ఫారం 49A: పాన్ కార్డ్ దరఖాస్తు ఫారమ్

ఫారమ్ 49A అనేది భారతదేశంలో శాశ్వత ఖాతా సంఖ్య (PAN) ను పొందేందుకు ఉపయోగించే దరఖాస్తు ఫారమ్. PAN అనేది ప్రత్యేకమైన ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫైయర్, ఇది నిర్దిష్ట లావాదేవీలలోకి ప్రవేశించేటప్పుడు తప్పనిసరిగా కోట్ చేయబడాలి.

బ్యాంక్ ఖాతాలో ₹50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ల నుండి నిర్దిష్ట ఆర్థిక లావాదేవీల వరకు అనేక సందర్భాల్లో శాశ్వత ఖాతా సంఖ్య (పర్మనెంట్ అకౌంట్ నంబర్) లేదా PAN ను కోట్ చేయడం ఒక తప్పనిసరి అవసరం.

అదృష్టవశాత్తూ, మీకు కేటాయించబడే PAN ను పొందడం చాలా సులభం. మీరు చేయాల్సిందల్లా, ప్రోటీన్ ఇగోవ్ టెక్నాలజీస్ లిమిటెడ్ మరియు UTIITSL అయిన PAN అప్లికేషన్‌లను సేకరించి ప్రాసెస్ చేయడానికి అధికారం ఉన్న సంస్థలకు అవసరమైన డాక్యుమెంటేషన్‌తో పాటు ఫారమ్ 49A ని సమర్పించడం మాత్రమే. 

మీకు ఇంకా శాశ్వత ఖాతా సంఖ్య లేకపోతే మరియు దాని కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, ఫారమ్ 49A, ఫారమ్‌లోని వివిధ భాగాలు మరియు దానితో పాటు మీరు సమర్పించాల్సిన పత్రాల గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఇవ్వబడింది. 

ఫారం 49A అంటే ఏమిటి? 

ఫారమ్ 49A అనేది భారతదేశం వెలుపల నివసిస్తున్న వారితో సహా భారతీయ పౌరులు శాశ్వత ఖాతా సంఖ్య (పర్మనెంట్ అకౌంట్ నంబర్) PAN కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తు ఫారమ్. భారతీయ పౌరులతో పాటు, ఇన్‌కార్పొరేటెడ్ మరియు అన్ఇన్‌కార్పొరేటెడ్ ఎంటిటీలు మరియు భారతీయ కంపెనీలు కూడా పాన్ కోసం దరఖాస్తు చేయడానికి ఫారమ్ 49Aని ఉపయోగించవచ్చు. 

ఫారం 49A లో ఉండే వివిధ విభాగాలు ఏమిటి?

PAN కార్డ్ కోసం 49A ఫారమ్‌లో మీ వ్యక్తిగత వివరాలు, సంప్రదింపు సమాచారం మరియు ఇతర ప్రత్యేకతలు వంటి సమాచారంతో సహా ఇంకా మీరు పేర్కొనాల్సిన అనేక విభాగాలు ఉన్నాయి. ఫారమ్‌లోని కొన్ని ముఖ్య విభాగాల యొక్క అవలోకనం ఇక్కడ ఇవ్వబడింది.

 1. అసెస్సింగ్ ఆఫీసర్ (AO కోడ్)

ఫారమ్ 49A లోని మొదటి విభాగంలో మీరు మీ ఏరియా కోడ్, రేంజ్ కోడ్, అసెస్సింగ్ ఆఫీసర్ (AO) రకం మరియు AO నంబర్ వంటి వివరాలను పూరించాలి. ఈ వివరాలు మీ నివాస స్థలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వీటిని మీరు ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ టాక్స్) పోర్టల్ నుండి పొందవచ్చు. 

AO కోడ్ ను గురించి మరింత చదవండి

 1. పూర్తి పేరు

ఈ విభాగం కింద, మీరు మీ మొదటి పేరు, మధ్య పేరు (ఏదైనా ఉంటే) మరియు చివరి పేరు లేదా ఇంటిపేరుతో సహా మీ టైటిల్ మరియు మీ పూర్తి పేరును నమోదు చేయాలి. ఈ విభాగాన్ని పూరిస్తున్నప్పుడు, ఏ విధమైన మొదటి అక్షరాలనూ (ఇనీషియల్స్) ఉపయోగించకండి. 

