Top 10 things to know before the market opens

Podcast Duration: 6:20
మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు తెలుసుకోవాల్సిన 10 ప్రధాన విషయాలు మిత్రులారా, ఏంజెల్ బ్రోకింగ్ యొక్క ఈ పోడ్కాస్ట్ కు స్వాగతం. ​మిత్రులారా, స్టాక్ మార్కెట్ వ్యాపారులు రోజూ ఒక దినచర్యను అనుసరిస్తారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ తెరిచేలోగా మార్కెట్ గురించి తెలుసుకోవడానికి అవసరమైనవన్నీ నేర్చుకోవడం కూడా ఈ దినచర్యలో ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ తెరిచాక ఈ విషయాలను సమీక్షించడానికి ఒక వ్యాపారికి సమయం ఉండకపోవచ్చు. అయితే మరి మార్కెట్ తెరిచేలోగా మీరు తెలుసుకోవలసిన విషయాలు ఏమిటి? ​ఇవే, ఈ పది విషయాలు. ​మొదటిది - జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మిత్రులారా, జాతీయ వార్తలకు స్టాక్ మార్కెట్ కు మధ్య పరస్పర సంబంధం ఉంది. కొన్ని అల్గారిథమిక్ ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్‌లు వార్తల విశ్లేషణ ఆధారంగా స్టాక్ మార్కెట్ సూచనలను మీకు అందిస్తాయి. ​మార్కెట్లు తెరిచినప్పుడు, జాతీయ వార్తల గురించి తెలియకుండా మీరు ఎటువంటి వ్యాపారం చేయకూడదు. ఇది తెలుసుకున్నాక, స్టాక్ మార్కెట్ లో భారతదేశపు మొదటి కృంగుబాటుకు లాక్డౌన్తో బలమైన సంబంధం కలిగి ఉండడం మీకు ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కాబట్టి మీరు మొదలు పెట్టే ముందు వార్తపత్రికలో వ్యాపార సంబంధ పేజీలు మరియు జాతీయ ముఖ్యాంశాలను పరిశీలించండి. ​రెండవది - అంతర్జాతీయ వార్తలను విస్మరించవద్దు. మిత్రులారా అంతర్జాతీయ వార్తల ద్వారా మీరు కొన్ని జాతీయ సంస్థల గురించి ముఖ్యమైన అంచనాలను చేయవచ్చు. ఉదాహరణకు, అంతర్జాతీయ మార్కెట్లలో రెగ్యులేటరీ మార్పులు ఎగుమతి సంస్థల వ్యాపారాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? లేదా, అంతర్జాతీయ వాణిజ్య విధానాల ప్రకారం, పరిశ్రమ సప్లై చెయిన్ గురించి మీరు ఏమి అంచనా వేయవచ్చు? మార్కెట్ తిరిగి ప్రారంభమయ్యే ముందు అంతర్జాతీయ వార్తలను బాగా అధ్యయనం చేయమని మిమ్మల్ని ఈ ప్రశ్నలు ప్రేరేపిస్తాయి. ​మూడవది-ప్రతి రోజు ప్రధాన సూచికల యొక్క ముఖ్యమైన నిరోధక స్థాయిలను అర్థం చేసుకోండి, స్టాక్ మార్కెట్లు భిన్నమైన కథనాలు వ్రాస్తాయి. ప్రతి రోజు ప్రైస్ యాక్షన్ సహాయంతో, మీరు కొంత సమాచారాన్ని అంచనావేయవచ్చు – ఉదాహరణకు, దేశ బ్యాంకింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ లేదా ఆటోమోటివ్ ఇండెక్స్లు ప్రస్తుతం ఏ నిరోధకత మరియు మద్దతు స్థాయిల మధ్య ట్రేడింగ్ చేస్తున్నాయి? ఈ పరిజ్ఞానం ప్రతి రంగం యొక్క పరిస్థితిని వాటి ధరల ద్వారా అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది - ఎందుకంటే మద్దతు మరియు నిరోధక స్థాయిలు సూచికల వలె పనిచేస్తాయి. ​నాల్గవది- ముఖ్యమైన ప్రకటనల కోసం చూడండి. ఈ ప్రకటనలు మీ పోర్ట్‌ఫోలియో, వివిధ రంగాల పరిజ్ఞానం మరియు స్టాక్ ఎక్స్ఛేంజీల గురించి అయి ఉండాలి. ఉదాహరణకు, ఏదైనా సంస్థ యొక్క పనితీరు నివేదికలు మరియు ఆదాయ ప్రకటనలు మీ పోర్ట్‌ఫోలియోలో ఏదైనా మినహాయింపులు లేదా పరిణామాలకు హామీ ఇస్తాయా? మార్కెట్లు తెరిచేలోగా సకాలంలో మీ పోర్ట్‌ఫోలియోలోకి ఎంట్రీ మరియు నిష్క్రమణలకై జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి! ​ఐదవది స్టాక్స్ యొక్క డెలివరీ శాతంపై నిఘా ఉంచండి ​ఒకవేళ ఏదైనా స్టాక్‌పై ఎక్కువ ట్రేడ్‌లు డెలివరీ కోసం అడిగితే, పెట్టుబడిదారులు ఈ స్టాక్‌లపై ఆసక్తి చూపుతున్నారని అర్థం. ఇంకా కొన్ని ప్రాథమిక మరియు సాంకేతిక విశ్లేషణతో మీరు దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాలను గుర్తించవచ్చు! ​సంఖ్య 6 - ముఖ్యమైన శాస్త్రీయ పూరోగతులను పరిశీలన