What is Public Float ?

Podcast Duration: 5:32
పబ్లిక్ ఫ్లోట్ ఏమిటి? ​హాయ్ ఫ్రెండ్స్, ఏంజిల్ బ్రోకింగ్ ప్రాడ్ క్యాస్ట్ కు స్వాగతం! ​ ​మిత్రమా నిన్న నేను మా కాలేజ్ ఫ్రెండ్ రవి తో వీడియో కాల్ లో మాట్లాడుతున్నాను. మేము కలిసి చాలా రోజులైందని అనుకున్నాము. మేము ముఖాముఖీ కలిసే అవకాశమైతే అసలు లేనేలేదు. అబ్దుకే వీడియో కాల్ ద్వారానే కలుసుకుంటూ ఉంటాము. రవి నాకు చాలా పాత మిత్రుడు. కాలేజ్ రోజుల్లో నేను, నా ఫ్రెండ్స్ అందరమూ అతడితో స్టాక్ మార్కెట్ గురించి రోజంతా చర్చించే వాళ్ళం. ఇన్ ఫ్యాక్ట్, రవి లెక్కల్లో చాలా చురుకైన వాడు. అందుకే స్టాక్ గురించి అతను చెప్పే అనాల్సిస్ వినడం, అతడిని అడిగి తెలుసుకోవడంలో మాకు ఎంతో ఉత్సాహంగా ఉండేది. ఇది మాకు కాలేజ్ క్లాస్ కంటే బాగుండేది. ​ ​మా కాల్ లో మా ఇంకో ఫ్రెండ్ శంకర్ కూడా కలిశాడు. లాక్ డౌన్ గురించి, ప్రయాణాల గురించి మాట్లాడుతూ మా చర్చ సేవింగ్స్ వైపుకు మళ్ళింది. ఈ సమయంలో శంకర్ బుర్రలో ఒక పెద్ద అనుమానం వచ్చింది. ఎక్జిట్ అయ్యే షేర్లన్నీ పబ్లిక్ గా ట్రేడ్ అవుతాయా అని అడిగాడు? ​ ​రవి కన్ఫ్యూజ్ అయ్యాడు. దానివల్ల ఇబ్బంది ఏముందు? అని అడిగాడు రవి. శంకర్ కు వచ్చిన అనుమానం ఏమిటంటే – ఏ ఇన్వెస్టర్ అయినా ఏ కంపెనీకి చెందిన షేర్లయినా మొత్తానికి మొత్తం ఏ సమయంలో అయినా అమ్ముకో వచ్చా. అని. రవి అతడికి ఈ టాపిక్ పైన ఒక ప్రీమియర్ ఇచ్చాడు. ​ ​స్పాయిలర్ అలర్ట్: ఈ షేర్లను పబ్లిక్ ఫ్లోట్ అని అంటారు. మరి రవి ఈ పబ్లిక్ ఫ్లోట్ షేర్ల గురించి శంకర్ కు ఏం చెప్పాడో మీరు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీరు చాలా ఆతృతతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. మనం ప్రారంభంలో ఏం చెప్పుకున్నామో గుర్తు చేసుకుందాం. ​ ​రిపబ్లిక్ ఫ్లోట్ కాన్సెప్ట్ ను రవి ఫ్లోట్ ద్వారా వివరించడం మొదలుపెట్టాడు. ఒక చెరువులో అనేక టైర్లు తేలుతున్నట్లు గా ఊహించుకోండి. వాటిని ఏవైనా కంపెనీ షేర్లుగా భావించండి. ఆ బొట్ల పైన ఉన్న జనమంతా ఇన్వెస్టర్స్ గా భావించండి. ఇప్పుడు నీవు ఈ కంపనీ షేర్లు కొనాలని అనుకుంటున్నావు, అప్పుడు నువ్వు ఆ షేర్లకు యజమాని అయిన, ఆ బోటుపైన కూర్చున్న వ్యక్తికి ఒక నిర్ణీత మొత్తం డబ్బు చెల్లించాలి. మీరు ఈ షేర్లను సక్సెస్ ఫుల్ గా కొనేశారనుకుందాం, ఈ లావాదేవీలో ఏం జరిగిందో మీరు గమనించారా? కొన్ని షేర్లు ఫ్లోట్ అవుతూ మీదగ్గరికి వచ్చి చేరాయి. ఇదేవిధంగా వేరేవాళ్ళు కూడా తమకు లావలసిన కంపెనీల షేర్లను కొనడం, అమ్మడం చేశారు. ఈ కాన్సెప్ట్ ద్వారా పబ్లిక్ ఫ్లోటింగ్ ను వివరించడం జరిగింది. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పబ్లిక్ ఫ్లోట్ అంటే, పబ్లిక్ వాటిని సులభంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రేడ్ చెయ్యడానికి వీలయ్యేవి అన్నమాట. వీరిలో నుండి కొన్ని రకాల షేర్లు ఆటోమేటిక్ గా ఎక్స్ క్లూడ్ అయిపోతాయి. – ఉదాహరణకు ప్రభుత్వ అదీనంలో ఉన్న షేర్లు, కంపెనీ అదీనంలో ఉన్న షేర్లు, కంపెనీ సిబ్బంది అదీనంలో ఉన్న షేర్లు – వీటిని కొంత నిర్ణీత వ్యవధి వరకు అమ్మడానికి వీలు ఉండదు. బేసిక్ గా ఏవైనా పాలసీ లేదా కొన్ని కారణాల వల్ల మార్కెట్ లో సులభంగా అమ్మడానికి వీలు పడని షేర్లు అన్నమాట. అటువంటి షేర్లను పబ్లిక్ ఫ్లోట్ లో కలపడం జరగదు. ​ ​అర్థమైంది కదా?