How are the IPOs of 2020 performing now? Find out here. | Telugu

Podcast Duration: 7:58
2020 IPOలు ఇప్పుడు ఎలా పని చేస్తున్నాయి? ​వాయిస్ ఓవర్- ​హలో ఫ్రెండ్స్ మరి ఇపుడు ఏంజెల్ వన్ ద్వారా మరో ఉత్తేజకరమైన పోడ్కాస్ట్కు స్వాగతం. మిత్రులారా ఈ రోజు మనం 2020 IPO ల గురించి చర్చిద్దాం. ఎప్పుడైతే కొత్త IPOల ప్రవేశం ఉంటుందో. అపుడు మార్కెట్ లో ఇస్యూల గురించి చాలా మటుకు చర్చలు తలెత్తుతాయి . IPO ఇస్యూ ల ధర ఏ మాత్రం? ఏవిటి, ఈ IPO ల తోటి ఇన్వెస్ట్ చేద్దామా, వద్దా ? రండి, బయల్దేరి చూద్దాం 2020 లో ఏయే కంపెనీలు IPO లో పాల్గొన్నాయ్ , మరి వాటి ప్రస్తుత పరిస్థితి ఏవిటి. ​పెట్టుబడి పెట్టేటప్పుడు దీర్ఘకాలిక వీక్షణ కలిగి ఉండటం ముఖ్యం. అందువల్ల గత సంవత్సరం ఐపిఓలు పెద్ద ముఖ్యాంశాలు చేసిన కంపెనీల పై మల్లి పరిశీలించడం, మరి వారు ఈ రోజు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారో తెలుసుకోవడం ఉపయోగపడుతుంది. ఈ పోడ్కాస్ట్లో మనం ఎస్బిఐ కార్డ్స్, రూట్ మొబైల్, ఏంజెల్ వన్ , హేప్పీయస్ట్ మైండ్స్, మజగాన్ డాక్ షిప్బిల్డర్లు మరియు మరికొన్నింటి గురించి చర్చిస్తాము. రండి మరిప్పుడు ఎస్బిఐ కార్డ్స్ తోటి ప్రారంభిద్దాం. ఎస్బిఐ కార్డ్స్ ఓ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్. ఎస్బిఐ కార్డ్స్ 1998 లో ప్రవేశ పర్చ బడింది. ఈ కంపెనీకి మాతృ సంస్థ ఎస్బిఐ. ఎస్బిఐ కార్డ్స్ హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్ లో ఉంది. అంతేకాక ఇందులో 3000 పైగా ఉద్యోగులున్నారు. ఎస్బిఐ కార్డ్స్ మరీ పెద్ద IPO మరియు వాటి లిస్టింగ్ ధర 658 రూపాయలు. అయితే ఎస్బిఐ కార్డ్స్ IPO కరోనావైరస్ పాండమిక్ తో పాటు ఎదుర్కొంటూ ఉంది. అందువల్లే IPO అయ్యాక కూడా వీటి షేర్ ప్రైస్ పది పోయింది. ఎస్బిఐ కార్డ్స్ స్టాక్ మార్కెట్ చరిత్రలోని అత్యల్ప స్థానం 509 రూపాయలు. గత ఒక సంవత్సరంలో ఈ సంస్థ మార్కెట్ వాల్యూ ను పొందింది. మీరు సంస్థను దాని అత్యల్ప పాయింట్ వద్ద కొనుగోలు చేసి ఉంటే, మీరు ఈ సమయానికి మీ పెట్టుబడిని రెట్టింపు చేయవచ్చు. ఈ పోడ్కాస్ట్ను రికార్డ్ చేస్తున్నప్పుడు ఎస్బిఐ కార్డ్స్ వాటా ధర 933 రూపాయలు. ఇది దాదాపు ఆల్ టైమ్ అత్యల్ప రేటుకి డబుల్అ. రండి, మరిప్పుడు IPO తర్వాతి దశలోని రూట్ మొబైల్ కంపెనీ పెర్ఫార్మెన్స్ చూద్దాం. రూట్ మొబైల్ ఓ టెలికాం కంపెనీ, క్లౌడ్ ప్లాట్ఫాం తో పాటు 2004 లో ప్రారంభించబడింది. రూట్ మొబైల్ ఒకప్పట్లో UK లో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ కంపెనీ ల లో 2 వది. 2020 లో రూట్ మొబైల్ రాబోవు ఫార్చ్యూన్ 500 కేటగిరీ లో తన స్థానాన్ని దక్కించు కోవడంలో ఫలీకృతమైంది. దాంతో పాటు రూట్ మొబైల్ కి ఉత్తమ సంస్థా పాలన కైన అవార్డు అందింది. 