ బ్రోకింగ్ ప్రాడ్ క్యాస్ట్ కు స్వాగతం! ​ ​మిత్రమా స్టాక్ ఎక్స్ఛేంజ్ లలో ప్రతి రోజూ లక్షలాది లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అందులో ఆ ఎక్స్ఛేంజ్ లల్లో లిస్ట్ అయిన కంపెనీల షేర్ల ఇంటెన్స్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఇలాగే ఒక రోజు నేను మరియు శిఖా మా కంపెనీ షేర్ల కదలికలను అతి జాగ్రత్తగా ఫాలో చేస్తున్నాము. COVID తర్వాత ఏర్పడిన ఆర్థిక మాంద్యం నుండి అపుడప్పుడే కోలుకుంటున్నాము. ఆ సమయంలో టెక్ మరియు ఫార్మా స్టాక్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. మేము కూడా మా డబ్బును ఒక టెక్నాలజీ రంగానికి చెందిన మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాము. అందులో ఒక కంపెనీ రెండు రోజులుగా బాగా గెయిన్ చేస్తూ వస్తోంది. రెండు రోజుల నుండి ఆ స్టాక్ గెయిన్ చేస్తున్న తీరును మేము గమనిస్తూ ఉన్నాము. ఆ స్టాక్ యొక్క ధర సెకన్లలోనే మారుతూ ఉండడాన్ని గమనించిన శిఖా ఈ ధరలు ఇంత వేగంగా కేవలం సెకన్ల వ్యవధిలో ఎలా లెక్క కట్టగలుగుతారు అని ప్రశ్నించింది. అప్పుడు నేను ఆమెకు స్టాక్ ధరలను లెక్క కట్టే విధానాన్ని వివరించాను. అదే విషయాన్ని ఇప్పుడు నేను మీకు కూడా వివరించబోతున్నాను. ఎందుకంటే, మీకు కూడా ఈ అనుమానం ఏదో ఒక సమయంలో వచ్చే ఉంటుంది. ఔనా? ​సరే, అయితే షేర్ల ధరలు ఎలా లెక్క కడటారో చూద్దాం పదండి. ​మిర్తులారా, ఒక కంపనీ పబ్లిక్ లోకి వెళ్ళిన సమయంలో మొట్టమొదటి సారిగా ఆ కంపనీ షేర్ల ధరను లెక్క కట్టడం జరుగుతుంది అంటే అవి స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ కావడం మొదలు పెట్టినప్పడన్నమాట. ఆ సమయంలో మొట్టమొదటి సారి కంపనీ యొక్క షేర్ ధరను లెక్క కట్టడం ద్వారా ఆ కంపనీ యొక్క వ్యాల్యుయేషన్ చెయ్యడం జరుగుతుంది. వ్యాల్యూయేషన్ అంటే అదేదో పెద్ద మాటగా మీకు అంబిపిస్తూ ఉండవచ్చు, కానీ అది అంత క్లిష్టమైనదేమీ కాదు. ​ ​వ్యాల్యుయేషన్ అంటే ఆ కంపెనీ యొక్క విలువ అన్న మాట. ఈ విలువ అన్నది కంపనీ యొక్క ప్రస్తుత ఆస్తులు, అప్పులు, ఆదాయాలు, ప్రస్తుతం ఉన్న పేటెంట్లు వంటే ఫ్యాక్టర్స్ ఆధారంగా లెక్కించబడుతుంది. ఆస్తులు అంటే – రియల్ ఎస్టేట్, ఆపరేషనల్ ఎక్విప్మెంట్, కంప్యూటర్లు, ఫర్నీచర్, కమాడిటీస్ మొదలైనవి. అప్పులు అంటే కంపనీ చెల్లించవలసిన అప్పులు – అంటే లోన్లు మొదలైనవి. వ్యాల్యుయేషన్ జరిగిన తర్వాత, కంపనీ యొక్క ఇష్యూ సైజ్ నిర్ణయించబడుతుంది. అనగా IPOలో ఆఫర్ చేయబోయే షేర్ల సంఖ్య అన్నమాట. వ్యాల్యుయేషన్ ను ఈ సంఖ్యతో డివైడ్ చెయ్యడం ద్వారా షేర్ యొక్క ఆఫర్ ధర నిర్ణయించబడుతుంది. మిత్రులారా, ఇదండీ కంపనీ మొట్టమొదటి సారిగా మార్కెట్ లో ప్రవేశించినపుడు షేర్ ధరను మొదటి సారి నిర్ణయించే విధానం. ​మరి ఆతర్వాత? ఆతర్వాత షేర్ ధరను ఏ విధంగా లెక్కిస్తారు? ఇక్కడే క్లాసిక్ ఎకనామిక్ ప్రిన్సిపిల్స్ మనకు సహకరిస్తాయి. మీకు డిమాండ్ అండ్ సప్లై సూత్రం తెలుసుకదా? ​ ​ఈ సూత్రం మేరకు ఏ వస్తువుకైనా డిమాండ్ పెరిగేకొలదీ దాని ధర పెరుగుతుంది. అంటే, ఈ వస్తువును చాలా మంది కొనాలని వెంటపడితే దాని ధర పెరుగుతుందన్నమాట. అయితే, ఒక వస్తువుకు డిమాండ్ తగ్గితే, దాని ధర కూడా తగ్గుతుంది. ​స్టాక్ మార్కెట్ లో కూడా ఏ షేర్ ధర అయినా నిర్ణయించే సమయంలో ఈ సూత్రమే