స్టాక్ మార్కెట్ యొక్క ప్రయోజనాలు

1 min read
by Angel One

పెట్టుబడి పెట్టడం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే, ప్రతి వ్యక్తి, అతడు/ఆమె తన భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చగలరని నిర్ధారించడం కోసం. ద్రవ్యోల్బణంలో పెరుగుదల వలన వ్యక్తులు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేయడం సరిపోదు. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన ధరలను ఎదుర్కొడానికి, పెట్టుబడులు ముఖ్యమైనవిగా అవుతాయి. స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం వలన అనేక ప్రయోజనాల ఉన్నందున స్టాక్ మార్కెట్ అతి పాత మరియు అత్యంత ప్రజాదరణ కలిగిన పెట్టుబడి మార్గాలలో ఒకటి.

స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా లభించే ప్రయోజనాలు

  • అధిక లిక్విడిటీ.
  • చాలా రకాలు కలిగి ఉండడం.
  • తక్కువ కాల వ్యవధిలో అధిక రాబడులు.
  • యాజమాన్యం సంపాదించుట మరియు ఓటు హక్కు.
  •  నియంత్రణ వాతావరణం మరియు ఫ్రేమ్‌వర్క్.
  •  వసతి.

అధిక లిక్విడిటీ:

భారతీయ స్టాక్ మార్కెట్లో, రెండు ఎక్స్ఛేంజీలు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బిఎస్ఇ) మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఇ) ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. చాలా కంపెనీలు ఈ ఎక్స్ఛేంజీలలో ఏదో ఒకటి లేదా రెండిటి ద్వారా వారి షేర్లను ట్రేడ్ చేస్తాయి. సగటు రోజువారీ పరిమాణాలు ఎక్కువగా ఉన్నందున ఇది పెట్టుబడిదారులకు అధిక లిక్విడిటీ అందిస్తుంది. అందువల్ల, పెట్టుబడిదారుడు స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఏదైనా ఉత్పత్తిని కొనాలని లేదా అమ్మాలని కోరుకుంటే, ఈ లిక్విడిటీ సులభతరం చేస్తుంది.

చాలా రకాలు కలిగి ఉండడం 

షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ మరియు డెరివేటివ్స్ వంటి వివిధ ఆర్ధిక సాధనాలను స్టాక్ మార్కెట్ అందిస్తుంది. ఇది పెట్టుబడిదారులకు వారి డబ్బును పెట్టుబడి పెట్టడానికి విస్తృత ఎంపికను అందిస్తుంది. పెట్టుబడి ఎంపికలను అందించడంతో పాటు, పెట్టుబడి పోర్ట్ఫోలియోల వైవిధ్యీకరణ ద్వారా స్టాక్ పెట్టుబడికి ఉన్న ప్రమాదాలను తగ్గించడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

తక్కువ కాల వ్యవధిలో అధిక రాబడులు:

బాండ్లు మరియు ఫిక్సెడ్ డిపాజిట్లు వంటి ఇతర పెట్టుబడి ఉత్పత్తులతో పోలిస్తే, స్టాక్ లో పెట్టుబడి పెట్టుబడిదారులకు తులనాత్మకంగా తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ రాబడులు అందించే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ట్రేడింగ్ ను ప్లాన్ చేయడం, స్టాప్-లాస్ మరియు టేక్-ప్రాఫిట్ ట్రిగ్గర్‌లను ఉపయోగించడం, పరిశోధన చేయడం మరియు తగిన శ్రద్ధ వహించడం మరియు సహనంతో వుండటం వంటి స్టాక్ మార్కెట్ ప్రాథమికతలకు కట్టుబడి ఉంటే, స్టాక్ పెట్టుబడికి స్వాభావికమైన నష్టాలను గణనీయంగా తగ్గించగలదు మరియు షేర్ మార్కెట్ పెట్టుబడులపై రాబడిని పెంచుతుంది.

యాజమాన్యం సంపాదించుట మరియు ఓటుకు హక్కు:

ఒక పెట్టుబడిదారుడు ఒక కంపెనీలో ఒక్క షేర్ పొందిఉన్నను, అతను కంపెనీలో యాజమాన్యంలో కొంత భాగాన్ని పొందుతాడు. ఈ యాజమాన్యం, పెట్టుబడిదారులకు ఓటు హక్కును మరియు వ్యాపారం యొక్క వ్యూహాత్మక కదలికలో పాలుపంచుకోనే  అవకాశాన్నీ అందిస్తుంది. ఇది అతిశయోక్తిలా అనిపించినప్పటికీ, ఇది నిజం మరియు వాటాదారులు వారి ప్రయోజనాలకు హానికరమైన అసమంజసమైన నిర్ణయాలు కంపెనీ మేనేజ్మెంట్ తీసుకోకుండా నిరోధించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

నియంత్రణ వాతావరణం మరియు ఫ్రేమ్‌వర్క్:

భారత స్టాక్ మార్కెట్‌ను స్టాక్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నియంత్రిస్తుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలను నియంత్రించడం, వాటి అభివృద్ధి మరియు పెట్టుబడిదారుల హక్కులను పరిరక్షించడం యొక్క బాధ్యతను సెబీ కలిగి ఉంటుంది. అంటే పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లో ఆర్థిక ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టినప్పుడు, వారి ఆసక్తులు ఒక నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ద్వారా బాగా రక్షించబడతాయి. కంపెనీల మోసపూరిత కార్యకలాపాల కారణంగా నష్టాలను ఇది గణనీయంగా తగ్గించడానికి సహాయపడుతుంది.

వసతి:

సాంకేతిక అభివృద్ధి ఆధునిక జీవనం యొక్క ప్రతి అంశాన్ని ప్రభావితం చేసింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా పెట్టుబడిదారులకు మరింత సౌకర్యాన్ని అందించడానికి వివిధ సాంకేతిక పురోగతులను ఉపయోగిస్తున్నాయి. బహిరంగ వాతావరణంలో పెట్టుబడిదారులకు ఉత్తమ పెట్టుబడి అవకాశాలను నిర్ధారించడానికి ట్రేడ్లు అన్నీ ఒక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫార్మ్ పై అమలు చేయబడతాయి. అదనంగా, బ్రోకింగ్ సేవలను అందించేవారు పెట్టుబడిని సౌకర్యవంతంగా చేసే ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్ సదుపాయాలను అందిస్తారు, ఎందుకంటే పెట్టుబడిదారులు వారి ఇల్లు లేదా కార్యాలయాల సౌకర్యం నుండి ఒక కంప్యూటర్ ద్వారా తమ ఆర్డర్లను ఉంచవచ్చు. డీమాట్ అకౌంట్ పెట్టుబడిదారులకు  తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలోని అన్ని ఉత్పత్తులను ఒకే స్థానంలో ఎలక్ట్రానిక్‌గా ఉంచడం సులభతరం చేస్తుంది, ఇది పనితీరును ట్రాక్ చేయడం మరియు పర్యవేక్షించడం సులభతరం చేస్తుంది.

స్టాక్ పెట్టుబడి అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులు తమ నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రిస్కులను తగ్గించడానికి మరియు రాబడులను గరిష్టంగా పెంచుకోవడానికి, స్టాక్ మార్కెట్ ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడం మరియు పెట్టుబడి పెట్టడానికి ముందు పరిశోధన చేయడం అవసరం అని సలహా ఇవ్వబడుతుంది.