2020 లో రూట్ మొబైల్ IPO ప్రారంభాన వాటి లిస్టింగ్ ధర రూ 717. నేటి రూట్ మొబైల్ యొక్క షేర్ ధర 1700 కి పైనే. IPO ప్రభావం వక్త్ రూట్ మొబైల్ తో ఎవరెవరు ఇన్వెస్ట్ చేసారో వారంతా మంచి సాటి లాభాలు రిజిస్టర్ చేశారనే చెప్పొచ్చు. ఇండియా లో టెలికాం సెక్టార్ వేగవంతంగా వర్దిల్లితొంది. రూట్ మొబైల్ ఈ రంగం లో ఓ మెరిసే తార లా ఉద్బవించింది. 2020 లో హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ కూడా IPO పరిధి లో ప్రవేశించింది. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఓ ఐటి కంపెనీ. వీటి ప్రధాన కార్యాలయం బెంగళూరు లో ఉన్నది. హ్యాపీయెస్ట్ మైండ్స్ వ్యాపారం UK నుంచి USA, ఆస్ట్రేలియా ద్వారా మిడిల్-ఈస్ట్ వరకు వ్యాపించి ఉంది. “డిజిటల్ జననం చురుకైన జననం” అన్నదే హ్యాపీయెస్ట్ మైండ్స్ నినాదం. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ లాంటి నూతన టెక్నాలజీస్ తయారీ కంపెనీల కి, రిటైల్, రవాణా, ఇ-కామర్స్, ఆర్ అండ్ డి లాటి అన్ని వర్గాల్లోనూ సహాయం చేస్తూ సహకరిస్తోంది. హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క లిస్టింగ్ ధర రూ 351, మరి ఈ రోజు హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క షేర్ ప్రైస్ రూ 910. ఇది, ఆల్ టైమ్ హై అయిన రూ 954కి అతి దగ్గర్లో ఉంది. మనం ప్రస్తుతం ఐటి విజృంభణ మధ్యలో ఉన్నాము మరియు కోవిడ్ -19 మహమ్మారి ఈ రంగానికి అదనపు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తరంగాన్ని నడుపుతున్న సంస్థలలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లయితే, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఓ ఆసక్తికరమైన ఎంపిక కావచ్చు. సంస్థ యొక్క లక్ష్యం “బుద్ధిపూర్వక ఐటి కంపెనీ” మరియు అదే విధంగా ఇది ఆలోచనాత్మకంగా మరియు సహేతుకమైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవటానికి ప్రసిద్ది చెందింది. 2020 లో మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ కూడా IPO ప్రవేశం పొందింది. ఈ కంపెనీ 1934 లో ప్రారంభమై మరియు ఇండియన్ నేవీ కోసం యుద్ధనౌకలు, జలాంతర్గాములు తయారీ చేస్తోంది. కంపెనీ వద్ద 8000 కి పైనే ఉద్యోగులున్నారు. వీటి ఆదాయం 5000 కోట్ల పైనే. జాబితా చేసే సమయంలో కంపెనీ ధర 168 రూపాయలు. నేడు కంపెనీ షేర్ ధర 255 రూపాయలు. మజగాన్ డాక్ షిప్బిల్డర్స్ ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ. మరియు వీటి ప్రధాన కార్యాలయం బొంబాయి లో ఉంది. కంపెనీ యొక్క ఆపరేటింగ్ ఆదాయం, నికర ఆదాయం, మొత్తం ఆస్తులు బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. యుద్ధనౌకలు మరియు జలాంతర్గాములు కాకుండా, ఈ సంస్థ ట్యాంకర్లు, ప్లాట్ఫాం సరఫరా నాళాలు మరియు పెట్రోలింగ్ పడవలను కూడా నిర్మిస్తుంది. మీరు రక్షణ మరియు రవాణాలో చురుకైన ఉనికిని కలిగి ఉన్న