Frequently asked questions about SGBs | Telugu

Podcast Duration: 7:27
SGB గురించి తరచుగా అడగబడే ప్రశ్నలు- ​ మిత్రులారా నమస్కారం. ఈ పోడ్కాస్ట్ లో మనం సావరిన్ గోల్డ్ బాండ్స్ గురించి చర్చించడంతో పాటు సావరిన్ బంగారు బాండ్స్ గురించి ఎక్కువగా అడగబడే ప్రశ్నల గురించి కూడా తెలుసుకుందాం. మేము ఆ ప్రశ్నలకైన జవాబుల్ని కూడా మీకు తెలుపుతాము. ​సావరిన్ గోల్డ్ బాండ్స్ 1 ఆసక్తికరమైన పెట్టుబడి ఎంపిక, కాక పొతే ప్రజలకి దీని గురించి ఎక్కువ తెలియకున్నది. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ల గురించి మీరు మా పోడ్కాస్ట్ లో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, తర్వాత చూడండి లేదా నిర్ణయించండి మీకీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో లోకి ఎలా కుదురుతారో, కుదరక పోతారో. ​ఇన్వెస్ట్మెంట్ కి రెండు కారకాలున్నాయి. ఒకటేమో గ్రోత్ గురించి ఇక రెండవదేమో సంపద రక్షణ గురించి.సావరిన్ గోల్డ్ బాండ్స్ సంపద సృష్టి రీత్యా చిన్న వేర్లున్నాయి పెద్ద వేర్లు కూడా వెల్త్ క్రియేషన్ రీత్యా ఉన్నాయి. రండి చూద్దాం మరి ఈ సావరిన్ బంగారు బాండ్ల విషయాల్లో తరచూ తలెత్తే ముఖ్యమైన 10 ప్రశ్నలతో పాటు వాటికి జవాబులేమిటి ​మొదటి ప్రశ్న: ఈ సావరిన్ బంగారు బాండ్లంటే ఏవిటి? వీటిని ఎవరు ఇస్యూ చేస్తారు? సావరిన్ గోల్డ్ బాండ్స్ ప్రభుత్వం సెక్యూరిటీల్లా జారీ చేసింది. మార్కెట్ నుంచి బంగారాన్ని ఫిజికల్ గా కొనుగోలు చేసేందుకైన ఆల్టర్నేటే ఇది. ఈ బాండ్స్ ఆర్బిఐ ద్వారా ఇష్యూ అవుతోంది. ​రెండో ప్రశ్న; భౌతిక బంగారం కి బదులు వాటి స్తానం లో సావరిన్ బంగారు బాండ్లు కొనేందుకు పెట్టుబడి చేయాల్సిన అవసరమేమిటి? భౌతికంగా బంగారాన్ని కొనడంలోనూ, అమ్మడంలోనూ ఎక్కువ సమయాన్ని కేటాయింపు చేయాల్సి రావడము స్టోర్ చేయడంలోనూ దానికి తగ్గ స్పేస్ కైనా సన్నాహాలకైనా అవసరముంటుంది. అయితే సావరిన్ బంగారు బాండ్ల విషయానికొస్తే వీటికి భౌతిక బంగారానికి అవసరమైన స్థలం అవసరం లేదు. అందువల్ల మీరు రిస్క్ మరియు స్టోరేజ్ ఖర్చుల నుండి విముక్తి పొందగలరు. గోల్డ్ కొనుగోలు కైన సమయం, లేదా ఆ బంగారు ఆభరణాల కైన మేకింగ్ ఛార్జీలు, గోల్డ్ కి సంబందించిన ప్యూరిటీ, ఇలాటి ఎన్నో ప్రాముఖ్య కారణాలున్నాయి ఈ రెండో ప్రశ్నకైన సమాధానంగా. సావరిన్ గోల్డ్ బాండ్స్ ని డిజిటల్గా పొందే ప్రసక్తి ఉన్నందువల్ల ఈ కారణాల వల్లో లేదా పై చెప్పిన అన్ని కారణాల వల్లో విముక్తి పొందగలుగుతారు. ​ఇక మూడవ ప్రశ్న: సావరిన్ బంగారు బాండ్ల పై ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు? సావరిన్ గోల్డ్ బాండ్స్ పై వ్యక్తులు, ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు, విశ్వవిద్యాలయాలు, మరియు హిందూ యునైటెడ్ కుటుంబాలు పెట్టుబడి