క్యాండిల్ స్టిక్ చార్ట్ ఎలా చదవాలి?

1 min read
by Angel One

ఒక క్యాండిల్ స్టిక్ చార్ట్ ఎలా చదవాలి?

ఆర్థిక మార్కెట్ విశ్లేషణ విస్తృతంగా రెండు వర్గాల క్రింద వస్తుంది, సాంకేతిక మరియు ప్రాథమిక. ప్రాథమిక విశ్లేషణ స్థూల ఆర్థిక పరిస్థితులు, త్రైమాసిక ఆదాయాలు మరియు భవిష్యత్తు ధర కదలికలను అంచనా వేయడానికి ఇతర కారకాల మధ్య ప్రస్తుత వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది, సాంకేతిక విశ్లేషణ గతంలో సెక్యూరిటీలు రూపొందించిన విధానాలను ఉపయోగిస్తుంది.

క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడదాం మరియు క్యాండిల్స్టిక్ చార్ట్స్ లో ప్యాటర్న్స్ ఎలా చదవాలో తెలుసుకుందాం.

క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్

ఒక ఆస్తి పెరుగుతున్న మరియు తగ్గుతున్న ధర ఫలితంగా ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏర్పడుతుంది. సాంకేతిక చార్ట్స్ యాదృచ్ఛిక ప్యాటర్న్స్ చూపవచ్చు, కొనుగోలు లేదా అమ్మకం సిగ్నల్ గా వ్యాపారులు కొన్ని నిర్దిష్ట ప్యాటర్న్స్ ఉపయోగిస్తారు. ఈ నమూనాలు సూచనలు మాత్రమే అని తప్పనిసరిగా పేర్కొనాలి మరియు హామీ లేదు.

ఈ నమూనాలను విస్తృతంగా బుల్లిష్ మరియు బేరిష్ గా విభజించవచ్చు. బుల్లిష్ నమూనాలు ధర పెరుగుదలకు సూచనగా ఉంటాయి, అయితే బేరిష్ నమూనాలు ధర తగ్గడానికి ముందుగా వస్తాయి.

క్యాండిల్ స్టిక్ భాగాలు

ఒక బార్ చార్ట్ లాగానే, ట్రేడింగ్ సెషన్ సమయంలో మార్కెట్లు ప్రారంభ, ముగింపు, అధిక లేదా తక్కువ ధరలు ఒక క్యాండిల్స్టిక్ చూపించును. ఒక క్యాండిల్స్టిక్ విస్తృత భాగాన్ని కలిగి ఉంటుంది, దీనిని “నిజమైన శరీరం” అని పిలుస్తారు. ఇది ట్రేడింగ్ సెషన్ యొక్క ప్రారంభ మరియు ముగింపు మధ్య ధర పరిధిగా వివరించబడుతుంది.

నిజమైన శరీరం రంగులో ఉన్నప్పుడు, అంటే సెక్యూరిటీ ద్వారా పేర్కొన్న ప్రారంభ ధర కంటే ముగింపు ధర తక్కువ అని అర్థం. దానికి వ్యతిరేకమైనది ఖాళీ శరీరం, అంటే ముగింపు ధర ప్రారంభ ధర కంటే ఎక్కువగా ఉందని అర్థం.

వారి సంబంధిత ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్ లలో కలర్‌ను మార్చడానికి ట్రేడర్లకు ఎంపిక ఉంటుంది. ఉదాహరణకు, ఒక డౌన్ క్యాండిల్ సాధారణంగా ఎరుపు రంగులో ఉంటుంది (ముందు వివరించినట్లుగా నలుపుకు బదులుగా). క్యాండిల్ యొక్క పై భాగం ఒక పచ్చ రంగు ఇవ్వవచ్చు (తెలుపుకు బదులుగా).

