Here’s how you can invest in international stocks | Telugu

Podcast Duration: 11:28

అంతర్జాతీయ స్టాక్స్ లో ఎలా పెట్టుబడి పెట్టవచ్చో ఇక్కడ వివరించబడింది

నమస్కారం డోస్టన్, ఏంజెల్ బ్రోకింగ్ రూపొందించిన మరో వివరణాత్మక పాడ్ క్యాస్ట్ కు స్వాగతం. అంతర్జాతీయ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టె ఐదు విధానాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం

మోహిత్ వాళ్ళ పక్కింట్లో ఉంటున్న శర్మా గారు చాలా రోజులుగా అంతర్జాతీయ స్టార్క్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. అతను మోహిత్ కు చేయీప్న దాన్ని బట్టి చూస్తే అతను బాగానే లాభాలు గడించినట్లు అర్థమవుతుంది. శర్మ గారు చాలా సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఆయనను చాలామంది 'పెట్టుబడుల నిపుణుడు' అని కూడా పిలుస్తారు. స్టాక్స్ వ్యాపారం చెయ్యడమే శర్మగారి పని. ఆయన జాతీయ, అంతర్జాతీయ స్టాక్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేస్తూ ఉంటాఋ. ఆయనకు ఒక అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థలో అకౌంట్ కూడా ఉంది.

ఆయన రోజూ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. మోహిత్ ఇప్పటికే మరో ఫుల్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ట్రేడింగ్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించలేడు. అందువల్ల ప్రత్యక్ష పెట్టుబడులకు బదులుగా పరోక్ష పెట్టుబడులను ప్రయత్నించమని అతను మోహిత్ కు సలహా ఇస్తుంటారు. అందుకే ఆయన ఏదో తనకు అర్థం కానీ ఉర్దూ భాష లేదా గ్రీకు భాష మాట్లాడుతున్నట్లు మొహిత్ ఆయనను చూస్తుంటాడు. అంతేగామ స్టాక్స్ లో అంతగా పరిజ్ఞానం లేనివారు కూడా అమెరికన్ స్టాక్ మార్కెట్ లో సులభంగా పెట్టుబడులు పెట్టవచ్చని చెబుతూ ఉంటాడు - మోహిత్ తో పాటు ఉద్యోగం చేస్తున్న ఈశాన్ కూడా . ఈశాన్ ఏంజెల్ బ్రోకింగ్ యాప్ ద్వారా దృరెక్ట్ గా ట్రేడ్ చేస్తుంటాడు.

ఇంటర్నేషనల్ స్టాక్స్ డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ఆ రెంటికీ మధ్య వున్న తేడా ఏంటి?

ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేయడానికి 6 రకాల పద్ధతులున్నాయి. 3 డైరెక్ట్, ఇంకో 3 ఇండైరెక్ట్. గతంలో బాగా అనుభమున్న ఇన్వెస్టర్లు మాత్రమే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో సులభంగా పెట్టుబడి పెట్టేవారు. అనుభవం లేనివారు ఇన్డైరెక్ట్ ఇన్వెమెంట్స్ వైపు మొగ్గు చూపేవారు. కానే, ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి కొంతమేరకు అవగాహన ఉన్న కొత్త ఇన్వెస్టర్ల కోసం యాప్ ఆధారంగా డైరెక్ట్ పెట్టుబడులు పెట్టె ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.

పదండి, ఈ 6 పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం.

ముందుగా 3 డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతుల గురించి మాట్లాడుకుందాం.

అంతర్జాతీయ స్టాక్స్‌లో నేరుగా పెట్టుబడులు పెట్టాలనుకునే ఔత్సాహిక పెట్టుబడిదారులు ప్రత్యక్ష పెట్టుబడి సంక్లిష్టంగా ఉండటమే కాకుండా మరింత ప్రమాదకరమన్న విషయం గుర్తుంచుకోవాలి. కాకపోతే ఆదాయం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇన్వెస్టర్లు తమ రీసర్చ్ మరియు ప్రిడిక్షన్స్ ఆధారంగానే స్టాక్స్ ను కొనడం అమ్మడం జరుగుతోంది. అతను గంటల కొలది సమయాన్ని అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లను అర్థం చేసుకోవడం మరియు గమనించడం కొరకు సమయాన్ని వెచ్చించడమే కాదు, కరెన్సీ రేట్లపై కూడా నిరంతరం నిఘా వేసి ఉంచాలి. కరెన్సీ రేట్లలో వచ్చే మార్పులు కూడా ఇన్వెస్టర్ యొక్క ఆదాయం పైన గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు, ఒక ఇన్వెస్టర్ ఈరోజు డాలర్ రేటు రు.73 దగ్గర ఉన్నపుడు కొన్ని ట్రెడ్స్ ద్వారా 1000 అమెరకన్ డాలర్లు సంపాదించాడని అనుకుందా, అదే డాల రేటు రు.60 కొ లేదా 80 కొ మారినపుడు అతడి ఆదాయంలో పెద్ద ఎత్తునమార్పులు చోటు చేసుకుంటాయి.

డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయమోలో హై రిస్క్ తో పాటు హై ఎర్నింగ్ కూడా ఉంటాయి. అందుకే, మోహిత్ పొరుగున ఉన్న మిస్టర్ శర్మ మరియు అతని సహోద్యోగి ఇషాన్ వంటి స్టాక్ మార్కెట్ నిపుణులు మనం ఈ క్రింద చర్చించబోయే మూడు ప్రత్యక్ష పెట్టుబడి పద్ధతుల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విధానం # 1 - అంతర్జాతీయ ట్రేడింగ్ అకౌంట్ ఓపన్ చెయ్యాలి.

వెస్టెడ్ ఫైనాన్స్ వంటి కొన్ని సంస్థలు పెట్టుబడిదారులకు అంతర్జాతీయ వాటాలను కొనుగోలు చేసే మరియు విక్రయించే అవకాశాన్ని ఇస్తాయి.

మీరు గనుక ఆ ఆప్షన్ ను ఎంపిక చేసుకున్నట్లయితే, ఈ అంశాలను గుర్తుంచుకోండి.

మీ అప్పర్ లిమిట్ ఏడాదికి $250,000 ఉంటుంది.

ట్రేడ్ల సంఖ్య పైన వివిధ ఫండ్ హౌస్ ల రిస్ట్రిక్షన్స్ కూడా వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల అకౌంట్ ఓపన్ చెయ్యడానికి ముందే వీటిని జాగ్రత్తగా పరిశీలించాలి.

ఈ అన్ని ఆర్థిక సంస్థలు అన్ని రకాల పెట్టుబడి ఎంపికలను అందించవు. మీరు కోరుకునే పెట్టుబడి ఎంపికలను మీకు లభిస్తాయా లేదా అన్న విషయాన్ని తనిఖీ చేసి, తిరిగి ధృవీకరించుకోండి.

అదేవిధంగా మీరు చెల్లించవలసిన ఫీ విషయం గురించి తెలుసుకోండి. వారు మీకు అకౌంట్ ఉచితంగానే ఓపన్ చేస్తామని, మరికొన్ని ఆఫర్స్ ఉన్నాయని చెప్పవచ్చు, కానీ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్, AMC వంటి అంశాల గురించి తెలుసుకోండి. AMC అంగా మీ అకౌంట్ ను యాక్టివ్ గా ఉంచేందుకు వారు తీసుకునే వార్షిక ఫీజు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అకౌంట్ విషయంలో ఇది భారేగానే ఉండవచ్చు.

డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విధానం # 2 - ఇంటర్నేషనల్ బ్రోకింగ్ ఫర్మ్ లో అకౌంట్ ఓపన్ చేయడం మరో ఆప్షన్.

మీకు నమ్మకం ఉంటే మరియు ఆర్థిక వనరులను కలిగి ఉంటే మీరు అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థలో సులభంగా ఖాతాను తెరవవచ్చు. ఈ ఆప్షన్ లో మీకు రెస్ట్రిక్షన్ తక్కువజ్ఞే ఉండవచ్చు - మీరు ఒక రోజులో మీకు కావలసినన్ని ట్రేడ్‌లు చేయవచ్చు మరియు అన్ని పెట్టుబడి వాహకాలు తెరిచి ఉంటాయి - కానీ ఫీజు మరియు ఫీజు నిర్మాణం గురించి కాస్తా జాగ్రత్తగా చదవాలి. ఈ ఆప్షన్ లో కూడా - మొదటి విధానంలో పేర్కొన్న కొన్ని పాయింట్లను మీరు గుర్తుంచుకోవాలి. అవి:

ఈ ఆప్షన్ లో మీ అప్పర్ లిమిట్ సంవత్సరానికి $250,000 ఉంటుంది.

ఏదైనా పత్రాలు మరియు వ్యక్తిగత వివరాలను ఇవ్వడానికి ముందు సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోండి.

డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విధానం # 3 - మీ మంచి పాత నమ్మదగిన స్టాక్ బ్రోకింగ్ఉ యాప్ ను పయోగించండి ఇషాన్ లాగే మీర్యూ ఏంజిల్ బ్రోకింగ్ మొబైల్ యాప్ ను ఉపయోగిస్తున్నట్లయితే, వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు ఇంతకుముందు ఉపయోగించిన మేము చర్చించిన సంక్లిష్టమైన రెండు ఎంపికలను నివారించే అవకాశం మీకు ఉంది.

