How to apply for an Offer for Sale? Let’s find out!

Podcast Duration: 5:41
ఆఫర్ ఫర్ సేల్‌కు దరఖాస్తు చేయడం ఎలా? తెలుసుకుందాం! హాయ్ ఫ్రెండ్స్, ఏంజిల్ బ్రోకింగ్ ప్రాడ్ క్యాస్ట్ కు స్వాగతం! ​ మిత్రులారా. ఈ మధ్యకాలంలో IPOల పట్ల జనాల్లో క్రేజ్ బాగా పెరిగిపోతోంది. చాలామంది వాటి కోసం అప్లై చేస్తున్నారు కూడా. నిన్న మా పక్కింటి శాలిని ఒక రీసెంట్ IPO గురించి నన్నడిగింది. నేను దానికోసం దరఖాస్తు చేసుకున్నాను, కానీ అది నాకు ఆలోకేట్ అవుతుందో లేదో నమ్మకం లేదని చెప్పాను. ఆమె కూడా ఆ విషయం గురించే ఆందోళన చెందుతున్నట్లు చెప్పింది. ఆ తర్వాత నేను టీ త్రాగడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళ అన్నయ్య నిఖిల్ కనిపించాడు. మాటల సందర్భంలో OFS ప్రస్తావన వచ్చింది. వాళ్ళిద్దరికీ దాని గురించి కొంతవరకు తెలుసు అని నాకర్థమైంది. దాంతో మేము ఆవిషయం గురించి చాలాసేపు మాట్లాడుకున్నాము. ఆ మాటల సందర్భంగా వాళ్ళు చాలా కాలంగా వీరిలో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిసింది. అందువల్ల వాళ్ళు మార్కెట్ విషయాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటారని అర్థమైంది. సరే, మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం?ఓ, OFSల గురించి కదూ! OFS అంటే ఏంటి, వాటి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న అంశాలు తెలుసుకోవాలని మీరు కూడా అనుకుంటున్నారా? ​సరే, అయితే చూద్దాం పదండి. ​మిత్రులారా, IPOs ద్వారా కంపెనీ తన వ్యాపారానికి కావలసిన పెట్టుబడిని అనేకమంది ఇన్వెస్టర్స్ నుండి రైజ్ చెయ్యడానికి IPOs ను విడుదల చేస్తుంది అన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. OFS ల విషయంలో కూడా దాదాపు ఇలాంటి ప్రాసెస్సే జరుగుతుంది. కాకపోతే ఒక చిన్న తేడా – అదేమిటంటే, ఇదివరకే పబ్లిక్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీ మాత్రమే OFS లేదా ఆఫర్ ఫర్ సెల్ ను విడుదల చేయ్యగలుగు తుంది. బేసిక్ గా OFS ద్వారా కంపెనీ తన క్యాపిటల్ ను రైజ్ చేయదు, అంతేగాక ఈ ప్రాసెస్ ద్వారా వారు మరీ ఎక్కువ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ను అనుసరించవలసిన అవసరం ఉండదు. అందుకే చాలా కంపెనీలు కొన్ని సందర్భాలలో FPO.ల బదులు OFSలను జారీ చేస్తూ ఉంటాయి. అయితే, మరి FPO – OFS కు మధ్య తేడా ఏమిటో మీకు తెలుసా? FPOలో కొత్త షేర్లు క్రియేట్ అవుతాయి, కానీ OFSలో కంపెనీ ప్రమోటర్లు తమ దగ్గరున్న షేర్లను బైటి వారికి అమ్మకానికి పెడతారు. అయితే ఇందులో ఒక నిబంధన ఉంటుంది – అదేమిటంటే, OFS ద్వారా ఇన్వెస్టర్లకు ఆఫర్ చేయబడిన షేర్లలో 10% రిజర్వ్ చేయబడతాయి, 25% ఇన్సూరెన్స్ మరియు మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు జారీ చేయబడతాయి. చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది కదూ? ,మరి అయితే వీటిలో ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల మీకేంటి లాభం? దీనివల్ల మీకేం వస్తుంది? ఇందులో ఏదైనా లాభం ఉంటే దాని కోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలి? ఆ విషయమే ఇప్పుడు మనం తెలుసుకుందాం! ​ ​మిత్రులారా వీటివల్ల లాభాలు అర్థం చేసుకోవాలంటే, మీరు OFSకు సంబంధించిన మరికొన్ని ప్రొసీజర్స్ గురించి తెలుసుకోవలసిన అవసర్మ్ ఉంటుంది. ఉదాహరణకు OFS లో మీరు బేసిక్ గా ఆఫర్ చేసిన శేర్స్ యొక్క ధరపైన బిడ్ చేయవలసి ఉంటుహ్న్దీ. ఎవరైతే హైయెస్ట్ బిడ్ చేస్తారో వారికె ఇవి అలాట్ చేయబడతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా కట్ ఆఫ్ ప్రైస్ పైన కూడా మీరు వీటిని కొనుగోలు చెయ్యవచ్చు. అంటే, OFS లో ఈ షేర్లు అందించబడుతున్న కనీస ధర దగ్గర అన్నమాట..