పెట్టగలరు. అసలు ఓ భారతీయుడు సావరిన్ బంగారు బాండ్శ్ కొని విదేశాలకెళ్లి అక్కడ స్థిర పడాల్సి వచ్చినా కూడా వారే వీటికి స్వంతదారులుగా చెలామణి సాగడం కొనసాగిస్తారు. ​4 వ ప్రశ్న: సావరిన్ బంగారు బాండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు కనీస మరియు గరిష్ట పెట్టుబడి ఈ మాత్రం ఉండాలి? మీరు సావరిన్ బంగారు బాండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు, కనీసం గా 1 గ్రాము నుండి గరిష్టంగా మీరు 4 కిలోల వరకు పెట్టుబడి చేయొచ్చు. అయితే మీరు ట్రస్ట్ లేదా ఇలాంటి సంస్థ అయితే, మీ పెట్టుబడి 20 కిలోల వరకు కూడా పరిమితించబడుతుంది. ప్రతి సంవత్సరానికి ఈ గరిష్ట పరిమితి పొడిగింపు నిర్ణయించబడిందని గుర్తుంచుకోవడం ముఖ్యం. అందువల్ల మీరు వ్యక్తిగత పెట్టుబడిదారులైతే ప్రతి సంవత్సరం 4 కిలోల సావరిన్ బంగారు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. మరోవైపు మీరు ట్రస్ట్ అయితే మీరు ప్రతి సంవత్సరం 20 కిలోల సావరిన్ బంగారు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఒక కుటుంబం ఒకే సంవత్సరంలో 4 కిలోల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకుంటే వారు వివిధ కుటుంబ సభ్యుల పేర్లలో బాండ్లను కొనుగోలు చేయవచ్చు. కాబట్టి సావరీన్ బంగారు బాండ్లను కొనుగోలు చేయగల కుటుంబంలో 5 మంది అర్హత ఉన్నవారు ఉంటే, వారకి అందుపాటు లో ఉన్న సంవత్సరంలో 20 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చు. మైనర్లకు సంరక్షకుడి ద్వారా సావరిన్ బంగారు బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చని కూడా గమనించాలి. ​ఐదవ ప్రశ్న: నేను సావరిన్ బంగారు బాండ్లను ఎక్కడ కొనాలి? సార్వభౌమ బంగారు బాండ్స్ ని కొనడానికి భౌతికంగాను ఖర్చులుంటాయి మరియు డిజిటల్గా కొనాలన్నా ఖర్చ్లు సహజం. అంతేకాదు మరి ఎక్కడైతే బ్యాంకు లకి వెళ్లలేని ప్రసక్తి ఉంటుందో వారు ఆ భారత దేశ నివాసులు సావరిన్ బంగారు బాండ్శ్ ని పోస్ట్ ఆపీస్ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. అయితే ఇవన్నీ కాకుండా సావరిన్ బాండ్శ్ ని డిజిటల్ గా కొనడమే మంచి ఎంపిక. ఇది ప్రతి ఒక్కరికీ సమయం, కృషి మరియు శక్తిని ఆదా చేస్తుంది. SGB ని ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టడం ఈ రోజుల్లో తరచుగా ఉపయోగించే ఆప్సన్. ​6 వ ప్రశ్న: సావరిన్ బంగారు బాండ్లు ఎలా జారీ చేయబడతాయి? అవును, సావరిన్ బంగారు బాండ్లను ట్రాంచస్ ద్వారా జారీ చేస్తారు. ఎప్పుడైతే సావరిన్ గోల్డ్ బాండ్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ విండో తెరువబోతుందో వాటికీ రెండు రోజులు ముందుగానే ఆర్బిఐ తమ వెబ్సైట్ ద్వారా గోల్డ్ యొక్క ధర మరియు ఆ ధర యొక్క సంబంధిత ఫీజుల వివరాలు విడుదల చేస్తుంది. ​7 వ ప్రశ్న: సావరిన్ బంగారు బాండ్ల వేలిడిటీ పీరియడ్ ఎంత కాలం? సావరిన్ గోల్డ్ బాండ్స్ యొక్క పదవీకాలం 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల తర్వాత బ్యాంక్ ఖాతా లో మీ పెట్టుబడి మొత్తం 2.5% వడ్డీ తో కలిపి మీకు జమ చేయబడుతుంది. ​8 వ ప్రశ్న: మరి సావరిన్ గోల్డ్ బాండ్స్ ని 8 సంవత్సరాల ముందే తీసుకోవాలనుకుంటే ఎలాగా? ఒక వేళా మీరు సావరిన్ గోల్డ్ బాండ్స్ ని 8 సంవత్సరాల వ్యవధికి ముందే పొందాలనుకుంటే మీరు 5 సంవత్సరాల తర్వాత మీ బాండ్స్ ని విడిపించుకోవచ్చు. బహుశా మీ బాండ్లు డిజిటల్గా కొనుగోలు చేసి ఉంటే మీరు మీ సావరిన్ గోల్డ్ బాండ్స్ పై ట్రేడబుల్ గౌరవాన్ని పొందగలిగేలా మార్పిడి చేయ బడుతుంది. అంటే దీని అర్థం మీరు మీ సావరిన్ బంగారు బాండ్లను డీమాట్ రూపంలో నిల్వ చేస్తే మీరు ఆసక్తి ఉన్న ఇతర పెట్టుబడిదారులకు బదిలీ చేయవచ్చు. మీరు మీ బాండ్లను బంధువు లేదా స్నేహితుడికి లేదా ఈ పెట్టుబడి విధానాల అర్హత ప్రమాణాలను నెరవేర్చిన ఎవరికైనా బహుమతిగా ఇవ్వొచ్చు లేదా బదిలీ చేయవచ్చు. ​9 వ ప్రశ్న: సారవిన్ బంగారు బాండ్ల పై రుణాలు పొందొచ్చా? సావరిన్ గోల్డ్ బాండ్స్ కి తప్పకుండా ఇవి వర్తిస్తాయి. మీరు సావరిన్ బంగారు బాండ్శ్ ని కొలేటరల్ లాగా ఉపయోగించ వచ్చు. మీరు ఏదేని బ్యాంక్, ఆర్థిక సంస్థ, లేదా NBFC నుంచి లోన్ రీత్యా ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ మరి సాధారణ బంగారు లాగానే ఉపయోగించబడతాయి. ​10 వ మరియు ఆఖరి ప్రశ్న: సావరిన్ బంగారు బాండ్ల కి మరియు సంపాదించిన కాపిటల్స్ కి టాక్స్ ఉంటుందా? ఎంత ఉంటుంది? సావరిన్ గోల్డ్ బాండ్స్ సంపాదనలపై వడ్డీ, ఆదాయ పన్ను చట్టం ప్రకారం వాటి తాహతుకి తగ్గట్టుంటుంది. అయితే సావరిన్ బంగారు బాండ్ల పై పొందబడే క్యాపిటల్ లాభాల పై ఈ విధమైన టాక్స్ విధింపబడదు. సావరిన్ గోల్డ్ బాండ్స్ పై టిడిఎస్ కూడా విధింపబడదు. ఈ విధంగా సావరిన్ బంగారు బాండ్లు ఒక సురక్షితమైన మరియు ఆసక్తికరమైన పెట్టుబడి విధానము. ఇలాంటి మరింత ఆసక్తికరమైన కంటెంట్ కోసం, మా ఛానెల్ను అనుసరించండి మరియు సభ్యత్వాన్ని పొందండి. మిత్రులారా మిమ్మల్ని మీరు అభివృద్ధి పరచుకోవటానికి అంతం లేదు, ఆర్థిక పరిజ్ఞానం నిరంతరం అభివృద్ధి చెందుతుంది మరియు ఎప్పటికీ ముగింపు లేనిది. కాబట్టి ఇలాంటి మరింత సమాచార కంటెంట్ కోసం వేచి ఉండండి! మీరు మీ స్వంత పరిశోధన కూడా చేయాలని కూడా గుర్తుంచుకోండి. ఇలాటి మరో విద్యా పూరిత కంటెంట్ కోసం మమ్మల్ని ఫాలో అవడంతో నవీకరించండి. ఇక మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు మరియు హేప్పీ ఇన్వెస్టింగ్సం. సెక్యూరిటీ మార్కెట్లలో పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ముందు అన్ని సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చదవండి.