ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ముద్రించబడిన నావెల్ కరోనా వైరస్ అవుట్‌బ్రేక్ పర్యావరణం నుండి ఆర్థిక వ్యవస్థ వరకు విస్తృతమైన ప్రభావాన్ని కలిగి ఉంది.  చైనాలో 2019 డిసెంబర్‌లో మొట్టమొదటిగా నమోదైన కేసు నుండి మొదలై 80కి పైగా దేశాలు సమిష్టిగా 90,000 కేసులను నమోదు చేశాయి.

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటి అయిన చైనా, నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తి యొక్క కేంద్రంలో ఉండడంవలన, వైరస్ యొక్క ప్రభావం ప్రపంచ మార్కెట్లో కనబడుతుంది. చైనాతో భౌగోళిక మరియు ఆర్ధిక సాన్నిహిత్యం ఉండడం కారణంగా భారత స్టాక్ మార్కెట్ కొన్ని ముఖ్యమైన తగ్గుదలలను చూసింది

వైరస్ వ్యాప్తి చైనాను ఎలా ప్రభావితం చేసింది?

చాలా దూర మరియు విస్తృతమైన దేశాలకు మెటీరియల్ యొక్క అతిపెద్ద ఎగుమతిదారుల్లో ఒకటిగా చైనా ఉండటంవలన, ఈ వైరస్ వ్యాప్తి సరఫరా కార్యకలాపాలలో సంభావ్య అంతరాయాలను కలిగించింది. ఫ్యాక్టరీలు మూసివేయబడవచ్చు, మరియు వినియోగదారుల వ్యయం స్తంభించకపోవచ్చు కానీ బాగా మందగించవచ్చు. డిమాండ్ మరియు సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు, పరిశ్రమలు మరియు స్టాక్ మార్కెట్ దెబ్బతింటాయి.

ఇండోచైనా వ్యాపారంపై కరోనావైరస్ యొక్క ప్రభావాలు

చైనా యొక్క ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్, మొబైల్స్, ఔషధాలు, సేంద్రీయ రసాయనాలు మరియు ఆటో భాగాల యొక్క ముఖ్యమైన దిగుమతిదారు భారతదేశం.  చైనా ఎగుమతుల్లో దాదాపు 14% వరకు భారతదేశం ఒక్కటే లెక్కించబడుతుంది. ఒక ఎగుమతిదారుగా, ఖనిజ ఇంధనాలు, రసాయనాలు, పత్తి, ప్లాస్టిక్ వస్తువులు, చేపలు మరియు ఉప్పుతో సహా భారతదేశం తన ఉత్పత్తులలో అంచనాగా 5% చైనాకు పంపుతుంది. చైనా లాక్‌డౌన్ లో ఉండటం మరియు చైనాకు, భారత ప్రభుత్వం జారీ చేస్తున్న ప్రయాణ సలహాల వలన, భారతీయ ఆర్థిక వ్యవస్థకు చిక్కులు మరియు భారతీయ స్టాక్ మార్కెట్‌లో పరిణామాలు ఉన్నాయి.

చైనా నుండి దిగుమతులు తగ్గడంతో, అందుబాటులో ఉన్న వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే దేశంలో ఉన్న బలహీనమైన డిమాండ్ కు జోడిస్తుంది. సరఫరా వైపు, చైనా నుండి విద్యుత్ యంత్రాలు వంటి కీలక ఇన్పుట్లు, వస్తువుల సరఫరాను ప్రభావితం చేయవచ్చు. చవకైన చైనా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనడం ఒక సవాలుగా ఉంటుంది మరియు సప్లయి తగ్గుతుంది.

సప్లయి మరియు డిమాండ్ లేకపోవడం వలన పెట్టుబడిదారులు జాగ్రత్త వహించడానికి మరియు మరింత పెట్టుబడులు పెట్టకపోవడానికి లేదా భవిష్యత్తులో భారత మార్కెట్ల నుండి వైదొలగడానికి కారణం కావచ్చు.

స్టాక్ మార్కెట్ పై కరోనావైరస్ ప్రభావం

భారతదేశంలో మొదట వైరస్ యొక్క ప్రభావం ఫిబ్రవరి చివరిలో భావించబడింది. 28 ఫిబ్రవరి నాడు, భారతీయ షేర్ మార్కెట్ భారీ పతనానికి గురైంది;  పెట్టుబడిదారు సంపదలో రూ. 5 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి, ఇది కరోనావైరస్ భయానికి ఆపాదించబడింది. భారతీయ సూచికలు 3.5% పతనాన్ని నమోదు చేశాయి, ఇది సెన్సెక్స్ చరిత్రలో రెండవ అతిపెద్ద పతనం. భారతీయ స్టాక్ మార్కెట్ దాని నష్టాలనుండి మార్చి2న కోలుకుంది, అయితే ఇటీవల భారతదేశంలో కరోనావైరస్ కేసులు నమోదవడంతో, మార్కెట్లు మళ్లీ ప్రతికూలంగా ముగిశాయి. 9 మార్చి 2020 నాటికి, సెన్సెక్స్ ఒకే రోజులో 1900 పాయింట్లకు పైగా కుప్పకూలింది. ఇది ఆగస్టు 2015 నుండి అత్యంత ముఖ్యమైన ఇంట్రాడే క్షీణతగా పరిగణించబడుతుంది.

స్టాక్ మార్కెట్ చారిత్రక పరంగా మానసిక స్థితికి భయపడే అవకాశం ఉంది మరియు ఇది ఇటువంటి సందర్భం. అయితే, ఆందోళన చెందడానికి భారతీయ స్టాక్ మార్కెట్ కు న్యాయమైన కారణాలు ఉన్నాయి మరియు అటువంటి కారణాలలో ఒక ఆందోళన భారతదేశం తో పాటు ప్రపంచవ్యాప్తంగా సప్లై-డిమాండ్  కార్యకలాపాలలో చైనా యొక్క పాత్ర.

సరఫరా లేని కారణంగా షేర్ మార్కెట్ పై ప్రభావం

ముందుగానే పేర్కొన్నట్లు, భారతదేశం ఒకదాని తరువాత ఒకటిగా ముడి సరుకు మరియు భాగాలను చైనా నుండి దిగుమతి చేస్తుంది. సాధారణంగా, చైనీస్ కొత్త సంవత్సరం లూనర్ హాలిడే సీజన్ కారణంగా చైనీస్ ఫ్యాక్టరీలు మూసివేయబడినప్పుడు వాటి ముడి సరుకుల సరఫరా కోసం చైనా పై ఆధారపడే ఆటోమొబైల్ కంపెనీలు తమ ముడి పదార్థాలు ఎక్కువగా నిల్వ చేస్తాయి. ఈ సెలవు దినాలు కరోనా కోలాహలం ఒకేసారి రావడం వలన భారతీయ కంపెనీలు తక్షణ సరఫరా సంక్షోభం ఎదుర్కోలేదు. ఏదేమైనా, స్వీయ విధించబడిన వాణిజ్య ఆంక్షలు కొనసాగితే, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్ మరియు టివిఎస్ మోటార్స్ వంటి ప్రధాన కంపెనీలకు కీలక ముడి పదార్థాల సరఫరా ఆగిపోవచ్చు.

అదేవిధంగా, భారతదేశంలోని ఔషదాలు తయారుచేసే పరిశ్రమను ప్రభావితం చేయవచ్చు. ఈ కంపెనీలు వారి ఉత్పత్తుల తయారీకి అవసరమైన క్రియాశీల ఔషధ పదార్థాలలో 67% వరకు దిగుమతి చేసుకుంటాయి. ఔషధ కంపెనీలు కనీసం 2-3 నెలల విలువైన ముడి సరుకులను నిల్వ చేసుకోవడం సర్వసాధారణం, తద్వారా వారు తక్షణ పోరాటం ఎదుర్కోరు. కానీ, చైనా నుండి సరఫరా అంతరాయం తదుపరి త్రైమాసికంలో కొనసాగితే, ఈ కంపెనీలు ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. ఇది ఉత్పత్తి ఖర్చులను పెంచుతుంది లేదా సరఫరాను తగ్గిస్తుంది. ఏ విధంగానైనా, ఇది స్టాక్ మార్కెట్లో ఔషధ పరిశ్రమ యొక్క స్థితి పై చిక్కులను కలిగిస్తుంది.

