మార్జిన్ కాలిక్యులేటర్ ఉపయోగించడం

1 min read

మార్జిన్ క్యాలిక్యులేటర్ ఉపయోగించడం

ఫ్యూచర్స్ మరియు ఆప్షన్లలో ట్రేడ్ చేసేటప్పుడు అర్థం చేసుకోవలసిన కీలకమైన విషయాలలో ఒకటి మార్జిన్ యొక్క భావన. మీరు ఎఫ్&ఓ లో ట్రేడింగ్ ప్రారంభించడానికి ముందు, మీరు ప్రారంభ మార్జిన్ అని పిలువబడే దానిని బ్రోకర్‌తో జమ చేయాలి. ధరల అస్థిరత కారణంగా ఫ్యూచర్స్ మరియు ఆప్షన్లలో ట్రేడ్ చేసేటప్పుడు కొనుగోలుదారు లేదా విక్రేత నష్టపోతే బ్రోకర్‌ను రక్షించడం దీని లక్ష్యం.

మీరు డిపాజిట్ చేసిన ప్రారంభ మార్జిన్ యొక్క మల్టిపుల్స్ లో ట్రేడ్ చేయవచ్చు. ఉదాహరణకు, మార్జిన్ 10 శాతం అయితే మరియు మీరు ఫ్యూచర్స్ మరియు ఆప్షన్లలో రూ .10 లక్షలు పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు బ్రోకర్‌తో రూ.1 లక్షను జమ చేయాలి. మీరు ట్రేడ్ చేసే ఈ మల్టిపుల్ ని లేవరేజ్ అంటారు.

వాస్తవానికి, మార్జిన్లు ఇండెక్స్ నుండి ఇండెక్స్ కు మరియు షేర్ నుండి షేర్ కు మారుతూ ఉంటాయి. కాబట్టి, మీకు కావలసిన ఈక్విటీ లేదా ఇండెక్స్ ఎఫ్ & ఓలో ట్రేడ్ చేయడానికి మార్జిన్ గురించి తెలుసుకోవడానికి మీకు ఒక ఎఫ్& కాలిక్యులేటర్ అవసరం.

స్పాన్ మార్జిన్ కాలిక్యులేటర్

ఎఫ్& మార్జిన్ కాలిక్యులేటర్ ఉపయోగించడానికి ముందు, స్పాన్ వంటి మార్జిన్ల రకాలను తెలుసుకోవడం చాలా అవసరం. స్పాన్ అనేది స్టాండర్డ్ పోర్టుఫోలియో అనాలిసిస్ అఫ్ రిస్క్ యొక్క చిన్న పేరు. స్పాన్ మార్జిన్ కాలిక్యులేటర్, మార్జిన్లను నిర్ణయించడానికి సంక్లిష్ట అల్గారిథమ్లను ఉపయోగిస్తుంది. అనేక సందర్భాలలో (సుమారు 16) ఒక పోర్టుఫోలియోలో వచ్చే అధిక నష్టం తో సమానంగా ప్రారంభ మర్గిన్ ఉండేటట్లు స్పాన్ కాలిక్యులేటర్ లెక్కపెడుతుంది.. స్పాన్ మార్జిన్లు రోజుకు ఆరు సార్లు సవరించబడతాయి, కాబట్టి రోజు సమయాన్ని బట్టి క్యాలిక్యులేటర్ వివిధ ఫలితాలను ఇస్తుంది.

వేల్యూ ఎట్ రిస్క్ మార్జిన్

ఎన్‌ఎస్‌ఇ ఎఫ్& మార్జిన్ కాలిక్యులేటర్లో వేల్యూ ఎట్ రిస్క్ (VaR) మార్జిన్ కలిగి ఉంటుంది. చారిత్రక ధరల ట్రెండ్లు మరియు అస్థిరత యొక్క గణాంక విశ్లేషణ ఆధారంగా ఆస్తి విలువ నష్టం యొక్క సంభావ్యతను ఇది అంచనా వేస్తుంది. సెక్యూరిటీలు గ్రూప్ I, గ్రూప్ II లేదా III ద్వారా గ్రూప్లో జాబితా చేయబడ్డాయో అనేదానిపై మార్జిన్లు ఆధారపడి ఉంటాయి. వివిధ సూచికలకు ఒక ఇండెక్స్ (VaR) కూడా ఉంది.

తీవ్ర నష్టం మార్జిన్

ఎక్స్‌ట్రీమ్ లాస్ మార్జిన్ (ELM) అనేది ఒకటి ఉంది, ఇది ఇక్కడ ఇచ్చిన రెండిటిలో ఏది ఎక్కువ అయితే అది: గత ఆరు నెలల్లో సెక్యూరిటీ ధర యొక్క రోజువారీ లాగరిథమిక్ రాబడి యొక్క స్టాండర్డ్ డివియేషన్ యొక్క ఐదు శాతం లేదా 1.5 రెట్లు. గత ఆరు నెలల రోలింగ్ డేటాను తీసుకొని ప్రతి నెల చివరిలో ఇది లెక్కించబడుతుంది. ఫలితం వచ్చే నెలకు వర్తిస్తుంది.