How can you be a part-owner of KFC & Pizza Hut? Devyani International IPO/ Everything you need to know about the Devyani International IPO | Telugu

Podcast Duration: 8:24
మీరు KFC & పిజ్జా హట్ యొక్క పార్ట్-యజమానిగా ఎలా ఉంటారు? దేవయాని ఇంటర్నేషనల్ ఐపిఓ. ​హలో ప్రెండ్స్, ఏంజెల్ వన్ యొక్క మరో పోడ్కాస్ట్ కి మీకు స్వాగతం. మిత్రులారా, ఈ రోజు మనం బర్గర్స్, పిజ్జా మరియు కాఫీ గురించి మాట్లాడుదాం. లేదు లేదు మిత్రులారా! మీరు ఏ ఫుడ్ గాని లేక వంట పోడ్కాస్ట్ మీద క్లిక్ చేయలేదు. మీరు ఏంజెల్ వన్ యొక్క పోడ్కాస్ట్ నే వింటున్నారు. అసలీ రోజు, నేను దేవయాని ఇంటర్నేషనల్ కే ఐపిఓ ల గురించి మాట్లాడ బోతున్నాను. దేవయాని ఇంటర్నేషనల్ ఇండియా లో పిజ్జా హట్, కెఎఫ్సి మరియు కోస్టా కాఫీ అవుట్లెట్ల 655 అవుట్లెట్లని నిర్వహిస్తున్నాయి మరియు ఇది యుఎస్ ఆధారిత రుచికరమైన అతిపెద్ద ఫ్రాంచైజ్జీ బ్రాండ్లు.గత కొన్ని నెలల క్రితం QSR అనే క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల ఐపిఓలు ఇండియన్ మార్కెట్స్ లో వ్హాల బాగా పాపులర్ అయ్యాయి. అంతకు ముందు బర్గర్ కింగ్ బార్బెక్యూ నేషన్ లు ఐపిఓల మార్కెట్ లో తోలి ప్రవేశం గావించాయి మరి, ఇప్పుడు దేవయాని ఇంటర్నేషనల్ 1,400 కోట్ల రూపాయల ఐపిఓను ప్రారంభించటానికి సెబీని సంప్రదించింది. పిజ్జా హట్, కెఎఫ్సి మరియు కోస్టా కాఫీ ల వ్యాపారంలో పార్ట్-యజమాని కావడానికి ఇపుడో ప్రత్యేకమైన అవకాశం మీకు కలుగుతోంది. దేవయాని ఇంటర్నేషనల్ సంస్థ గురించి మరిన్ని వివరాలు ఉత్సాహంగా ఇపుడు తెలుసుకుందాం. ​ప్రశ్న నెంబర్ 1: దేవయాని ఇంటర్నేషనల్ ఐపిఓను ఎందుకు దాఖలు చేస్తోంది? ​అన్నిటికన్నా ముందు, సాంకేతిక వివరాల పై బయటినుంచే పరిశీలిద్దాం. దేవయాని ఇంటర్నేషనల్ యొక్క ఐపిఓలో 400 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ మరియు 12.5 కోట్ల షేర్ల అమ్మకం ఆఫర్ ఉంటుంది. ఈ 12.5 కోట్ల షేర్లని రెండు కంపెనీలు విక్రయిస్తాయి, మొదటిది, హై టెమాసెక్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తి యాజమాన్య సంస్థ కి చెందిన డునెర్న్ ఇన్వెస్ట్మెంట్స్ మారిషస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇక రెండో సంస్థ పేరు ఆర్జే కార్ప్ లిమిటెడ్, అంటే కాదు ఇదొక ప్రమోటర్ కంపెనీ. ​సరే, మరిప్పుడు కంపెనీ షేర్ ఎన్లిస్ట్ చేసింతర్వాత వాటి ప్రసక్తి ఏమిటి? మంచిది, దేవయాని ఇంటర్నేషనల్ ఐపిఓ ద్వారా పొందిన నిధు ల తోటి కంపెనీ యొక్క రూ .357.8 కోట్ల రుణాలని తిరిగి చెల్లించేందుకు వాటిని ఉపయోగిస్తుంది. ఇందులో కొద్దీ పాటి నిధుల్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడుతుంది. సరే, ఇప్పటివరకు, చాలా బాగుంది. తర్వాతి మాటేంటి ​ప్రశ్న నెంబర్ 2: ఇష్యూ కంపెనీ యొక్క నేపథ్యం ఏవిటి? ​దేవయాని ఇంటర్నేషనల్ 1991 లో స్థాపించబడింది మరియు ఇది భారత