సావరిన్ గోల్డ్ బాండ్‍ను ఆన్‍లైన్‍లో ఎలా కొనాలి

1 min read
by Angel One

బంగారం అనేది అత్యంత విరుద్ధమైన పరిస్థితుల్లో కూడా వేరేవాటిని అధిగమించిన ఒక వ్యూహాత్మక ఆస్తి. ఇతర ఆస్తి శ్రేణుల నుండి నష్టాలను తగ్గించడానికి పోర్ట్ ఫోలియో డైవర్సిఫైయర్ గా ఇది తరచుగా కొనుగోలు చేయబడుతుంది. దాని సామర్థ్యాన్ని గ్రహించడంతో, చాలామంది వివిధ రూపాల్లో బంగారంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. భౌతిక రూపంలో దాన్ని కొనుగోలు చేయడమే కాకుండా, సావరెన్ గోల్డ్ బాండ్లు (ఎస్‌జిబిలు)గా పెట్టుబడి కోసం బంగారం అందుబాటులో ఉంటుంది. ఈ బాండ్లు భౌతిక బంగారానికి అత్యుత్తమ ప్రత్యామ్నాయం ఎందుకంటే ఇది పీరియాడిక్ వడ్డీ మరియు మెచ్యూరిటీ సమయంలో మార్కెట్ విలువను అందిస్తుంది. మీరు వాటిని ఒక పెట్టుబడి ఎంపికగా పరిగణించడం ప్రారంభించడానికి ముందు ఎస్‌జిబిల గురించి మరింత అర్థం చేసుకుందాం.

ఎస్‌జిబిలు అంటే ఏమిటి?

ఎస్‌జిబిలు అనేవి భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా జారీ చేయబడిన ప్రభుత్వ సెక్యూరిటీలు. ఎస్‌జిబిలు అంతర్లీన ఆస్తిగా బంగారం కలిగి ఉంటాయి మరియు బంగారం యొక్క గ్రాములలో డినామినేట్ చేయబడి ఉంటాయి. ఇండియన్ బులియన్ మరియు జ్యువెలర్స్ అసోసియేషన్ ద్వారా ప్రచురించబడిన విధంగా 999-ప్యూరిటీ బంగారం యొక్క చివరి మూడు పని రోజుల సగటు మూసివేత ధరను బాండ్లు కలిగి ఉంటాయి. 2015 లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద భారత ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడిన, సావరెన్ గోల్డ్ బాండ్లు సాధారణ విరామాల వద్ద చిన్న సమూహాలుగా అందించబడతాయి.

ఎస్‌జిబిల లక్షణాలు:

సావరెన్ గోల్డ్ బాండ్ల యొక్క కొన్ని లక్షణాలు:

 1. సావరెన్ గోల్డ్ బాండ్లు స్టాక్ ఎక్స్చేంజ్ పై ట్రేడ్ చేయబడతాయి
 2. ఎస్‌జిబి లు సంవత్సరానికి 2.5 శాతం వడ్డీని కలిగి ఉంటాయి, ఇది సెమీ-యాన్యువల్ గా చెల్లించబడవలసి ఉంటుంది
 3. చివరి వడ్డీ మెచ్యూరిటీ పై ప్రిన్సిపల్ తోపాటు చెల్లించబడుతుంది
 4. బాండ్లు 8 సంవత్సరాల అవధిని కలిగి ఉంటాయి. అయితే, 5 వ సంవత్సరం నుండి వడ్డీ చెల్లింపు తేదీన నిష్క్రమణ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి
 5. ఒక వ్యక్తి 4 కిలోల బంగారానికి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‍యుఎఫ్) కూడా 4 కిలోల బంగారానికి సబ్స్క్రైబ్ చేయవచ్చు, అయితే ట్రస్టులు మరియు ఇతర సంస్థలు 20 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చు
 6. అనుమతించబడే కనీస పెట్టుబడి 1 గ్రామ్
 7. ఈ బాండ్లు ప్రభుత్వ భద్రతా చట్టం, 2006 కింద స్టాక్స్ గా జారీ చేయబడతాయి. పెట్టుబడిదారులు ఒక హోల్డింగ్ సర్టిఫికెట్ అందుకుంటారు
 8. ఢిమాట్  మరియు భౌతిక రూపాల్లో బాండ్లు అందుబాటులో ఉన్నాయి
 9. బాండ్లను రీడీమ్ చేసిన తర్వాత, పెట్టుబడిదారులు గత మూడు రోజుల్లో ఆ లోహం యొక్క సగటు ధరను అందుకుంటారు
 10. క్యాష్, డిమాండ్ డ్రాఫ్ట్, చెక్కులు లేదా డిజిటల్ మోడ్ ద్వారా చెల్లింపు చేయబడవచ్చు
 11. బంగారం ధర పెరగడంతో వచ్చే మూలధన లాభాలు పన్ను మినహాయింపు కలిగి ఉంటాయి. అయితే, సంపాదించిన వడ్డీ పన్ను విధించదగినది
 12. బాండ్లను లోన్లకు వ్యతిరేకంగా కొలేటరల్స్ గా ఉపయోగించవచ్చు.

ఎస్‌జిబిలను ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలి:

ప్రభుత్వం వాటిని చిన్న సమూహాలలో విడుదల చేసినప్పుడు మాత్రమే ఎస్‍జిబి లు  మధ్యమధ్యలో  అందుబాటులో ఉంటాయి. ప్రతి 2 లేదా 3 నెలలకు విక్రయం ఒక వారం కోసం తెరవబడుతుంది. ఇతర సమయాల్లో కొనుగోలు చేయాలనుకునేవారు మార్కెట్ ధరకు ఇంతకు పూర్వం జారీచేయబడినవి కొనుగోలు చేయవచ్చు. విక్రయం కోసం విండో తెరవబడినప్పుడు, జాతీయ బ్యాంకులు, షెడ్యూల్డ్ విదేశీ బ్యాంకులు, షెడ్యూల్డ్ ప్రైవేట్ బ్యాంకులు, భారతదేశ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, నియమించబడిన పోస్ట్ ఆఫీసులు మరియు స్టాక్ ఎక్స్ఛేంజ్ ల అధీకృత వాణిజ్య సభ్యుల ద్వారా ఎస్‌జిబిలు కొనుగోలు చేయవచ్చు.

ఆఫ్‌లైన్ సోర్సెస్ కాకుండా, మీరు ఎస్‌జిబిలను ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలో మీరు తెలుసుకోవాలి. మీరు జాబితా చేయబడిన వాణిజ్య బ్యాంకులు లేదా భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క వెబ్‌సైట్ల నుండి ఆన్‌లైన్‌లో ఫారాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే మరియు చెల్లించే పెట్టుబడిదారులు గ్రామ్‌కు రూ 50 డిస్కౌంట్ పొందుతారు. ఎస్‌జిబిలు కొనుగోలు కోసం పాన్ నంబర్ తప్పనిసరి.

ముగింపు:

ఎస్‌జిబిలు అనేవి బంగారం యొక్క ధర పెరగడం నుండి మీరు లాభం పొందడానికి మిమ్మల్ని అనుమతించే పూర్తిగా పెట్టుబడి సాధనాలు. అవి డిమాట్ మరియు పేపర్ రూపంలో ఉంటాయి మరియు ఉపయోగం కోసం వాస్తవ భౌతిక బంగారంగా మార్చడం సాధ్యం కాదు. అందువల్ల, వాటి లక్షణాలు మరియు పెట్టుబడి లక్ష్యాలను అర్థం చేసుకోవడం అవసరం.