Debunking X myths surrounding trading | Telugu

Podcast Duration: 6:36
​ ​ట్రేడింగ్ ను చుట్టేసిన 5 అపోహలను తొలగించేద్దాం ​హలో ఫ్రెండ్స్ ఏంజెల్ వన్ పోడ్‌కాస్ట్‌కు స్వాగతం, మొదటిసారి వింటున్న శ్రోతలకు మరొకసారి ప్రత్యేకమైన స్వాగతం. మా పోడ్‌కాస్ట్‌ రెగ్యులర్ గా వింటున్న శ్రోతలకు ఈ ఎపిసోడ్ కు తిరిగి స్వాగతం. ​ ఇక్కడ మేము కష్టమైన స్టాక్ మార్కెట్ విషయాలను సింప్లిఫై చేస్తాము. బిగినర్స్ కు ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి అవసరమైన బేసిక్స్ ఇస్తాము. ​మా పోడ్‌కాస్ట్ మీకు యూస్ ఫుల్ గా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, ఈ రోజు పోడ్‌కాస్ట్‌లో మేము ట్రేడింగ్ చుట్టూ ఉన్న కొన్ని అవాస్తవాలను సాల్వ్ చేయబోతున్నాము. ట్రేడింగ్ కొత్త కావడంతో దాని గురించి మంచి విషయాలు అలాగే చెడు విషయాలు చాలానే విని ఉంటారు. అయితే చాలా పాపులర్ అయిన, అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని ట్రేడింగ్ పుకార్ల చుట్టూ ఉన్న నిజాన్ని తెలుసుకుందాం మొదటి అవాస్తవం, మిత్ నంబర్ 1: ఏంటంటే ​స్టాక్ మార్కెట్ అనేది రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యే దారి. ​మొదటి దానికి పూర్తిగా ఆపోజిట్ గా ఉండేది మిత్ నంబర్ 2: స్టాక్ మార్కెట్లలో డబ్బు పెడితే మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ​ఒక పని చేద్దాం మిత్ నంబర్ 1, మిత్ నంబర్ 2రెండు కలిపి చెప్పచ్చు ఎందుకంటే ఆ రెండు రిలేట్ అయివున్నాయి. ​స్టాక్ మార్కెట్‌లో మీరు స్లో అండ్ స్టడీ గా డబ్బును పెంచుకోవచ్చు ​అవును మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవడం ద్వారా పెద్ద లాభాలను టార్గెట్ చేయొచ్హు కానీ ఎక్కువ రిస్క్ ఉన్న స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా నష్టాలు కూడా రావచ్చు అన్నీ కాదు కొన్ని. ​ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఓవర్ నైట్ లో ధనవంతులవడం గురించిన కథలు స్టాక్ మార్కెట్లో మొత్తం పోగొట్టుకోవడం గురించి అవాస్తవాలు. ​ఇలాంటి ట్రేడ్ చేయడమే ఏకైక మార్గం కాదు. తెలివైన ట్రేడర్ సరైన రీసెర్చ్ చేసి ప్రాఫిటబుల్ స్టాక్స్ ను ఎంచుకోవచ్చు. ​స్టాక్ మార్కెట్‌లో మొత్తం పోగొట్టుకోవడం అంటే అది హై రిస్క్ స్టాక్స్ కు సంబంధించినది కానీ కొన్ని రిస్క్ మేనేజ్‌మెంట్ స్టెప్స్ తీసుకోవడం ద్వారా రిస్క్ తగ్గించగలము. ​ స్టాప్ లాస్ సెట్ చేసి పెట్టుకోవాలి ఎలా అంటే మీరు ఒక్కోషేర్ వంద రూపాయలు పెట్టి కొంటే రూ. 