2003 లో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్రవేశపెట్టబడినప్పటి నుండి, భారతదేశం యొక్క కమోడిటీ ట్రేడింగ్ మార్కెట్ ఒక దిగ్భ్రాంతి కల్పించే 120 రెట్లు పెరిగింది.  అయినా, మనం ఇంకా పైపైన గీకడం మాత్రమే జరిగింది మరియు కమోడిటీ ట్రేడింగ్ కు మన దేశంలో అభివృద్ధి చెందేందుకు అద్భుత సామర్థ్యం  ఉంది.

నేడు, భారతదేశం యొక్క స్వంత మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) వెండి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ఛేంజ్. ఇది బంగారం, రాగి మరియు సహజ గ్యాస్ కమోడిటీ ట్రేడింగ్ లో రెండవ మరియు క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ లో మూడవ స్థానంలో ఉంది.

అయితే, క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ప్రపంచంలో అత్యంత క్రియాశీలంగా ట్రేడ్ చేయబడుతున్న వస్తువు మరియు అధిక ట్రేడ్ పరిమాణం కారణంగా మరింత లిక్విడిటీని అందిస్తాయి. ఆయిల్ లో కమోడిటీ ట్రేడింగ్ లేదా క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎలా చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటే, ప్రారంభించడానికి ఈ ప్రారంభకుల గైడ్ సరైన ప్రదేశం.

కానీ మొదట; కమోడిటీ ట్రేడింగ్ అంటే ఏమిటి?

కమోడిటీ ట్రేడింగ్ అంటే ఏమిటి?

కమోడిటీ ట్రేడింగ్ అనేది రిస్క్ మేనేజ్మెంట్ లేదా స్పెక్యులేషన్ లక్ష్యంతో అవసరమైన వస్తువుల ట్రేడింగ్. ఒక ఉదాహరణతో కమోడిటీ ట్రేడింగ్ భావనను ఉత్తమంగా అర్థం చేసుకోవచ్చు.

ఉదాహరణ 1 – రిస్క్ మేనేజ్మెంట్ లేదా హెడ్జింగ్ కోసం కమోడిటీ ట్రేడింగ్

మీరు గోధుమ పండించే ఒక రైతు అని భావించండి మరియు మీరు మీ ఉత్పత్తిని మార్కెట్లో క్వింటల్‌ రూ. 500 కు విక్రయిస్తారు, ఇది మీకు మంచి లాభం అందిస్తుంది. విక్రయించడానికి మీ వద్ద వేల టన్నుల బియ్యం ఉంది మరియు గోధుమ ధర  అనుకోనివిధంగా తగ్గితే మీకు నష్టం జరగకుండా మీరు నిర్ధారించుకోవాలనుకుంటున్నారు. నష్టాల నుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి, మీరు ఒక భవిష్యత్తు తేదీలో  గోధుమను క్వింటల్ రూ. 500 కు విక్రయించడానికి ఒక ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లోకి ప్రవేశించవచ్చు (ఒక ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కొనండి). దీనిని హెడ్జింగ్ అని పిలుస్తారు.

ఉదాహరణ 2 – స్పెక్యులేషన్ కోసం కమోడిటీ ట్రేడింగ్

ఇప్పుడు, మీరు క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ఆసక్తి కలిగిన వ్యాపారి అని భావించండి. మీరు క్రూడ్ ఆయిల్ పై బుల్లిష్ (అంటే భవిష్యత్తులో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయని మీరు భావిస్తున్నారు)గా ఉన్నారు. క్రూడ్ ఆయిల్ యొక్క ఒక కాంట్రాక్ట్ 100 బ్యారెల్స్ మరియు దీని ధర రూ. 2,50,000 (బ్యారెల్ కు రూ. 2,500); కానీ మీరు ఒక ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కొనుగోలు చేయడానికి మొత్తం డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు. మీరు రూ. 12,500 అయి ఉండే 5% మార్జిన్ చెల్లించవలసి ఉంటుంది.