చేయండి. సైన్స్ పురోగతులు పరిశ్రమలలో కొన్ని ముఖ్యమైన మార్పులను ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు, సౌరశక్తి యొక్క సమర్థవంతమైన మరియు చవకైన విధానం శక్తి సంబంధ పరిశ్రమలో కొన్ని దీర్ఘకాలిక మార్పులను రేకెత్తిస్తుంది. మార్కెట్లు ఇక్కడి నుండి ఎలా నడుస్తాయో అర్థం చేసుకోవడానికి ఇటువంటి సమాచారం కీలకం. ​ఏడవది - మీ పోర్ట్‌ఫోలియోలోని ప్రధాన మార్పుల కోసం చూడండి. ఒకవేళ మీ పోర్ట్‌ఫోలియోలోని ఏదైనా స్టాక్స్ ముఖ్యమైన ఉన్నత మరియు పతన స్థితులకు చేరుకుంటే, మీ పోర్ట్‌ఫోలియో యొక్క ప్రమాద పరిస్థితి మారుతుంది. అంటే మీ పోర్ట్‌ఫోలియోకు సమీకరణ అవసరం అని అర్ధం - స్టాక్ మార్కెట్ తెరవడానికి ముందు లెక్క వేయండి, తద్వారా మీరు రిస్క్ చేయడంలో హద్దులు తెలుసుకోగలుగుతారు. ​ఎనిమిదవది - కరెన్సీ మార్కెట్ చలనాన్ని అర్థం చేసుకోండి. ఒకవేళ మీ జాతీయ కరెన్సీ విదేశీ మార్కెట్‌కు సంబంధించి భారీ లాభాలు లేదా నష్టాలను ప్రదర్శిస్తే, ఇప్పటికే ఉన్న ఆర్థిక సమతౌల్యం దానివలన ప్రభావితం అవుతుంది. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్ ప్లేయర్ కాబట్టి కరెన్సీ స్థితిగతులు మిమ్మల్ని ప్రభావితం చేయవని అనుకోకండి. ​తొమ్మిదవది - వస్తు మార్కెట్ల విషయంలో కూడా అదే జరుగుతుంది. వస్తు మార్కెట్లకు స్టాక్ మార్కెట్‌తో ఆసక్తికరమైన సంబంధం ఉంటుంది. ఒకవేళ వస్తు మార్కెట్ల పై మీ పోర్ట్‌ఫోలియోలోని ఏదైనా కంపెనీలు బలమైన ప్రభావాన్ని కలిగి ఉంటే, వస్తు మార్కెట్ స్థితిగతులు వాటి స్టాక్ ధరలను కూడా ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. అలాగే, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు కూడా ప్రస్తుత సంఘటనలకు ప్రతిస్పందనగా స్టాక్ మార్కెట్ హిట్ అవుతుందా లేదా బౌన్స్ అవుతుందో మీకు తెలియజేస్తాయి. చివరిగా - ​పదవది - రాజకీయ సంబంధ సంఘటనలు మీ పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోండి. రాజకీయాలు, మార్కెట్లు వార్తాపత్రికలలో వేరు వేరు పేజీలలో ఉండవచ్చు, కానీ నిజానికి, ప్రాథమికంగా ఒకటి మరొకదానిని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, ఒకవేళ ప్రభుత్వాలు సంరక్షక లేదా ఉదార వాణిజ్య చట్టాలు మరియు మార్కెట్ నియమాలను ప్రవేశపెడితే, స్టాక్ మార్కెట్లు ముఖ్యమైన సవరింపుకు గురి అవుతాయి. కాబట్టి అలాంటి ఏవైనా పెద్ద చర్చల పై ఒక కన్ను వేసి ఉంచండి, మార్కెట్లు తిరిగి తెరవడానికి ముందు ఆ రోజు వాటికి ఎలా స్పందిస్తాయో అంచనా వేయండి. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలో మీకు తెలుసు. ఈ అన్ని చర్యల ద్వారా మార్కెట్లు తిరిగి ప్రారంభించే ముందే కంపెనీల బిజినెస్ ఎకోసిస్టమ్స్ మరియు వాటి నంబర్స్ వెనుక అర్ధాన్ని జాగ్రత్తగా విశ్లేషించగలుగుతారు. ప్రతి విజయవంతమైన పెట్టుబడిదారుడు స్టాక్ మార్కెట్లో కొత్త ఎత్తుగడ వేయడానికి ముందు వందలాది చరరాశులను కలిగి ఉంటాడు. నిజానికి, ఈ చర్యలు మార్కెట్లలో విజయం పొందడానికి మీకు సహాయపడే వ్యూహాల వెనుక ఉన్న రహస్యాలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడతాయి. అయితే మీరు రేపటి స్టాక్ మార్కెట్ కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్నారా? అయితే సిద్ధం కండి, మార్కెట్లు మొదలయ్యాక కొనుగోలు లేదా అమ్మకం బటన్‌ నొక్కే ముందే అవసరమైన ఏర్పాట్లు చేయండి. స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించబోయే మీకు ఏంజెల్ బ్రోకింగ్ తరఫున శుభాకాంక్షలు! అప్పటి వరకు, ఏంజెల్ బ్రోకింగ్ నుండి వీడ్కోలు, మరియు సంతోషంగా పెట్టుబడి పెట్టండి! పెట్టుబడులు మరియు సెక్యూరిటీ మార్కెట్లు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ముందు అన్ని సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చదవండి.