CALCULATE YOUR SIP RETURNS

GSTIN అంటే ఏమిటి?

6 min readby Angel One
వస్తువులు & సేవల పన్ను గుర్తింపు సంఖ్య (GSTIN) అనేది GST వ్యవస్థ కింద నమోదు చేసిన ప్రతి వ్యక్తి లేదా సంస్థకు ప్రత్యేకమైన 15-అంకెల గుర్తింపు సంఖ్య. GSTIN సంఖ్యకు దరఖాస్తు చేయడం సులభం మరియు కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు.
Share

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ GST(జీఎస్టీ) పరిచయం భారతీయ పన్ను వ్యవస్థ దృశ్యంలో ఒక కీలక మలుపు అయ్యింది. జీఎస్టీ ప్రత్యక్షేతర పన్నుల వసూళ్లను సులభం, అంతరాయం లేనివిగా, మరింత సమర్థవంతంగా చేసింది. ఇది పన్ను ఎగ్గొట్టే సందర్భాలను కూడా గణనీయంగా తగ్గించింది. ఈ ప్రత్యక్షేతర పన్ను వ్యవస్థలో అత్యంత కీలక అంశాలలో ఒకటి GSTIN. మీరు వ్యాపార యజమాని అయినా లేదా ఉత్పత్తులు, సేవలను కొనుగోలు చేసే వ్యక్తి అయినా, జీఎస్టీఐఎన్ ఏమిటి మరియు దాని ప్రామాణికతను ఎలా పరిశీలించాలో తెలుసుకోవాలి. ఈ వ్యాసంలో, మేము భావనను మాత్రమే కాకుండా జీఎస్టీఐఎన్ నంబర్ ను విభజించి అది ఏమిని సూచిస్తుందో కూడా అర్థం చేసుకుంటాము.

GSTIN అంటే ఏమిటి?

జీఎస్టీఐఎన్ అనేది గూడ్స్ & సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ యొక్క సంక్షిప్త రూపం. ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వ్యవస్థలో నమోదు అయిన వ్యాపారాలు మరియు వ్యక్తులకు జారీ చేసే, ప్రత్యేకమైన 15-అంకెల ఆల్ఫాన్యూమరిక్ గుర్తింపు. జీఎస్టీఐఎన్ నంబర్ కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ బోర్డు CBIC(సీబీఐసి) వంటి నియంత్రణాధికారులకు, అమ్మకాలు, కొనుగోళ్లు, రీఫండ్ డేటాను సహా పన్ను అనుగుణతను ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. 

GSTIN నిర్మాణాన్ని విభజించడం

ఇప్పుడు గూడ్స్ & సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఏమిటో తెలుసుకున్నందున, దాని నిర్మాణాన్ని విభజించి దాని వివిధ భాగాలను అర్థం చేసుకుందాం. సాధారణ జీఎస్టీఐఎన్ ఇలా ఉంటుంది: 27AAAAA1234B1Z5.

  • జీఎస్టీఐఎన్ లోని మొదటి రెండు అంకెలు, నమోదు అయిన సంస్థ లేదా వ్యక్తి ఉన్న రాష్ట్రాన్ని సూచిస్తాయి. పై నంబర్‌లో 27 అనేది మహారాష్ట్ర రాష్ట్ర కోడ్.
  • జీఎస్టీఐఎన్ నంబర్‌లోని తదుపరి 10 అంకెలు, నమోదు అయిన సంస్థ లేదా వ్యక్తి యొక్క పర్మనెంట్ అకౌంట్ నంబర్ PAN(పాన్) అవుతాయి.
  • పాన్ తర్వాత ఉండే అంకె, ఒక రాష్ట్రంలో ఆ వ్యక్తి లేదా సంస్థ చేసిన రిజిస్ట్రేషన్ల సంఖ్యను సూచిస్తుంది.
  • పద్నాలుగో అంకె అక్షరం 'Z'. ఇది అన్ని జీఎస్టీఐఎన్లలో స్థిరంగా ఉండే ఏకైక అంకె.
  • గూడ్స్ & సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ యొక్క చివరి అంకె చెక్సమ్ అంకె. చెక్సమ్ అంకె ఒక సంఖ్య లేదా అక్షరం కావచ్చు మరియు ప్రత్యేక అల్గారిథమ్‌తో రూపొందించబడుతుంది. ఇది లోపాలను గుర్తించడంలో, జీఎస్టీఐఎన్ సమగ్రతను నిర్ధారించడంలో సహాయపడుతుంది.

జీఎస్టీఐఎన్‌కు ఎవరు దరఖాస్తు చేయాలి?

ఈ క్రింది అర్హత ప్రమాణాలను పూర్తిచేసే వ్యక్తులు మరియు సంస్థలకు జీఎస్టీఐఎన్ కు దరఖాస్తు చేయడం తప్పనిసరి.

  • వ్యక్తి లేదా సంస్థ వస్తువులు, సేవలు లేదా రెండింటిని కొనుగోలు చేసి విక్రయించాలి.
  • వార్షిక సమగ్ర టర్నోవర్ నిర్దిష్ట పరిమితిని మించాలి. వస్తువులు సరఫరా చేసే వ్యక్తులు మరియు సంస్థలకు వార్షిక సమగ్ర టర్నోవర్ పరిమితి ₹40 లక్షలు (ప్రత్యేక వర్గ రాష్ట్రాలలో ₹20 లక్షలు). అదే సమయంలో, సేవలు అందించే వ్యక్తులు మరియు సంస్థలకు టర్నోవర్ పరిమితి ₹20 లక్షలు (ప్రత్యేక వర్గ రాష్ట్రాలలో ₹10 లక్షలు).
  • వివిధ రాష్ట్రాలమధ్య (ఇంటర్-స్టేట్ సేల్స్) వస్తువులు లేదా సేవలను సరఫరా చేసే వ్యక్తి లేదా సంస్థ, వార్షిక సమగ్ర టర్నోవర్ పరిమితిని మించకపోయినా, జీఎస్టీఐఎన్ కోసం దరఖాస్తు చేయాలి.
  • వ్యక్తి లేదా సంస్థ నాన్-రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ లేదా క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్‌గా వర్గీకరించబడితే.
  • వ్యక్తి లేదా సంస్థ సరఫరాదారుని ఏజెంట్‌గా లేదా ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తే.
  • వ్యక్తి లేదా సంస్థ రివర్స్ చార్జ్ మెకానిజం కింద జీఎస్టీ చెల్లించాల్సి ఉన్నపుడు.
  • వ్యక్తి లేదా సంస్థ ఈ-కామర్స్ అగ్రిగేటర్ అయితే లేదా ఈ-కామర్స్ అగ్రిగేటర్ ద్వారా వస్తువులు లేదా సేవలను సరఫరా చేస్తే.

గమనిక: పైన పేర్కొన్న ప్రమాణాలలో ఏదీ సరిపోకపోయినా, వ్యక్తి లేదా సంస్థ స్వచ్ఛందంగా నమోదు చేసుకుని జీఎస్టీఐఎన్ పొందవచ్చు. 

GSTINకు ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

ఒక జీఎస్టీఐఎన్ పొందడానికి, మీరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వ్యవస్థలో మీరే నమోదు కావాలి. ఇది జీఎస్టీఐఎన్‌కు ఎలా దరఖాస్తు చేయాలో ఆన్‌లైన్‌లో విశదమైన స్టెప్-బై-స్టెప్ గైడ్. 

