స్టాక్‌లలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి: బిగినర్స్ గైడ్

ట్రేడింగ్ ప్రారంభించడానికి, మీకు డీమాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ అవసరం, రెండూ “ఏంజెల్ బ్రోకింగ్” వంటి ప్రముఖ స్టాక్ బ్రోకర్లతో లభ్యమవుతాయి. డిమాట్ అకౌంట్ మీరు కొనుగోలు చేసిన షేర్లను ఉంచుకోవడానికి అనుమతించే సాధారణ రిపోజిటరీగా పనిచేస్తుంది, అయితే ట్రేడింగ్ అకౌంట్ వాస్తవమైన కొనుగోలు మరియు అమ్మకపు కార్యకలాపాలను సులభతరం చేస్తుంది.

మీరు భారతీయ షేర్ మార్కెట్లో విజయవంతంగా ట్రేడింగ్ ప్రారంభించడానికి ముందు తెలుసుకోవలసిన కొన్ని ప్రాథమిక సమాచారం ఇక్కడ ఇవ్వబడింది:

 • ట్రేడింగ్ ప్రక్రియ
 • స్టాక్ ట్రేడింగ్ ఎలా నేర్చుకోవాలి?
 • షేర్ మార్కెట్ బేసిక్స్
 • బుల్ మార్కెట్
 • బేర్ మార్కెట్
 • లాంగ్ పొజిషన్స్ మరియు  షార్ట్ పొజిషన్స్
 • ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ & ఫ్లోర్ ట్రేడింగ్
 • ఆక్షన్ మార్కెట్ & డీలర్ మార్కెట్
 • మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి
 • మీరు మీ నిర్ణయాలను దేని ఆధారంగా తీసుకోవాలి?
 • మీ హక్కులను తెలుసుకోండి

ట్రేడింగ్ ప్రక్రియ 

 • మీరు మీ ట్రేడింగ్ అకౌంట్ ను ఉపయోగించి షేర్ కొనుగోలు చేసినప్పుడు, డబ్బు మీ బ్యాంక్ అకౌంట్ నుండి బదిలీ చేయబడుతుంది మరియు షేర్ మీ డిమాట్ అకౌంట్ కు బదిలీ చేయబడుతుంది
 • మీరు షేర్ను అమ్మినప్పుడు , అది మీ డిమాట్ అకౌంట్ నుండి షేర్మార్కెట్కు బదిలీ చేయబడుతుంది. లావాదేవీ ఫలితంగా మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు అందుబాటులో ఉంటుంది.

స్టాక్ ట్రేడింగ్ ఎలా నేర్చుకోవాలి?

ఆన్లైన్ ట్రేడింగ్ ఖాతాను ఎంచుకోవడం

స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభించడానికి, ఒక ఇన్వెస్టర్ ట్రేడింగ్ అకౌంట్ మరియు డీమాట్ అకౌంట్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి, ఇది ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ కోసం ఇన్వెస్టర్ యొక్క బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేయబడి ఉండాలి. మీరు స్టాక్ ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇది ఒక అవసరమైన దశ. ఇది మీకు ఇంటర్ఫేస్ పరిచయం చేస్తుంది మరియు మీకు ట్రేడింగ్ టూల్స్ మరియు  రీసెర్చ్ కు యాక్సెస్ ఇస్తుంది, ఇది ఏదైనా స్టాక్ బ్రోకింగ్ కంపెనీ యొక్క క్లయింట్లు మాత్రమే యాక్సెస్ చేయవచ్చు. ఆ డిమాట్  అకౌంట్  మరియు  ట్రేడింగ్ అకౌంట్ ఎలా తెరవాలో మరింత తెలుసుకోండి.