ఆ క్రూడ్ ఆయిల్ ధరలు ప్రతి బ్యారెల్ కు రూ. 2,550 పెరుగుతాయని ఊహించండి. ఆ సందర్భంలో, మీరు ప్రతి బ్యారెల్‌కు రూ. 50 లాభం పొందుతారు మరియు కేవలం రూ. 12,500 పెట్టుబడి పెట్టడం ద్వారా మొత్తం రూ. 5,000 (రూ. 50 x 100) పొందుతారు. అందువల్ల, కమోడిటీ ట్రేడింగ్ ట్రేడర్లకు చాలా లెవరేజ్ అందిస్తుంది. ఈ ఉదాహరణలో 20x. 

కమోడిటీ మార్కెట్లో పడిపోతున్న గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల నుండి కూడా లాభం పొందవచ్చు. ఎన్ఎస్ఇ డెరివేటివ్స్ నుండి ఉదాహరణ దిగువన ఇవ్వబడింది.

పైన పేర్కొన్న ఉదాహరణలో, ఒక భవిష్యత్తు తేదీన అధిక ధరకు విక్రయించడం కోసం ఒక ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లోకి ప్రవేశించడం ద్వారా మీరు పడిపోతున్న ఆయిల్ ధరల నుండి లాభం పొందవచ్చు. ఉదాహరణకు, మీరు డిసెంబర్ 1 నాడు ఒక ఆయిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కొనుగోలు చేసారు మరియు డిసెంబర్ 30 నాటికి ఆయిల్ ధరలు ప్రతి బ్యారెల్ కు రూ. 4520 నుండి 4420 కు పడిపోయాయి. కానీ మీరు ఇప్పటికీ ఫ్యూచర్స్ ను రూ. 4520 కు విక్రయించి, ప్రతి బ్యారెల్ కు రూ. 100 లాభంగా రూ. 10 లక్షల నికర లాభం (10,000 బ్యారెల్స్ x 100) పొందవచ్చు.

ఆయిల్ లో కమోడిటీ ట్రేడింగ్ చేయడం ఎలాగ

కమోడిటీ ఆయిల్ ఫ్యూచర్స్ పైన అందించిన ఉదాహరణ లాగానే పనిచేస్తాయి. అయితే, మీరు ఐఒసి, ఒఎన్జిసి, బిపిసిఎల్ మొదలైనటువంటి ఆయిల్ కంపెనీని స్వంతంగా కలిగి ఉంటే తప్ప డెలివరీ కంటే ఎక్కువగా స్పెక్యులేషన్ కోసం క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ జరుగుతుంది.

మీరు ఒక కమోడిటీగా ఆయిల్ లో ట్రేడింగ్ గురించి తెలుసుకునే ముందు, కమోడిటీ ఆయిల్ ఫ్యూచర్స్ యొక్క ఈ క్రింది ప్రధాన లక్షణాలను దృష్టిలో ఉంచుకోండి. మీరు ఆయిల్ అని చెప్పినప్పుడు, ఇది క్రూడ్ ఆయిల్ అవుతుంది కానీ సోయాబీన్ ఆయిల్ కాదు లేదా  ఎంసిఎక్స్, ఎన్‍సిడిఇఎక్స్ లేదా ఇతర కమోడిటీ ఎక్స్ఛేంజ్లలో కమోడిటీగా ట్రేడ్ చేయబడిన ఏదైనా ఇతర ఆయిల్ కాదు.

– క్రూడ్ ఆయిల్ అనేది ప్రపంచంలోని అత్యంత లిక్వడ్ కమోడిటీలలో ఒకటి, ఎందుకంటే ఇది అనేక రంగాలకు ఇంధనం మరియు శక్తి యొక్క మూలం కాబట్టి.

