పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) కార్డ్ భారతదేశంలో ప్రతి పన్ను చెల్లింపుదారుకు అవసరమైన డాక్యుమెంట్. ఇది గుర్తింపు రుజువుగా పనిచేస్తుంది, అలాగే ఫైనాన్షియల్ మరియు ట్యాక్స్ సంబంధిత విషయాల్లో కీలకం. ఒక్క వ్యక్తికి ఒక్క ప్యాన్ మాత్రమే ఉండాలి, అయితే కొన్ని సందర్భాల్లో డుప్లికేట్ కార్డ్ రావచ్చు లేదా వివిధ కారణాలతో దాన్ని సరెండర్ చేయాల్సి రావచ్చు. ఈ ఆర్టికల్‌లో, ప్యాన్ కార్డ్‌ను ఎలా సరెండర్ చేయాలి అనే స్టెప్స్ ను, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ద్వారా చూపిస్తాం
డుప్లికేట్ ప్యాన్ కార్డ్‌ను ఎలా సరెండర్ చేయాలి - ఆన్‌లైన్?
స్టెప్ 1: ప్రక్రియ ప్రారంభించండి
ఆఫీషియల్ NSDL వెబ్‌సైట్ కి వెళ్లండి. "ప్యాన్ చేంజ్ రిక్వెస్ట్ ఆన్‌లైన్ ఫారమ్" పేజీకి నావిగేట్ చేయండి.
స్టెప్ 2: అప్లికేషన్ టైప్ సెలెక్ట్ చేయండి
ఇప్పుడు డ్రాప్‌డౌన్ లిస్ట్ నుండి "ప్రస్తుత ప్యాన్ డేటాలో మార్పులు లేదా సవరణలు/ప్యాన్ కార్డ్ రీప్రింట్ (ప్రస్తుత ప్యాన్ డేటాలో ఎలాంటి మార్పులు లేవు)" సెలెక్ట్ చేయండి
స్టెప్ 3: ఫారమ్ పూర్తి చేయండి
అవసరమైన అన్ని వివరాలు నింపండి. పూర్తి చేసిన తర్వాత ఫారమ్ సబ్మిట్ చేయండి. సబ్మిషన్ తర్వాత, యూనిక్ టోకెన్ నంబర్ మీ రిజిస్టర్ చేసిన ఇమెయిల్‌కు పంపబడుతుంది. భవిష్యత్ ఇంటరాక్షన్స్ కోసం ఈ నంబర్ అవసరం అవుతుంది.
స్టెప్ 4: మీ సబ్మిషన్ పద్ధతి ఎంచుకోండి
మీ ప్యాన్ అప్లికేషన్ డాక్యుమెంట్స్‌ను మీరు ఇలా సమర్పించవచ్చు:
- ఆధార్-బేస్డ్ e-KYC/e-Sign (పేపర్‌లెస్) ద్వారా
- డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ద్వారా
- డాక్యుమెంట్స్‌ను ఫిజికల్‌గా పంపండి.
స్టెప్ 5: అదనపు ప్యాన్ వివరాలు నమోదు చేయండి
సరెండర్ చేయాలనుకుంటున్న అదనపు ప్యాన్ నంబర్లను క్లియర్‌గా పేర్కొనండి. కన్ఫర్మ్ చేయడానికి పక్కనే ఉన్న బాక్స్‌ను చెక్ చేయండి.
స్టెప్ 6: ప్రూఫ్ సమర్పించండి
మీరు ఎంచుకున్న సబ్మిషన్ పద్ధతి ప్రకారం, గుర్తింపు, నివాసం, జనన తేదీ రుజువుల స్కాన్ చేసిన ఇమేజెస్ అటాచ్ చేయండి.