మీరు రెండు అకౌంట్ లు తెరవడానికి ముందు, బ్రోకింగ్ ఫర్మ్ యొక్క విశ్వసనీయతను మరియు ఆధారాలను తనిఖీ చేయడం అవసరం. అంతేకాకుండా, ట్రేడింగ్ అకౌంట్ మిమ్మల్ని మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ షేర్స్, ఐపిఓలు మరియు ఫ్వూచర్స్ అండ్ ఆప్షన్స్ లొ ఆన్లైన్ పెట్టుబడులు పెట్టడానికి అనుమతిస్తుంది. చివరగా, అన్ని సమయాలలో మీ లావాదేవీలు సురక్షితంగా మరియు భద్రంగా ఉండటం కొరకు సురక్షిత ఇంటర్ఫేస్ మరియు ప్రోటోకాల్స్ కలిగి ఉండాలి

మీరే తెలుసుకొండి

కొనుగోలు, అమ్మకం, ఐపిఓ, పోర్ట్ఫోలియో, కోట్స్, స్ప్రెడ్, వాల్యూమ్, యీల్డ్, ఇండెక్స్, సెక్టార్, వోలాటాలిటీ మొదలైనటువంటి ట్రేడింగ్ పదాలు మీరు తెలుసుకోవడం ముఖ్యం. మీరు స్టాక్ మార్కెట్లో మీ మొదటి ఆర్డర్ ఉంచడానికి ముందు, స్టాక్ మార్కెట్ పరిభాష మరియు సంబంధిత వార్తల గురించి మెరుగైన అవగాహన పొందడానికి ఆర్థిక వెబ్సైట్లు చదవండి లేదా ఇన్వెస్ట్మెంట్ కోర్సులలొ చేరండి.

ఆన్లైన్ స్టాక్ సిములేటర్ తో ప్రాక్టీస్ చేయండి

ఆన్లైన్ స్టాక్ సిములేటర్ ఉపయోగించడం మీ నైపుణ్యాలను ప్రాక్టీస్ చేయడానికి రిస్క్ లేనటువంటి మంచి ఆలోచన. వర్చువల్ స్టాక్ మార్కెట్  గేమ్స్ ఆడటం ద్వారాపెట్టుబడి వ్యూహాలపై మీ జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. చాలా ఆన్లైన్ వర్చువల్  గేమ్స్ మార్కెట్ సూచికలు మరియు స్టాక్ విలువలతో సమకాలీకరించబడినవి, తద్వారా మీరు వర్చువల్ డబ్బును ఉపయోగించి స్టాకులలో వ్యాపార అనుభవాన్ని పొందుతారు. ఇది స్టాక్స్ కోల్పోకుండా, స్టాక్ మార్కెట్ పనిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

తక్కువరిస్క్ అధికరాబడి ట్రేడింగ్ పద్ధతిని ఎంచుకోండి

స్టాక్ మార్కెట్లో ఎల్లప్పుడూ ధర హెచ్చు తగ్గులు ఉంటాయి. ప్రారంభకులు అధిక రిస్క్ తో అధిక రాబడులను ఆశించడం ద్వారా తమ షేర్ ట్రేడింగ్ అకౌంట్ కు ఎక్కువ నష్టం తెస్తారు. ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్‌లో రిస్క్ అనివార్యమైనందున, తక్కువ-రిస్క్ అధికరాబడి ట్రేడింగ్‌ పద్ధతులు నష్టాలను నియంత్రిస్తూ రాబడులు పొందేలా చూస్తాయి. 

మీ ప్లాన్ను తయారు చేయండి

పాత సామెత కొద్దీ, ప్లాన్ చేయడంలో విఫలమైతే మీరు విఫలం కావాలని ప్లాన్ చేసినట్టు. తీవ్ర విజయ కాంక్ష ఉన్న వ్యక్తులు, ట్రేడర్స్ తొ పాటు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మరియు ట్రేడ్ కోసం ఒక వ్యూహాన్ని కలిగి ఉండాలి. మీ వ్యాపార వ్యూహాల ద్వారా సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు పెట్టుబడి పెట్టాలనుకునే సమయ పరిమితిని మరియు మొత్తాన్ని నిర్ణయించండి. తదనుగుణంగా, ప్రణాళిక చేయబడిన వ్యూహం ప్రకారం మీరు ఏర్పాటు చేసిన నగదు పరిమితులు మరియు మీ ద్వారా ఏర్పాటు చేయబడిన ఎక్స్‌పోజర్‌ను ఆధారంగా మీ ఆర్డర్లను కొనుగోలు చేయడానికి మరియు అమ్మడానికి మీరు షెడ్యూల్ చేయవచ్చు.

