Upcoming IPOs in the month of April 2021

Podcast Duration: 5:58
ఏప్రిల్ 2021లో రాబోతున్న ఐపీఓలు ఏవి? ​హాయ్ ఫ్రెండ్స్, ఏంజిల్ బ్రోకింగ్ ప్రాడ్ క్యాస్ట్ కు స్వాగతం! ​ ​మిత్రులారా, IPOs స్టాక్ మార్కెట్ లో ఎంతో కాలంగా ఎదురు చూసే ఈవెంట్స్ లో ఒకటిగా భావించబడుతుంది. ఏదిఏమైనా, IPOs ద్వారా కొత్త బిజినెస్ స్టాక్ మార్కెట్ లోకి వస్తుంది. ఉత్సాహవంతులైన షేర్ హోల్డర్స్ ద్వార్స్స్ ఇన్వెస్ట్ చేయబడిన క్యాపిటల్ తో తన వ్యాపారాన్ని వేగవంతం చేస్తుంది. ఇది ఎంతో ఉత్తేజాన్ని కలిగించి విషయమే కదా? మీ విషయం నాకు తెలియదు గానీ, నాకు మాత్రం ఎంతో ఉత్సాహంగా ఉంది. మీకు ఉత్సాహంగా లేనట్లయితే నేను నా మిత్రుడి గురించి చెబుతాను. ఈ ప్రోడ్ క్యాస్ట్ లో అది మీకు ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఏప్రిల్ లో కొన్ని IPO లు రానున్నాయి. అయితే, ఇంకెందుకు ఆలశ్యం, ఇక మొదలు పెట్టేద్దామా? ​ ​మిత్రులారా, కోవిడ్ మొదటి దశ లాక్ డౌన్ పూర్తయ్యేకఒక రోజు నేను నా ఫ్రెండ్ రాహుల్ తో కలిసి టీ తాగడానికి ఒక కేఫే కి వెళ్ళాను. చాలా రోజుల తర్వాత బైటికి వెళ్లామన్నమాట. కదా? ​ ​భయపడకండి – మాస్క్ మొదలుకొని శానిటైజర్ దాకా - ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకొనే వెళ్లాము. మేము ఒక రూఫ్ టాప్ లో అందరికీ దూరంగా కూర్చున్నాము. సరే, ఈ లాక్ డౌన్ సమయంలో రాహుల్ దగ్గర ఓ 2 లక్షల రూపాయలు ఆదా అయ్యాయట. అతను ఆ డబ్బులో కొంత మొత్తం మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడిగా పెట్టాలని యోచిస్తుండగా బర్గర్ కింగ్ IPO గురించి అతడి యాప్ లో వచ్చిందట. దాంతో అతడు ఆ కంపనీ బ్యాక్ గ్రౌండ్ గురించి వివరాలు సేకరించడం మొదలు పెట్టాడు. ​ ​ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఆ IPO కోసం దారకాస్తు చేసుకున్నాడు, కానీ లిస్టింగ్ తర్వాత కొన్ని రోజులకు డైవెస్ట్ చేసుకున్నాడు. ​ ​మిత్రులారా, రాహుల్ లిస్టింగ్ గెయిన్స్ తీసుకోవడానికి ముందు కొంత సహమయం వెయిట్ చేశాడు. ఈ ప్రక్రియ వల్ల అతను కొంత మేరకు ప్రయోజనం పొందాడు. కానీ గుర్తుంచుకోండి, అన్ని IPOs ఇదే విధంగా పర్ఫామ్ చెయ్యవు. కొన్ని IPOs వారి ఆలాట్మెంట్ ధరకంటే తక్కువ లో కూడా ట్రేడింగ్ అవుతూ ఉనాయి. ఏది ఏమైనప్పటికీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొరకు IPOs ఒక చక్కటి ఆప్షన్ అనే చెప్పవచ్చు. అయితే మీరు ఫండమెంటల్స్ పైన గట్టిగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. మరి రాహుల్ అనుభవం విని ఎక్జైట్ అయ్యారా? ​ ​సరే పదండి, ఇప్పుడు ఏప్రిలో లో ఏ IPOs ముందుకు వస్తున్నాయో చూద్దాం. మిత్రులారా ఈ పోడ్ క్యాస్ట్ చేస్తున్న సమయానికి ఏప్రిల్, మే నెలల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ లో 5 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయని తెలిసింది. ఈ కంపనీల పనితీరు గురించి, వాటి మార్కెట్ ఔట్ లుక్ గురించి మనం ఒకసారి చూద్దాం. ​ ​1. KIMS హాస్పిటల్స్ – మిత్రులారా, కోవిడ్ తరుణంలో ఆసుపత్రులకు చాలా డిమాండ్ ఉంది. ఈ కంపనీ భారత దేశంలోని 2 టైర్. 3 టైల్ నగరాలలో ఈ డిమాండ్ ను సర్వ్ చేస్తోంది. ఈ కంపనీ 2500 పడకలతో, 9 స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఇది ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాలలో లీడింగ్ హెల్త్ కేర్ ప్రోవైడర్స్ లో ఒకటి. దీనికి దృఢమైన మేనేజ్మెంట్ టీం యొక్క బ్యాక్ అప్ ఉంది. గత 3 సంవత్సరాల రాబడి గమనిస్తే అది స్థిరంగా పెరుగుతూ వస్తోంది. ఏప్రిల్ లో గమనించదగిన IPOలలో ఇది ఒకటి. తర్వాతది ఏమిటో చూద్దాం. ​2. దూద్లే డైరీ. ఈ కంపెనీ దక్షణాదిలో పాలు మరియు పాల ఉత్పత్తుల అమ్మకం మరియు సరఫరా ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఈ కంపనీ 2018 లోనే లిస్టికింగ్ కొరకు SEBI కి దరఖాస్తు చేసుకుంది. కానీ వారు అంగీకరించలేదు. ఈసారి SEBI ఈ కంపనీకి పచ్చ జండా చూపించింది. ఈ IPO ద్వారా 800 కోట్ల రూపాయలు సేకరించాలన్నది కంపనీ లక్ష్యం. ఈమొత్తం తో ప్రస్తుతం ఉన్న అప్పులు తీర్చి క్యాపిటల్ ఎక్స్పెండీచర్ కు సపోర్ట్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇది లాభదాయకమైన IPOయేనా? ఏమో సమయమే సమాధానం చెప్పాలి. ​3. మూడవది సెవెన్ అయిలాండ్స్ షిప్పింగ్ కంపనీ. మిత్రులారా ఇది ఒక సీ లాజిస్టిక్స్ కంపనీ. దీని పేరుతోనే మీకు ఆ విషయం అర్థమైపోతుంది. ఈ ఇష్యూ ద్వారా 600 కోట్ల రూపాయల పెట్టుబడి సమకూర్చుకోవాళ్లండి ఈ కంపనీ లక్ష్యం. ఈ డబ్బుతో రెండు కార్గో నౌకలు కొనాలనుకుంటోంది. ఈ కంపనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ గత మూడు సంవత్సరాలు గా పెరుగుదలనే నమోదు చేస్తూ వస్తోంది. 2020 ప్రధమ త్రైమాసికంలో 119 కోట్ల రూపాయలు లాభం చూపించింది ఈ కంపనీ. ఇది కొంతవరకు లాభదాయకమైన ఇష్యూగానే కన్పిస్తోంది. ​4. సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్స్. ఈ కంపనీ ఆటోమోటైవ్ పార్ట్స్ ఇండస్ట్రీ లో ఫినిష్డ్ మరియు సెమీ ఫినిష్డ్ ప్రాడక్ట్స్ సెల్ చేస్తుంది. ఈ కంపనీ క్యాస్టింగ్ మెటల్స్ లో ప్రత్యేకత సాధించింది. ఈ కంపనీ 2016 నుండి 2020 మధ్యలో ఈ కంపనీ ఎర్నింగ్స్ లో ఏటా 10.9% వృద్ధి నమోదు చేస్తూ వస్తోంది. ఈ IPO ద్వారా 6000 కోట్ల రూపాయలు సేకటించాలని ఈ కంపనీ భావిస్తోంది. ఈ కంపనీకి మారుతి సుజికి, జాగ్వార్, ల్యాండ్ రోవర్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఆటో మేకర్స్ తో కూడిన స్ట్రాంగ్ కష్టమర్ పోర్ట్ ఫోలియో కలిగి ఉంది. ​5. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్. ఇది ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపనీ అన్న విషయం దీని పేరును బట్టే మనకు అర్థం అవుతోంది. దీనికి బ్లాక్ స్టోన్ అనే ప్రివెట్ ఎక్వీట్ ఫర్మ్ యొక్క బ్యాకప్ ఉంది. ఈ కంపనీ ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాలలో 11,000 కోట్ల నెట్ అసెట్స్ ను మేనేజ్ చేస్తోంది. గత ఏడాది కంపనీ 189 కోట్ల రూపాయల నికర లాభం ఆర్చిచింది. ప్రస్తుతం ఈ IPO ద్వారా 7300 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని కంపనీ యోచిస్తోంది. ​ ​ఇవీ మిత్రులారా ఏప్రిల్ లో రానున్న అప్ కమింగ్ IPO లు. ​వీటిలో మీరు దేనికైనా అప్లై చేయాలని అనుకుంటున్నారా? IPO ఇష్యూ నుండి కేటాయింపులు పొందే అవకాశాలను పెంచడానికి కొన్ని ఉత్తమ ఉపాయాల గురించి మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే, యూ ట్యూబ్ లో మా వీడియోలు చూడండి లేదా www.angelone.in ని సందర్శించండి ​ ​నెక్స్ట్ ప్రోడ్ క్యాస్ట్ లో మళ్ళీ కలుద్దాం, అంటిల్ దెన్ గుడ్ బై ఫ్రమ్ ఏంజిల్ బ్రోకింగ్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్. ​ ​సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకొని ఉంటాయి. అందువల్ల ఇన్వెస్ట్ చేసే ముందు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చదవండి. ​