షార్ట్ సెల్లింగ్ అనేది మార్జిన్ అకౌంట్ ఉపయోగించి మీ డీమాట్ అకౌంట్లో మీ వద్ద లేని షేర్లు లేదా సెక్యూరిటీలను అమ్మే పద్ధతి. అటువంటప్పుడు మీరు మార్జిన్ ఫీజు చెల్లించడం ద్వారా మీ బ్రోకర్ నుండి షేర్లు లేదా సెక్యూరిటీలను తీసుకోవచ్చు. సెటిల్మెంట్ కాలం చివరిలో మీరు రుణం తీసుకున్న షేర్లను మీ బ్రోకర్‌కు తిరిగి ఇచ్చేలా చూడాలి – ఇది సాధారణంగా స్టాక్స్ విషయంలో ఒక రోజు మరియు కరెన్సీలు, ఫ్యూచర్స్ మరియు ఆప్షన్ల విషయంలో ఎక్కువ కాలం.
షార్ట్ సెల్లింగ్ ఒక నిర్దిష్ట సెక్యూరిటీ యొక్క ధర తగ్గుతుంది మరియు ధరల క్షీణత నుండి మీరు లాభం పొందవచ్చు అనే భావన. మీరు సాధారణంగా స్టాక్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీరు లాభాలను బుక్ చేసుకోగలిగే విధంగా ధరలు పెరుగుతాయని మీరు ఆశిస్తున్నారు. ఏదేమైనా, షార్ట్ సెల్లింగ్ విషయంలో ఇది వ్యతిరేకం, మీరు మీ దగ్గర లేని షేర్లను అమ్మడం ద్వారా ధరలు తగ్గినప్పుడు మీరు లాభం పొందాలని ఆశిస్తున్నారు. వింతగా అనిపిస్తుందా, కాని షార్ట్ సెల్లింగ్ అంటే ఇదే!
స్టాక్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ – సరళమైన వివరణ
షేర్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ 7 సాధారణ దశల్లో వివరించవచ్చు:
- మార్జిన్ అకౌంట్ తెరవండి
- ధరలు తగ్గే అవకాశం ఉన్న స్టాక్‌ను కనుగొనండి
- మీ బ్రోకర్ నుండి స్టాక్ తీసుకోండి
- స్టాక్ అమ్మండి
- సెటిల్మెంట్ కాలానికి ముందు అదే స్టాక్ కొనండి
- స్టాక్‌ను బ్రోకర్‌కు తిరిగి ఇవ్వండి
- అమ్మకపు ధర మరియు కొనుగోలు ధరల మధ్య వ్యత్యాసాన్ని మీ లాభంగా ఉంచండి
ట్రేడింగ్‌లో షార్ సెల్లింగ్ అంటే ఏమిటి మరియు ఇది ఎలా పనిచేస్తుంది?
ఇప్పుడు సులభంగా అర్థం చేసుకోగలిగే ఉదాహరణతో స్టాక్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
ఉదాహరణ
ఎబిసి బ్యాంక్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని హరీష్ విన్నాడు మరియు స్టాక్ ధర తగ్గుతుందని అతను ఆశిస్తున్నాడు. అతను తన బ్రోకర్‌ను పిలిచి, ఎబిసి బ్యాంక్ యొక్క 100 షేర్లను షార్ట్ చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు. ఈ ఆర్డర్‌ను నెరవేర్చడానికి, హరీష్ యొక్క బ్రోకర్ ఎబిసి బ్యాంక్ యొక్క 100 షేర్లను కనుగొని హరీష్‌కు రుణంగా ఇవ్వాలి.
తరువాత, అతని బ్రోకర్ తన స్టాక్ జాబితా మరియు తన క్లయింట్ ల పోర్ట్ ఫోలియో ద్వారా తనిఖీ చేస్తాడు. అతను అప్పటికీ వాటిని కనుగొనలేకపోతే, అతను వాటిని అమ్మమని ఇతర బ్రోకర్లను అడగవచ్చు. చివరగా, హరీష్ యొక్క బ్రోకర్ తన క్లయింట్ యొక్క ఒక పోర్ట్ ఫోలియోలో షేర్లను కనుగొంటాడు మరియు అతను (బ్రోకర్) హరీష్ కోసం మార్కెట్లో షేర్ ని విక్రయిస్తాడు. అతను ఎబిసి బ్యాంక్ యొక్క 100 షేర్లను అమ్మిన సమయంలో, ఇది ఒక్కో షేరుకు రూ.150 రూపాయలు. కాబట్టి, బ్రోకర్ హరీష్ బ్రోకరేజ్ అకౌంట్ లో రూ.15,000 క్రెడిట్ చేస్తాడు.