స్టెప్ 7: వెరిఫై & చెల్లించండి
సమగ్రంగా రివ్యూ చేసిన తర్వాత పేమెంట్ సెక్షన్‌కి వెళ్ళండి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
స్టెప్ 8: అక్నాలెడ్జ్‌మెంట్
పేమెంట్ తర్వాత ఒక అక్నాలెడ్జ్‌మెంట్ కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాలకు దాన్ని సేవ్ చేసి ప్రింట్ తీసుకోండి.
స్టెప్ 9: ప్రక్రియ పూర్తి చేయండి
ఆన్‌లైన్ అప్లికేషన్ తేదీ నుండి 15 రోజుల్లో, డిమాండ్ డ్రాఫ్ట్ (ఉపయోగిస్తే) మరియు డాక్యుమెంట్ ప్రూఫ్‌తో పాటు ఆ అక్నాలెడ్జ్‌మెంట్ ఎన్‌ఎస్డిఎల్ ఈ-గోవ్(e-Gov) కి చేరాలి.
డుప్లికేట్ ప్యాన్ కార్డ్‌ను ఎలా సరెండర్ చేయాలి - ఆఫ్‌లైన్?
స్టెప్ 1: ఫారమ్ పొందడం
ఏదైనా NSDL కలెక్షన్ సెంటర్ నుండి "కొత్త ప్యాన్ కార్డ్ కోసం అభ్యర్థన లేదా/లేదా ప్యాన్ డేటాలో మార్పులు లేదా సవరణల కోసం అభ్యర్థన" ఫారమ్ పొందండి.
స్టెప్ 2: ఫారమ్ పూర్తి చేయండి
ఫారమ్‌ను జాగ్రత్తగా నింపండి. అవసరమైన డాక్యుమెంట్ల కాపీలు అటాచ్ చేయండి.
స్టెప్ 3: సబ్మిషన్
నింపిన ఫారమ్‌ను ఏదైనా ఎన్‌ఎస్డిఎల్ కలెక్షన్ సెంటర్‌లో సమర్పించండి. సబ్మిషన్ తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ వస్తుంది. ఇది రిక్వెస్ట్ ఫైలింగ్ చేసిన 15 రోజుల్లో ఎన్‌ఎస్డిఎల్ ఆఫీసుకు చేరేలా చూసుకోండి.
స్టెప్ 4: అసెసింగ్ ఆఫీసర్‌కు లెటర్
డుప్లికేట్ ప్యాన్ మరియు దాన్ని రద్దు చేయాలనే మీ ఆకాంక్షను పేర్కొంటూ అసెసింగ్ ఆఫీసర్‌కు వివరంగా లెటర్ రాయండి. మీ వద్ద మరొక ప్యాన్ కార్డ్ లేనట్టు కన్ఫర్మ్ చేసే అఫిడవిట్‌ను అసెసింగ్ ఆఫీసర్ అడగవచ్చు.
స్టెప్ 5: ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్‌ను సందర్శించండి
మీకు సమీపంలోని ఇన్‌కమ్ ట్యాక్స్ అసెసింగ్ ఆఫీసర్‌ని వ్యక్తిగతంగా కలవండి. డుప్లికేట్ ప్యాన్ వివరాలు మరియు మీ క్యాన్సిలేషన్ రిక్వెస్ట్‌తో లెటర్ ఇవ్వండి. భవిష్యత్ అవసరాల కోసం అక్నాలెడ్జ్‌మెంట్‌ను ఉంచుకోండి.
వ్యక్తిగత హోల్డర్ మరణం కారణంగా ప్యాన్ కార్డ్‌ను ఎలా సరెండర్ చేయాలి?
స్టెప్ 1: అవసరమైన డాక్యుమెంట్లు సేకరించండి
- ప్యాన్ కార్డ్ హోల్డర్ మరణ ధృవపత్రం.
- లీగల్ హెయిర్ లేదా కుటుంబ సభ్యుడు సైన్ చేసిన, ప్యాన్ క్యాన్సిలేషన్ కోరుతూ లెటర్.
