NCD ఎలా కొనాలి?

1 min read
by Angel One

NCDలను ఎలా కొనాలి: రకాలు మరియు ప్రయోజనాలపై చర్చ

పెట్టుబడి విషయానికి వస్తే, మీ పెట్టుబడిదారుల ప్రొఫైల్‌కు అనుగుణంగా అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది పెట్టుబడిదారులు కంపెనీ ఈక్విటీ షేర్లలో నేరుగా పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారు, సురక్షితను కోరుకునే పెట్టుబడిదారులు డిబెంచర్లను తీసుకుంటారు.

డిబెంచర్లు సాధారణ ఋణ సాధనాలు, ఇవి మార్కెట్ నుండి ఋణాలు సేకరించాలనుకున్నప్పుడు ఒక కంపెనీ జారీ చేస్తుంది. కొన్ని డిబెంచర్లను కొంతకాలం తర్వాత యజమాని యొక్క అభీష్టానుసారం ఈక్విటీలుగా మార్చవచ్చు. ఇవి కన్వర్టిబుల్‌ డిబెంచర్లు. మరొక వైపు వ్యతిరేకంగా నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు (NCDs) ఉన్నాయి. నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు కంపెనీ ఫిక్సెడ్ డిపాజిట్ల మాదిరిగా పనిచేస్తాయి, కాని పెట్టుబడి విషయానికి వస్తే, తరచుగా పెట్టుబడిదారులు NCDలను ఎలా కొనాలనే దానిపై తడబాటు చెందుతారు.

స్వాభావికంగా భద్రత లేనప్పటికీ, స్థిర రాబడిని అందించే పెట్టుబడి సాధనాలు NCDలు. ఇది బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్‌కు ప్రత్యామ్నాయం, ఇది ఒక స్థిర పదవీకాల పెట్టుబడి, ఇది స్థిర వడ్డీ రేటుపై రాబడిని ఉత్పన్నం చేస్తుంది. కానీ బ్యాంక్ FDలకు విరుద్ధంగా, NCDలు పెట్టుబడిపై 10-12 శాతం రాబడిని ఇస్తాయి. ఆకర్షణీయం కదా? కాబట్టి, మీ పోర్టుఫోలియోను వైవిధ్యపరచడానికి NCDలను ఎలా కొనుగోలు చేయాలో చర్చించుకుందాం.

రకాలు

నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు రుణ సాధనాలు మరియు బాండ్లతో అనేక లక్షణాలను పంచుకుంటాయి, ఇది స్థిర ఆదాయాన్ని సంపాదించే రుణ పరికరం కూడా. అయితే, రెండింటి మధ్య ప్రాధమిక వ్యత్యాసం ఉంది. బాండ్లు ఋణం యొక్క సురక్షిత రూపాలు, అయితే NCDలు సురక్షితమైనవి మరియు అసురక్షితమైనవి కూడా. ఇవి అసురక్షితమైనవి కనుక, అవి బాండ్లతో పోలిస్తే అధిక రాబడిని అందిస్తాయి.

NCDలు సురక్షితంగానూ మరియు అసురక్షితంగానూ ఉంటాయి. ఇంకా, కాల్ మరియు పుట్ NCDలు ఉన్నాయి. ‘కాల్ చేయదగిన’ NCD అంటే పరిపక్వతకు ముందు ఏ తేదీనైనా డిబెంచర్‌ను రీడీమ్ చేసే హక్కులను జారీ చేసేవారు కలిగి ఉంటారు. మరొక వైపు పుట్ NCDలు ఉన్నాయి, వడ్డీ రేటు పెరిగి పెట్టుబడిదారుడు అధిక-దిగుబడినిచ్చే ఎంపికను కనుగొంటే, పరిపక్వతకు ముందు డిబెంచర్‌ను రీడీమ్ చేసే హక్కు పెట్టుబడిదారులకు అనుమతిస్తుంది.

ప్రయోజనాలు 

NCDలలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి, క్రిందివాటివలె

అధిక వడ్డీ రేటు: చారిత్రాత్మకంగా, NCDలు బాండ్లు మరియు బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్ల కంటే మెరుగైన ఆదాయాన్ని అందించాయి. NCDలపై సగటు రాబడి 10-12 శాతం మధ్య ఉంటుంది, ఇది ఇతర సారూప్య పెట్టుబడి సాధనాల కంటే చాలా ఎక్కువ.