గురువు ను కనుగొనండి

ప్రతి విజయవంతమైన పెట్టుబడిదారుడు వారి పెట్టుబడి ప్రయాణంలో ఎదో ఒక సమయంలో గురువు కలిగి ఉంటారు. మీరు  పెట్టుబడి ప్రపంచానికి కొత్త అయినప్పుడు మరియు ఇప్పుడే స్టాక్ ట్రేడింగ్ శిక్షణ ప్రారంభించినప్పుడు, రంగంలో ఒక మంచి అనుభవం ఉన్న వ్యక్తిని కనుగొనడం మరియు మీ ప్రయాణంలో మీకు మార్గనిర్దేశం చేయడం అవసరం. మీ గురువు ఒక నేర్చుకునే మార్గాన్ని సృష్టించడానికి, కోర్సులు మరియు అధ్యయన మెటీరియల్ ను సిఫార్సు చేయడానికి సహాయపడగలరు, అలాగే మార్కెట్ యొక్క హెచ్చు తగ్గులు ద్వారా మిమ్మల్ని ప్రోత్సహించడానికి సహాయపడగలరు.

ఆన్లైన్/ వ్యక్తిగత కోర్సులు

ఒక ప్రారంభకుడు  ట్రేడింగ్ నేర్చుకోవాలని అనుకుంటే విస్తృత శ్రేణి ఆన్లైన్ మరియు వ్యక్తిగత కోర్సులు  అందుబాటులో ఉన్నాయిస్టాక్ బ్రోకింగ్ ప్రయాణం యొక్క అన్ని దశలలో పెట్టుబడిదారులు/వ్యక్తులకు ఈ కొర్సులు అన్ని అంశాలను  కవర్ చేస్తాయి. ఎన్ఎస్ఇ ఇండియా ద్వారా మీరు షార్ట్టర్మ్ స్టాక్ బ్రోకింగ్ కోర్సులను కూడా ఎంచుకోవచ్చు.

షేర్ మార్కెట్ బేసిక్స్ 

ఒక భారతీయ పెట్టుబడిదారుగా, మీరు ట్రేడ్ చేయగలిగే రెండు షేర్ మార్కెట్లు:

– నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఇ)

– బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బిఎస్ఇ)

అన్ని డిపాజిటరీలో పాల్గొనేవారు రిజిస్టర్ చేసుకున్న రెండు డిపాజిటరీలు:

– నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్ డిఎల్)

– సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్ (సిఎస్ డిఎల్).

ట్రేడింగ్ యొక్క రెండు పద్ధతులు

ట్రేడింగ్  అనేది షేర్ మార్కెట్లో డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలో  చేప్పే పద్ధతి. లాభం పొందే ఉద్దేశ్యంతో సెక్యూరిటీలను కొనుగోలు చేయడం మరియు విక్రయించడం యొక్క క్రియాశీల రూపంగా ఇది నిర్వచించబడవచ్చు.

రెండు రకాల ట్రేడింగ్:

ఇంట్రాడే ట్రేడింగ్ లేదా డే ట్రేడింగ్ లో, మార్కెట్ మూసివేయడానికి ముందు మీరు అన్ని పొజిషన్ లను మూసివేయాలి. ఇంట్రాడే ట్రేడింగ్ కోసం, మీరు మార్జిన్ల ఉపయోగాన్ని పొందవచ్చు, ఇది స్టాక్ మార్కెట్లో మీ ఎక్స్పోజర్ పెంచడానికి బ్రోకర్ అందించిన ఫండింగ్. ఇది మీరు స్టాక్స్ యొక్క అదనపు సంఖ్యను కొనుగోలు/విక్రయించడానికి అనుమతిస్తుంది, లేదంటే మీరు ఎక్కువ మొత్తం నిధులు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది.