స్టెప్ 2: రిక్వెస్ట్ లెటర్ రాయండి
మరణించిన వ్యక్తి పేరు, ప్యాన్, జనన తేదీ, మరియు సరెండర్ కారణాన్ని వివరించండి. మరణ ధృవపత్రాన్ని అటాచ్ చేయండి.
స్టెప్ 3: సంబంధిత అధికారికి సమర్పించండి
అటాచ్ చేసిన డాక్యుమెంట్లతో లెటర్‌ను లోకల్ ఇన్‌కమ్ ట్యాక్స్ అసెసింగ్ ఆఫీసర్‌కు వ్యక్తిగతంగా ఇచ్చేయండి లేదా పంపండి.
స్టెప్ 4: రసీదు
సబ్మిషన్ తర్వాత రిసీట్ లేదా అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. భవిష్యత్ అవసరాల కోసం దీన్ని సేఫ్‌గా ఉంచండి.
ఫర్మ్/పార్ట్‌నర్‌షిప్ ఫర్మ్/కంపెనీ యొక్క ప్యాన్ కార్డ్‌ను ఎలా సరెండర్ చేయాలి - ఆన్‌లైన్?
స్టెప్ 1: ప్రక్రియ ప్రారంభించండి
ఆఫీషియల్ NSDL వెబ్‌సైట్‌కు వెళ్ళండి. "ప్యాన్ చేంజ్ రిక్వెస్ట్ ఆన్‌లైన్ ఫారమ్" పేజీకి నావిగేట్ చేయండి.
స్టెప్ 2: అప్లికేషన్ టైప్ ఎంచుకోండి
"ప్రస్తుత ప్యాన్ డేటాలో మార్పులు లేదా సవరణలు/ప్యాన్ కార్డ్ రీప్రింట్ (ప్రస్తుత ప్యాన్ డేటాలో ఎలాంటి మార్పులు లేవు)" ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
స్టెప్ 3: ఫారమ్ నింపండి
ఫర్మ్/కంపెనీ వివరాలు ఎంటర్ చేయండి. మీ ఇమెయిల్‌కు పంపిన టోకెన్ నంబర్‌ను నోట్ చేసుకోండి. భవిష్యత్ ఇంటరాక్షన్స్ కోసం దాన్ని ఉంచుకోండి.
స్టెప్ 4: అదనపు ప్యాన్ వివరాలు ఇవ్వండి
సరెండర్ చేయాలనుకున్న ప్యాన్ నంబర్‌ను స్పష్టంగా పేర్కొని, సంబంధిత బాక్స్‌ను చెక్ చేయండి.
స్టెప్ 5: డాక్యుమెంట్ సబ్మిషన్
అధీకృత సంతకదారుల గుర్తింపు, చిరునామా, జనన తేదీ వంటి అవసరమైన డాక్యుమెంట్ల స్కాన్ చేసిన ఇమేజెస్ అటాచ్ చేయండి.
స్టెప్ 6: వెరిఫై & చెల్లించండి
అన్నీ రివ్యూ చేసి పేమెంట్‌కు కొనసాగండి.
స్టెప్ 7: అక్నాలెడ్జ్‌మెంట్
ఒక అక్నాలెడ్జ్‌మెంట్ ఫారమ్ జెనరేట్ అవుతుంది. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకుని సేవ్ చేసుకోండి.
ఫర్మ్/పార్ట్‌నర్‌షిప్ ఫర్మ్/కంపెనీ యొక్క ప్యాన్ కార్డ్‌ను ఎలా సరెండర్ చేయాలి - ఆఫ్‌లైన్?
స్టెప్ 1: ఫారమ్ పొందడం
ఏదైనా ఎన్‌ఎస్డిఎల్ కలెక్షన్ సెంటర్ నుండి "కొత్త ప్యాన్ కార్డ్ కోసం అభ్యర్థన లేదా/లేదా ప్యాన్ డేటాలో మార్పులు లేదా సవరణల కోసం అభ్యర్థన" ఫారమ్ పొందండి.