బిలియనీర్ రవి జైపురియా యొక్క RJ గ్రూప్ యాజమాన్యంలో ఉంది. రవి జైపురియా గారి నికర విలువ మొత్తం 3.5 బిలియన్ డాలర్లు మరియు అతను ప్రస్తుతం ప్రపంచంలో 925 వ ధనవంతుడిగానూ ఫోర్బ్స్ ప్రకారం భారతదేశంలో 61 వ ధనవంతుడిగాను జాబితా చేయబడ్డాడు. ​అసలు, దేవయాని ఇంటర్నేషనల్ కంపెనీ వారి కుమార్తె పేరు పై పెట్టారు. ​మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దేవయాని ఇంటర్నేషనల్ యాజమాన్యంలో ఉన్న RJ corp సంస్థే, భారతదేశంలో పెప్సి కంపనీ కైన అతిపెద్ద బాట్లర్ విభాగం. రవి జీ గారు వరుణ్ బెవెరేజస్ అన్న మరో కంపనీక్కూడా యాజమాన్యం వహిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పెప్సికో యొక్క రెండవ అతిపెద్ద బాట్లర్ సంస్థ. ​ప్రశ్న నెంబర్సం 3: దేవయాని ఇంటర్నేషనల్ హిస్టరీ ఎలా ఉండేది? ​1997 లోనే దేవయాని ఇంటర్నేషనల్ మొట్ట మొదట యమ్ బ్రాండ్ తో జత చేరి, జైపూర్లో భారతదేశం యొక్క మొట్టమొదటి పిజ్జా హట్ అవుట్లెట్ను ప్రారంభించింది. ఆ తరువాత, వెనక్కి తిరిగి చూడటం అన్న ప్రసక్తే లేదు. ఈ నాటికి ప్రధాన సంస్థ గా భారతదేశం అంతటా 297 పిజ్జా హట్స్, 264 కెఎఫ్సిలు మరియు 44 కోస్టా కాఫీ షాపులను నిర్వహిస్తోంది. ఇవి కాక కంపెనీ వాంగో, ఫుడ్ స్ట్రీట్, మసాలా ట్విస్ట్, ఐల్ బార్, అమ్రేలి మరియు క్రష్ జ్యూస్ బార్ వంటి ఇతర బ్రాండ్లను కూడా నిర్వహిస్తోంది. దేవయాని ఇంటర్నేషనల్లో నేడు 9,000 మందికి పైగా ఉద్యోగులున్నారు. ​ప్రశ్న నెంబర్ 4: దేవయాని ఇంటర్నేషనల్ యొక్క ఫైనాన్షియల్స్ చెపుతున్నదేమిటి ? ​దేవయాని ఇంటర్నేషనల్ యొక్క ముఖ్యమైన రెవెన్యూలు కెఎఫ్సి మరియు పిజ్జా హట్ స్టోర్స్ నుంచే అండుతొంది. ​19,20 మరియు 21 వ ఆర్ధిక సంవత్సరాల్లో కెఎఫ్సి మరియు పిజ్జా హట్ ల ఇంటర్నేషనల్ మొత్త ఆదాయం 76%, 77.49% మరియు 92.28%. అయితే, ఈ మూడేళ్లలో కంపెనీ పెద్ద ఎత్తున నష్టాలను కూడా చవిచూసింది. 19,20, 21 ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ వరుసగా రూ .94 కోట్లు, రూ .121.4 కోట్లు, రూ .63 కోట్లు నష్టాలను నమోదు చేసింది. కంపెనీకి నష్టాలే. మరి ... నష్టాలు ఈ కంపెనీ కి ఎలా సంభవించాయి?. వీటి గురించి చెప్పాలంటే రెండే కారణాలున్నాయి. మొదటి కారణం స్టోర్ నెట్వర్క్ విస్తరణ కారణంగా అధిక నిర్వహణ ఖర్చులు ఏర్పడ్డాయి. ​మరియు రెండవ కారణం ఈ దుకాణాల కార్యకలాపాల నుండి ఈ ఖర్చులను తిరిగి పొందడంలో వైఫల్యం. ​అన్నిటికన్నా ముఖ్యమైన స్టేట్మంట్. అదేంటంటే, కంపెనీ తమ DRHP లో ఈ విధంగా ప్రస్తావించింది, జాగ్రత్తగా ద్యాస ఉంచి వినండి మిత్రులారా … .. భవిష్యత్తు న, ప్రతి సంవత్సరం కొత్త దుకాణాలను తెరవాలని ఆలోచిస్తున్నట్టు ఈ కంపెనీ పేర్కొంది మరియు ఈ స్టోర్స్ పరిపక్వం చెందనంత కాలం నష్టాలు తప్పవని కూడా వెల్లడించింది . ​IPO కి ఫైలింగ్ చేయడమంటే ప్రతి కంపెనీ యొక్క DRHP లేదా డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఫైలింగ్ చేయడం లాటిది. ఈ డాక్యుమెంట్ కంపెనీ లో ముఖ్యంగా పెట్టుబడి పెట్టే ముందు, ఇన్వెస్టర్ల కి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి తెలుసుకునే వీలు కూడా కల్పిస్తుంది. దేవయాని ఇంటర్నేషనల్ యొక్క DRHP లో కోవిడ్ మహమ్మారి ప్రభావం కూడా వ్యక్తీకరించడం జరిగింది. క్రమేణా గణనీయమైన క్షీణత ఉన్నందున ఆర్ధిక సంవత్సరం 21 లో తన ప్రధాన బ్రాండ్ వ్యాపారం కింద ఉన్న 61 దుకాణాలను శాశ్వతంగా మూసివేసినట్లు కంపెనీ ప్రకటించింది. క్షీణిస్తున్న దశల నుంచి, కోర్ బ్రాండ్ల నుండి కంపెనీ ఇన్-స్టోర్ భోజన ఆదాయంపై కూడా దెబ్బ తీసింది. ఎలాగంటే ఆర్థిక సంవత్సరం 20 లో ప్రధాన గరిష్ట ఆదాయం గా 48.85% ఉండేది మరి ఇప్పుడీ ఆర్ధిక సంవత్సరం 21 లో ముఖ్యంగా ఇది మొత్తం ఆదాయంలో 29.80 శాతానికి పడిపోయింది. ఇది స్టోర్లో భోజనానికి మాత్రమే కాదు, ఇది మొత్తం ఆదాయంలో కూడా పడిపోయింది. ఆపరేషన్స్ ద్వారా వచ్చే ఆదాయం గత సంవత్సరం 20 తో పోలిస్తే 1,516 కోట్ల రూపాయల నుండి 25 శాతం తగ్గి, ఈ సంవత్సరం 21 లో 1,134 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంటే కాదు, దేవయాని ఇంటర్నేషనల్ వారు ఇలా అంటున్నారు తమ DRHP లో కోవిడ్ -19 యొక్క ప్రతికూల ప్రభావం ఆర్ధిక సంవత్సరం 22 లో కూడా కొనసాగుతుందని భావిస్తున్నట్టుగా వెల్లడించారు. ఇవండీ దేవయాని అంతర్జాతీయ ఐపిఓ గురించి ముఖ్య విషయాలు. మిత్రులారా, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ప్రారంభించే ముందు, తమరు కూడా స్వయంగా నిశితంగా మార్కెట్ పరిస్తుతుల్ని అంచనావేయడం తప్పని సరి. మిత్రులు మరియు కుటుంబ సబ్యయులందరికి చెప్పాల్సిన ఓ విషయం ఏవిటంటే ఇలాటి పరిశోధనలు చేయకుండా ఇందులో దిగితే ఇది ప్రమాదకము మరియు మీరు మీ డబ్బును కోల్పోతారు. ఒక వేళా ఆప్ దేవయాని ఇంటర్నేషనల్ ఐపిఓ పై ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే ఓ సారి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ని గూగుల్ ని లోతు గా పరిశిలించండం తప్పని సరి అన్నది గుర్తుంచుకోండి. అవును, మరి ఈ విషయం గుర్తుంచు కొండి. స్టాక్ మార్కెట్ ప్రధాన రిస్క్ ఎప్పుడూ పెట్టుబడి పెట్టడం లో ఉంటుంది. ఆ విషయంపైనే ఈ పోడ్కాస్ట్ , మీ కోసం మీ అవగాహన ప్రయోజనాల కోసం మాత్రమే తయారు చేయబడింది మరియు పెట్టుబడిదారులు తమ సొంత పరిశోధనలు కూడా చేయాలి. ఇందులో ఆసక్తికరమైన పాడ్కాస్ట్లు మా వెబ్సైట్, యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియా ఛానెల్ల ద్వారా అనుసరించడం వీటిని తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. మరి అప్పటి దాకా సెలవు. మరియు హేప్పీ ఇన్వెస్టింగ్సం. సెక్యూరిటీ మార్కెట్లలో పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ముందు అన్ని సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చదవండి. ​