డెలివరీ ట్రేడింగ్లో స్టాక్స్ కొనుగోలు చేయడం మరియు ఒక రోజు కంటే ఎక్కువగా వాటిని కలిగి ఉండటం ఉంటుంది, తద్వారా వారి డెలివరీని తీసుకోవడం ఉంటుంది. ఇది మార్జిన్ల వినియోగాన్ని కలిగి ఉండదు, అందువల్ల మీరు మీ షేర్ మార్కెట్ పెట్టుబడుల కోసం నిధులను కలిగి ఉండాలి. ఇండియన్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మరింత సురక్షితమైన పద్ధతి.

బుల్ మార్కెట్

బుల్ మార్కెట్ అనేది మార్కెట్ అంతటా సాధారణ వృద్ధి ధోరణి ఉన్న ఒక మార్కెట్ పరిస్థితి. ఇది పెట్టుబడిదారుల మధ్య విస్తృత ఆశావాదం మరియు ధరలు పెరుగుతాయనే సాధారణ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాయి.

బుల్ మార్కెట్ లో స్టాక్ ధరలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. బుల్ మార్కెట్ ముందు మరియు తరువాత స్టాక్ ధరలలో  గణనీయమైన క్షీణత (సాధారణంగా 20%) గమనించవచ్చు.

ఏప్రిల్ 2003 నుండి జనవరి 2008 మధ్య, ఒక ప్రధాన బుల్ మార్కెట్ ట్రెండ్ సుమారు ఐదు సంవత్సరాలు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ (బిఎస్ఇ సెన్సెక్స్) గమనించబడింది. అది  2,900 పాయింట్ల నుండి 21,000 పాయింట్లకు పెరిగింది.

బేర్ మార్కెట్

బేర్ మార్కెట్ అనేది మార్కెట్ అంతటా సాధారణ క్షీణత ఉన్న ఒక మార్కెట్ పరిస్థితి. ఇది విస్తృతమైన నిరాశావాదం మరియు పెరిగిన అమ్మకపు కార్యకలాపాలు కలిగి ఉంటుంది మరియు పెట్టుబడిదారులు స్టాక్ ధరల క్షీనత ఎదురుచూస్తారు. ఈసమయంలొ గణనీయమైన స్టాక్ ధరల క్షీనత కనిపిస్తుంది. సాధారణంగా, అతి పైకి వెళ్లిన ధరల నుండి దాదాపు 20% క్షీనత అనేక నెలల వ్యవధిలో పరిశీలించబడితే, మార్కెట్  బేర్ పీరియడ్ ఎంటర్ చేసిందని చెప్పబడుతుంది.

లాంగ్ పొజిషన్స్ మరియు  షార్ట్ పొజిషన్స్

ఒక పెట్టుబడిదారుడు అతను/ఆమె షేర్లను కొనుగోలు చేసి వాటిని సొంతం చేసుకున్నట్లయితే లాంగ్ పొజిషన్స్ కలిగి ఉన్నారంటారు. మరొక వైపు, పెట్టుబడిదారుడు స్టాక్స్ ను ఇతరులకు రుణపడి ఉండి కానీ వాటిని సొంతం చేసుకోనట్లైతె, అతను/ఆమెకు షార్ట్ పొజిషన్స్ ఉన్నాయని చెప్పబడుతోంది.

ఉదాహరణకు, ఒక పెట్టుబడిదారు కంపెనీ X యొక్క 500 షేర్లను కొనుగోలు చేసి ఉంటే, అప్పుడు అతను/ఆమె 500 షేర్లు లాంగ్ గా చెప్పబడుతుంది. పెట్టుబడిదారుడు షేర్ల కోసం పూర్తి మొత్తాన్ని చెల్లించారని పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే, వాస్తవంగా వాటిని సొంతం చేసుకోకుండా పెట్టుబడిదారులు కంపెనీ X యొక్క 500 షేర్లను పంచుకుంటే, అతను/ఆమె 500 షేర్స్ షార్ట్ గా చెప్పబడుతుంది. ఇది డెలివరీ చేయడానికి ఒక పెట్టుబడిదారుడు  బ్రోకరేజ్ సంస్థ నుండి తన మార్జిన్ ఖాతాకు షేర్లు తీసుకున్నప్పుడు తరచుగా జరుగుతుంది. పెట్టుబడిదారుడు ఇప్పుడు 500 షేర్లను రుణపడి ఉంటాడు మరియు డెలివరీ అవసరం కోసం షేర్లను మార్కెట్లో కొనుగోలు చేయాలి.

ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ & ఫ్లోర్ ట్రేడింగ్

ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ అభివృద్ధి చెందడానికి ముందు షేర్లను కొనుగోలు చేసే ప్రక్రియ ధీర్ఘంగానూ మరియు శ్రమతో కూడుకున్నది గా వుండేది.  పెట్టుబడిదారుడు ఆర్డర్ ఇవ్వడానికి బ్రోకర్‌ను పిలుస్తాడు, బ్రోకర్ ఆర్డర్ క్లర్కును పిలుస్తాడు, అతను ఆర్డర్‌ను ఫ్లోర్ బ్రోకర్‌కు రిలే చేస్తాడు, ఫ్లోర్ బ్రోకర్ ఆర్డర్‌ను అమలు చేసి ఆర్డర్ క్లర్కుకు పంపుతాడు, తరువాత దానిని బ్రోకర్‌కు పంపుతాడు చివరగా, మీ ఆర్డర్ నింపడంతో పాటు బ్రోకర్ మీకు నిర్ధారణను ఇస్తాడు. ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ఆవిర్భావంతో, ట్రెడిషనల్ ఫ్లోర్‌తో అవసరమైన ఎక్కువ సమయం లేదా పిట్ ట్రేడింగ్ పద్ధతితో ఒక షేర్‌ను కొనుగోలు చేసే మొత్తం ప్రాసెస్‌కు వ్యతిరేకంగా,  షేర్లను కొనుగోలు చేసే మొత్తం ప్రక్రియను కొద్ధి క్షణాలలొనే అమలు చేయవచ్చు. సమయాన్ని ఆదా చేయడంతో పాటు, పెట్టుబడిదారుడు కూడా ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫార్మ్ నుండి షేర్‌లను కొనుగోలు చేసేటప్పుడు తక్కువ బ్రోకరేజ్ ఖర్చు చెల్లించవచ్చు. స్పష్టంగా, ఒక ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్ యొక్క ఆవిర్భావం ఫ్లోర్ బ్రోకర్ల సంఖ్య బాగా తగ్గడానికి దారితీసింది.

ఆక్షన్ మార్కెట్ & డీలర్ మార్కెట్

ఒక ఆక్షన్ మార్కెట్లో ధరలు అనేవి ఒక అమ్మకందారుడు ఇష్టపడి అంగీకరించే అతి తక్కువ ధరపైన మరియు ఒక కొనుగోలుదారుడు ఆ ప్రొడక్ట్/సెక్యూరిటీ కోసం అత్యధిక ధర చెల్లించడానికి సిద్దపడే దానిమీద ఆదారపడి ఉంటాయి. అమ్మకందారుడు కాంపిటేటివ్ ఆఫర్స్ పొస్ట్ చేస్తారు, కొనుగోలుదారుడు కాంపిటేటివ్ బిడ్స్ పొస్ట్ చేస్తారు. ఈ రెండూ మాచ్ అయినప్పుడు లావాదేవి చేయబడుతుంది. 

ఉదాహరణ: కంపెనీ X షేర్లను రూ. 1200, రూ. 1250, మరియు రూ. 1300 కు అమ్మడానికి సిద్ధంగా  ముగ్గురు  అమ్మకందారులు ఉన్నారు. అదే సమయంలో, కంపెనీ యొక్క షేర్లను రూ. 1400, రూ. 1350, మరియు రూ. 1300 కు  కొనుగోలు చేయడానికి ముగ్గురు కొనుగోలుదారులు ఉన్నారు. అందువల్ల, కొనుగోలుదారుడు సంఖ్య 3 మరియు అమ్మకందారుడు సంఖ్య 3 యొక్క కొనుగోలు మరియు అమ్మకం ధర రెండింటినీ అంగీకరించినందున ఆ ఆర్డర్ మాత్రమే అమలు అవుతుంది.