మీరు యాప్ స్టోర్ నుండి ఏంజెల్ బ్రోకింగ్ యా ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. .ఆ తర్వాత. మీరు చేయాల్సిందల్లా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ పైన క్లిక్ చేసి, ఆపై మీరు మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు ఏంజెల్ బ్రోకింగ్ అమెరికాకు చెందిన వెస్టెడ్ ఫైనాన్స్ తో టై అప్ అయి ఉండడం వల్ల మీరు ఆ సంస్థ యొక్క వివరాల గురించి మళ్ళీ వెరిఫికేషన్ వంటివి చేయవలసిన అవసరం లేదు.

ఈ ఆప్షన్ లో సింప్లిసిటీనే కాదు, మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే:

ఫీజుల విషయానికి వస్తే , ఫారెక్స్ ట్రాన్స్మిషన్ ఫీజులు మరియు AMC వర్తించవచ్చు, ఏంజెల్ బ్రోకింగ్ ద్వారా నిర్వహించిన మీ ట్రేడ్‌లపై ఎటువంటి కమిషన్ ఉండదు.

మీరు ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకో వచ్చు. అమెజాన్, గూగుల్ వంటి చాలా కంపెనీల షేర్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది, ఏంజెల్ బ్రోకింగ్ యాప్ ద్వారా ఈ కంపెనీలలో మీరు USD1 కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి, మీ ఇన్వెస్ట్మెంట్ ను ఇతర ఇన్వెస్టర్స్ తో పూల్ చేసుకొని, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మా సపోర్ట్ టీం మీకు సహాయం చేయడం కొరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అన్నింటికన్నా ఉత్తమమైనది - ముఖ్యంగా మోహిత్ వంటి వారి కొరకు - క్యూరేటెడ్, రెడీమేడ్ పోర్ట్‌ఫోలియోల ఆప్షన్ కూడా ఉంది. ఏంజెల్ బ్రోకింగ్ వీటిని ‘వెస్ట్’ అని బ్రాండ్ చేస్తోంది. దీని వల్ల ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకునే సమయంలో కన్ఫ్యూషన్ ఉండదు, ఇది కొత్త ఇన్వెస్టర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఒకవేళ మోహిత్ లాగా మీకు ఎలాంటి ట్రేడింగ్ యాప్ లేనట్లయితే, వెంటనే ఏంజెల్ బ్రోకింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఆతర్వాత, కాస్తంత KYC ప్రాసెస్ లేదా డాక్యుమెంట్ సబ్మిషన్ చేసిన తర్వాత (ఇది కేవలం 5 నుముషాల పని) 1 నుండి 3 పనిదినాల లోపు మీ ఇంతనేషనల్ స్టాక్స్ ట్రేడ్ ముదలు పెట్టవచ్చు,

ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో ఉండే 3 విధానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఇన్వెస్టర్లకు ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్టాక్ మార్కెట్ కు సంబంధించిన అంశాలు వినడం మీకు గందరగోళంగా అనిపించినట్లయితే, ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విధానమే మీకు సరైన ఆప్షన్. ఇంటర్నేషనల్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ గురించి, ఇంటర్నేషనల్ స్టాక్స్ గురించి మీరు తలబద్దలు కొట్టుకొవలసిన అవసరం లేకుండానే దాని ద్వారా లభించే ప్రయోజనాలను ఆస్వాదించ వచ్చు. ఊహించని నష్టాలలో వాటా ఉంటుంది కానీ అంతర్జాతీయ స్టాక్‌లను నేరుగా కొనుగోలు చేయడం మరియు అమ్మడం ద్వారా వచ్చే అంత నష్టం ఉండదు.

ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విధానం # 1 - అంతర్జాతీయ స్టాక్లలో పెట్టుబడులు పెట్టే భారతీయ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం.

దీని వల్ల మీరు ఇంటర్నల్ స్టాక్స్ లో మీరు ఎక్స్పొషర్ పొందుతారు. ఎక్స్పోజర్ వల్ల స్టాక్ ధరల కదలికలను బట్టి సంపాదించగల సామర్థ్యం లేదా కోల్పోయే అవకాశాన్ని తగ్గించుకునే సామర్థ్యం పెంపొందించుకో వచ్చు. దాంతోపాటు, మీరు మ్యూచువల్ ఫన్ద్ల్ పెట్టుబడి పెట్టడం వల్ల, మీకు ఫండ్ మేనేజర్ యొక్క ఎక్స్పర్టైజ్ కూడా లభిస్తుంది. మరో విషయం ఏమిటంటే మీ డబ్బు ఇతరుల డబ్బుతో పాటు పూల్ చేయబడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ మీ పెట్టుబడిని వివిధ రూపాల్లో పెట్టుపడి పెడుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వ్వర మీ రిస్క్ కూడా కొంతమేరకు తగ్గుతుంది. అయితే వీరు స్టాక్స్ ను ఏవిధంగా గుర్తిస్తారు?: అంతర్జాతీయ స్టాక్లలో పెట్టుబడులు పెట్టే చాలా మ్యూచువల్ ఫండ్స్ ఫండ్ పేరులో ఆయా దేశాల పేర్లు ఉంటాయి; నిర్ధారణ చేసుకోవడం కొరకు ఫండ్ లిటరేచర్ ను పూర్తిగా చదవండి.

ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విధానం # 2 -FoFsలో పెట్టుబడి పెట్టడం.

FoFs, అనగా ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఇది మ్యూచువల్ ఫండ్స్ లో ఒక కేటగిరీ. దీనివల్ల లభించే ప్రయోజనాలు, మరియు రిస్క్ తగ్గించే అవకాశాలు మేము ఇదివరకే వివరించడం జరిగింది. ఈ ఫండ్స్ తాము సేకరించిన పెట్టుబడులను భారతీయ మరియు, అంతర్జాతీయ స్టాక్స్, బాండ్స్ మరియు ఇతర మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇతర ఆస్తులలో పెట్టుబడిగా పెడతాయి. అంతర్జాతీయ స్టాక్స్, బాండ్లు మరియు మ్యూచువల్ ఫండ్లలో భారీగా పెట్టుబదులు పెట్టె ఫండ్స్ కోసం మీరు చూడవచ్చు.

ఈ మొదటి రెండు ఆప్షన్లు మోహిత్ వంటి ప్రారంభకుకలకు గందరగోళం లేకుండా చాలా సులభంగా ఉంటాయి,

ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విధానం # 3 - ETFs - అనగా ఎక్స్ఛేంజ్ ట్రెడెడ్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం.

ETFs లో ముఖ్యమైన అంశం ఏమిటంటే, వీటిలో మ్యూచువల్ ఫండ్స్ మరియు స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క కలయిక. ETFs మ్యూచువల్ ఫండ్స్ లాగే ఉంటాయి, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ల మాదిరిగానే ఇవి కూడా పెట్టుబడిదారుల మూలధనాన్ని పూల్ చేస్తాయి మరియు తరువాత వాటిని వివిధ స్టాక్స్, బాండ్లు మొదలైన వాటిలో పెట్టుబడి పెడతాయి. అయితే ఇటిఎఫ్‌లు కూడా స్టాక్స్ లాగా ఉంటాయి ఎందుకంటే అవి రోజంతా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు అంతర్జాతీయ స్టాక్లలో అంతర్గతంగా పెట్టుబడి పెట్టాలనుకుంటే, అంతర్జాతీయ ఇండైసీస్ ను ట్రాక్ చేసే ETFs లో పెట్టుబడి పెట్టవచ్చు.

మిత్రమా మీరు ఏ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకున్నయ ముందుగా మీరు ఎంతమేరకు రిస్క్ భరించగలరో చెక్ చేసుకోండీ. పైన పేర్కొన్న 6 పెట్టుబడి పద్ధతుల్లో మీరు దేనిని ఎంపిక చేసుకోవాలనుకునా , మీ పెట్టుబడి రిస్క్ ఫ్రీగా ఉంటుందని మాత్రం అనుకోకండి ఎందుకంటే స్టాక్ మార్కెట్ స్వభావమే అనూహ్యమైన మార్పులతో కూడుకున్నది

మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టె ముందు - మీ కుటుంబ్న అవసరాలు, మీ రోజువారీ ఖ్సచులు, మీ వాహనానికి ఇంధనం ఖర్చులు, మీ పిల్లల స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు, ఇంకా అనుకోని ఇతర ఖర్చుల కొరకు అవసరమైన ధనాన్ని తప్పనిసరిగా పక్కకు పెట్టాలి. తెలివైన ఇన్వెస్టర్లు ఎల్లప్పుడూ తమ పెట్టుబడులను వైవిధ్యభరితంగా ఉంచుతారు మరియు ఏదైనా ప్రమాదకర పెట్టుబడులు పెట్టడానికి ముందు తగినంత మేరకు పొదుపులు మరియు స్థిరమైన ఆదాయం ఉండేలా చూసుకుంటారు గుర్తు పెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్ తో సహా అన్నీ రకాల మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్ తో కూడుకొని ఉంటాయన్న నగ్న సత్యాన్ని ఎప్పడూ మరిచిపోకూడదు. ఎల్లప్పుడూ జాగరూకతతో ఇన్వెస్ట్ చేయండి

మరోవిషయం, ప్రతివారూ ఇన్వెస్ట్ చెయ్యవచ్చు మీరు మరింత ఆర్థిక పరిజ్ఞానాన్ని పొందడం కొరకు ఇంకా వీడియోలు చూడాలనుకుంటే www.angelone.in ను ర్శించండి మరింత సమాచారం పొందండి మళ్ళీ కలుద్దాం అంత్గవరకు హాయిగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి