All you need to know about E-Rupi

Podcast Duration: 6:42
E-Rupi గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హలో మిత్రులారా, Angel One వాళ్ళ మరొక ముఖ్య సమాచార పోడ్‌కాస్ట్‌కు తెలియజేయడానికి మిమల్ని స్వాగతిస్తున్నారు. మిత్రులారా, ఈ రోజు మనం E-Rupi గురించి తెలుసుకోబోతున్నాము. ఈ నెల మొదట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి E-Rupi ని ప్రారంభించారు. E-Rupi ని మనం ఎలా పలకాలంటే ఇ ఆర్ యు పి ఐ. నాకు తెలిసి మీకు అర్థమైంది కాకుంటే మళ్ళీ చెప్తాను. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే NPCI, ఏదైనా ఒక ఉపయోగం కోసం ఇతరులకు డబ్బు చెల్లించే కొత్త మార్గంగా E-Rupi ని ప్రారంభించింది. మనం అనుకోవచ్చు ఏంటి ఈ E-Rupi, దీనివల్ల నాకు ఉపయోగం ఏమి అని? దీని గురించి నేను మీకు చాలా వివరంగా చెప్తాను. E-Rupi ఒక వోచర్ లాంటిది ఇది ప్రతి వ్యక్తి వాళ్ళకు అనుకూల విధంగా ఉపయోగించచ్చు. ఈ వోచర్ కోడ్ మీ మొబైల్ కి వస్తుంది. ఇది SMS లో రావచ్చు, లేకుంటే QR కోడ్ గా కూడా రావచ్చు. ఇది ఒక్కసారి డబ్బులు పే చేయడానికి ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్ పేమెంట్ చేసి రిటైలర్లు లేదా వ్యాపారవేత్తలకు అనుకూలంగా ప్రజలు E-Rupi వోచర్‌ను వాడచ్చు. ఆ రిటైలర్ కు లేదా వ్యాపారవేత్తలకు వెంటనే డబ్బు వస్తుంది. E-Rupi గురించి ఒక్కమాటలో చెప్పాలంటే, మనం పే చేయడానికి పాస్ బ్యాంక్ ఎకౌంటు లేదా పే చేసే యాప్ లు ఏవి లేకపోయిన ఈ E-Rupi వోచర్ ని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో నేను చెప్పేదా? ముందే మార్కెట్ లో కొన్ని రకాల పే చేసే విధానాలు ఉంది ఇప్పుడు ఈ కొత్త విధానం ఎందుకు. దీనివల్ల అవసరం ఏమి? చెప్పాలంటే, E-Rupi మార్కెట్ లో ఉండే అన్ని పేమెంట్ ప్రోడక్ట్ కన్నా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. E-Rupi ని వాడడం ద్వారా మీరు లేదా ప్రభుత్వం కేటాయించిన ప్రయోజనం కోసం డబ్బు ఖర్చు చేయచ్చని అనుకోవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు ప్రభుత్వం ఎవరికైనా అంటే హాస్పిటల్ కి లేదా కోవిడ్ ఖర్చుల కోసం డబ్బుని కేటాయిస్తే E-Rupi ద్వారా ప్రభుత్వం తెలుసుకోబడుతుంది కేటాయించిన డబ్బు దీనికి మాత్రమే ఉపయోగించారని. ఈ విధంగా E-Rupi ని ప్రారంభించుడం ద్వారా, భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విధానం పెరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ప్రైవేట్ సంస్థ ఎవరికైన ఆరోగ్యపరంగా, చదువుపరంగా, లేక ఇతర సామాజిక విషయాలు పరంగా సహాయం చేయాలనుకుంటే వాళ్ళు డబ్బు ఇవ్వకుండా E-Rupi ని ఇవ్వచ్చు. దాంతోపాటు చెల్లింపుదారుడు వోచర్ కోసం చెల్లించుకోవడానికి కాల పరిమితిని కూడా తగ్గిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం 3 నెలల్లోపు చెల్లింపు వోచర్‌ను వాడకుంటే, ఆ వోచర్ 3 నెలల తర్వాత పనిచేయదు. గ్యాస్ లేదా ఎరువుల సబ్సిడీ చెల్లింపులో అయినా సబ్సిడీ చెల్లింపుల విషయంలో ప్రభుత్వానికి వచ్చిన ముఖ్య సమస్యలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం E-Rupi విధానాన్ని విడుదల చేసింది. ఎందుకంటే, పెద్ద సమస్థలు ఎక్కువ సబ్సిడీ బిల్లను అందిస్తుంది సబ్సిడీ పేద ప్రజలకు మాత్రమే ఇవ్వాలని తెలుసుకోవడానికి ఈ విధానం ప్రభత్వం పెట్టింది. నిజానికి, ఈ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ అది తగిన ప్రజలకు చేరుకోవడానికి మాత్రమే. దానికోసం ప్రభుత్వం డైరెక్ట్ గా అందించే విధానాన్ని తీసేసి, అది అవసరమైన వాళ్ళ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా తీసుకోవడం చేయబడింది. గత కొన్నేళ్లుగా DBT వ్యవస్థ బాగా మెరుగుపడింది. అధికారిక సమాచారం కోసం భారతదేశం 54 మంత్రిత్వ శాఖలకు పైగా 314 డిబిటి ప్రోగ్రామ్‌లను నడుపుతోంది. FY21 లో రూ. 