మరొక వైపు, ఒక డీలర్ మార్కెట్ లో డీలర్లు అమ్మకం మరియు కొనుగోలు ధరలు పోస్ట్ చేస్తారు. ఇటువంటి డీలర్లుమార్కెట్ మేకర్లుగా నియమించబడతారు. వారు వారి ధరలను ఎలక్ట్రానిక్ గా ప్రదర్శిస్తారు, తద్వారా ప్రక్రియ స్పష్టంగా వుంటుంధి. 

ఉదాహరణ: డీలర్ A తన దగ్గర స్వంతంగా వున్న కంపెనీ X యొక్క కొన్ని స్టాక్స్ ఎక్కువగా అమ్మాలని అనుకుంటున్నాడు. ఇతర డీలర్స్ ద్వారా కోట్ చేయబడిన దర Rs.1300/Rs.1400. అయితే, డీలర్ A Rs.1250/Rs.1350 ధరను పోస్ట్ చేస్తాడు. కంపెనీ X యొక్క షేర్స్ కొనదలచిన పెట్టుబడిదారులు ఇతర డీలర్లు పోస్ట్  చేసిన ధర కంటే  రూ. 50  తక్కువ కనుక డీలర్ A నుండి షేర్స్ కొనుగోలు చేస్తారు.

మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి

మీరు ఎంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి అనేది మీరు తట్టుకోగల ఫైనాన్షియల్ రిస్క్ నిర్ణయిస్తుంది. మీ పెట్టుబడులు మీ పొదుపులను ప్రమాదంలో పడేయరాదు. మీ పోర్ట్ఫోలియోను వైవిద్యంగా చేసుకుని స్టాప్ లాస్ వంటి లక్షణాలు ఉపయోగించి నష్ట్టాన్ని తగ్గించుకోవడం ముఖ్యం.

మీరు మీ నిర్ణయాలను దేని ఆధారంగా తీసుకోవాలి?

 • ఆర్థిక విశ్లేషణ:

కంపనీ నివేదికలు మరియు పరిశ్రమ పోలికలు మరియు కంపెనీ ఉత్పత్తుల అభివృద్దికి డిమాండ్ అంచనాలు వంటి ఆర్దికేతర సమాచారం  ఉపయోగిస్తూ భవిష్యత్ షేర్ ధర మరియు ఆరోగ్యం అంచనా వేయుటకు ఆర్ధిక విశ్లేషణ ఉపయౌగిస్తారు. ఈ సంస్థ ఇతర సంస్తలకన్నా ఏ విదంగా ప్రయోజనకారిగా వుంది, లేదా ఈ సంస్థ గణనీయమైన మార్కెట్ షేర్ కలదా వంటి ప్రశ్నలు అడగడం ముఖ్యం.

 • సాంకేతిక విశ్లేషణ:

సాంకేతిక విశ్లేషణలో ధరల యొక్క చారిత్రక కదలికను మ్యాప్ చేయడానికి రెండుడైమెన్షనల్ చార్ట్ ఉపయోగం ఉంటుంది. భవిష్యత్తు ధరల గురించి అంచనా వేయడానికి షేర్ ధరలు మరియు పరిమాణాలు చార్ట్స్ యొక్క చారిత్రక విలువలను ఉపయోగిస్తుంది.

ఈ రెండు రకాల విశ్లేషణలు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

మీ హక్కులను తెలుసుకోండి

బ్రోకర్ తో ఒక ఒప్పందంలోకి ప్రవేశించడానికి ముందు, అది సెబీ తో రిజిస్టర్ అయిందా లేదా  మరియు బ్రోకర్ చేసే దావాలు అధారపూరితమైనేవేనా అని నిర్ధారించుకోండి. నిధులు మరియు సెక్యూరిటీలస్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ను ప్రతి మూడు నెలలకు మరియు మీరు చేసే అన్ని డిపాజిట్లకు డాక్యుమెంటెడ్ రుజువులను తెప్పించుకోండి.