98 వద్ద స్టాప్ లాస్ సెట్ చేయవచ్చు. ​షేర్ ధర రూ .98 కి పడిపోయిన వెంటనే మీకు రూ .2 కంటే ఎక్కువ నష్టం జరగదు. వెంటనే మీ షేర్స్ సేల్ చెయ్యొచ్చు. ​ఇప్పుడు చెప్పండి మొత్తం డబ్బులు ఎలా పోతాయి? స్టాక్స్ ను జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. స్టాక్స్ ను ఎక్స్పర్ట్ టిప్స్ చూసి, లేదంటే న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ చూసి ఎప్పుడూ కొనకూడదు . ​కంపెనీ షేర్స్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందు దాని ఫైనాన్షియల్ రికార్డ్స్ ను ఎప్పుడూ చూడండి. ​చూడండి రెవెన్యూ ఎక్కువగా లాసెస్ తక్కువగా ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది పాపులర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ప్రైవేట్ కంపెనీస్ స్ట్రాంగ్ గా ఉంటాయి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ రెవెన్యూ పొందే అవకాశం ఉంది. ​లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి: డే ట్రేడింగ్ అనేది ట్రేడింగ్‌లో అత్యంత ప్రమాదకరమైది, ముఖ్యంగా బిగినర్స్ కోసం. ఎందుకంటే మీరు స్టాక్‌ను ఓవర్ నైట్ హోల్డ్ చేయలేరు. ఈ రోజు తీసుకు మీరు న్నషేర్లు రోజు ముగిసే లోపు సేల్ చేసేయాల్సి ఉంటుంది ​ మీరు అనుకున్నంతగా స్టాక్ ధర పెరిగిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా అలాగే అమ్మడానికి మీకు ఇష్టం ఉందా లేదా అనే విషయాలతో సంబంధం లేకుండా రోజు ముగిసే సరికి అమ్మవలసి ఉంటుంది ​ ​లాంగ్ టర్మ్ రిస్క్ ప్లాటొ అవుట్ అవుతుంది ఫ్రెండ్స్ .అవును స్టాక్ రేట్స్ ఒక్క రోజులోనే విపరీతంగా ఫ్లక్చ్చుయేట్ అవుతాయి. కావాలంటే మీరే ఏదైనా ఒక స్ట్రాంగ్ కంపెనీ లాంగ్ టర్మ్ స్టాక్ ప్రైస్ గ్రాఫ్‌ను చూడండి, లాంగ్ టర్మ్ లో ప్రైస్ ఇన్ క్లైన్ అవలేదా? ​మిత్ నంబర్ 3: మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే మీ ఉద్యోగాన్ని వదిలేయాలి. ఈ రూమర్ అన్ని చొట్ల ఉంది, ఒక విషయం చెప్పండి, మీరు వేరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ,అంటే ఫిక్స్ డ్ డిపాజిట్,(పీపీయెఫ్) PPF లేదా మ్యుచువల్ ఫండ్ మీరు ఉద్యోగాన్ని వదిలివేస్తారా? కానీ అది తప్పనిసరి కాదు, ​మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగారు, ఇంకా మీ జాబ్ కూడా చేస్తున్నారు. అంతేనా? అవును, ట్రేడింగ్‌ను ఫుల్ టైం జాబ్ గా ఎంచుకున్న వాళ్లు కూడా ఉన్నారు, ​కానీ అది తప్పనిసరేమి కాదు, ​మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టచ్చు. మీ జాబ్ కూడా చేయచ్చు. ​మీరు మీ ఆఫీస్ అవర్స్ తర్వాత గాని వీకెండ్ లో గాని కంపెనీస్ మీద రీసర్చ్ చేయొచ్చు. మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు వితిన్ సెకన్స్ మీ బై ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. పాత రోజుల్లో ఆఫ్‌లైన్ ట్రేడింగ్ కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ లో ఎక్కడినుంచైనా ఇన్వెస్ట్ చేయొచ్చు మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఇంకా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. మీరు డే ట్రేడింగ్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. మీరు జాబ్ కి వెళ్ళే ముందు, అర్లి అవర్స్ లో ట్రేడ్ చేయొచ్చు మీరు కొనుగోలు చేసిన అన్ని షేర్లను అలాగే క్లోజ్ చేయొచ్చు అంటే అర్థం ఏంటంటే మీరు ఆఫీసుచేకి వెళ్లేటప్పుడు మీరు కొనుగోలు చేసిన అన్ని షేర్లను అమ్ముకొవచ్చు. ​మిత్ నంబర్ 4: ​మీకు చాలా కంప్యూటర్‌లు ఇంకా మొత్తం సెటప్ అవసరం. ​ట్రేడింగ్ యాప్స్ కు ముందు ఇదే పరిస్థితి ఉండేది. వాస్తవానికి కొంతమంది ప్రొఫెషనల్ డే ట్రేడర్స్ ప్రతి సెకను రకరకాల స్టాక్ రేట్స్ గ్రాఫ్‌ గమనించడానికి అలాంటి సెటప్‌ చేసుకొవచ్చు. ​ఈ రకమైన వ్యాపారులు ట్రేడింగ్ కోసం చిన్న ధరల మార్పులను వెంబడిస్తారు ​వారు భారీ మొత్తాలలో వ్యాపారం చేయడం ద్వారా తమ సంపాదనను సాధిస్తారు. కానీ అలా ట్రేడ్ చేయడం తప్పనిసరి కాదు. ​స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, స్మార్ట్‌ఫోన్ సరిపోతుంది. మిత్ నంబర్ 5: మార్కెట్ డౌన్ అయినప్పుడు, మీరు నష్టానికి యిస్తున్నప్పటికీ, మిగతా ట్రేడర్స్ స్టాక్‌ను అమ్మేస్తున్నప్పుడు మీరు కూడా అమ్మేయాలి. ​స్టాక్ మార్కెట్ వివిధ రకాల విషయాలతో ప్రభావితమవుతుంది ​కానీ ట్రేడర్స్ చాలా భావోద్వేగానికి లోనవుతారు. ​ మంచి కారణం లేకుండా చాలా మంది అమ్ముతారు. కానీ మీరు ఇన్వెస్ట్ చేసెన కంపెనీ యొక్క బిహేవియర్ పై మీ టార్గెట్ పై మీరు శ్రద్ధ వహించాలి. ​మోకాలి కుదుపు ప్రతిచర్యలను నివారించండి. చాలా సందర్భాలలో - ప్రత్యేకించి వార్తలకు అతిగా స్పందించే వ్యక్తుల విషయంలో - మార్కెట్ కొద్ది రోజుల్లో పుంజుకుంటుంది.అయితే, మీరు పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఇబ్బందుల్లో పడితే, మీరు అమ్మేయాల్సి ఉంటుంది. ​అయితే అవును, నేను మళ్ళీ మీకు చెప్తాను ఇన్వెస్ట్ డ్ కంపెనీ ,వారి రెవెన్యూ వ్యయ, లాభం ఇంకా నష్టాలపై శ్రద్ధ వహించండి, ​స్టాక్ ఇన్వెస్ట్ చేయడానికి విలువైనదేనా అని నిర్ణయించడానికి ధర/ఆదాయాల నిష్పత్తి అయిన P/E నిష్పత్తి వంటి సాధనాలను ఉపయోగించడం ద్వారా మీరు మీ స్వంత పరిశోధనను జాగ్రత్తగా చేస్తారని అనుకుంటున్నాను. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. ​ముగింపు మాటలలో, ​ట్రేడ్ చేసేటప్పుడు మీరు మీ బై టైమింగ్‌ను కూడా నిర్ణయించవచ్చు ,అవును స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైనది . పాడ్‌కాస్ట్‌కు ట్యూన్ చేసి, మార్కెట్ ఎలా పనిచేస్తుందనే దానిపై మీ అవగాహనను పెంచుకోవడం కోసం ఫాలో అవండి. ఈ పోడ్‌కాస్ట్ విద్యా ప్రయోజనాల కోసం, పెట్టుబడిదారుగా మాత్రమే రూపొందించబడింది ​సొంత పరిశోధనచేయండి, తెలివిగా వ్యాపారం చేయండి . మీరు రోజువారీ ఖర్చులు కోసం తగినంత పక్కన ఉంచిన తర్వాత మిగిలిపోయిన పెట్టుబడితో ఎప్పుడూ వ్యాపారం చేయండి. సెక్యూరిటీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ముందు అన్ని సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చదవండి. ​ ​ ​ ​