ఆదాయపు పన్ను నోటీసు

1 min read
by Angel One

ఆదాయపు పన్ను అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆదాయంపై ప్రపంచంలోని దాదాపుగా అన్ని ప్రభుత్వాలు విధించే ప్రత్యక్ష పన్ను రూపం. అయితే, మీ ఆదాయం కనీస పరిమితికి చేరుకున్నప్పుడు మాత్రమే ఆదాయపు పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఆదాయం ఎంత ఎక్కువగా ఉంటే మినహాయింపు అంత ఎక్కువగా ఉంటుంది.

ఒక పన్ను నోటీసు తరచుగా పన్ను చెల్లింపుదారులను ఆందోళన పడేలా చేస్తుంది.  కానీ మీరు ఒక ముఖ్యమైన గడువును మిస్ అయినా లేదా ఒక ప్రక్రియను అనుసరించడంలో లోపం చేసినట్లయితే ఆదాయపు పన్ను నోటీసు మీకు పంపవచ్చు.

ఆదాయ పన్ను నోటీసు కోసం సాధారణ కారణాలు

  • TDS-ఫారం 26AS సరిపోలలేదు: మీ యొక్క మూలం వద్ద మినహాయించబడిన పన్ను (TDS) మొత్తం మీ ఫారం 26 తో సరిపోలకపోతే మీ ఇంటి వద్ద పన్ను నోటీసును మీరు ఆశించవచ్చు. అనేక కారణాల వలన సరిపోలకపోవచ్చు, ముఖ్యంగా మీకు ఒకటి కంటే ఎక్కువ ఆదాయం వనరులు ఉంటే. అటువంటి సందర్భంలో, ఐ-టి విభాగం మీకు సెక్షన్ 143 (1A) కింద నోటీసు పంపవచ్చు.

ఆదాయ పన్ను నోటీసును ఎలా డీల్ చేయాలి?

మొదట, సరిపోలకపోవడానికి కారణాన్ని వివరించడం ద్వారా మీరు ఈ నోటీసుకు ప్రతిస్పందించవచ్చు. దీని కోసం, మీరు ITR ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి మరియు అప్పుడు ఇది చేయండి. అంతేకాకుండా, మీరు మీ వివరణలకు మద్దతు ఇవ్వడానికి చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించాలి.

  • సెక్షన్ 143(1): ఏదైనా ఆదాయాన్ని బహిర్గతం చేయని సందర్భంలో సెక్షన్ 143(1) క్రింద ఐ-టి విభాగం మీకు నోటీసు పంపవచ్చు. మీ ఆదాయం గురించి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి లేదా మ్యూచువల్ ఫండ్ హౌస్ నుండి విభాగం తన విచారణ ద్వారా అన్ని వనరుల నుండి మీరు మొత్తాలను బహిర్గతం చేయలేదని తెలుసుకుంటే, ఆ ప్రాతిపదికన మీకు ఒక నోటీసు పంపవచ్చు.

ఆ సందర్భంలో ఆదాయపు పన్ను నోటీసును ఎలా డీల్ చేయాలి?

మీకు తెలిసినట్లు, ఆదాయపు పన్ను మీ జీతం ఒక్కటి మాత్రమే కలిగి ఉండదు. ఒక పెట్టుబడి నుండి మీకు కలిగి ఉండగల మూలధన లాభాలు లేదా ఒక ఆస్తి నుండి వచ్చే ఆదాయం మీరు లెక్కలోకి తీసుకోవాలి. అంతేకాకుండా, మీ ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఫిక్సెడ్ డిపాజిట్ల నుండి పెట్టుబడి రిటర్న్స్ కూడా ప్రకటించబడాలి.

