నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టండి

0 mins read
by Angel One

సంపద సృష్టించే విషయానికి వస్తే, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఆఘ్ర స్తానంలో ఉంటుంది. మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడితే మీ పెట్టుబడులు మీకు తగినట్టుగా ప్రతిఫలం ఇవ్వగలవు. ఏదేమైనా, మీరు తప్పనిసరిగా పోరాడవలసిన స్వాభావిక రిస్క్ కూడా ఉంది.  ఫైనాన్షియల్ మార్కెట్  పేలవంగా పనిచేస్తే, మీరు మీ పెట్టుబడి యొక్క ముఖ్యమైన భాగాన్ని కోల్పోవచ్చు. మార్కెట్  రిస్క్ యొక్క ప్రభావం తగ్గించడానికి, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో పెట్టుబడి పెట్టడం ఉత్తమ వ్యూహాల్లో ఒకటి. అది ఏమిటి మరియు నిఫ్టీ ఇండెక్స్ పెట్టుబడి ఎలా చేయాలో మీరు ఆలోచిస్తున్నట్లయితే, మీ కోసం విషయాలను స్పష్టం చేయడంలో సహాయపడే కొంత విలువైన సమాచారం ఇక్కడ ఇవ్వబడింది.

నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అంటే ఏమిటి?

నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అనేది ముఖ్యంగా ఒక మ్యూచువల్ ఫండ్, ఇందులో నిఫ్టీ ఇండెక్స్ లో ఉన్న కంపెనీల స్టాక్స్ లో మీ డబ్బు పెట్టుబడి పెట్టబడుతుంది. మీరు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, మీరు ముఖ్యంగా స్టాక్‌కు బదులుగా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడుతున్నారు. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ 50 ఇండెక్స్ లోని కంపెనీలతో సరిగ్గా సరిపోయే విధంగా రూపొందించబడింది. ఈ ఫండ్ నిఫ్టీ 50 ఇండెక్స్ కు అద్దం పడుతుండటంతో, ఇది మార్కెట్ దృష్టాంతంతో సంబంధం లేకుండా ఇండెక్స్ పనితీరును అనుసరిస్తుంది.

సాంప్రదాయక మ్యూచువల్ ఫండ్స్లో, ఫండ్ మేనేజర్ కొన్ని ప్రమాణాల ఆధారంగా స్టాక్స్ ఎంచుతారు. అయితే, మ్యూచువల్ ఫండ్స్ మీకు విస్తృత మార్కెట్ బహిర్గతం లేదా రిస్క్ వైవిధ్యీకరణను అరుదుగా అందిస్తాయి. తత్ఫలితంగా, ఫండ్ పోర్ట్‌ఫోలియోలో కొన్ని ఎంపిక చేసిన కంపెనీల తక్కువ పనితీరు కారణంగా, ఆర్థిక మార్కెట్లు బాగా పనిచేస్తున్నప్పుడు కూడా, నెట్ అసెట్ వేల్యూ (ఎన్‌ఎవి) తగ్గే అవకాశం ఉంది.

మీరు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు దృష్టాంతం సంభవించకపోవచ్చు, ఎందుకంటే కొన్ని స్టాక్స్ యొక్క తక్కువ పనితీరు చివరికి ఇతర ఎక్కువ పనితీర్రు స్టాక్స్ ద్వారా సమతుల్యత కలిగి ఉంటుంది. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ మీరు బహిర్గత చేయబడిన రిస్క్ మొత్తాన్ని గణనీయంగా తగ్గిస్తుంది మరియు దీర్ఘకాలంలో స్థిరమైన రాబడి ఇవ్వడం ద్వారా మీకు కొంత భద్రతను అందిస్తుంది.

నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో పెట్టుబడి ప్రయోజనాలు

వ్యక్తిగత స్టాక్స్ మరియు సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కన్నా నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ కలిగి ఉన్న కొన్ని ప్రయోజనాలు క్రింద వివరించబడ్డాయి.

తక్కువ రిస్క్ 

నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌లోని స్టాక్స్ నిఫ్టీ 50 ఇండెక్స్ తో సమానంగా ఉన్నందున, మీరు విస్తృత మార్కెట్ బహిర్గతం ఆస్వాదించగలుగుతారు, తద్వారా మీ పోర్ట్‌ఫోలియోను సమర్థవంతంగా వైవిధ్యపరుస్తుంది మరియు కలిగే రిస్క్ తగ్గిస్తుంది. మీరు మార్కెట్‌లోని దాదాపు అన్ని ప్రధాన పరిశ్రమలు మరియు రంగాలకు బహిర్గతం చేయబడినందున, ఒక నిర్దిష్ట రంగం పేలవంగా పనిచేసినప్పటికీ మీ రాబడి ఎక్కువగా ప్రభావితం కాదు.

స్థిరమైన రాబడి 

వ్యక్తిగత స్టాక్స్ లేదా పరిశ్రమ నిర్దిష్ట స్టాక్స్ కు సంబంధించి మీరు ఎక్కువగా రాబడి పొందవచ్చు, కానీ మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా అవి స్థిరంగా ఉండకపోవచ్చు. అయితే, మీరు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో పెట్టుబడి పెట్టినప్పుడు అలా కాదు. మీరు ఇక్కడ పొందిన రాబడులు మరింత స్థిరమైనవి మరియు భవిష్యత్తు అభివృద్ధికి  సంభావ్యత ఫండ్స్ తో అపరిమితమైనవి.