స్టెప్ 2: ఫారమ్ పూర్తి చేయండి
ఫారమ్‌ను నింపి, ఫర్మ్ లేదా కంపెనీ గురించి వివరాలు పేర్కొనండి. అవసరమైన డాక్యుమెంట్లు అటాచ్ చేయండి.
స్టెప్ 3: రిక్వెస్ట్ లెటర్
ప్యాన్ క్యాన్సిలేషన్ కోరుతూ, కారణాలను తెలిపే ఫార్మల్ లెటర్ రాయండి.
స్టెప్ 4: సబ్మిషన్
నింపిన ఫారమ్, లెటర్, మరియు అటాచ్ చేసిన డాక్యుమెంట్లను లోకల్ ఎన్‌ఎస్డిఎల్ కలెక్షన్ సెంటర్‌కి సమర్పించండి.
స్టెప్ 5: రసీదు
సబ్మిట్ చేసిన తర్వాత రిసీట్ లేదా అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. మీ రికార్డ్స్ కోసం దాన్ని ఉంచుకోండి.
స్టెప్ 6: ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్‌ను సందర్శించండి
లోకల్ ఇన్‌కమ్ ట్యాక్స్ అసెసింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లి డాక్యుమెంట్లు సమర్పించి, ప్యాన్ కార్డ్ సరెండర్ చేయాలనే కారణాన్ని వివరించండి. వారు ఇస్తే ఆ రిసీట్/అక్నాలెడ్జ్‌మెంట్‌ను తప్పక ఉంచుకోండి
మీ ప్యాన్ కార్డ్‌ను సరెండర్ చేస్తూ గమనించవలసిన ముఖ్యాంశాలు.
- సరెండర్ కారణం: డుప్లికేట్ ప్యాన్ ఉండటం, హోల్డర్ మరణం, లేదా బిజినెస్ డిజాల్యూషన్ వంటి కారణాన్ని స్పష్టంగా పేర్కొనడం ముఖ్యం.
- అక్నాలెడ్జ్‌మెంట్లు ఉంచుకోండి: ప్యాన్ కార్డ్ సరెండర్ చేయడానికి సమర్పించినప్పుడు ఇచ్చే అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ లేదా రిసీట్‌ను ఎప్పుడూ ఉంచుకోండి. ఇది మీ రిక్వెస్ట్‌కు రికార్డ్‌గా ఉంటుంది.
- ఆలస్యాలు నివారించండి: సరెండర్ చేయాల్సిన అవసరం గుర్తించిన వెంటనే (ఉదా., డుప్లికేట్ ప్యాన్ కనిపిస్తే) వెంటనే చర్య తీసుకోండి, తద్వారా సమస్యలు తగ్గుతాయి.
- రిఫండ్స్ లేవు: ప్యాన్ కార్డ్ పొందడానికి లేదా కరెక్షన్‌కి చెల్లించిన ఫీజులు తరువాత కార్డ్‌ను సరెండర్ చేసినా రిఫండబుల్ కావు.
- దుర్వినియోగం నిలువరించండి: వాడకంలో లేని ప్యాన్ కార్డులను సరెండర్ చేయడం ద్వారా పొటెన్షియల్ దుర్వినియోగం, ఐడెంటిటీ థెఫ్ట్, లేదా మోసపూరిత చర్యలను అరికట్టవచ్చు
సారాంశం
భారతదేశంలో ట్యాక్స్ మేనేజ్‌మెంట్ సమర్థవంతంగా ఉండేందుకు ప్యాన్ కార్డులను సరెండర్ చేసే ప్రక్రియను అర్థం చేసుకోవడం అవసరం. సూచించిన స్టెప్స్‌ను ఫాలో అవడం ద్వారా ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ నిలబెడుతూ సీమ్లెస్ అనుభవం పొందవచ్చు.

