ఈక్విటీ మార్కెట్ అంటే ఏమిటి

షేర్ మార్కెట్లో ట్రేడ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే , పెట్టుబడిదారులు ఒక సంస్థ యొక్క పాక్షిక యజమానులు కావచ్చు. డబ్బుకు బదులుగా కంపెనీలు అందించే ఈ షేర్లను ఈక్విటీలు అంటారు. భారతీయ స్టాక్ మార్కెట్లో, ఈక్విటీలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) మరియు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) లలో ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి.

ఈక్విటీ మార్కెట్ ని  స్టాక్ మార్కెట్ అని కూడా పిలుస్తారు, ఇది కంపెనీ షేర్లలో ట్రేడింగ్ చేయడానికి ఒక వేదిక. లిస్టెడ్ కంపెనీలలో వ్యాపారం చేయడానికి కొనుగోలుదారులు మరియు విక్రేతలు కలిసే ప్రదేశం ఇది. లిస్టెడ్ కంపెనీలు అంటే తమ ఈక్విటీలో కొంత భాగాన్ని పెట్టుబడిదారులకు అందించిన సంస్థలు.

ఈక్విటీ మార్కెట్ గురించి మీరు తెలుసుకోవలసినదంతా:

 • ఒక ఈక్విటీని అర్థం చేసుకోవడం.
 • ట్రేడింగ్ ఈక్విటీ.
 • ఈక్విటీ యొక్క ప్రయోజనాలు.
 • వాటాదారుని కొరకు ఈక్విటీ.
 • ఈక్విటీ పెట్టుబడి రాబడి.
 • ఈక్విటీ మార్కెట్ల రకాలు.
 • ఈక్విటీ మార్కెట్ విధానాలు.

ఈక్విటీని అర్థం చేసుకోవడం

ఒక కంపెనీ లో వాటాదారులు పెట్టుబడి పెట్టే నిధులతో పాటు కంపెనీ సంపాదించిన కొంత లాభాన్ని,  మరింత వృద్ధి మరియు విస్తరణ కోసం కంపెనీ చేత నిలుపుకోబడినది నిధులను ఈక్విటీ అంటారు.

ఈక్విటీ అనేది ఒకరి పోర్ట్ఫోలియోను పెట్టుబడి పెట్టడానికి మరియు వైవిధ్యపరచడానికి ఒక ప్రాథమిక ఆస్తి తరగతి. ఈక్విటీలో ట్రేడింగ్ చేయడానికి షేర్ మార్కెట్ యొక్క లోతైన విశ్లేషణ మరియు పరిశోధన అవసరం, ఏంజెల్ బ్రోకింగ్ దాని పెట్టుబడిదారులందరికీ ఈ సేవలను అందిస్తుంది. అదనంగా, డెరివేటివ్స్, షేర్ల లోనే కాకుండగా బాండ్లు, కమోడిటీస్ మరియు కరెన్సీల వంటి సెక్యూరిటీలలోకి విస్తరించడానికి ఈక్విటీని అనుమతిస్తాయి.

ట్రేడింగ్ ఈక్విటీ

ఒక కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐ‌పి‌ఓ) చేసినప్పుడు ప్రాథమిక మార్కెట్లో ఈక్విటీ ట్రేడ్ చేయవచ్చు మరియు కొత్త సెక్యూరిటీలు కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే జారీ చేయబడిన షేర్లు ద్వితీయ మార్కెట్లో కొనుగోలు మరియు అమ్మబడతాయి. పెట్టుబడిదారులు ప్రైవేట్ ఈక్విటీని కూడా కలిగి ఉండవచ్చు, అనగా, ఇప్పటికీ ప్రైవేట్ గా మరియు ఎక్స్ఛేంజ్లలో జాబితా చేయబడని ఒక కంపెనీ యొక్క షేర్లు. ఈక్విటీలలో ట్రేడింగ్ చేయడానికి, పెట్టుబడిదారులకు డీమాట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి, మరియు ఏంజెల్ బ్రోకింగ్ ఈ రెండింటినీ అందిస్తుంది.

