మెంథా ఆయిల్ ధర

1 min read
by Angel One

పరిచయం

మెంథా ఒక సుగంధ మూలిక, దీనిని జపనీస్ పుదీనా అని కూడా పిలుస్తారు. ఆవిరి స్వేదనం ప్రక్రియ ద్వారా, ఎండిన మెంథా ఆకుల వడపోత ఫలితంగా మెంథా ఆయిల్ వస్తుంది. దీని యొక్క మరింత ప్రాసెసింగ్ మెథనాల్ మరియు ఇతర పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. మెంథా ఆయిల్ మరియు ఇతర ఉత్పన్నాలు ఔషధ, పరిమళ ద్రవ్యాలు, మరియు సువాసన పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించబడతాయి. మెంథా ప్లాంట్ ను మొట్టమొదటిసారిగా 1958 మరియు 1964 మధ్య కాలంలో ప్రవేశపెట్టారు. 1996 నాటికి భారతదేశం 6,000 టన్నుల ఆయిల్ ను ఉత్పత్తి చేస్తోంది, ఇది 2013 లో 45,000 టన్నులను అధిగమించింది. మెంథా ఆయిల్ ఉత్పత్తి రేటు పెరుగుదల 2004 తరువాత ప్రారంభమైంది, ప్రస్తుతం, భారతదేశం మెంథా ఆయిల్ యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు మరియు ఎగుమతిదారు. భారతదేశం ఎనిమిది జాతుల మెంథాను పండిస్తుంది, వాటిలో 3 ఎగుమతి చేయబడతాయి. మెంథా ఆయిల్ ధర ప్రస్తుతం కిలోకు INR 1204 అటూఇటూగా ఉంది. 

పనితీరు అవలోకనం

అయినప్పటికీ, మెంథా ఆయిల్ ధర ఎల్లప్పుడూ మార్పుకు అవకాశం ఉంది. భారతదేశం దాని ప్రాధమిక ఉత్పత్తిదారుగా అవతరించినప్పటి నుండి, ఎగుమతిదారులు దాని అస్థిరమైన ధరలకు లోబడి ఉన్నారు. ఈ ట్రేడింగ్ లో వరుసగా పాల్గొనేవారు MCX లో ధ్రవ్య ఫ్యూచర్స్ ఒప్పందం లభ్యత కారణంగా ధర రిస్క్ నిరోధించవచ్చు.

ధరలను ప్రభావితం చేసే కారకాలు

వివిధ కారకాలు మెంథా ఆయిల్ ధరను ప్రభావితం చేస్తాయి. చైనా, సింగపూర్ మరియు యుఎస్ వంటి ప్రధాన కొనుగోలుదారుల దిగుమతి డిమాండ్, డాలర్-రూపాయి రేటు మరియు మార్కెట్లో సింథటిక్ ఆయిల్ ధర నిర్ణయం వంటివి మెంథా ఆయిల్ ధరలను ప్రభావితం చేసే అంతర్జాతీయ అంశాలు. ఉత్పత్తికి సంబంధించిన దేశీయ కారకాలు పంట ఉత్పత్తిలో పెరుగుదల లేదా తగ్గుదల, ఇది నాట్ల సమయంలో వాతావరణంపై ఆధారపడి ఉంటుంది మరియు మునుపటి పంటలో పొందిన లాభం. మెంథా ఆయిల్ కోసం వివిధ ఔషధ కంపెనీల దేశీయ డిమాండ్లు శీతాకాలంలో పెరుగుతాయి. వివిధ రూపాల్లో మెంథా ఆయిల్ స్టాక్స్ లభ్యత కూడా ధరలకు సూచిక.

ఉత్పత్తి రకాలు

సింగపూర్, జపాన్, ఫ్రాన్స్, యుఎస్ మరియు చైనా వంటి దేశాలకు భారతదేశం వివిధ రకాల మెంథా ఆయిల్ ను ఎగుమతి చేస్తుంది. జపనీస్ మింట్ ఆయిల్, పెప్పర్ మింట్ ఆయిల్, డి-మెంతోలైజ్డ్ జపనీస్ మింట్ ఆయిల్, స్మియర్ మింట్ , వాటర్ మింట్ ఆయిల్, హార్స్ మింట్ ఆయిల్ మరియు బెర్గెమోంల్ ఆయిల్ ప్రధాన మెంథా ఆయిల్ ఎగుమతి రకాలు.

ముగింపు

మెంథా ఆయిల్ ఆహార పదార్థాలలోనూ మరియు సువాసన పదార్థంగానూ ఎక్కువగా ఉపయోగించబడే ఒక ముఖ్యమైన ఆయిల్. దానికి తోడు, మెంథా ఆయిల్‌లో శీతలీకరణ లక్షణాలు కూడా ఉన్నాయి మరియు శ్లేష్మ పొర మరియు చర్మాన్ని ఉపశమనం చేస్తాయి. అందుకే దీనిని ఔషధ మరియు సౌందర్య పరిశ్రమలలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మెంథా ఆయిల్ కోసం ట్రేడింగ్ సెషన్ సోమవారం నుండి శుక్రవారం వరకు, 9.00 am నుండి 5.00 pm వరకు ఉంటుంది. ట్రేడింగ్ యూనిట్ 360 కిలోలు, మరియు గరిష్ట ఆర్డర్ పరిమాణం 18000 కిలోలు. ఆన్‌లైన్‌లో ప్రదర్శించబడే మెంథా ఆయిల్ ధరలు చాలా తాజాగా మరియు నమ్మదగినవి. పెద్ద మొత్తంలో కొనడానికి ముందు మీరు ఈ రోజు మెంథా ఆయిల్ ధరను తనిఖీ చేయాలి.