Why invest at a young age

Podcast Duration: 7:56
LIC IPO ల గురించి మీరు తెలుసుకోవలసిన ఎన్నో విషయాలు. హలొ ప్రెండ్స్ మరియు ఏంజెల్ వన్ ద్వారా మరో ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన IPO స్పెషల్ పోడ్కాస్ట్ కు స్వాగతం. మిత్రులారా, ఈ పోడ్కాస్ట్ లో మనం ఎల్ఐసి ఐపిఓ ల గురించి మాట్లాడబోతున్నాము. మిత్రులారా ఎల్.ఐ.సి ఒక మిక్కిలి పాత కంపెనీ. అంతేకాదు అతి ప్రసిద్ధమైనది కూడా. చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పటికే ఎల్ఐసి పాలసీలను పొంది ఉండవచ్చు లేదా ఏదో ఒక సమయంలో ఒక పాలిసీ ని కలిగి ఉండవచ్చు. అంతే కాదు ఎల్ఐసి భీమా వ్యాపారంలో ఉన్నందున చాలా మంది ఇన్వెస్టర్ల ఆలోచనలు కూడా ఇన్సూరెన్స్ పట్ల డిమాండ్ ఎప్పటికీ ఉంటాయన్నదే ఇన్వెస్ట్మెంట్ కి చెందిన ఓ మంచి ఆప్సన్. స్మార్ట్ ఇన్వెస్టర్, ఎలాగైనా, లోతుగా త్రవ్వటానికి మరియు ఎల్ఐసి గురించి సాధ్యమైనంతవరకు తెలుసుకోవాలనుకుంటాడు. పైగా చివరకి మార్కెట్ లో ఎన్నో రకాల ఇన్సూరెన్స్ కంపెనీలున్నాయి . ఒకప్పట్లో ఎల్ఐసి యొక్క మార్కెట్ ఏకస్వామ్యము గా ఉండేది. అయితే ఇప్పట్లో ఎల్ఐసి కూడా కఠినమైన పోటీ ఎదుర్కోవాల్సి వస్తోంది. మీరు ఎల్ఐసి పట్ల తీవ్రమైన రీసెర్చ్ చేయాలనుకున్నా, iఅందువల్ల ఈ పోడ్కాస్ట్ వింటున్నా - ఇది అద్భుతమైన మొదటి ముందడుగు. పదండి ఎల్ఐసి మరియు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాటి ఐపిఓ చుట్టూ ఉన్న అన్ని ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం. మనం ఈ వివరాల్ని సరైన పద్ధతిలో చర్చించుకుందాం, అపుడే మీకు అత్యంత గరిష్ట ప్రయోజనాలు దొరుకుతాయి. ఈ చర్చలు మూడు-భాగాలుగా ఉంటాయి. ఇపుడు మనం IPO ల గురించే మాట్లాడటం ప్రారంబిద్దాం. - ఎపుడు ఇది రాబోతుంది; మరియు ఇది భిన్నంగా ఎలా ఉంటుంది, IPO యొక్క పరిమాణం మొదలైనవి. అలాగే మరి మహమ్మారి సమయాల్లోనూ మరియు మహమ్మారికి ముందు సమయంలో ను ఎల్ఐసి యొక్క పనితీరు లాటివి గురించి కూడా ప్రారంభిద్దాం. క్రిందటి ఐపిఓలతో సహా ఎల్ఐసి దాని సహచరులని ప్రత్యేకించి చూద్దాం. --------------------------------- పార్ట్ 1 - ప్రత్యేకించి ఐపిఓ ల గురించిన వివరాలన్నీ. ఇందులోని ఈ ప్రత్యేకతలేవిటి, మరియు ఎందుకీ ప్రత్యేకత? మొదటి విషయం ఏమిటంటే ఎల్ఐసి ఐపిఓ లు ఇండియా యొక్క అతి పెద్ద ఐపిఓ గా ఉండబోతుంది, అది జరిగే సమయానికి. షెడ్యూల్చే తేదీలు ఇప్పటి వరకు విడుదల కాలేదు, ఇది మూడవ త్రైమాసికంలో సంభవిస్తుందని ఊహించబడింది, అంటే ఈ సంవత్సరం అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య లో ఏదేని సమయం లో ఉండ వచ్చు. నివేదికల ప్రకారం, 2021 లోనే ఈ ఉత్తేజకరమైన ఐపిఓ లు సంభవించ బడే అవకాశాలు ఉన్నట్టు అంచనా. తర్వాతి విషయం ఏమిటంటే ఇంతవరకు కంపెనీ తమ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేయలేదు. సరే కాబట్టి LIC యొక్క నిర్మాణం గురించి కొద్దిగా నేపథ్యం లోకి వెళదాం. భారత ప్రభుత్వం