క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్‌లను ఎలా చదవాలి

బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, వంటి అనేక ప్రాథమిక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి. క్యాండిల్స్టిక్స్ ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  • బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్: సెక్యూరిటీ విక్రేతలు కొనుగోలుదారుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్యాటర్న్ ఏర్పడుతుంది. ఒక చిన్న ఆకుపచ్చ నిజమైన శరీరాన్ని మించిన ఒక పొడవైన ఎరుపు నిజ శరీరాన్ని మీరు చూసినప్పుడు మీరు ఈ ప్యాటర్న్ని నిర్ధారించవచ్చు. బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది బేర్స్ నియంత్రణలో ఉన్నారని సూచన మరియు సెక్యూరిటీ ధర తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
  • బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్: బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కు విరుద్ధంగా, విక్రేతలు కంటే కొనుగోలుదారుల  ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్యాటర్న్ ఏర్పడుతుంది. ఈ ప్యాటర్న్ సుదీర్ఘమైన ఆకుపచ్చ రంగు నిజ శరీరం ఒక చిన్న ఎరుపు రంగు నిజ శరీరాన్ని నింపేలాగా కనిపిస్తుంది. ట్రేడర్లు ఈ నమూనాను కొనుగోలు సూచనగా అర్థం చేసుకుంటారు. ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఏర్పడినప్పుడు ధరలు పైకి వెళ్లవచ్చునని ఆశించబడుతుంది.
  • బేరిష్ ఈవెనింగ్ స్టార్: ఒక ఈవెనింగ్ స్టార్ అనేది సెక్యూరిటీ యొక్క ధర అగ్రస్థానంలో ఉన్నప్పుడు ఏర్పడే ప్యాటర్న్. ప్యాటర్న్లోని చివరి క్యాండిల్ మునుపటి రోజు యొక్క చిన్న నిజ శరీరం క్రింద తెరిచినప్పుడు, ఏర్పడిన ప్యాటర్న్ను బేరిష్ ఈవెనింగ్ స్టార్  అంటారు. ఇటువంటి ప్యాటర్న్ కనబడినది అంటే భవిష్యత్తులో సెక్యూరిటీ ఒక విక్రయ ఒత్తిడిని చూడవచ్చని అర్థం.
  • బేరిష్ హరామి: ఈ ప్యాటర్న్ ట్రేడర్లు సందిగ్ధంలో ఉన్నారని సూచిస్తుంది. మునుపటి రోజు యొక్క నిజ శరీరం లోపల పూర్తిగా ఉండేటటువంటి ఒక చిన్న ఎర్రటి శరీరాన్ని బేరిష్ హరామి అంటారు. అటువంటి ప్యాటర్న్ ఏర్పడిన తర్వాత ధర ఊపు కొనసాగితే, పైకి కదలిక కొనసాగవచ్చు. కానీ ధర కిందకు పడడం మొదలుపెడితే ఇది మరింత కిందకు పడే అవకాశం ఉంది.
  • బుల్లిష్ హరామి: ఒక చిన్న ఆకుపచ్చ రంగుతో ఉన్న  శరీరం మునుపటి రోజు యొక్క పెద్ద  ఎరుపు రంగు నిజ శరీరంలో ఉంటే , ఆ ప్యాటర్న్ బుల్లిష్ హరామి అని పిలుస్తారు. ఈ ప్యాటర్న్ ఒక ట్రెండ్ ఆగిపోవడాన్ని సూచిస్తుంది మరియు ఒక పైకి వెళ్లే కదలిక త్వరలో అనుసరించవచ్చు.
  • బేరిష్ హరామి క్రాస్: ఈ ప్యాటర్న్ పైకి వెళ్లే ట్రెండ్ ఉన్నప్పుడు ఏర్పడును. ఒక డోజి, పైకి వెళ్లే క్యాండిల్ ను అనుసరించినప్పుడు – క్యాండిల్ స్టిక్ దాదాపుగా ప్రారంభ మరియు ముగింపు ధరలు సమానంగా ఉంటుంది – ఈ ప్యాటర్న్ను బేరిష్ హరామి క్రాస్ అని పిలుస్తారు. అంతేకాకుండా, డోజి మునుపటి సెషన్ యొక్క నిజ శరీరంలో ఉంటుంది. ట్రేడర్లు ఇటువంటి ప్యాటర్న్ ను ఒక బేరిష్ హరామి లాగా అర్థం చేసుకుంటారు.
  • బుల్లిష్ హరామి క్రాస్: ఈ ప్యాటర్న్ కిందకు వెళ్లే ట్రెండ్ ఉన్నప్పుడు ఏర్పడును. డోజి ఒక క్రింది క్యాండిల్ ను అనుసరించినప్పుడు ఈ నిర్మాణం జరుగుతుంది. డోజి మునుపటి సెషన్ యొక్క నిజ శరీరంలో ఉంటుంది. బుల్లిష్ హరామి లాగానే ఇది కూడా ఒక ట్రెండ్ ఆగిపోవడాన్ని సూచిస్తుంది మరియు తరువాత పైకి వెళ్లే కదలికను సూచిస్తుంది.

ముగింపు: క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ భవిష్యత్తు ధర కదలికలను అంచనా వేయడానికి ట్రేడర్లకు సహాయపడతాయి. క్యాండిల్స్టిక్స్ ట్రేడర్లకు సెక్యూరిటీ మరియు ఇతర ఆస్తి తరగతుల చుట్టూ ఉన్న సెంటిమెంట్ లను పరిశీలించడానికి సహాయపడతాయి. ప్యాటర్న్స్ భవిష్యత్తు ధర కదలికలను సూచిస్తాయి, కానీ ఎల్లప్పుడూ ఈ సూచనలు నిజమవుతాయని హామీ ఇవ్వబడదు అని నిపుణులు సూచిస్తున్నారు.