ఒక రీటైల్ ఇన్వెస్టర్ గా OFS ద్వారా మీరు రెండు విధాలుగా లాభం పొందవచ్చు – ఒకటి ఇదివరకే మనం చెప్పుకున్నట్లుగా - OFSలో కంపెనీ రీటైల్ ఇన్వెస్టర్లకు ఫ్లోర్ ప్రైస్ పైన డిస్కౌంట్ ఇస్తుంది. ఇక రెండోది, మీరు వీటికి కేవలం సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ చార్జెస్ మరియు ట్రాన్సాక్షన్ ఫీజు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. ​సౌండ్స్ కూల్ కదూ? వీటి కోసం ఎలా అప్లై చెయ్యాలి అని ఆలోచిస్తున్నారా? నిఖిల్ మరియు శాలిని కూడా నన్ను ఇదే ప్రశ్న అడిగారు. నేను పూర్తి సమాచారం ఇచ్చేసరికి వారు ఆశ్చర్యపోయారు. అవే సిషయాలు నేను మీకు కూడా వివరిస్తారు! ​మిత్రులారా! OFS లో పాల్గొనే సమయంలో మీరు గుర్తు పెట్టుకొవలసిన ఒక ముఖ్యమైన విషయం అవి కేవలం 3-10 రోజులు మాత్రమే ఓపన్ గా ఉంటాయి. అంతేకాదు అవి కేవలం 9:15 AM to 2:45 PM వరకు మాత్రమే ఓపన్ గా ఉంటాయి. మీరు గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే మీ బిడ్ గనుక ఫ్లోర్ ప్రైస్ కంటే తక్కువ గనుక ఉంటే, మీకు అలాట్మెంట్ కాదు. అబ్దువల్ల మీరు కట్ ఆఫ్ ప్రైస్ పైన బిడ్ చెయ్యకపోతే ఏ ధర దగ్గర బిడ్ చెయ్యాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకసారి అది తెలుసుకుంటే, ఒక రిటైల్ ఇన్వెస్టర్ గా మీరు తెలుసుకోవలసిన రెండో విషయం – మీరు 2 లక్షల వరకు మాత్రమే బిడ్ ని ప్లేస్ చెయ్యగలరు. ఒకవేళ మీరు అంతకంటే ఎక్కువ మొత్తానికి బిడ్ చేసినట్లయితే ఎక్సీడ్ అయిన మొత్తానికి మీకు ఆలాట్మెంట్ దొరకదు. మీరు ఈ నిబంధనలను అర్థం చేసుకుంటే చాలు, OFSలో బిడ్ చెయ్యడం అన్నది పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు. ​ఇంకో విషయం, OFS లో పాల్గొనాలంటే మీకు తప్పనిసరిగా ఒక డీమ్యాట్ అకౌంట్, ఒక ట్రేడింగ్ అకౌంట్ ఉండాలన్న విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. మీరు మీ డీలర్ దగ్గరకి వెళ్లకూడదు అని అనుకున్నట్లయితే, ​ ​మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే చాలు – ఇంకెందుకు ఆలశ్యం మీ ట్రేడింగ్ పోర్టల్ పైన లాగిన్ అవండి, మీ బిడ్ ప్లేస్ చేయండి చాలు. చాలా సింపుల్ అనిపిస్తుంది కదూ? అవును సులభమే, నెక్స్ట్ టైమ్ ఒక OFS ఓపన్ అవుతుంది అంటే, అది మీకు సరైన అవకాశంగా భావిస్తున్నట్లయితే, ఇది మీకు చాలా సింపుల్ ప్రొసీజర్ కదూ! ​మీరు తెలుసుకోవలసింది ఇంతే! మీకు ఈ పోడ్ క్యాస్ట్ నచ్చినట్లయితే మా www.angelone.in వెబ్సైట్ లో మేం ఉంచిన ఉచిత ఎజుకేషనల్ రిసోర్సెస్ మీకు మరింతగా నచ్చుతాయని మేము ఖచ్చితంగా చెప్పగలం. వాటిని కూడా చూడండి! ​అంటిల్ దెన్ నేను నిఖిల్ దగ్గరికి వెళ్ళి టీ తాగుతూ ఒక అప్ కమింగ్ IPO గురించి మాట్లాడి వస్తాను. మనం కల్లీ కలుద్దాం. అప్పటివరకూ గుడ్ బై. ఫ్రమ్ ఏంజిల్ బ్రోకింగ్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్! ​సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకొని ఉంటాయి. అందువల్ల ఇన్వెస్ట్ చేసే ముందు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చదవండి.. ​