యొక్క ఇన్వెస్టుమెంట్స్ ఎల్ఐసి లో చాలా ఎక్కువగా ఉన్నాయి. అవసరమైన మూలధనాన్ని సమీకరించడానికి ఎల్ఐసిలో తన వాటాను విక్రయించాలని ప్రభుత్వం కోరుతుంది. . ఎల్ఐసిలో తన వాటాను 6% నుండి 7% పాటి అమ్మకాలతో . రూ .90,000 కోట్ల కి పెంచాలన్నదే ప్రభుత్వం యొక్క ద్యేయం . గవర్నమెంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ చాలా ఉన్నతంగా ఉంది. - ప్రభుత్వం రూ .2.51 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటోంది. ఇందులో, దాదాపు 45% వరకు ఎల్ఐసి ఐపిఓ ల ద్వారా అని వారి నిర్ణయాలు. ఇక మూడో మాట పాలసీ హోల్డర్స్ కి సంబంధించి : పాలసీదారులలో ఉత్సాహం ఏర్పడింది ఎందుకంటే ఐపిఓ ఇష్యూలో 10% పాలసీదారులకు కేటాయించబడుతుంది అని ప్రభుత్వమే ప్రకటింనందువల్ల. అందువల్ల ఎల్ఐసి ఐపిఓ ల కు ముందే 1 కోటి కన్నా ఎక్కువ డిమాట్ ఖాతాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఆ ప్రకారం ఐపిఓ ల పరిమాణం, ఎల్ఐసి పేరు మీదున్న ప్రజాదరణ, అతి పెద్ద మొత్తంలో పాలసీదారులచే సృష్టించబడిన సందడి, ప్రభుత్వ ప్రమేయం యొక్క కారణాలవల్ల, ఎల్ఐసి ఐపిఓ చుట్టూ చాలా సందడి గొలిపే ముఖ్యాంశాలు ఉన్నాయి. పార్ట్ 2 - ఎల్ఐసి యొక్క పనితీరు, ఆర్థిక స్థితి మరియు వాల్యుయేషన్ హెడ్లైన్స్ చూస్తే ఏ ఐపిఓ ఐనా ఆకర్షణీయంగా అనిపించవచ్చు, కాకపొతే ఇన్వెస్ట్మెంట్ కి తయారవడం లో, మొదటి దశ ఏమిటంటే - కంపెనీ యొక్క వ్యాపార స్థితి గతుల్ని మరియు ఆర్థిక విషయాలను గమనించడం. నేను ప్రత్యేకించి చెబుతున్నాను అయినా నా మాటల ప్రకారం వెళ్లాల్సిన పని లేదు, సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితులను జాగ్రత్తగా గమనించండి ముఖ్యంగా. పదండి ముఖ్యాంశాల్ని గమనిద్దాం. ఎల్ఐసి భారతదేశపు అతిపెద్ద ఆర్థిక సంస్థ. వీటి ఆస్తుల విలువ లు రూ 32 లక్షల కోట్ల పై చిలుకే. ఈ మహమ్మారి చండాల సమయంలో కూడా, అంటే ఏప్రిల్ 2020 నుంచి సెప్టెంబర్ 2020 వరకైన సమయం లో ఎల్ఐసి యొక్క క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ రూ .260,000 కోట్లన్నమాట, రూ .15,000 కోట్ల రాబడితో. కిందటి సంవత్సరం ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ మొత్తం దాదాపు రూ 244,000 దాకా ఉండేది. ఎల్ఐసి యే మార్కెట్ తగ్గు దిశల్లో ను ప్రయోజనం పొందింది. ఎల్ఐసి మదింపుకు సంబంధించి వివిధ గణాంకాలు వెలువడ్డాయి. ప్రభుత్వ వాల్వ్యేసన్ సుమారు గా రూ .12 నుంచి 15 లక్షల కోట్ల వరకైతే ప్రైవేట్ కంపెనీల వాల్యుయేషన్ రూ .9 నుంచి 10 లక్షల కోట్ల వరకు ఉండేది . ఎల్ఐసికి రూ .28 కోట్ల నుంచి రూ .35 కోట్ల విలువైన పాలసీలు ఉన్నాయి. ప్రీమియం కలెక్షన్ యొక్క మొత్తం 45 కోట్ల నుంచి రూ .50 కోట్లు, పార్ట్ 3 - ఎల్ఐసి వర్సెస్ వాటి సహకారులతో ఎల్ఐసి యొక్క ఫైనాన్షియల్స్ సంబందించిన ఈ హైలైట్స్ గమనిస్తే, ప్రతిదీ ప్రకాశవంతంగా మరియు కాంతి పరంగా కనిపిస్తుంది. కొంచెం జూమ్ అవుట్ కూడా చేద్దాం మరియు మరింత పెద్దదిగా చేసి