ఆటోమొబైల్ మరియు ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ భారతీయ స్టాక్ మార్కెట్లో ముఖ్యమైన వాటాదారులు. కరోనవైరస్ వ్యాప్తి మరియు చైనా లాక్ డౌన్ కారణంగా వారి కార్యకలాపాలు మరియు ఉత్పత్తి అనేది ప్రభావితం అయితే, అది మార్కెట్లో పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గడానికి దారితీస్తుంది.

ఈ అనిశ్చితిలో మరో వైపు అవకాశాన్ని చూసే విధంగా ఉంది. స్వల్పకాలిక ఆటగాళ్ళు ప్రపంచ వ్యాపార మాంద్యానికి భయపడి షేర్లను అమ్ముతున్నారు, దీనివలన తక్కువ ధరకు మరింత స్టాక్ అందుబాటులో ఉంటుంది. “మునిగేది కొనవచ్చు” మరియు మార్కెట్ త్వరలోనే సరిదిద్దుకుంటుదని మరియు కోలుకుంటుందని భావించే అవకాశవాదులు షేర్లను కూడబెట్టుకోవచ్చు.

భారతదేశానికి ఆయిల్ లో చిన్న ప్రయోజనం

చైనా యొక్క ఆర్ధిక లాక్డౌన్ దాని ముడి చమురు వినియోగాన్ని తగ్గించింది. చైనా నుండి చమురు కోసం భారీగా తగ్గిన డిమాండ్ అంటే ముడి చమురు ధరలో ప్రపంచవ్యాప్తంగా తగ్గింపు. జనవరి చివరి నుండి భారతదేశం చమురు ధరలో 25% తగ్గింపును నమోదు చేసింది. 80% చమురు అవసరాలను తీర్చడానికి చమురు దిగుమతులపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థగా, ఇది భారతదేశం ఇప్పటికే కష్టపడుతున్న ఆర్థిక వ్యవస్థకు స్వాగతించే ఉపశమనం కలిగించింది, ఇది స్టాక్ మార్కెట్‌ను కూడా ప్రభావితం చేసింది.  ముడి చమురు ధరల తగ్గుదల వలన తమ ఉత్పత్తి తయారీలో ముడి చమురు ఉపయోగించే కంపెనీలు ప్రయోజనం పొందుతాయి. తదనంతరం, ఇది స్టాక్ మార్కెట్లో వారి స్థితిని మెరుగుపరుస్తుంది.

తదుపరి త్రైమాసికంలో ఆశావాదం 

వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో, కరోనావైరస్ దాని సహజ మరణాన్ని కనుగొనవచ్చు మరియు ప్రభుత్వ మరియు ఔషధ పరిశోధనా సంస్థలు వ్యాక్సిన్ మరియు నివారణ పరంగా కొంత పురోగతి సాధించాయి. ఇది ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని కలిగిస్తుంది మరియు మార్కెట్ క్రమంగా పెరుగుతుంది. సార్స్ (ఎస్ఎఆర్ఎస్),ఎబోలా, స్వైన్ ఫ్లూ వంటి గత వ్యాప్తి చెందిన వాటిని చూస్తే, “ఇది కూడా దాటిపోతుంది” అని అనిపిస్తుంది, మరియు భారతీయ ఆర్థిక వ్యవస్థ మరియు షేర్ మార్కెట్ కరోనావైరస్ తీసుకువచ్చిన ఈ మందగమనాన్ని తట్టుకుంటాయి.

ప్రస్తుతానికి, పెద్ద మరియు చిన్న పెట్టుబడిదారులందరూ ప్రపంచ సూచికలపై, ఇటీవలి కరోనావైరస్ కేసుల సంఖ్యపై మరియు ప్రస్తుత షేర్ మార్కెట్ అస్థిరతలో ప్రభుత్వ జోక్యాలపై దృష్టి ఉంచారు.