What is the difference between RII, NII, QIB and anchor investor?

Podcast Duration: 6:58
ఆర్ఐఐ, ఎన్ఐఐ, క్యూబీ మరియు యాంకర్ ఇన్వెస్టర్ మధ్య తేడా ఏమిటి? ​హాయ్ ఫ్రెండ్స్, ఏంజిల్ బ్రోకింగ్ ప్రాడ్ క్యాస్ట్ కు స్వాగతం! ​RII, NII, QIB అండ్ ఆంకర్ ఇన్వెస్టర్స్ కు మధ్య తేడా ఏమిటో, అది ఎలా వచ్చిందో తెలుసుకుందాం పదండి ​ ​మీరేమనుకుంటున్నారు, ఆక్రోనిమ్స్ కేవలం మిల్లెనిఅల్స్ అండ్ జెన్ జి వ్యక్తుల ద్వారా వస్తాయా? LOL, ROFL, YOLO, FOMO వంటి షార్ట్ ఫాంస్ మాత్రమే ఉంటాయా? లేదండీ, షార్ట్ ఫాంస్, ఆక్రోనైంస్ అంటే స్టాక్ మార్కెట్ చాలా ఇష్టపడుతుంది. RII, NII and QIB అన్నవి IPOలకు లింక్ చేయబడిన కొన్ని ప్రత్యేకమైన అబృవేషన్లు. అసలు IPO అన్నదే ఒక షార్ట్ ఫామ్. దీని పూర్తి పేరు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే, ఒక కంపనీకి చేయిందిన షేర్లను మొట్టమొదటి సరిగా ప్రజలకు అమ్మకానికి పెట్టడం అన్నమాట. విమానం ఎక్కే సమయంలో బిజినెస్ క్లాస్, సీనియర్ సీజన్స్, గర్భిణీ స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈ కేటగిరీలు IPOలలో ప్రాధాన్యతా క్రమంలో ఉంటాయి. ఈ కేటగిరీ చేసే విధానాన్ని SEBI ప్రవేశపెట్టింది. RII అంటే రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ అని అర్థం. NII అంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. QIB అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్. ఇక యాంకర్ ఇన్వెస్టర్ పూర్తి గానే చెప్పుకోవడం జరుగుతోంది. దాదాపు అందరూ ఇన్వెస్టర్లు లేదా చాలామంది ఇన్వెస్టర్లు IPO ల్లో పాల్గొనే అవకాశం ఉంది కనుక వారిని ప్రాధమికంగా ఈ నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగింది. దేఐనా IPO మార్కెట్లోకి వస్తోంది అంటే సహజంగానే జనంలో చాలా ఉత్కంఠత నెలకొని ఉంటుంది. జనమంతా IPOలో షేర్లు కొనాలని ఎందుకనుకుంటారంటే ఇది వారికి ఒక లాభదాయకమైన సంపాదన అవకాశంగా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే, ఈ ఎర్నింగ్ పొటెన్షియాలిటీ అన్నది ఒక్కో IPOకు ఒక్కో రకంగా ఉంటుంది. అందువల్ల వీటిలో పెట్టుబడి పెట్టె ముందు ఇన్వెస్టర్లు బాగా ఆలోచించి పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ​ఈ రోజు మనం చర్చ కొరకు మనం చెప్పుకునే అంశం ఏమిటంటే, సాధారణంగా IPOలకు సప్లై కంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గరిష్ట సంఖ్యలో ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించడం కొరకు SEBI ఇన్వెస్టర్లను 4 కేటగిరీలుగా విభజిస్తుంది. ప్రతి కేటగిరీకి IPOలో ఖచ్చితంగా కొంత శాతం కేటాయించడం జరుగుతుంది. ​ముందుగా మనం RII కేటగిరీ గురించి తెలుసుకుందాం ఈ RII లేదా రీటైల్ ఇండివీజువల్ ఇన్వెస్టర్లకు 35 శాతానికి తగ్గకుండా షేర్లను కేటాయించడం జరుగుతుంది. అయితే వీరు 200,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో షేర్లు కొనడానికి వీలు లేదు. ఎక్కువమంది జనాలకి పెట్టుబడి అవకాశం లభించాలనే ఉద్దేశంతో ఈ లిమిట్ పెట్టడం జరిగింది. రెసిడెంట్ ఇండియన్స్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ మరియు హెచ్‌యుఎఫ్‌లు ఈ విభాగంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ​మొత్తం షేర్లలో 35 శాతం అలాట్ చేసిన తర్వాత కూడా IPO ఓవర్ సబ్స్క్రైబ్ కావచ్చు, దాని వల్ల IPO కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ విక్రయించడానికి తగిన షేర్లు ఉండకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో IPO రెట్టింపు గా ఓవర్ సబ్స్క్రైబ్ అయినట్లయితే, ప్రతి ఇద్దరు ఇన్వెస్టర్లలో ఒకరికి షేర్లు అలాట్ చెయ్యడం జరుగుతుంది. ఒకవేళ మూడు రెట్లు, నాలుగు రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు లాటరీ ద్వారా షేర్లు కేటాయించడం జరుగుతుంది. ​RII కేటగిరీ కింద IPO షేర్లను కొనుగోలు చేసే ఇన్వెస్టర్లు కట్-ఆఫ్ ధర వద్ద షేర్లను కొనుగోలు చేయవచ్చు. కటాఫ్ ధర అంటే IPOకు ఉన్న డిమాండ్ ను బట్టి కంపనీ నిర్ణయించే ధర అన్నమాట. కటాఫ్ ధరకు IPO కొనాలనుకునే ఇన్వెస్టర్లు చాలా ఎక్కువ ధరతో లేదా అత్యధిక ధరతో బిడ్ వేయాల్సి ఉంటుంది. ఒకవేళ వారు బిడ్ చేసిన ధరకంటే తక్కువ కు కటాఫ్ ధర నిర్ణయించబడినట్లయితే, వారు ఎక్కువగా చెల్లించిన మొత్తం వారికి తిరిగి చెల్లించడం జరుగుతుంది. తమకు ఆలాట్మెంట్ జరిగే లోపు RII లు ఎప్పుడైనా తమ బిడ్ ను ఉపసంహరించుకో వచ్చు. ​నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, లేదా NII లు IPO లో 15 శాతం కంటే తక్కువ కాకుండా కేటాయింపు పొందుతారు. ఈ కేటగిరీలోని ఇన్వెస్టర్లు కూడా 2,00,000 రూపాయల వరకు మాత్రమే దరఖాస్తు చేయవలసి ఉంటుంది. రెసిడెంట్ ఇండియన్లు, HNI, NRI లు HUFలు కంపనీలు, ట్రస్ట్ లు, సైటిఫిక్ ఇన్స్టిట్యూషన్లు, సొసైటీలు ఈ కేటగిరీ క్రింది దారకాస్తు చేసుకోవచ్చు. ​ఈ కేటగిరీలో ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల తరచూ 15 శాతం అలాట్మెంట్ తక్కువ పడుతూ ఉంటుంది. ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగిన సందర్భాల్లో అలాట్మెంట్ దామాషా పద్ధతిలో జరుగుతుంది ఉదాహరణకు IPO 10 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయిందనుకోండి, అప్పుడు 100 షేర్ల కోసం దారకాస్తు చేసుకున్న వారికి 10 షేర్లు కేటాయించడం జరుగుతుంది. తమకు ఆలాట్మెంట్ జరిగే లోపు NII లు ఎప్పుడైనా తమ బిడ్ ను ఉపసంహరించుకో వచ్చు. ​RII లకు వర్తించే నిబంధనల్లో చాలా వరకు NII లకు కూడా వర్తిస్తాయి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే NII లు కటాఫ్ ధరకు బిడ్ చేసేందుకు వీలు లేదు. ​క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్స్ (వీరినే QIBs అని కూడా అంటారు) వీరు పెద్ద ఇన్వెస్టర్లు – బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు, ఈ కేటగిరీ క్రిందికి వస్తారు. మొత్తం ఆఫర్ లో 50 శాతం వీరికి కేటాయించడం జరుగుతుంది. ఈ కేటగిరీ క్రింద దరఖాస్తు చేసుకునే ఇన్వెస్టర్ కు SEBI రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ ఇన్వెస్టర్లు కటాఫ్ ధరకు బిడ్ చేసేందుకు వీలు లేదు. అంతేకాదు వీరు ఒకసారి బిడ్ చేసిన తర్వాత ఇక ఉపసంహరించుకోవడానికి వీలు లేదు. SEBI నిబంధనల మేరకు QIBలకు ఇది నిషేధించబడింది. మనం ముందు చెప్పుకున్న కేటగిరీ ఇన్వెస్టర్లలా వీరు చివరి క్షణంలో ఉపసంహరించుకునే అవకాశం లేదు. ​యాంకర్ ఇన్వెస్టర్లు లేదా QIBలు 10 శాతం లేదా 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. QIBలలో 60 శాతం మండి యాంకర్ ఇన్వెస్టర్లే. ఈ యాంకర్ ఇన్వెస్టర్ కోసం ఆఫర్ పీరియడ్ వేరుగా ఉంటుంది. వీరికొరకు ఆఫర్ ధర కూడా వేరుగా సెట్ చెయ్యడం జరుగుతుంది. ​ఈ యాంకర్ ఇన్వెస్టర్లు IPO మార్కెట్ లోకి రాక ముందే కొంత హంగామా చెయ్యడం మీరు గమనించే ఉంటారు. వీళ్ళు హీరోలు. వీరు వీరికి అనేక నిబంధనలు ఉంటాయి– మర్చెంట్ బ్యాంక్స్ ఆఫ్ ద కంపనీ, ప్రమోటర్ల దగ్గరి బంధువులు ... యాంకర్ ఇన్వెస్టర్లు కాలేరు. ​మీరు IPO లో ఇన్వెస్ట్ చెయ్యాలనుకున్నా లేదా ప్రస్తుతం ఉన్న స్టాక్స్ ను కొనుగోలు చెయ్యాలనుకున్నా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఏంజెల్ బ్రోకింగ్ యాప్ ద్వారా వెంటనే ప్రారంభించండి. ​ఏంజిల్ బ్రోకింగ్ యాప్ ను మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మా బ్లాగ్స్ ద్వారా, వీడియోల ద్వారా, మా పోడ్ క్యాస్ట్ ల ద్వారా కేవలం 1 – 2 రోజుల్లోనే మీ స్టాక్ మార్కెట్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు ​IPO మార్కెట్లో చాలా ఉత్సాహాన్ని సృష్టిస్తుందన్న విషయం నిజం. కానీ మీరు గుంపు వెంట పరుగులు తీయకండి. మీరు స్వయంగా రీసర్చ్ చేసి, ఇందులో ఎర్నింగ్ కు పొటెన్షియాలిటీ ఉందా లేదా చూసి మీ నిర్ణయం మీరు తీసుకోండి. ​నెక్స్ట్ ప్రోడ్ క్యాస్ట్ లో మళ్ళీ కలుద్దాం, అంటిల్ దెన్ గుడ్ బై ఫ్రమ్ ఏంజిల్ బ్రోకింగ్ అండ్ హ్యాపీ లర్నింగ్. ​సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకొని ఉంటాయి. అందువల్ల ఇన్వెస్ట్ చేసే ముందు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చదవండి. ​