నీకూ అర్థమైందా? ​ ​నాకు అర్థమైంది, శంకర్ కు కూడా అర్థమైంది. కానీ ఇదిగో పబ్లిక్ ఫ్లోట్ గురించి మరింత ఆసక్తికరమైన అంశం. పబ్లిక్ ఫ్లోట్ లో ఒకపక్క లాభాలు ఉంటాయి, మరో వైపు నష్టాలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం, మిత్రులారా లాభాల విషయానికి వస్తే పబ్లిక్ ఫ్లోట్ ఏ కంపనీకి అయినా – ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ కు ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పించి - పెద్దమొత్తం లో ఆపరేటింగ్ క్యాపిటల్ సమకూర్చుకునే అవకాశం కల్పిస్తుంది. ఆవిధంగా సమకూర్చుకున్న మొత్తంతో ఆ కంపెనీ తనకున్న అప్పులు చెల్లించి డెట్ రేషియో ను తగ్గించుకుంటుంది. మరో విషయం ఏమిటంటే, పబ్లిక్ ఫ్లోట్ ను ఆపరేట్ చెయ్యడం ద్వారా కంపెనీల పైన నమ్మకం పెరుగుతుంది. దాంతో పాటు మీడియాలో వీటిపైన ఎక్కువ శ్రద్ధ ఏర్పడేలా చేస్తుంది. ​ ​వీటిలో కూల్ కానివి ఏమిటి? ​ఈ క్రింది మూడు అంశాలు 1. పబ్లిక్ ఫ్లోట్ ద్వారా కంపనీ మార్కెట్ ఫ్కాల్చుయేషన్స్ లో ఎక్స్పొజ్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ గనుక బేరీష్ గా ఉన్నట్లయితే, కంపెనీకి ఆపరేటింగ్ క్యాపిటల్ కొరత ఏర్పడుతుంది. దీనివల్ల అవసరమైన సమయాల్లో కంపనీకి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. 2. కంపనీ షేర్ల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి తగ్గకుండా ఉండాలంటే, కంపెనీలు మంచి పనితీరు కనబరచాలి. కానీ ఇది కంపెనీ పని తీరుపైన ఒత్తిడిని పెంచుతుంది. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం కొన్ని కంపెనీలు ఫాల్స్ ఎర్నింగ్స్ ను, ఫాల్స్ పర్ఫామెన్స్ రిపోర్ట్స్ ను కూడా జారీ చేసిన సందర్భాలున్నాయి. ఆతర్వాత పెద్ద మొత్తాల్లో జరిమానాలు కట్టడం జరిగింది. కొన్ని కంపెనీలు ఫాల్స్ ఎర్నింగ్స్ ను, ఫాల్స్ పర్ఫామెన్స్ రిపోర్ట్స్ ఇస్స్యూ చేయడం ద్వారా ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేసి, చతికిల పడిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరువు తక్కువ పనుల వల్ల కంపెనీలు పైకి ఎదగడం కష్టం. ఇన్వెస్ట్ చేసే సమయంలో ఇటువంటి కంపెనీలను దూరంగా ఉంచడం మంచిది. 3.చివరగా, ఫ్లోట్ రెడ్యూజ్ కావడం వల్ల కంపనీ యొక్క లిక్విడిటీ తగ్గిపోతుంది. అంటే, మీరు ఈ స్టాక్స్ కొనాలనుకుంటే, వారిని అంత సులభంగా కొనలేరు. ఇన్వెస్టర్లు కంపనీలను వాల్యూయేషన్ చేసే సమయంలో పబ్లిక్ ఫ్లోట్ ను ఉపయోగిచడానికి మొగ్గు చూపుతారు – ఎందుకంటే, ఎందుకంటే ఇది సంస్థ యొక్క రియల్ టైమ్ ఎస్టిమేట్ యొక్క ఖచ్చితమైన అంచనాను ఇచ్చే అవకాశం ఉంది. ​ఇది ఒక ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్ కదా? ఇటువంటి కూల్ కన్సెప్త్స్ పైన మాదగ్గర ఇంకా చాలా పోడ్ క్యాస్ట్ లు ఉన్నాయి, వాటన్నింటినీ పరిశీలించవలసిందిగా నేను మీకు సలహా ఇస్తున్నాను. మీకు మరింత ఫ్రీ లర్నింగ్ మెటీరీయల్ కావాలంటే www.angelone.in ను సందర్శించండి. అధ్యయనం కొనసాగిస్తూ ఉండండి. ​ ​గుడ్ బై ఫ్రమ్ ఏంజిల్ బ్రోకింగ్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్. ​ ​సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకొని ఉంటాయి. అందువల్ల ఇన్వెస్ట్ చేసే ముందు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చదవండి. ​