ద్రవ్యత: బాండ్ల మాదిరిగా కాకుండా, పెట్టుబడిదారులు ఈక్విటీల మాదిరిగానే సెకండరీ మార్కెట్లో NCDలను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. అధిక ధ్రవ్యత కారకం NCDలను పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికగా చేస్తుంది. ధ్రవ్యత పరంగా, NCDలు బాండ్లు మరియు ఈక్విటీల మధ్య సగం వరకు ఉంటాయి.

మీరు పరిపక్వతపై NCDలను రీడీమ్ చేసినప్పుడు, మీరు సేకరించిన వడ్డీతో పాటు అసలు మొత్తాన్ని అందుకుంటారు.

NCD లను ఎలా కొనాలి 

ప్రారంభంలో కంపెనీ NCDలను ఎక్స్ఛేంజ్‌లో జారీ చేస్తుంది మరియు తరువాత సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ జరుగుతుంది. కాబట్టి, మీరు ఒక కంపెనీ NCDని ప్రకటించినప్పుడు సబ్ స్క్రైబ్ చేయవచ్చు లేదా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు సెకండరీ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. లిస్టెడ్ కంపెనీలు BSE మరియు NSE లలో NCDలను జారీ చేస్తాయి, ఇక్కడ ఈ సాధనాలు బహిరంగంగా ట్రేడింగ్ చేయబడతాయి. NCDని ఎలా కొనుగోలు చేయాలనే అంశంపై మనం ఉన్నప్పుడు, NCD ఆఫర్ విలువ కంపెనీ యొక్క విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుందని మేము పేర్కొనాలి. అందువల్ల, ఉత్తమమైన NCD ఆఫర్‌లను ఎంచుకునేటప్పుడు, కూపన్ రేటుతో పాటు కంపెనీ యొక్క  క్రెడిట్ రేటింగ్‌ను మరియు జారీచేసేవారి విశ్వసనీయతను తనిఖీ చేయండి. క్రెడిట్ రేటింగ్ కంపెనీలు NCDలకు రేటింగ్ ఇస్తాయి.  అధిక రేటింగ్ ఇవ్వబడిన NCDలను కొనడం మంచిది, AAA+, AA+, మరియు వంటివి. రేటింగ్ అధికంగా వుంటే, ఆఫర్ మంచిది. అలాగే, కంపెనీ యొక్క ఆర్థిక నివేదికను తనిఖీ చేయండి. విశ్వసనీయ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం – లాభదాయకమైనది, ఋణం తిరిగి చెల్లించే మంచి రికార్డుతో, అన్నీ మంచి రాబడినీ  మరియు మనశ్శాంతినీ  రెండింటినీ నిర్ధారిస్తాయి.

NCDలలో పెట్టుబడులు పెట్టడం కూడా పన్ను చిక్కులను కలిగి ఉంటుంది, వడ్డీ ఆదాయానికి, ఆదాయపు పన్ను స్లాబ్‌ల ప్రకారంగా పన్ను విధించబడుతుంది. అలాగే, మీరు ఒక సంవత్సరానికి ముందు సెకండరీ మార్కెట్లో NCDని ట్రేడింగ్ చేస్తే, స్వల్పకాలిక మూలధన లాభ పన్ను విధిస్తారు. మొదటి సంవత్సరం తరువాత, పన్నుల తర్వాత 20 శాతం చొప్పున దీర్ఘకాలిక మూలధన లాభ పన్ను విధించబడుతుంది.

ముగింపు

మీరు మీ పెట్టుబడిపై స్థిర ఆదాయాన్ని ఇష్టపడినప్పుడు NCDలు మంచి పెట్టుబడి ఎంపిక. కానీ ఇవి అసురక్షిత ఋణ సాధనాలు కాబట్టి, కంపెనీ నిర్వహించడానికి కష్టపడుతున్నప్పుడు రిస్క్ పెరుగుతుంది. అయితే, అపక్రమం అయ్యే అవకాశాలు చాలా అరుదు.

ఇతర స్థిర-రేటు పెట్టుబడి ఎంపికలతో పోల్చినప్పుడు, NCDలు అధిక రాబడిని ఇస్తాయి. మొత్తంమీద, మీరు మీ పోర్టుఫోలియోను వైవిధ్యపరచాలని, రిస్క్ ఎక్స్‌పోజర్‌ను తగ్గించాలని మరియు స్థిరమైన రాబడిని కోరుకుంటే, NCDలు గొప్ప ఎంపిక. ఈ రోజుల్లో, మీరు NCDలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.