మీ పన్ను రిటర్న్ లో వ్యత్యాసం 30 రోజుల్లోపు అదనపు పన్ను మొత్తాన్ని చెల్లించడానికి మీకు బాధ్యత వహిస్తుందని కూడా మీరు గమనించాలి. మీరు చెల్లుబాటు అయ్యే రుజువుతో నోటీసుకు సమాధానం ఇవ్వవచ్చు మరియు మీ ITR వివరాలను దాఖలు చేసేటప్పుడు మీరు చేసిన ఏదైనా లోపం వివరించవచ్చు.

  • సెక్షన్ 143(2): సెక్షన్ 143(2) కింద ఒక నోటీసు అంటే డిపార్ట్మెంట్ మీ ITR ను మూల్యాంకన చేస్తోంది లేదా తనిఖీ చేస్తోంది అని అర్ధం. సూచించిన సమయ వ్యవధిలోపు అటువంటి నోటీసుకు మీరు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. అందువల్ల, మీరు ప్రతిస్పందన కోసం అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
  • సెక్షన్ 139 (9): దీనితో పాటు, మీరు తప్పు ITR ఫారం కోసం కూడా నోటీసును అందుకోవచ్చు. ఇది ఒక ఆదాయపు పన్ను నోటీసును ఆకర్షించే సాధారణ కారణం. ఉదాహరణకు, మీకు అనేక ఆదాయ వనరులు ఉన్నాయి మరియు మీరు తప్పు ITR ఫారం ఎంచుకోవడం ద్వారా రిటర్న్ ఫైల్ చేసారు, అప్పుడు మీరు సెక్షన్ 139 (9) క్రింద ఒక నోటీసు అందుకుంటారు.

ఆదాయ పన్ను నోటీసును ఎలా డీల్ చేయాలి?

ఐ-టి విభాగం సాధారణంగా సెక్షన్ 139(9) క్రింద నోటీసు ఉంటే ప్రతిస్పందన కోసం 15 రోజుల వరకు అనుమతిస్తుంది. మీరు ఈ వ్యవధిలో స్పందించడంలో విఫలమైతే, మీ రిటర్న్ ఫైలింగ్ చెల్లనిదిగా ప్రకటించబడవచ్చు.

పన్ను నోటీసును ఆకర్షించడానికి ఇతర కారణం

పైన జాబితా చేయబడిన కారణాలు కాకుండా, మీరు అధిక-విలువ లావాదేవీ లేదా మీ జీవిత భాగస్వామి పేరులో చేసిన పెట్టుబడి ప్రకటించడంలో విఫలమైతే మీ ఇంటికి ఒక నోటీసు రావచ్చును.

మరొకరి పేరులో పెట్టిన పెట్టుబడిని పేర్కొనపోవటం కూడా పన్ను చెల్లింపుదారుని యొక్క మరొక సాధారణ లోపం. ఆ లావాదేవీ మీ ఫైలింగ్స్ లో కూడా పేర్కొనవలసి ఉంటుంది.

సాధారణంగా పన్ను విభాగం ఒక సంవత్సరంలో 10 లక్షలకు పైగా లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్‌తో ఉన్న వ్యక్తులను దగ్గరగా పరిశీలిస్తుంది. అంతేకాకుండా, 30 లక్షలకు పైగా విలువగల ఆస్తి లావాదేవీ కూడా ఐ-టి విభాగం యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది, అందువల్ల, ఆదాయపు పన్ను నోటీసు అంటే ఏమిటి మరియు ఆదాయపు పన్ను నోటీసుతో ఎలా డీల్ చేయాలో మీరు తెలుసుకోవాలి.

ముగింపు:

చాలా ఆదాయ-పన్ను నోటీసులు పెట్టుబడి రుజువుతో పాటు అదనపు డేటాను మీరు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా మీరు మీ భాగంలో ఏదైనా లోపం ఉంటే అది వివరించవలసి ఉంటుంది. అందువల్ల ఫైలింగ్ వ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకోవడం మరియు మీరు చేసిన అన్ని పెట్టుబడుల రికార్డును ఉంచుకోవడం మంచి పద్ధతి.