షేర్ మార్కెట్‍లో బ్రోకరేజ్‌ను ఎలా లెక్కించాలి?

మీరు షేర్లలో ట్రేడ్ చేస్తున్నప్పుడు, దానితో అనేక ఫీజులు సంభందపడి వుంటాయి. వాటిలో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్(ఎస్ టిటి), సర్వీస్ టాక్స్, స్టాంప్ డ్యూటీ, బ్రోకరేజ్ ఛార్జ్ మరియు ఇతరత్రా ఉంటాయి. వివిధ ఖర్చులలో, బ్రోకరేజ్ ఛార్జ్ మరియు ఎస్ టిటి చాలా సాధారణమైనవి. షేర్లు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మరియు వివిధ ఆర్థిక సాధనాలను కొనుగోలు మరియు అమ్మకాలలో మనకు సహాయపడే ఏజెంట్లు బ్రోకర్లు. ఒక బ్రోకర్ అందించే సేవలకు బదులుగా, అతను లేదా ఆమె చార్జ్ చేసే ఫీజును బ్రోకరేజ్ అని పిలుస్తారు. బ్రోకర్లు రెండు రకాలు, మీరు ఎంచుకున్న బ్రోకర్  రకంపై  బ్రోకరేజ్  ఛార్జ్  ఆధారపడి ఉంటుంది.

బ్రోకర్ల రకాలు

అందించే సేవల ఆధారంగా, బ్రోకర్లను రెండు రకాలుగా ఉండవచ్చు

పూర్తిసేవా బ్రోకర్లు: వీరు సాంప్రదాయక బ్రోకర్లు, మరియు వీరి  సేవలలో స్టాక్స్, కరెన్సీ మరియు కమోడిటీలలో  ట్రేడింగ్ సహాయం ఉంటుంది. వారు మీ కోసం పరిశోధన చేస్తారు, మీ అమ్మకాలు మరియు ఆస్తులను నిర్వహిస్తారు మరియు మీకు నిపుణుల సలహాను అందిస్తారు. వారు బ్యాంకింగ్ కోసం ఆస్తులను కూడా అందిస్తారు. పూర్తి సేవా బ్రోకర్ల ఛార్జీలు ఇంట్రాడే ట్రేడింగ్ మరియు డెలివరీ ట్రేడింగ్  రెండింటిలోనూ 0.01% నుండి 0.50% వరకు ఉంటాయి.

డిస్కౌంట్ బ్రోకర్లు: డిస్కౌంట్ బ్రోకర్లు అత్యంత సమర్థవంతమైన ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫార్మ్ అందిస్తారు, దీనిని మీరు స్టాక్స్ మరియు కమోడిటీలలో ట్రేడ్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. వీరి ఛార్జీలు తక్కువగా ఉంటాయి, మరియు వీరు ఏ పెట్టుబడి సలహాను అందించరు. బ్రోకర్లు ఇంట్రాడే మరియు డెలివరీ ట్రేడింగ్ విషయంలో ప్రతి ట్రేడ్ కు ఒక స్థిరమైన ఫీజు (రూ 10 లేదా రూ 20) వసూలు చేస్తారు. కొంతమంది బ్రోకర్లకు డెలివరీ ట్రేడింగ్ కోసం ఎటువంటి ఛార్జీలు ఉండవు.

భారతదేశంలో, 3 రకాల బ్రోకరేజ్  ప్లాన్లు  అందించబడతాయి

1. ట్రేడింగ్ పరిమాణం యొక్క శాతం ఆధారంగా బ్రోకరేజ్

2. ప్రతీ ట్రేడ్ కు ఛార్జ్ చేయబడే ఫ్లాట్ బ్రోకరేజ్

3. అపరిమిత నెలవారీ ట్రేడింగ్ ప్లాన్

బ్రోకరేజ్ ఛార్జీలను అర్థం చేసుకోవడం

షేర్ కొనుగోలు మరియు అమ్మకం సమయంలో  బ్రోకరేజ్  ఛార్జ్ చెల్లించవలసి ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి.  మీరు దీనికి మినహాయింపుగా ఉన్న కొందరు బ్రోకర్లను కనుగొనవచ్చు, వారు కొనుగోలు లేదా అమ్మకం కోసం ఒకసారి మాత్రమే చార్జ్ వసూలు చేస్తారు.

షేర్ మార్కెట్లో బ్రోకరేజ్ ఎలా లెక్కించాలో మీరు యోచిస్తున్నట్టైతే, ఉదాహరణ అర్థం చేసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.