 1. పై పేరు యొక్క సంక్షిప్తనామాలు (అబ్రివేషన్స్)

మీ పేరు చాలా పొడవుగా ఉంటే లేదా పాన్ కార్డ్‌లో మీ పేరులో కొంత భాగాన్ని మాత్రమే ముద్రించాలనుకుంటే, మీరు ఫారమ్ 49A లోని ఈ విభాగంలో దానిని పేర్కొనవచ్చు. మీ పేరు యొక్క సంక్షిప్తాలు కూడా ఆమోదించబడతాయి.

 1. మీరు ఎప్పుడైనా వేరే పేరుతో పిలవబడ్డారా?

మీరు అధికారికంగా లేదా మరొక అధికారిక పేరుతో సూచించబడి ఉంటే లేదా మీరు ఇటీవల మీ పేరును మార్చుకున్నట్లయితే, ఇతర పేరు యొక్క వివరాలను తప్పనిసరిగా ఈ విభాగంలో నమోదు చేయాలి. ఇక శీర్షిక (టైటిల్) లో, మీ మొదటి మరియు మధ్య పేర్లు మరియు మీ చివరి పేరు లేదా ఇంటిపేరు నుండి ప్రతిదీ తప్పనిసరిగా నమోదు చేయాలి.

 1. లింగం (మగ/ఆడ/ట్రాన్స్‌జెండర్) 

ఫారమ్ 49A యొక్క ఈ విభాగంలో, మీరు మీ లింగం; మీరు మగ, ఆడ లేదా ట్రాన్స్‌జెండర్ అనే విషయాన్ని పేర్కొనాలి. ఈ విభాగం కేవలం వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది మరియు PAN కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న సంస్థలకు లేదా కంపెనీలకు కాదు. 

 1. పుట్టిన తేదీ 

ఈ విభాగం కింద, మీరు మీ పుట్టిన తేదీని DDMMYYYY (తేదీ,నెల,సంవత్సరం) ఈ వరుసలో పేర్కొనాలి. ఒక ఎంటిటీ లేదా కంపెనీ కోసం ఫారమ్ 49A నింపబడి ఉంటే, మీరు ఆ ఎంటిటీ యొక్క ఇన్కార్పొరేషన్, ఫార్మేషన్ లేదా ఒప్పందంపై సంతకం చేసిన తేదీని నమోదు చేయాలి. 

 1. తల్లిదండ్రుల వివరాలు 

మీరు వ్యక్తిగతంగా PAN కార్డ్ కోసం 49A ఫారమ్‌ను పూరిస్తే, మీరు ఈ విభాగం కింద మీ తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయాలి. సంబంధిత గడులలో తండ్రి మరియు తల్లి యొక్క పూర్తి పేరును తప్పనిసరిగా నమోదు చేయాలి. మీ తల్లి సింగిల్ పేరెంట్ అయితే తప్ప తండ్రి పేరును నమోదు చేయడం తప్పనిసరి, ఈ సందర్భంలో, మీరు మీ తల్లి పేరును మాత్రమే అందించడం ద్వారా కూడా పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లింగం (జెండర్) వలె, ఈ విభాగం కూడా వ్యక్తిగత దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది మరియు ఎంటిటీలకు కాదు. 

 1. అడ్రస్

ఫారమ్ 49A యొక్క ఈ విభాగంలో, మీరు మీ నివాసం యొక్క పూర్తి అడ్రస్ మరియు మీ కార్యాలయ అడ్రస్ (ఏదైనా ఉంటే) నమోదు చేయాలి. దరఖాస్తును పూరించేటప్పుడు, ఆవరణ లేదా భవనం పేరు, వీధి పేరు మరియు మీ ప్రాంతం పేరు, మిగిలిన వాటితో పాటుగా చేర్చారని నిర్ధారించుకోండి. 

 1. కమ్యూనికేషన్ కోసం అడ్రస్

ఈ విభాగంలో, మీరు నివాసం (రెసిడెన్షియల్) లేదా ఆఫీస్ అనే రెండు అడ్రస్ లలో ఒక దాన్ని మీరు ఆదాయపు పన్ను శాఖ నుండి అన్ని అధికారిక కమ్యూనికేషన్‌లను స్వీకరించడానికి ఎంచుకోవచ్చు. 