సంస్థలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లయితే, మజగాన్ డాక్ షిప్బిల్డర్లు ఓ ఆసక్తికరమైన ఎంపిక. 2020 లో బర్గర్ కింగ్ ఇండియాకు కూడా ఐపిఓ ప్రవేశం ఉంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా, ఫాస్ట్ ఫుడ్ కంపెనీలు ఒక సవాలు ని ఎదుర్కుంటే దానికి తోడు ఓ అవకాశాన్ని కూడా ఎదుర్కొన్నాయి. లాక్డౌన్ కారణంగా ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్లను మూసివేయడం సవాలయితే, ప్రజలు ఇంటి పట్టున ఉంటూ ఆర్డర్ చేయడమూ మరి, దీన్ని సక్రమంగా వ్యూహం పన్నితే ఇది తారాస్థాయి కి ఎదిగే అవకాశం కూడా కావచ్చు. బర్గర్ కింగ్ ఇండియా దేశంలో అతిపెద్ద ఫాస్ట్ ఫుడ్ చెయిన్స్ లో ఒకటి మరియు వేగంగా అభివృద్ధి చెందు తున్న సంస్థ. బర్గర్ కింగ్ ఇండియా యొక్క షేర్ ధర నేడు 155 రూపాయలు. ఇది స్టాక్ మార్కెట్లో మొదటి రోజు బర్గర్ కింగ్ ముగింపు ధర 138 రూపాయలుగా ఉన్న దాని కంటే స్వల్ప మైన ప్రీమియం మాత్రమే. 2020 లో ఏంజెల్ వన్ కూడా IPO ప్రవేశం పొందింది. ఏంజెల్ వన్ యొక్క లిస్టింగ్ ధర ఇంచుమించు రూ 275 మరి ఈ రోజు ఏంజెల్ వన్ షేర్ ధర రూ 800 కన్నా ఎక్కువే. అవును - లిస్టింగ్ కి డే నుంచి నేటి వరకు ఏంజెల్ వన్ షేర్ ప్రైస్ ఇంచు మించు 3 రేట్లు పెరిగింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల చొరవ భారతదేశంలో చాలా తక్కువ. మరి ఏంజెల్ వన్ వంటి ఫిన్టెక్ కంపెనీలు దీని దశ ని మారుస్తున్నాయి. ఏంజెల్ వన్ స్టాక్స్, కమోడిటీస్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, డెరివేటివ్స్ మరియు ఇతర ఆర్థిక ఆస్తులలో పెట్టుబడులు పెట్టడం చాలా సులభం చేస్తుంది. మరీపాటికి మీకు బాగా అర్థమయే ఉండాలి IPO ల ప్రభావాలు మరియు వాటి ప్రభావితాలు. మరి రాబోయే IPOల గురించి మీరు ఎలా అప్డేట్ అవుతామని మరియు వాటిలో పెట్టుబడులు పెట్టడానికి చెందిన ముఖ్యమైన కీలక మార్గాలను ఎలా నేర్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా? బాధ పడ కండి. ఇలాంటి మరింత ఆసక్తికరమైన కంటెంట్ కోసం, మా ఛానెల్ను అనుసరించండి మరియు సభ్యత్వాన్ని పొందండి. మిత్రులారా మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోవడానికి హద్దుల్లేవు. ఆర్థిక పరిజ్ఞానం నిరంతరం అభివృద్ధి చెందుతుంది మరియు అంతం లేనిది, కాబట్టి ఇలాంటి మరింత సమాచార కంటెంట్ కోసం వేచి ఉండండి! మీరు స్వతహాగా పరిశోధన చేయాలని కూడా గుర్తుంచుకోండి. ఇటువంటి ఎడ్యుకేటడ్ కంటెంట్ ని అనుసరించిమ్మేది మరియు నవీకరించబదండి. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు మరియు హేప్పీ ఇన్వెస్టింగ్సం. ​పెట్టుబడులు మరియు సెక్యూరిటీ మార్కెట్లు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ముందు అన్ని సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చదవండి ​