551 కోట్లకు పైగా ట్రాన్స్ఫర్ చేయబడింది. FY 22 ముఖ్యంగా అది రూ .1.30 కోట్లకు పైగా 155 కోట్ల ట్రాన్స్ఫర్ జరిగింది. ఇలాంటి పెద్ద విషయాలలో సమస్యలు రావడం సులభమే. DBT సమస్యవల్లె ముఖ్యంగా తీసేశారు, బ్యాంకు ఖాతాలన్నీ ఉన్నందుకు, జన్-ధన్ యోజనం కోసం ప్రారంభించిన DBT లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అదే కాకుండా, చిన్న పట్టణాలు మరియు గ్రామాలలో కొన్ని అవినీతి కేసులు ఉన్నాయి. మరొక్క విధంగా చుసుకునట్లితే పేదవాళ్ళ ఖాతాలను ఉపయోగిస్తునట్లు అనిపిస్తుంది. అప్పుడు సబ్సిడీ వస్తుంది, అతను దాన్ని వాడుకోవచ్చు. అంతేకాకుండా, మనం చూసినట్లయితే ప్రజలకు సబ్సిడీ ఇచ్చినప్పుడు, లబ్ధిదారులు ఆల్కహాల్ లేదా జూదాల పై సబ్సిడీలను వేసేస్తారు. ఇలాంటి సమస్యలకు ఒకటే పరిష్కారం అదే ప్రభుత్వం వోచర్స్ ద్వారా అందిస్తే, అది మధ్యలో ఉన్న వ్యక్తులకు చేరకుండా సరైన వాళ్ళకే చేరుతుంది. E-Rupi వాడడంవల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇంకా ఏమంటే, ప్రభుత్వం ప్రయోజనం కలిగి అలాగే దాని సబ్సిడీ చెల్లింపులకు ఎక్కువ డేటా పారదర్శకత మరియు జవాబుదారీతనంగా ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవలసినది ఏమంటే E-Rupi అనేది క్రిప్టోకరెన్సీ కాదు. ఇది డిజిటలైజ్డ్ చెల్లింపు వ్యవస్థ. ఏదేమైనా, E-Rupi ని తీసుకోవడం అనేది క్రిప్టోకరెన్సీ ఉంహించిన విధంగా చాలా ఆశను కలిగించింది, ఇటువంటి డిజిటలైజేషన్ కోరుకున్న వాళ్ళకి మంచిదే. క్రిప్టోకరెన్సీ ఉంహించిన వాళ్ళకు చెప్పేది ఏమంటే ఇలాంటి చర్య క్రిప్టోకరెన్సీల పట్ల ప్రభుత్వం సానుకూల వైఖరిని చెప్పడమే ఒక ముందడుగు. డిజిటలైజేషన్ మరియు క్రిప్టో-ఆస్తులు కలిసి ఉండడానికి ఇది మొదటి అడుగని చాలా మంది మార్కెట్ నిపుణులు అనుకుంటున్నారు. భారతదేశంలో, నగదు పై GDP నిష్పత్తి 14.7% వద్ద ఉంది, ఇది గత రెండు దశాబ్దాలలో ఎప్పుడూ లేనంత అధికం. E-Rupi చెల్లింపు రసీదులను తీసుకోవడంతో, ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోంది మరియు దేశంలో డబ్బు పై ఆధారపడటాన్ని తగ్గిస్తోంది. భారతదేశంలో 19 కోట్ల మంది బ్యాంకు లేని వ్యక్తులకు ఆర్థిక పరంగా విస్తరించడం మరియు వాళ్ళని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం E-Rupi ని ప్రారంభించడం ప్రభుత్వం యొక్క ముఖ్య కారణం. E-Rupi అనేది ప్రాథమికంగా సంక్షేమ చెల్లింపుల కోసం తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారం, ఇది ఆర్థిక వ్యవస్థను మరింత అధికారికంగా చేయడానికి ప్రభుత్వ డ్రైవ్‌కు మరింత శక్తిని అందిస్తుంది. విన్నారు కదా మిత్రులారా, E-Rupi గురించి చెప్పడం అయింది. ఏది ఏమైనా, మేము మీకు చెల్లించే కొత్త విధానాలు మీ ముందు తెస్తూ ఉంటామని హామీ ఇస్తున్నాను. చివరగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ పోడ్‌కాస్ట్ విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే చేసినది మరియు పెట్టుబడిదారుడు తన సొంత పరిశోధన కూడా చేయాలి. మరిన్ని ఆసక్తికరమైన పాడ్‌కాస్ట్‌ల కోసం YouTube మరియు ఇతర సోషల్ మీడియా ఛానెల్‌లలో మమ్మల్ని ఫాలో అవ్వండి. అప్పటివరకు వీడ్కోలు మరియు సంతోషకరమైన పెట్టుబడి! సెక్యూరిటీ మార్కెట్లలో పెట్టుబడులు ప్రమాదాలకు లోబడి ఉంటాయి, పెట్టుబడి పెట్టడానికి ముందు సంబంధిత పత్రాలన్నింటినీ జాగ్రత్తగా చదవండి. Investments in the securities markets are subject to market risks, read all the related documents carefully before investing.