ఈక్విటీ యొక్క ప్రయోజనాలు

 • షేర్ మార్కెట్ పెట్టుబడులు, ఇతర రకాల ఆస్తులతో పోల్చితే, ద్రవ్యోల్బణం సమయంలో ఉత్తమ రాబడిని ఇచ్చాయి. వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతున్నప్పుడు కూడా ఖర్చులు తగ్గించకుండా పెట్టుబడిదారులు వారి ప్రస్తుత జీవనశైలిని కొనసాగించడానికి ఇది వీలు కల్పిస్తుంది.
 • ఈక్విటీ, నష్టమైన పెట్టుబడిగా ఉన్నప్పుడు, సేవింగ్స్ అకౌంట్ లేదా ఫిక్సెడ్ డిపాజిట్ కంటే ఎక్కువ రాబడిని అందిస్తుంది ఎందుకంటే సంపాదించిగల లాభం వాస్తవంగా అపరిమితంగా ఉంటుంది.
 • ఈక్విటీ డెరివేటివ్స్ ఉపయోగించడం ద్వారా ప్రత్యేకంగా ఆప్షన్స్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం ద్వారా నష్టాలను తగ్గించడం మరియు లాభాలను పెంచడం సాధ్యమవుతుంది
 • ఈక్విటీలో పెట్టుబడి పెట్టడానికి మంచి షేర్ మార్కెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం అనేది భవిష్యత్ ఆర్థిక అవసరానికి పెద్ద మూలధనం నిర్మించడానికి కీలకం, ఎందుకంటే ఈక్విటీ దీర్ఘకాలంలో అధిక రాబడిని అందిస్తుంది
 • ప్రముఖ కంపెనీల ఈక్విటీలో పెట్టుబడి పెట్టడం వలన డివిడెండ్ల అదనపు ప్రయోజనం ఉంటుంది. డివిడెండ్లు అనేవి కంపెనీ ఆదాయం నుండి వాటాదారులు అందుకునే చెల్లింపులు. వాటిని ఇవ్వడం తప్పనిసరి కానప్పటికీ, సంస్థాపించబడిన వ్యాపారాలు వారి వాటాదారుల సంఖ్యను పెంచడానికి డివిడెండ్లను చెల్లిస్తాయి.

వాటాదారుని కొరకు ఈక్విటీ

ఒకరు పెట్టుబడి పెట్టిన ఈక్విటీల విలువను తెలుసుకోవడం కాకుండా, ఈక్విటీ యొక్క వ్యక్తిగత షేర్ విలువను తెలుసుకోవడం కూడా ముఖ్యం, ఇది మొత్తం ఆస్తుల నుండి మొత్తం బాధ్యతలను తీసివేయడం ద్వారా లెక్కించవచ్చు.

ఈక్విటీ = ఆస్తుల విలువబాధ్యతల విలువ

ఈక్విటీ పెట్టుబడి రాబడులు

ఈక్విటీపై రాబడి, కంపెనీ తన పెట్టుబడిదారుల నిధులను దాని లాభం మరియు ఆదాయాలను పెంచడానికి ఉపయోగించగల సామార్ద్యాన్ని కొలుస్తుంది. ఒక నిర్దిష్ట కంపెనీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయో లేదో అర్థం చేసుకోవడానికి ఈక్విటీ రాబడిని ట్రాక్ చేయడం ముఖ్యం.

ఈక్విటీ మార్కెట్ల రకాలు

ప్రాథమిక మార్కెట్:

ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రతిపాదించే ప్రతి కంపెనీ తప్పనిసరిగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ) తో రావాలి. ఐపిఓ సమయంలో, కంపెనీ తన ఈక్విటీలో కొంత భాగాన్ని ప్రజలకు అందిస్తుంది. ఐపిఓ ముగిసిన తరువాత, స్టాక్ మార్కెట్లో ఒక ముఖ్యమైన భాగం అయిన స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ఒకదానిలో షేర్లు జాబితా చేయబడతాయి. భారతదేశంలో ప్రాథమిక ఎక్స్ఛేంజీలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) మరియు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ).

ద్వితీయ మార్కెట్:

ఐపిఓ షేర్ల జాబితా తరువాత, ఇవి ద్వితీయ మార్కెట్లో ట్రేడ్ చేయబడతాయి. ఈ వేదిక ప్రారంభ పెట్టుబడిదారులకు వారి పెట్టుబడుల నుండి నిష్క్రమించే అవకాశాన్ని అందిస్తుంది. అదనంగా, ఐపిఓ సమయంలో షేర్లను సేకరించడంలో విఫలమైన పెట్టుబడిదారులు వీటిని ద్వితీయ మార్కెట్ నుండి కొనుగోలు చేయవచ్చు. భారతీయ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సాధారణంగా బ్రోకర్ల ద్వారా జరుగుతుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలు మరియు పెట్టుబడిదారుల మధ్య బ్రోకర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు.