  • దశ 1: అధికారిక గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • దశ 2: హోమ్‌పేజ్‌లోని కుడి పైభాగంలో ఉన్న 'నమోదు' బటన్‌పై క్లిక్ చేయండి.
  • దశ 3: క్రొత్త వెబ్‌పేజీపై 'క్రొత్త నమోదు' ఆప్షన్‌పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం నింపడం కొనసాగించండి.
  • దశ 4: సంబంధిత ఫీల్డ్స్‌లో అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత, బాక్స్‌లో చూపించిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి 'కొనసాగించండి' క్లిక్ చేయండి.
  • దశ 5: మొబైల్ మరియు ఈమెయిల్ వన్-టైం పాస్‌వర్డ్స్ OTP(ఓటిపీలు) నమోదు చేసి 'కొనసాగించండి' క్లిక్ చేయండి.
  • దశ 6: టెంపరరీ రెఫరెన్స్ నంబర్ TRN(టిఆర్ఎన్) ఉత్పత్తి అవుతుంది. జీఎస్టీఐఎన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయడానికి ఇది తప్పనిసరి కాబట్టి టిఆర్ఎన్‌ను సురక్షితంగా ఉంచండి.
  • దశ 7: 'కొనసాగించండి' బటన్‌ను క్లిక్ చేయండి.
  • దశ 8: 10 ట్యాబ్లుతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫారం కనిపిస్తుంది, ప్రతీటా భిన్న అంశాలను సూచిస్తుంది. వీటిలో ఇవి ఉన్నాయి:
  • వ్యాపార వివరాలు
  • ప్రొమోటర్/ భాగస్వాములు
  • అధీకృత సంతాకర్త
  • అధీకృత ప్రతినిధి
  • ముఖ్య వ్యాపార స్థలం
  • అదనపు వ్యాపార స్థలాలు
  • వస్తువులు మరియు సేవలు
  • రాష్ట్రానికి ప్రత్యేక సమాచారం
  • ఆధార్ ధృవీకరణ
  • ధృవీకరణ
  • దశ 9: ప్రతి ట్యాబ్‌పై క్లిక్ చేసి అన్ని ఫీల్డ్‌లను పూరించండి.
  • దశ 10: అప్లికేషన్‌లోని 'Aadhaar Authentication' విభాగంలో, మీరు మీ ఆధార్‌ను ధృవీకరించుకోవచ్చు. ఆధార్ ధృవీకరణను ఎంచుకోకపోతే, మీరు మీ e-KYC(ఈ-కేవైసి) డాక్యుమెంట్లను మాన్యువల్గా అప్‌లోడ్ చేయాలి.
  • దశ 11: అప్లికేషన్‌లోని 'Verification' విభాగంలో, చెక్‌బాక్స్‌ను ఎంచుకుని డ్రాప్‌డౌన్ జాబితా నుండి అధీకృత సంతాకర్తను ఎంచుకోండి.
  • దశ 12: సంతకం చేసే స్థలాన్ని నమోదు చేసి, అప్లికేషన్‌ను సంతకం చేసే పద్ధతిని ఎంచుకోండి. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ DSC(డిఎస్‌సి), ఈ-సిగ్నేచర్ (ఆధార్ ధృవీకరణ) లేదా EVC(ఈవీసీ) ద్వారా సంతకం చేయడం ఎంచుకోవచ్చు.

మీరు అప్లికేషన్‌పై సంతకం చేసిన వెంటనే, అది సమర్పింపబడి ధృవీకరణ కోసం జీఎస్టీ అధికారులకు పంపబడుతుంది. అదే కోసం అప్లికేషన్ రెఫరెన్స్ నంబర్ ARN(ఏఆర్ఎన్) మీ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీకి కూడా వస్తుంది. మీ జీఎస్టీఐఎన్ అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయడానికి ఏఆర్ఎన్‌ను ఉపయోగించవచ్చు. ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ విధానంలో నమోదు అవుతారు మరియు ఒక జీఎస్టీఐఎన్ నంబర్ కేటాయించబడుతుంది. గమనిక: మీరు జీఎస్టీఐఎన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ ధృవీకరణను ఎంచుకున్నట్లయితే, మీకు e-KYC(ఈ-కేవైసి) వెరిఫికేషన్ లింక్ ఈమెయిల్‌గా వస్తుంది. ఆ లింక్‌పై క్లిక్ చేసి ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి. మీరు ప్రక్రియను పూర్తి చేయకపోతే, మీ అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. 

GSTIN నంబర్‌ను ఎలా దృవీకరించాలి?

ఇప్పుడు జీఎస్టీఐఎన్ నంబర్‌ను ఎలా పొందాలో మీకు తెలిసినదంటే, గూడ్స్ & సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ చెల్లుబాటును పరీక్షించడానికి అనుసరించాల్సిన దశలు ఇవి. 

  • దశ 1: అధికారిక గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • దశ 2: హోమ్‌పేజ్‌లోని 'పన్ను చెల్లింపుదారును శోధించండి' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • దశ 3: 'జీఎస్టీఐఎన్/యూఐఎన్ UIN(యూఐఎన్) ద్వారా శోధించండి' క్లిక్ చేయండి.
  • దశ 4: సంబంధిత ఫీల్డ్స్‌లో జీఎస్టీఐఎన్ మరియు చూపించిన క్యాప్చా కోడ్‌ని నమోదు చేయండి.
  • దశ 5: 'శోధించండి' క్లిక్ చేయండి.