 1. టెలిఫోన్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడీ వివరాలు

ఈ విభాగం కింద, మీరు మీ టెలిఫోన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడీని నమోదు చేయాలి, ఇది కమ్యూనికేషన్ కోసం ఉపయోగించబడుతుంది. మీరు మీ టెలిఫోన్ నంబర్‌ను నమోదు చేస్తుంటే, మీ టెలిఫోన్ నంబర్‌తో పాటు దేశం యొక్క కోడ్ మరియు ప్రాంతం లేదా STD కోడ్‌ను పేర్కొన్నారని నిర్ధారించుకోండి. 

 1. దరఖాస్తుదారు యొక్క స్థితి

ఇక్కడ, మీరు దరఖాస్తుదారుగా మీ స్థితిని ఎంచుకోవాలి. కింది ఎంపికలు ఫారమ్ 49A లో అందించబడ్డాయి. 

 • వ్యక్తి
 • హిందూ అవిభక్త కుటుంబం
 • కంపెనీ
 • భాగస్వామ్య సంస్థ
 • ప్రభుత్వం
 • వ్యక్తుల సంఘం
 • ట్రస్ట్‌లు
 • వ్యక్తుల సమూహం
 • లోకల్ అథారిటీ
 • ఆర్టిఫిషియల్ జురిడికల్ పర్సన్స్
 • లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్షిప్
 1. నమోదు సంఖ్య (రిజిస్ట్రేషన్ నంబర్)

మీరు ఒక ఎంటిటీగానో లేదా కంపెనీ కోసమో శాశ్వత ఖాతా నంబర్‌ను పొందేందుకు ఫారమ్ 49A ని పూరిస్తే, రిజిస్ట్రేషన్, ఫార్మేషన్ లేదా ఇన్‌కార్పొరేషన్ సమయంలో ఎంటిటీకి కేటాయించిన ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్‌ను మీరు నమోదు చేయాలి. ఎంటిటీగా నమోదు చేయకపోతే, మీరు ఈ విభాగాన్ని పూరించాల్సిన అవసరం లేదు. 

 1. ఆధార్ నంబర్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ 

ఆధార్ మరియు పాన్ వివరాలను లింక్ చేయాల్సిన అవసరం ఉన్నందున, మీరు ఫారమ్ 49A లోని ఈ విభాగంలో మీ ఆధార్ నంబర్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ని నమోదు చేయాలి. అదనంగా, మీరు మీ ఆధార్ ప్రకారంగా ఉన్న మీ పేరును కూడా పేర్కొనాలి. 

 1. ఆదాయ వనరు (సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్)

PAN కార్డ్‌ల కోసం 49A ఫారమ్‌లోని ఈ విభాగంలో, మీరు మీ ఆదాయ మూలాన్ని (సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్) పేర్కొనాలి. మీరు వివిధ మూలాల నుండి ఆదాయాన్ని సంపాదించినట్లయితే మీరు ఆ ఎంపికలనన్నిటినీ ఎంచుకోవచ్చు. ఫారమ్‌లో మీకు కనిపించే ఎంపికలు ఇక్కడ ఉన్నాయి. 

 • జీతం
 • మూలధన లాభాలు
 • వ్యాపారం లేదా వృత్తి నుండి వచ్చే ఆదాయం
 • ఇతర వనరుల నుండి ఆదాయం
 • ఇంటి ఆస్తి నుండి ఆదాయం

మీకు ఆదాయం లేకుంటే, ఈ విభాగంలో ‘నో ఇన్‌కమ్’ అనే ఎంపిక కూడా ఉంది, దానిని మీరు ఎంచుకోవచ్చు.

 1. ప్రతినిధి (రిప్రజెంటేటివ్) అసెస్సీ (RA)

ప్రతినిధి అసెస్సీ అనే వారు మరొక వ్యక్తికి చట్టపరమైన ప్రతినిధిగా వ్యవహరించే వ్యక్తి. ఉదాహరణకు, మైనర్ విషయంలో, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ప్రతినిధిగా అసెస్‌మెంట్ వేయవచ్చు. మీకు ఒక ప్రాతినిధ్య మదింపుదారు ఉన్నట్లయితే, వారి పూర్తి పేరు మరియు అడ్రస్ తో సహా వ్యక్తి యొక్క వివరాలు తప్పనిసరిగా ఈ విభాగం క్రింద పేర్కొనబడాలి. 