వర్తిస్తుంది. తద్వారా కొన్ని షేర్ల ధరలు పెరుగుతూ పోతుంటాయి. మరియితే, స్టాక్ ఎక్స్ఛేంజీలలో సప్లై – డిమాండ్ ను అంత ఖచ్చితంగా ఎలా లెక్కిస్తారు? ​అంటే, దీనికి సమాధానం – కొన్ని నిర్ణీత నిముషాలకు అందే బై అండ్ సెల్ ఆర్డర్స్ ఆధారంగా అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క సెకనుకు స్టాక్ ఎక్స్ఛేంజీలలో వేలాది బై అండ్ సెల్ ఆర్డర్లు పోస్ట్ అవుతూ ఉంటాయి, మీరు ఏదైనా ఒక షేర్ యొక్క ఆస్క్ అండ్ బిడ్ స్ప్రెడ్ గ్రాఫ్ చూసినట్లయితే, స్టాక్ ఎక్స్ఛేంజీలు బేసిక గా సప్లై ని డిమాండ్ తో మ్యాచ్ చేస్తుంటాయని మీకు అర్థమవుతుంది. ఈ ప్రక్రియలో, షేర్ల ధరలను నిరంతరం బై అండ్ సెల్ ఆర్డర్ల తో పరిష్కరించబడే డిమాండ్ కు రెస్పాండ్ అవుతూ ఉంటాయి. మార్కెట్లు ఓపన్ లో ఉన్నపుడు షేర్ల ధర ప్రతి సెకనుకు అప్ అండ్ డౌన్ అవుతూ ఉండడానికి నిజానికి కారణం ఇదే. ఇదిగాక, స్టాక్ మార్కెట్ ధరలు ఫ్లక్చుయేట్ అవడానికి మరో కారణం కూడా ఉంది. కానీ ఇది కూడా సాధారణంగా డిమాండ్ అండ్ సప్లై ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు ఏ కంపనీకి చెందిన ఆస్తులైనా వరదలు, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయినపుడు, జనం ఆ కంపనీ షేర్లను ఇబ్బడి ముబ్బడిగా అమ్మివేయడం జరుగుతుంది. ఆ సమయంలో ఆ స్టాక్ కు డిమాండ్ పడిపోవడం, సప్లై విపరీతంగా పెరిగిపోవడం కరణంగా దాని ధర పడిపోవడం జరుగుతుంది. ​అదేవిధంగా యాన్యువల్ రిపోర్ట్ లో మంచి పనితీరు కనిపించినపుడు ఆ కంపనీ యోక్క స్టాక్ కు డిమాండ్ పెరుగుతుంది, దాంతో ఆ షేర్ ధర పెరుగుతుంది. కాకపోతే, ఈ కారణాలు సాధారణంగా స్టాక్ యొక్క ధరల క్యాలిక్యులేషన్ ను ప్రభావితం చెయ్యవు. ​కానీ ఒక సమయంలో జరుగుతుంది. అది ఏదైనా కంపనీ తన స్టాక్ ను స్ప్లిట్ చేసినపుడు – అంటే ఆ కంపనీ తన ఒక స్టాక్ ను రెండు, లేదా మూడు, లేదా నాలుగు లేదా 20 – 30 స్టాక్స్ గా కన్వర్చ్ చేసినపుడు. ఇన్వెస్టర్ల దగ్గర ఉన్న స్టాక్స్ యొక్క వ్యాల్యూ అలాగే ఉంటుంది. కానీ వాటి సంఖ్య స్ప్లిట్ రేషియో మేరకు మల్టిప్లై అవుతుంది. దాంతో పాటు ఆ స్టాక్ ప్రైస్ కూడా స్ప్లిట్ రేషియో తో డివైడ్ అవుతుంది. అంటే, ఒక స్టాక్ రెండుగా కన్వర్ట్ అయినపుడు, దాని ధర సగం అవుతుంది. 1 స్టాక్ 10 గా స్ప్లిట్ అయినపుడు దాని ధర 10 రేట్లు తగ్గిపోతుంది. ​స్టాక్ ధరల లెక్కింపు చాలా సులభంగా అనిపిస్తుంది కదూ? కానీ స్టాక్ ధరలను స్థిరంగా సర్దుబాటు చేసే సిస్టమ్ లు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఈ సిస్టమ్ లు చాలా హై ఫ్రీక్వెన్సీ పైన ఒక్కో ఆర్డర్ ను స్కాన్ చేసి మ్యాచ్ చేస్తూ ఉంటాయి. మార్కెట్లు తెరిచి ఉన్నపుడు తెరవెనుక జరిగేది ఇదే! ఇది చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్ కదూ? మరిన్ని వివరణాత్మక స్టాక్ మార్కెట్ కన్సెప్త్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, మా ప్రోడ్ క్యాస్ట్స్ ను చూస్తూ ఉండండి లేదా ఉచిత లర్నింగ్ మెటీరీయల్ కోసం www.angelone.in ని సందర్శించండి అంటిల్ దెన్ గుడ్ బై ఫ్రమ్ ఏంజిల్ బ్రోకింగ్ అండ్ హ్యాపీ లర్నింగ్ ​సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకొని ఉంటాయి. అందువల్ల ఇన్వెస్ట్ చేసే ముందు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చదవండి. ​