ఒక బ్రోకర్ ఇంట్రాడే ట్రేడింగ్ పై 0.05% ఫీజు వసూలు చేశాడు అనుకుందాం. దీని అర్థం

బ్రోకరేజ్ ఛార్జ్ మొత్తం టర్నోవర్ లో 0.05% ఉంటుంది. మీరు కొనుగోలు చేసిన స్టాక్ రూ 100 అయితే,  అప్పుడు బ్రోకరేజ్ ఛార్జ్ రూ 100 లో 0.05%, ఇది రూ 0.05. అప్పుడు, ట్రేడింగ్ పై మొత్తం బ్రోకరేజ్ ఛార్జ్ రూ 0.05 + 0.05, ఇది రూ 0.10 (కొనుగోలు మరియు అమ్మకం కోసం).

బ్రోకరేజ్ అనేది నిర్ణయించబడిన శాతం వద్ద షేర్ల మొత్తం ఖర్చుపై లెక్కించబడుతుంది. కాబట్టి, బ్రోకరేజ్ కోసం సూత్రం క్రింది విధంగా ఉంటుంది.

ఇంట్రాడే ఛార్జీలు .05%  మరియు డెలివరీ పై .50%, అప్పుడు

  • ఇంట్రాడే బ్రోకరేజ్ = 1 షేర్ యొక్క మార్కెట్ ధర * షేర్ల సంఖ్య * 0.05%
  • డెలివరీ బ్రోకరేజ్ = 1 షేర్ యొక్క మార్కెట్ ధర * షేర్ల సంఖ్య * 0.50%

బ్రోకర్ల మద్య పోటీ స్థాయిలు పెరుగుతున్నందున, ఛార్జీలు మరింత సరసమైనవిగా మారుతున్నాయి.

ఉపయోగకరమైన చిట్కాలు

మీరు చివరిగా ఒక బ్రోకర్ ని ఎంచుకున్న తర్వాత, మీరు మీలావాదేవీలపై అతను వర్తింపచేసే బ్రోకరేజ్ మీరు అంగీకరించిన ఆఫర్ కు సరిపోలి ఉందని నిర్ధారించుకోవాలి. అప్పుడప్పుడు వర్తింపజేయబడిన బ్రోకరేజ్ ను కూడా మీరు తనిఖీ చేయాలి.

మీ ఖాతా నుండి బ్రోకర్ ద్వారావార్షిక నిర్వహణ ఛార్జీలుగా వర్గీకరించబడిన మొత్తం మినహాయించబడుతుంది. ఛార్జీల గురించి కూడా విచారించండి. మీరు పెట్టుబడి పెట్టిన ఫండ్ నుండి గణనీయమైన భాగాన్ని ప్రతి నెలా ఎఎంసి  ఛార్జ్ గా మినహాయించబడితే   సందర్భంలో, ప్రారంభంలోనే  పెద్ద మొత్తాన్ని చెల్లించడం మంచిది, మరియు నెలవారీ ఎఎంసి  ఛార్జీలు రద్దు చేయబడతాయి. ఇది సగటున, ఏకమొత్తం మీద రూ. 500 – 750  వరకూ ఉంటుంది.

సమార్దవంతంగా వసూలు చేయబడే బ్రోకరేజ్  రేటు,  పైన పేర్కొన్న శాతం కంటే భిన్నంగా ఉంటుంది. బ్రోకరేజ్ తో పాటు, మీరు పరిగణించాల్సిన ఇతర సంబంధిత ఛార్జీలు కూడా  ఉన్నాయి.

నెట్ ట్రేడింగ్ ఖర్చు సూత్రాన్ని ఉపయోగించి లెక్కించబడుతుంది

ట్రేడింగ్ ఖర్చు = బ్రోకరేజ్ + సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ + స్టాంప్ డ్యూటీ + ఇతర ఛార్జీలు

ముగింపు

ఇప్పుడు ట్రేడర్స్ కు అనేక బ్రోకర్ సంస్థలు అందుబాటులో ఉన్నాయి, కాబట్టి మీకు ఎంపికకు చాలా అవకాశం వుంది. బ్రోకర్ ద్వారా వసూలు చేయబడే బ్రోకరేజ్ , బ్రోకర్  యొక్క ప్రధాన ఆదాయ వనరు. కాబట్టి, ట్రేడర్లను ఆకర్షించడానికి, మీరు వారికి అధిక పరిమాణాలను ఇస్తే బ్రోకర్లు తక్కువ బ్రోకరేజ్ అందిస్తారు, మరియు మీరు తక్కువ పరిమాణాలను అందిస్తే అధిక ఛార్జీలు. ఇంట్రాడే బ్రోకరేజ్ ఛార్జీలు సాధారణంగా డెలివరీ ఛార్జీల కంటే తక్కువగా ఉంటాయి. కాబట్టి, వివిధ బ్రోకర్ల ఆఫర్ ఛార్జీలను చూడండి, మరియు నేడే ఒకర్ని ఎంచుకోండి!