చూద్దాం. ఇక్కడ కొన్ని గణాంకాలు ఉన్నాయి. ఈ మొదటి గణాంకాలు 2020 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు మహమ్మారి యొక్క గరిష్ట శిఖరం సమయంలో ఎల్ఐసి యొక్క మార్కెట్ వాటాను సూచిస్తాయి. పాలసీల సంఖ్యకు సంబంధించి ఎల్ఐసి యొక్క మార్కెట్ వాటా 67% దగ్గర్లో ఉంది - మరి , వీటితో పోల్చితే, 2019-2020 ఫిస్కల్ నందు 69 % వద్ద ఉంటూ ఎల్ఐసి యొక్క వార్షిక నివేదిక ప్రకారం మొదటి సంవత్సరం ప్రీమియంలకు సంబంధించి ఎల్ఐసి మార్కెట్ వాటా 70% గా ఉంది. 15 వేల కోట్ల రూపాయల రాబడితో మూలధన మార్కెట్ పెట్టుబడి రూ .260,000 కోట్లు. మార్చి 2021 నాటికి, ఎల్ఐసికి ఖచ్చితంగా దాని తోటి సహచరుల కంటే పెద్ద నెట్వర్క్ ఉంది: 20 ఇతర బీమా సంస్థల మధ్య 11 లక్షల ఏజెంట్లతో పోలిస్తే రంగం లో 13.5 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. అంటే 20 భీమా సంస్థలు కలిసినా కూడా ఎల్ఐసి యొక్క సేల్స్ నెట్వర్క్ తో మ్యాచ్ అవడం లేదు. ఇంకా చెప్పాలంటే ఇవి ఈ మహమ్మారి సందర్భానికి చెందిన నంబర్స్వా. మహమ్మారి సమయాలకి ముందు ఎల్ఐసి మరింత మెరుగ్గా ఉండేది. ఈ గణాంకాలు మార్చి 2020 కి చెందినవి. ఇందులో, ఎల్ఐసి యొక్క సేల్స్ నెట్వర్క్ కూడా రెట్టింపుగా ఉంది. - అప్పట్లో 22 లక్షల ఏజెంట్లు. ఇపుడు చూద్దాం, ప్రజల్లోకి వెళ్లిన ఇతర బీమా కంపెనీల పనితీరు. ఇపుడీ విషయాలు కొంచెం నిజమే. మిత్రులారా : ఇటీవల న్యూ ఇండియా అస్యూరెన్స్ మరియు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా అన్న 2 జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు ప్రజల్లోకి వచ్చాయి. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ఐపిఓ లో, షేర్ల ఆఫర్ ధర రూ 912 అయితే మరి ఇపుడు అదే షేర్ల ప్రస్తుత స్టాక్ మార్కెట్ లో దాదాపు రూ .200 కే మార్కెట్ ధర గా ఉంది- అంటే ఇది రాసే సమయంలో. ఈ పోడ్కాస్ట్ రాసే సమయంలో న్యూ ఇండియా అస్యూరెన్స్ ఐపిఓ షేర్ల ఆఫర్ ధర రూ 770 నుండి 800 రూపాయల పరిధిలో ఉండేది మరి ఇపుడేమో అటూ ఇటూ రూ. 168 ల కే. ఐపిఓ లో ఇన్వెస్ట్ చేసే ముందు, మీ రిస్క్ పరిజ్ఞానాన్ని ఎల్లప్పుడూ పరిగణించండి మరియు సంస్థను నిశితంగా పరిశోధించండి. చివరగా, ఈ విషయం గుర్తుంచుకోండి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం లో ప్రధానంగా రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. ఈ పోడ్కాస్ట్ మిమ్మల్ని ఈ విషయాలు తెలుసుకునేందుకు మాత్రమే తయారు చేయబడింది మరియు ఇన్వెస్టర్స్ కూడా తమ సొంత పరిశోధనల్ని చేయాలి. ఇక్కడ షార్ట్ కట్స్ అన్నవి ఏమాత్రం లేవు. మరియు ఆసక్తికరమైన ఐపిఓ స్పెషల్ పాడ్కాస్ట్ల కి మా యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియా ఛానెల్ల ద్వారా ఫాలో అవండి. అప్పటి వరకు వీడ్కోలు మరియు హేప్పీ ఇన్వెస్టింగ్. సెక్యూరిటీ మార్కెట్లలో పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ముందు సంబంధిత పత్రాలను అన్నింటినీ జాగ్రత్తగా చదవండి.