– ఆయిల్ లో కమోడిటీ ట్రేడింగ్ లో విజయం సాధించడానికి, మీరు డిమాండ్ మరియు సప్లై లో హెచ్చుతగ్గులు  అనేవి ఆయిల్ ధరలపై ఎలా ప్రభావం చూపుతారో అర్థం చేసుకోగలిగి ఉండాలి.

– క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కోసం సాంకేతిక మరియు ప్రాథమిక విశ్లేషణ రెండింటినీ అప్లై చేయవచ్చు.

– నష్టాలను నివారించడానికి మీకు తప్పనిసరిగా ఒక ట్రేడింగ్ వ్యూహం ఉండాలి.

అన్ని లోహపు మార్కెట్లు ఏకం చేసినదాని కంటే ఆయిల్ మార్కెట్ పెద్దది

ఎంసిఎక్స్ పై క్రూడ్ ఆయిల్ కాంట్రాక్ట్స్

రూ. 3,000 కోట్ల కంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రతి రోజు ఎంసిఎక్స్ లో జరుగుతుంది. ఇది ఎక్స్ఛేంజిలపై అత్యంత క్రియాశీలంగా ట్రేడ్ చేయబడే కమోడిటి.

ఎంసిఎక్స్ పై రెండు రకాల క్రూడ్ ఆయిల్ కాంట్రాక్ట్స్ ట్రేడ్ చేయబడతాయి:

– క్రూడ్ ఆయిల్ (మెయిన్)

– ధర కోట్: ప్రతి బ్యారెల్ కు

– లాట్ సైజు: 100 బ్యారెల్స్

– గడువు: ప్రతి నెల 19th లేదా 20th

– క్రూడ్ ఆయిల్ (మినీ)

– ధర కోట్: ప్రతి బ్యారెల్ కు

– లాట్ సైజు: 10 బ్యారెల్స్

– గడువు: ప్రతి నెల 19th లేదా 20th

లాట్ సైజ్ తక్కువ  కావడంతో అవసరమైన మార్జిన్ డబ్బు కూడా అతి తక్కువగా ఉంటుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ మినీ వర్తకులతో మరింత ప్రాచుర్యం కలిగి ఉంది.

రిటైల్ పెట్టుబడిదారులు ఆయిల్ లో కమోడిటీ ట్రేడింగ్ చేయడం ఎంచుకోవచ్చా

ఖచ్చితంగా, దీనికి అతి తక్కువ పెట్టుబడి అవసరం మరియు అధిక లెవరేజ్ కారణంగా అధిక లాభాలను సంపాదించడానికి మీకు  అత్యధిక అవకాశాలు ఉంటాయి. అయితే, ఆయిల్ ఫ్యూచర్స్ అత్యంత లిక్విడ్ మాత్రమే కాక అవి చాలా చంచలమైనవి మరియు ధర కదలికలను ముందుగానే ఊహించటం కష్టం.

మీ బ్రోకర్ కమోడిటీ బ్రోకింగ్ సర్వీస్ అందిస్తూ మరియు ఎంసిఎక్స్ లేదా ఎన్‍సిడిఇఎక్స్ తో అనుబంధంగా ఉంటే, మీరు క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కోసం వారిని సంప్రదించవచ్చు. ప్రారంభంలో, నిపుణులతో ప్రారంభించి క్రమంగా మీ స్వంతగా ట్రేడింగ్ ప్రారంభించడం మంచిది.

ఎంసిఎక్స్ మరియు ఎన్‌సిడిఇఎక్స్ పై ట్రేడర్లకు ఏంజెల్ బ్రోకింగ్ కమోడిటీ ట్రేడింగ్ సేవలను కూడా అందిస్తుంది. సున్నా వార్షిక నిర్వహణ ఛార్జీలు మరియు సున్నా బ్రోకరేజ్ ఫీజుతో వచ్చే ఉచిత డిమాట్ అకౌంట్ తో ఆయిల్ డెరివేటివ్‌లలో ట్రేడింగ్ ప్రారంభించండి.