హరీష్ పందెం సరైనదని నిరూపించబడింది. ఎబిసి బ్యాంక్ యొక్క ఆర్థిక ఇబ్బందుల గురించి చెడు వార్తలు వేగంగా ప్రయాణించడంతో, క్రిందకు పడిపోయింది ఇది ఒక్కో షేరుకు రూ.120 రూపాయలు. ఇప్పుడు హరీష్ మళ్ళీ తన బ్రోకర్‌ను పిలిచి ఎబిసి బ్యాంక్‌లో తన స్థానాన్ని కవర్/స్క్వేర్ ఆఫ్ చేయమని అడుగుతాడు. హరిష్ బ్రోకరేజ్ అకౌంట్ నుండి డబ్బును ఉపయోగించి బ్రోకర్ ఎబిసి బ్యాంక్ యొక్క 100 షేర్లను మార్కెట్ నుండి ప్రస్తుత ధర రూ.120 రూపాయలు వద్ద కొంటాడు, ఇది మొత్తం రూ. 12,000 అవుతుంది. అప్పుడు, బ్రోకర్ ఎబిసి బ్యాంక్ యొక్క 100 స్టాక్‌లను తన ఇతర క్లయింట్ యొక్క పోర్ట్ ఫోలియోకు తిరిగి ఇచ్చేస్తాడు.
ఇప్పుడు హరీష్ ఎబిసి బ్యాంక్ 100 షేర్లను రూ.15,000 కు అమ్మి మరియు తిరిగి రూ.12,000 కి కొనుగోలు చేసి, రూ.3,000 సులభమైన లాభం చేశాడు. స్టాక్ రుణం తీసుకొనే హక్కును ఇచ్చినందుకుగాను హరీష్ తన లాభం నుండి కొంత భాగాన్ని బ్రోకర్‌కు చెల్లించాల్సి ఉంటుంది.
షార్ట్ సెల్లింగ్ అనుబంధమైన రిస్క్ లు
షేర్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్, స్టాక్స్ యొక్క వాస్తవ ధరలో కేవలం 20-25% ఖర్చు చేయడం ద్వారా అధిక రాబడికి అవకాశాలను అందిస్తుంది. అయినప్పటికీ, ఇది నష్టాల యొక్క అధిక రిస్క్ లతో కూడా వస్తుంది. సాధారణంగా, మీరు స్టాక్‌ను రూ.10,000 కొంటే, మీ నష్టాలు రూ.10,000 కు మాత్రమే పరిమితమౌతాయి. కానీ షార్ట్ సెల్లింగ్ లో , ట్రేడింగ్ సమయంలో స్టాక్ ధర ఎంత ఎక్కువగా పెరుగుతుందో మీకు ఎప్పటికీ తెలియదు.
షేర్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ అందరికీ కాదని మీరు అర్థం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ లో నైపుణ్యాన్ని పొందడానికి మీరు చాలా సమయం మరియు పరిశోధనలను పెట్టుబడిగా పెట్టాలి. షార్ట్ సెల్లింగ్ బేరిష్ మార్కెట్లో హెడ్జింగ్ (పెట్టుబడి రక్షణ) సాధనంగా కూడా ఉపయోగించబడుతుంది. షార్ట్ సెల్లింగ్ సెక్యూరిటీల గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే, ఏంజెల్ బ్రోకింగ్‌లోని ట్రేడింగ్ నిపుణులు సరైన దశలతో మీకు సహాయపడగలరు కాబట్టి మీరు విశ్వాసంతో ట్రేడ్ చేయవచ్చు. ఈ రోజే ఏంజెల్ బ్రోకింగ్ డీమాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ తో ప్రారంభించండి!