 1. గుర్తింపు రుజువు (POI), అడ్రస్ రుజువు (POA) మరియు పుట్టిన తేదీ రుజువు (POB)గా సమర్పించబడిన పత్రాలు

ఈ విభాగంలో, మీరు మీ గుర్తింపు రుజువు, అడ్రస్ రుజువు మరియు పుట్టిన తేదీ రుజువులుగా ఫారం 49A తో పాటు మీరు జతచేసిన పత్రం యొక్క పేరు మరియు రకాన్ని పేర్కొనాలి. 

ఫారం 49A ని ఆన్‌లైన్‌లో ఎలా పూరించాలి?

మీరు ఆన్‌లైన్‌లో ఫారమ్ 49A ని నింపి సమర్పించాలనుకుంటే, మీరు అనుసరించాల్సిన దశలవారీ సంక్షిప్త అవలోకనం ఇక్కడ ఇవ్వబడింది. 

 • దశ 1: UTIITSL లేదా Protean eGov Technologies Limited యొక్క PAN పోర్టల్‌ని సందర్శించండి. 
 • దశ 2: జాబితా మరియు దరఖాస్తుదారు స్థితి నుండి ఫారమ్ 49Aని ఎంచుకోండి. 
 • దశ 3: ఫారమ్ 49A ఫైల్ చేసే విధానాన్ని ఎంచుకోండి. డిజిటల్ మోడ్ కింద, మీరు ఆధార్ ఇ-సైన్ సౌకర్యంతో లేదా మీ డిజిటల్ సిగ్నేచర్ టోకెన్ (DSC)ని ఉపయోగించి ఫారమ్‌పై సంతకం చేసే అవకాశం ఉంది. 
 • దశ 4: దరఖాస్తును ఆన్‌లైన్‌లో పూరించడాన్ని కొనసాగండి. 
 • దశ 5: మీ ఫోటోగ్రాఫ్ మరియు మీ సంతకం యొక్క స్కాన్ చేసిన కాపీతో సహా సంబంధిత డాక్యుమెంటరీ సాక్ష్యాలన్నింటికీ స్కాన్ చేసిన కాపీలను జత చేయండి.
 • దశ 6: దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించి, చెల్లింపును (పేమెంట్) చేయండి. 

అంతే. మీ ఫారమ్ 49A, సంబంధిత జారీ చేసే అధికారానికి సమర్పించబడి ప్రాసెస్ చేయబడుతుంది. ఫారమ్ యొక్క ధృవీకరణ పూర్తయిన తర్వాత, మీకు శాశ్వత ఖాతా సంఖ్య కేటాయించబడుతుంది

గమనిక: పైన వివరించిన ప్రక్రియ కేవలం ఒక ఉదాహరణ మాత్రమే, అది మీరు ఎంచుకునే అధీకృత PAN ప్రాసెసింగ్ ఎంటిటీని బట్టి కొద్దిగా మారవచ్చు.

ఫారమ్ 49A ని ఆఫ్‌లైన్‌లో ఎలా పూరించాలి? 

మీరు ఫారమ్‌ను ఆఫ్‌లైన్‌లో పూరించి సమర్పించాలి అనుకుంటే, మీరు చేయాల్సిందల్లా ఆదాయపు పన్ను వెబ్‌సైట్ లేదా UTIITSL లేదా Protean eGov Technologies Limited వెబ్‌సైట్‌ను సందర్శించడం. ఇక్కడ, మీరు 49A ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవడం కోసం ఒక ఎంపికను కనుగొంటారు.

ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ చేసి, ఫారమ్‌లోని అన్ని విభాగాలను మీరే (మాన్యువల్‌గా) పూరించండి. వివరాలన్నింటినీ బ్లాక్ (BLOCK) లెటర్స్‌లో మరియు నల్లని సిరా (బ్లాక్ ఇంక్‌)తో పూరించాలని గుర్తుంచుకోండి. మీరు ఫారమ్‌ను పూరించడం పూర్తి చేసిన తర్వాత, సంబంధిత ఖాళీలలో మీ సంతకాన్ని చెయ్యండి. అలాగే, ఫారం 49A మొదటి పేజీకి ఇరువైపులా రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను అతికించండి. 

