What Is a NFO (New Fund Offer) ?

Podcast Duration: 5:55
ఎన్ఎఫ్ఓ (న్యూ ఫండ్ ఆఫర్) అంటే ఏమిటి? ​హాయ్ ఫ్రెండ్స్, ఏంజిల్ బ్రోకింగ్ ప్రాడ్ క్యాస్ట్ కు స్వాగతం! ​ ​మిత్రులారా, ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో ఏ ఒక్క రోజుకు మరుసటి రోజుతో పోలిక ఉండదు. ఈ మాటను జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. స్టాక్ మార్కెట్ లో ప్రతి రోజూ కొత్త కొత్త షేర్లు, వాటి ధరలు పెరగడం, తరగడం జరుగుతూ ఉంటుంది. మన జీవితాలలో ఒడిదుకులు కూడా ఇంతే కదూ!! ​నిజనైకి రోజువారీ రొటీన్ జీవితంతో విసిగిపోయి కొత్తదనం కొరకు ఎక్జైట్మెంట్ మరియు థ్రిల్ కొరకు వెతుక్కుంటూ ఉంటారు. ఇదిగో నా మిత్రుడు కార్తీక్ విషయమే తీసుకుందాం – అతను రోజూ ఏదో ఒక ఫ్రెండ్ కు కాల్ చేసి, హిల్ ట్రిప్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటాడు. అవతలి వాడు అంగీకరించక పోయిన కనీసం 15 నిముషాల పాటు అతడి మేడతూ తిని మరీ ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. అలాగే నా మరో స్నేహితుడు కేనీత్ మార్కెట్ లో ఉన్న అన్నీ మ్యూచువల్ ఫండ్స్ యొక్క గణాంకాలు చూసీ చూసీ బోర్ అయిపోయాడు - వాటి గురించి ఎంతగా స్టడీ చేశాడంటేమీరు ఏ ఫండ్ పేరు చెప్పినా సరే దాని గురించి 1 కాదు 3 కాదు గత 5 సంవత్సరాల రిటర్న్ మొదలు కొని ఎక్జిట్ లోడ్, హోల్డింగ్స్ వరకు మొత్తం సమాచారం కళ్ళు మూసుకొని చెప్పేస్తాడు. అతను కొత్తగా ఏ ఫండ్ వచ్చినా దాని న్యూస్ ట్రాక్ చేస్తూ ఉంటాడు. ఔనూ-, ఈ మాట చెప్తుంటే మీకు NFOs గురించి చెప్పాలనే ఐడియా వచ్చింది. పదండి ఇప్పుడు వాటి ఫురించే మాట్లాడుకుందాం. ​ ​ముందుగా NFO అంటే అర్థం ఏమిటో తెలుసుకుందాం. అదేవిధంగా కెన్నిత్ వాటి పట్ల అంత ,మక్కువ ఎందుకు పెంచుకున్నాడో కూడా తెలుసుకుందా. ​ ​మిత్రులారా NFO అంటే న్యూ ఫండ్ ఆఫరింగ్ అంటే మార్కెట్ లోకి ఒక ఆకొత్త ఫండ్ ఆఫర్ చేయబడుతోంది అని అర్థం. ఇంకా ఎవరికైనా ఏదైనా అర్థం కాలేదా? ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే కొత్త మార్కెట్ లో ఆఫర్ చ్డెయ్యడం అని తెలుసుకున్నాం గుర్తుందా? ప్రాధమికంగా NFO కూడా IPO లాంటిదే. IPOలో పెట్టుబడి కోసం ధన సమీకరణ జరుగుతుంది, NFO లో అసెట్ మేనేజ్మెంట్ కంపనీలు సెక్యూరితెలు కొనుగోలు చెయ్యడం కొరకు కొత్త మ్యూచువల్ ఫండ్ ద్వారా ధనం సేకరించడం జరుగుతుంది. ​అయితే ఈ NFOs వల్ల ఇన్వెస్టర్లకు ఏంటి లాభం అని మీరు ఆలోచిస్తున్నారా? పదండి అదేంటో తెలుసుకుందాం. ఏదైనా అసెట్ మేనేజ్మెంట్ కంపనీ కొత్తగా ఫండ్ ఆఫర్ చేసిందంటే, అది తన యూనిట్లను ఒక ఫిక్స్డ్ ధరకు ఆఫర్ చేస్తుంది. సాధారణంగా ఆ ధర 10 రూపాయలుగా ఉంటుంది. అంటే ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క యూనిట్ ధర 10 రూపాయలన్నమాట. ఈవిధంగా సేకరించిన డబ్బు దేనికి ఉపయోగిస్తాను అన్న విషయం NFO తో పాటు మీకు అందజేసే ఆఫర్ డాక్యుమెంట్ లో వివరంగా ఉంటుంది. ​ ​అయితే మిత్రులారా ఈ NFO ఇష్యూ సాధారణంగా 30 రోజుల పాటు మార్కెట్ లో ఓపన్ గా ఉంటుంది. పోతే, NFOలో కూడా రెండు రకాలు ఉంటాయి. – అవేంటంటే, ఓపన్ ఎండెడ్ NFOలు, క్లోజ్ ఎండెడ్ NFOలు. వాటి మధ్య తేడా ఏమిటంటే, క్లోజ్ ఎండెడ్ NFO లో మీ డబ్బు ఒక నిర్ణీత కాలవ్యవవధి వరకు లాక్ అయిపోతుంది. అంటే ఈ వ్యవధిలో మీరు మీ డబ్బును ఈ ఫండ్ నుండి విత్ డ్రా చెయ్యలేరన్నమాట. టెక్నికల్ గా మీరు ఈ క్లోజ్ ఎండెడ్ ఫండ్ ను మార్కెట్ లో అమ్ముకోగలరు కానీ వీటికి అంతగా లిక్విడిటీ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ లో సాధారణ ఇన్వెస్ట్మెంట్ చెయ్యడం కంటే, ఈ NFOs ద్వారా ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల కలిగే ప్రత్యేక లాభం ఏమిటి? అన్న అనుమానం మీకు వచ్చే ఉంటుంది. ఇప్పుదు మనం మాట్లాడుకోబోయేది దాని గురించే. అంతేగాక ఈ కొత్త ఫండ్స్ ఆఫరింగ్ లో పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు తీసుకోవలసిన జాగ్రతల గురించి కూడా మాట్లాడుకుందాం. ​1. NFOs ద్వారా మీరు మీ డబ్బును వినూత్న వ్యూహాల ద్వారా గ్రో చేసుకోవచ్చు. ఉదాహరణకు – కొన్ని ఫండ్స్ ప్రీ-IPO కంపనీల్లో సిస్టమేటిక్ గా ఇన్వెస్ట్ చెయ్యడం లో మీకు సహాయపడతాయి. మరి కొన్ని అయితే మీ ఇన్వెస్ట్మెంట్స్ ను పుట్ ఆప్షన్స్ లో పెట్టదవారా రక్షణ కల్పిస్తాయి. అందువల్ల NFOs మీ నిధులకు కొత్త ఎక్స్పోజర్ ఇవ్వగలవు. ​2. ఒకవేళ NFOs ను మార్కెట్ పీక్ లో ఉన్నపుడు కొనుగోలు చేసినట్లయితే, మీ ఫండ్ మేనేజర్ మీ ఫండ్స్ ను హోల్డ్ చేసి, లోయర్ లేవల్స్ దగ్గర పర్చేజ్ చెయ్యగలరు. మీరు టాప్ ఆఫ్ ద కర్వ్ దగ్గర కూడా మార్కెట్ లోకి ఎంటర్ కావడానికి భయపడవలసిన అవసరం లేదు. ​ ​3 వ లాభం – కొంతమందికి లాక్-ఇన్ పీరియడ్ ఇష్టం ఉండదు. కాకపోతే మార్కెట్ గణాంకాల ప్రకారం చాలామంది ఈక్విటీ మార్కెట్ లో రెండేళ్ల వరకు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారని తెలుస్తోంది. మరియు దీర్ఘకాలిక పెట్టుబడుల యొక్క నిజమైన సామర్థ్యాన్ని గ్రహించలేరు. మ్యూచువల్ ఫండ్స్ లో మీకు లాంగ్ టర్మ్ ఎక్స్పొజర్ ఆప్షన్ లభిస్తుంది. ​ ​చూడండి మిత్రులారా, ఈ లాభాలు అన్నవి మీ నిర్ణయం పైన, మీ NFO కంపనీ మరియు దాని ఫండ్ మేనేజర్ పైన ఆధారపడి ఉంటాయి. కాగా మీరు ఏదైనా NFOలో పెట్టుబడి పెట్టడానికి ముందు గుర్తు పెట్టుకోవలసిన కొన్ని అంశాలు: ​ ​మొదటిది 1: AMC గురించి – అంటే NFO జారీ చేసిన కంపనీ గురించి, దాని రేపుటేషన్ టూరించి, ప్రస్తుత ఆఫర్ గురించి జాగ్రత్త గా పరిశీలించాలి. ​ ​రెండవ విషయం 2 : NFO యొక్క ఫండ్ మేనేజర్ పైన దృష్టి కేంద్రీకరించాలి. మీ డబ్బే గాక లక్షలాది మండి డబ్బును మేనేజ్ చెయ్యడానికి బాధ్యత తీసుకుంటున్న వారు నిజంగా అంతటి అర్హతలు ఉన్నాయా? అన్న విషయం గురించి అధ్యయనం చెయ్యాలి. ​మూడవది 3: ఆఫర్ డాక్యుమెంట్ ను జాగ్రత్తగా చదవాలి. అందులో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, ఆలొకేషన్ కు సంబంధించిన వివాలు మీకు లభిస్తాయి. ​ ​నాల్గవది 4 : NFOలకు పర్ఫామెన్స్ హిస్టరీ ఏమీ ఉండదు. ఇన్వెస్ట్ చేయడానికిముందు వాటి వల్ల రిస్క్ మరియు రిటర్న్ పొటెన్షియాలిటీ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి. ​ ​కాబట్టి మిత్రులారా, NFOలు అంటే ఏమిటి, వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాల గురించి ఈ పోడ్ క్యాస్ట్ మీకు వివరమైన సమాచారాన్ని అందించిందని భావిస్తున్నాను. NFOలు చాలా ఆకర్షణీయంగానే ఉంటాయి కానీ వాటిలో పెట్టుబడి పెట్టడానికి ముందు సెక్యూరిటీస్ మార్కెట్ లో ఉన్న రిస్క్గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి. ​ఈ వివరాలన్నీ తెలుసుకోవడం కొరకు యూట్యూబ్ చానెల్ లో ఉన్న మావీడియోలు చూడండి, లేదా www.angelone.in ని సందర్శించండి అంటిల్ దెన్ గుడ్ బై ఫ్రమ్ ఏంజిల్ బ్రోకింగ్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్!! ​సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకొని ఉంటాయి. అందువల్ల ఇన్వెస్ట్ చేసే ముందు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చదవండి. ​