పక్షపాతం తొలగింపు

మీరు ఒక ఫండ్ మేనేజర్ అయినా లేదా ఒక వ్యక్తిగత పెట్టుబడిదారుడు అయినా, పెట్టుబడి కోసం స్టాక్స్ ఎంచుకునేటప్పుడు మీ భావోద్వేగాలను పక్కన పెట్టడం కష్టం. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌తో, ఎటువంటి భావోద్వేగ పక్షపాతం లేదు మరియు స్టాక్ పోర్ట్‌ఫోలియో ఎంపికే పూర్తి లక్ష్యంగా ఉంటుంది, ఎందుకంటే ఈ ఫండ్ నిఫ్టీ ఇండెక్స్ కు అద్దం పట్టేలా రూపొందించబడింది.

నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో నేరుగా ఎలా పెట్టుబడి పెట్టాలి

క్రింది దశలవారీ విధానం మీకు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో నేరుగా ఎలా పెట్టుబడి పెట్టాలో ఒక విస్తృత ఆలోచనను ఇస్తుంది.

దశ 1: మొదట, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో పెట్టుబడి పెట్టడానికి మీకు ట్రేడింగ్ మరియు డిమాట్ అకౌంట్ అవసరం. మీకు ఇప్పటికే ఒక అకౌంట్ లేకపోతే, మీరు మీ ఇష్టమైన స్టాక్ బ్రోకర్ వెబ్సైట్లు సందర్శించడం ద్వారా అకౌంట్లను తెరవవచ్చు.

స్టెప్ 2: మీ స్టాక్ బ్రోకర్ ద్వారా జాబితా చేయబడిన విధంగా ఒక ట్రేడింగ్ మరియు డిమాట్ అకౌంట్  తెరిచే విధానాన్ని అనుసరించండి. దీనికి మీరు ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపవలసి ఉంటుంది. అదనంగా, నో యువర్ కస్టమర్ (కె వై సి) గుర్తింపు రుజువు, నివాస రుజువు మరియు ఆదాయ రుజువు వంటి నో యువర్ కస్టమర్ (కె వై సి)  డాక్యుమెంట్ల స్కాన్ చేయబడిన కాపీలను అప్లోడ్ చేయమని కూడా మిమ్మల్ని అడగవచ్చు.

దశ 3: మీ కె వై సి ధృవీకరణ  విజయవంతమైన తర్వాత,  ట్రేడింగ్ మరియు డిమాట్ అకౌంట్ తెరవడానికి మీ అప్లికేషన్ మీ స్టాక్ బ్రోకర్ ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది.

దశ 4: అప్లికేషన్ ప్రాసస్ విజయవంతంగా పూర్తి అయిన తర్వాత, ఒక  ప్రత్యేక యూజర్ ఐడి మరియు పాస్వర్డ్  మీతో  పంచుకోబడుతుంది. మీ స్టాక్ బ్రోకర్ యొక్క ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్కు లాగిన్ అవ్వడానికి మీరు దీన్ని ఉపయోగించవచ్చు.

దశ 5:  ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్ లోకి లాగిన్ అయిన తర్వాత, మ్యూచువల్ ఫండ్ విభాగానికి  వెళ్ళండి మరియు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోండి. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకునే ముందు, దాని పనితీరు మరియు  గత చరిత్ర పై సమగ్ర విశ్లేషణ చేయడం మంచి ఆలోచన. అలాగే, మీరు మొత్తం స్కీమ్ సంబంధిత డాక్యుమెంట్లు చదవారని నిర్ధారించుకోండి.

దశ 6: మీరు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకున్న తర్వాత, మీరు ఒక సిస్తామటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) ప్రారంభించడానికి ఎంచుకోవచ్చును  లేదా ఫండ్ యొక్క యూనిట్లను నేరుగా ఒకే మొత్తంలో చెల్లింపుతో కొనుగోలు చేయవచ్చు. 

ముగింపు

పైన ఉన్న దశలను అనుసరించడం ద్వారా, మీరు ఎప్పుడైనా నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మీ ఫండ్స్ దీర్ఘకాలికంగా బాగా పనిచేసే అవకాశాన్ని పెంచుతాయి, తద్వారా మీ ఆర్ధిక లక్ష్యాలను మరియు అవసరాలను చాలా తక్కువ సమయంలో నెరవేర్చుకోవచ్చు. అంతేకాకుండా, ఈ ఫండ్స్ ఖచ్చితంగా నిర్వహించబడుతున్నందున, మీరు మీ పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షించడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు నిఫ్టీ ఇండెక్స్ పెట్టుబడి ఎలా చేయాలి అనేదాని గురించి మంచి ఆలోచన ఉంది, మీరు వాటిలో పెట్టుబడి పెట్టండి, వెనక్కి కూర్చుని, రాబడులను ఆస్వాదించండి.