స్టాక్ చార్ట్ విశ్లేషణ రకాలు

1 min read
by Angel One

స్వల్పకాలిక ట్రేడర్లు రోజువారీ చార్టుల ఆధారంగా ట్రేడింగ్ చేస్తారు, ఎందుకంటే వారు స్టాక్ ధరలలో తక్షణ కదలికపై ఎక్కువ ఆసక్తి చూపుతారు, అయితే మధ్యస్థ నుండి దీర్ఘకాలిక ట్రేడర్లు వారపు / నెలవారీ చార్టులపై ఎక్కువ ఆధారపడతారు, ఎందుకంటే వారు ఎక్కువ కాలం వేచి ఉండడానికి సిద్ధంగా ఉండి ఎక్కువ రాబడిని కోరుకుంటారు.  

సాధారణంగా చార్టిస్టులు ఉపయోగించే 3 రకాల చార్టులు ఉన్నాయి. ఇవి:

  1. లైన్ చార్ట్స్:

ముగింపు ధరలు గ్రాఫ్‌ పై ప్లాట్ చేయబడతాయి మరియు ఒక లైన్ ని ఏర్పాటు చేయడానికి కలపబడుతాయి.

  1. బార్ చార్ట్స్: బార్ సెషన్ యొక్క ప్రారంభం / అధిక / అల్ప / ముగింపులను ఉపయోగిస్తుంది
  2. క్యాండిల్ స్టిక్ చార్ట్స్:

ఈ చార్ట్స్ కూడా సెషన్ యొక్క ప్రారంభం / అధిక / అల్ప / ముగింపులను కూడా ఉపయోగిస్తాయి.

(బార్ మరియు క్యాండిల్ స్టిక్ చార్టుల కోసం పైన ఇచ్చిన చిత్రాలు గూగుల్ నుండి అర్థంచేసుకోవడం కోసం మాత్రమే తీసుకోబడ్డాయి. కాపీరైట్ సమస్యను మనం ఎదుర్కొనే అవకాశం ఉన్నందున వాటిని నేరుగా ఏ పేజీలోనూ ఉపయోగించవద్దు.)

_____________________________________________________________________

సాంకేతిక పరిశోధన కోసం చార్ట్ నిర్మాణం గురించి నాకు ఏదైనా చెప్పండి?

చార్టు లోని ఎక్స్-యాక్సిస్ ధరలను ప్లాట్ చేసిన కాలాలను ప్లాట్ చేస్తుంది మరియు వై-యాక్సిస్ షేర్ యొక్క విలువ లేదా ధరను ప్లాట్ చేస్తుంది. ఇది కొన్ని గంటల నుండి కొన్ని సంవత్సరాల పరిధి వరకు ఉండవచ్చు. అంటే గంటల నుండి సంవత్సరాల వరకు ఉండే ధరల ఆధారంగా ధరలను ప్లాట్ చేయవచ్చు. అందువల్ల మనకు పై డేటా ఆధారంగా నిమిషం చార్టులతో పాటు గంటల, రోజువారీ, వార, నెలవారీ, త్రైమాసిక, వార్షిక చార్ట్స్ ఉండవచ్చు. సాధారణంగా 4 కోట్ లు ఈ క్రమంలో ఉంటాయి-

  • ప్రారంభం
  • అధిక
  • అల్ప
  • ముగింపు

ఈ కింది దృష్టాంతం సహాయంతో బార్ చార్ట్ మరియు క్యాండిల్ స్టిక్ చార్ట్ ఎలా నిర్మించబడుతుందో చూద్దాం. స్క్రిప్ట్ ఎ: –

ఒక రోజున ప్రారంభ ధర రూ. 150
రోజు యొక్క అధిక ధర రూ. 160
రోజు యొక్క అల్ప ధర రూ. 125
రోజు ముగింపు ధర రూ. 130

బార్ చార్టులో, బార్ యొక్క ఎడమ వైపున గీసిన చిన్న డాష్ (-) ద్వారా ప్రారంభం సూచించబడుతుంది మరియు బార్ యొక్క కుడి వైపున మరొక డాష్ ద్వారా ముగింపు .

క్యాండిల్ స్టిక్ చార్టులో, నిజమైన బాడీ అనగా బాడీ యొక్క 2 చివరలు, ఇచ్చిన కాలానికి ప్రారంభ మరియు ముగింపు ధరను చూపుతాయి. నిజమైన బాడీ యొక్క ఎగువ మరియు దిగువ ఉన్న లైన్ లను నీడలు అంటారు, మరియు అవి ఆ సెషన్‌ యొక్క అధిక మరియు అల్పాలను సూచిస్తాయి. బాడీ యొక్క రంగు ఆ సెషన్ యొక్క ప్రారంభ మరియు ముగింపును సూచిస్తుంది. ప్రారంభం కన్నా ముగింపుకి అధికంగా ఉంటే, అది బుల్లిష్ క్యాండిల్, క్యాండిల్ యొక్క రంగు తెల్లగా ఉంటుంది మరియు అది బేరిష్ అయితే క్యాండిల్ యొక్క రంగు నల్లగా ఉంటుంది. కొన్ని ప్యాకేజీలలో, తెలుపుకు బదులుగా ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులను ఉపయోగిస్తారు.