జీఎస్టీఐఎన్ చెల్లుబాటు అయ్యితే, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ విధానంలో నమోదు అయిన సంస్థ లేదా వ్యక్తి వివరాలు మీరు చూస్తారు. మరోవైపు, జీఎస్టీఐఎన్ చెల్లుబాటు కాకపోతే, నంబర్ చెల్లదు అని తెలిపే సందేశం వస్తుంది.

సారాంశం

గూడ్స్ & సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ జీఎస్టీ విధానంలోని ఒక ముఖ్య అంశం. ఇది ప్రత్యేక గుర్తింపు కావడంతో, పన్ను అధికారులు లావాదేవీలు మరియు పన్ను అనుగుణతను సమర్థవంతంగా దృవీకరించగలరు. అలాగే, ఏదైనా లావాదేవీకి ముందు వస్తువులు లేదా సేవలను అందించే వ్యాపారం యొక్క ప్రామాణికత, సమగ్రతను దృవీకరించుకోవడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

 

FAQs

కాదు. పాన్(PAN) అనేది శాశ్వత ఖాతా సంఖ్యకు సంక్షిప్త రూపం మరియు ఇది వ్యక్తులకు మరియు సంస్థలకు జారీ చేయబడే 10 అంకెల ఏకైక అక్షరాంక గుర్తింపు సంఖ్య. ఇదే సమయంలో, జిఎస్‌టిఐఎన్(GSTIN) అనేది వస్తు మరియు సేవల పన్ను గుర్తింపు సంఖ్యకు సంక్షిప్త రూపం మరియు ఇది జిఎస్‌టి(GST) కింద నమోదైన సంస్థలు మరియు వ్యక్తులకు జారీ చేయబడే ఏకైక 15 అంకెల అక్షరాంక గుర్తింపు సంఖ్య. 15 అంకెల జిఎస్‌టిఐఎన్ సంఖ్యలో జిఎస్‌టి కింద నమోదైన వ్యక్తి లేదా సంస్థ యొక్క 10 అంకెల పాన్ సంఖ్య ఉంటుంది.
మీకు గూడ్స్ మరియు సర్వీసెస్ టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయించబడేందుకు 7 నుండి 10 పని దినాలు పట్టవచ్చు.
వస్తువులు, సేవలు లేదా రెండూ అందిస్తూ, నిర్దిష్ట పరిమితులను మించే టర్నోవర్ ఉన్న వ్యాపారాలే జీఎస్‌టిఐఎన్ [GSTIN(జీఎస్‌టిఐఎన్)] సంఖ్య కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేయాలి. టర్నోవర్ పరిమితిని మించని వ్యాపారాలు ఇప్పటికీ స్వచ్ఛంద నమోదు ద్వారా జీఎస్‌టిఐఎన్ పొందడానికి ఎంచుకోవచ్చు. అయితే, వస్తు మరియు సేవల పన్ను కింద నమోదు తప్పనిసరి అయిన కొన్ని వర్గాల వ్యాపారాలు ఉన్నాయి.
ఒక వ్యాపారం GSTIN(జీఎస్టీఐఎన్) సంఖ్య లేకుండా పనిచేస్తే, ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కింద నేరంగా పరిగణించబడుతుంది కాబట్టి గణనీయమైన జరిమానాలకు లోబడుతుంది.
ఆధికారిక జీఎస్టీ(GST) వెబ్‌సైట్‌ను సందర్శించి "సర్వీసెస్" ట్యాబ్‌లోని "అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయండి" ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ జీఎస్టీఐఎన్(GSTIN) దరఖాస్తు స్థితిని తనిఖీ చేయవచ్చు. తర్వాత, డ్రాప్‌డౌన్ జాబితా నుండి "రిజిస్ట్రేషన్" ఆప్షన్‌ను ఎంచుకుని వివరమైన స్థితిని పొందడానికి ఫీల్డ్‌లో మీ అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ ఏఆర్‌ఎన్(ARN) ను నమోదు చేయండి.
Open Free Demat Account!
Join our 3.5 Cr+ happy customers