ఈక్విటీ మార్కెట్ విధానాలు

ట్రేడింగ్:

స్టాక్ ఎక్స్ఛేంజీలు పూర్తిగా ఆటోమేటెడ్ మరియు కంప్యూటరీకరించబడిన ఆటోమేటెడ్ స్క్రీన్-ఆధారిత ట్రేడింగ్ వేదికను అందిస్తాయి. ఈ వేదిక అనేది బహిరంగ ట్రేడ్ వ్యవస్థ, ఇక్కడ కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు అన్ని ట్రెడ్స్ చూడవచ్చు మరియు వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వారి ఆర్డర్‌లను ఉంచవచ్చు.

క్లియరింగ్ మరియు సెటిల్మెంట్:

ట్రేడింగ్ రోజులో అమలు చేయబడిన అన్ని ట్రేడ్‌లను ఎక్స్ఛేంజీలు క్లియర్ చేసి సెటిల్ చేస్తాయి. ఈ ఎక్స్ఛేంజీలు విధానాల నుండి ఎటువంటి విచలనాలు మరియు / లేదా వాయిదా లేకుండా చక్కగా నిర్వచించబడిన సెటిల్మెంట్ చక్రాలను నిర్వహిస్తాయి. ట్రేడింగ్ సెషన్ సమయంలో ట్రెడ్స్ సమగ్రంగా ఉంటాయి మరియు ట్రేడింగ్ సభ్యుల బాధ్యతలను నిర్ణయించే లక్ష్యంతో స్థానాలు నెట్  చేయబడతాయి. ఈ విధానాలు నిధుల కదలికలను కూడా నిర్ధారిస్తాయి మరియు షేర్లు సరైన పద్ధతిలో పూర్తవుతాయి. భారతీయ స్టాక్ మార్కెట్లో పనిచేసే ఎక్స్ఛేంజీలు అనుసరించే సెటిల్మెంట్ చక్రం T+2. అంటే అన్ని సెక్యూరిటీలు మరియు నిధుల కదలికలు రోజు 1 (ఇది ట్రేడ్‌లు అమలు చేయబడిన రోజు) తర్వాత రెండు రోజులకు  పూర్తవుతాయి. T+2 చక్రం కింద, కొనుగోలుదారులు తమ డీమాట్ అకౌంట్లోనే షేర్ల  క్రెడిట్లను అందుకుంటారు మరియు అమ్మకందారుల అమ్మకపు ఆదాయాన్ని రెండు రోజుల్లో ట్రేడింగ్ అకౌంట్ కు అనుసంధానించబడిన బ్యాంకు అకౌంట్లో పొందుతారు.

రిస్క్ నిర్వహణ:

విస్తృతంగా తెలిసిన స్టాక్ మార్కెట్ ప్రదమికం ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా రిస్క్లు ఉన్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలు రిస్క్ నిర్వహణ కోసం సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేశాయి. ఈ వ్యవస్థ పెట్టుబడిదారుల ప్రయోజనాలను నిర్ధారిస్తుంది మరియు కంపెనీల మోసపూరిత కార్యకలాపాలను నివారిస్తుంది. మార్కెట్ వైఫల్యాలను నివారించడానికి మరియు మారుతున్న యంత్రాంగాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు నిరంతరం రిస్క్ నిర్వహణ వ్యవస్థను మెరుగుపరుస్తూ ఉంటాయి. మార్జిన్ అవసరాలు, పే-ఇన్లు మరియు స్వచ్ఛంద క్లోజ్-అవుట్ సౌకర్యాలు మరియు లిక్విడ్ ఆస్తులు వంటివి రిస్క్ నిర్వహణ వ్యవస్థ యొక్క కొన్ని భాగాలు.

ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా పెరుగుతున్న ధరలను అధిగమించడం ద్వారా పెట్టుబడిదారులకు వారి భవిష్యత్ ఆర్థిక అవసరాలను తీర్చడంలో సహాయపడతాయి. స్టాక్ మార్కెట్ ప్రాధమిక అంశాలను అర్థం చేసుకోవడం మరియు మార్కెట్ మరియు దాని నియంత్రణ గురించి మరింత తెలుసుకోవడం మరియు షేర్ మార్కెట్ పెట్టుబడులలో క్రమశిక్షణా విధానాన్ని అనుసరించడం దీర్ఘకాలంలో భారీ రాబడిని అందిస్తుంది.