ఫారమ్ యొక్క ఎడమ వైపున అతికించిన పాస్‌పోర్ట్ సైజు ఫోటోపై మీ సంతకాన్ని చెయ్యండి. 

అది పూర్తయిన తర్వాత, మీరు UTIITSL లేదా Protean eGov టెక్నాలజీస్ లిమిటెడ్‌కి అన్ని సంబంధిత డాక్యుమెంటరీ సాక్ష్యాలతో పాటు నింపిన మరియు సంతకం చేసిన ఫారమ్ 49Aని మెయిల్ చేయవచ్చు 

ఫారం 49Aతో పాటు సమర్పించాల్సిన పత్రాలు 

ఫారం 49A తో పాటు సరైన డాక్యుమెంటరీ సాక్ష్యాలను సమర్పించడం పాన్ కేటాయింపు పొందడానికి చాలా కీలకం. మీరు సమర్పించగల సాధారణంగా ఆమోదించబడిన పత్రాల జాబితా యొక్క అవలోకనం ఇక్కడ ఉంది.

 •  గుర్తింపు రుజువు (క్రింది వాటిలో ఏదైనా ఒకటి)
 • ఆధార్ కార్డ్
 • ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డు
 • పాస్‌పోర్ట్
 • డ్రైవింగ్ లైసెన్స్
 • రేషన్ కార్డ్
 • అడ్రస్ రుజువు (క్రింది వాటిలో ఏదైనా ఒకటి)
 • ఆధార్ కార్డ్
 • ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డు
 • పాస్‌పోర్ట్
 • డ్రైవింగ్ లైసెన్స్
 • అడ్రస్ తో కూడిన పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్
 • విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, నీటి బిల్లు, బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్ లేదా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ వంటి తాజా యుటిలిటీ బిల్లు
 • ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం
 • పుట్టిన తేదీ రుజువు (క్రింది వాటిలో ఏదైనా ఒకటి)
 • జనన ధృవీకరణ పత్రం
 • మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్
 • వివాహ ధ్రువీకరణ పత్రం
 • పెన్షన్ చెల్లింపు ఆర్డర్
 • డ్రైవింగ్ లైసెన్స్
 • పాస్‌పోర్ట్
 • ఆధార్ కార్డ్

మీరు ఎంటిటీ లేదా కంపెనీ కోసం పాన్ కార్డ్ కోసం 49A ఫారమ్‌ను పూరిస్తే, కింది డాక్యుమెంట్‌ల జాబితాను జతచేయాలి. 

 • కంపెనీ: రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ROC) జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీ.
 • భాగస్వామ్య సంస్థ: రిజిస్ట్రార్ ఆఫ్ ఫర్మ్‌లు జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీ లేదా భాగస్వామ్య దస్తావేజు కాపీ
 • లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్ (LLP): LLP రిజిస్ట్రార్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీ
 • ట్రస్ట్‌లు:  ట్రస్ట్ డీడ్ కాపీ లేదా ఛారిటీ కమిషనర్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీ.
 • అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, లోకల్ అథారిటీ, బాడీ ఆఫ్ వ్యక్తులు లేదా ఆర్టిఫిషియల్ జ్యూరిడికల్ పర్సన్స్: అగ్రిమెంట్ కాపీ లేదా ఒక సమర్థ అధికారి ద్వారా జారీ చేయబడిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీ 

ముగింపు

దీనితో, మీరు ఇప్పుడు ఫారం 49Aకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని గురించి తెలుసుకోవాలి. గుర్తుంచుకోండి, కొత్త శాశ్వత ఖాతా సంఖ్య (PAN) కోసం దరఖాస్తు చేయడానికి మాత్రమే ఈ ఫారమ్ ఉపయోగించబడుతుంది. మీరు మీ ప్రస్తుత పాన్ వివరాలకు ఏవైనా మార్పులు చేయాలనుకుంటే, మీరు ఆదాయపు పన్ను యొక్క పోర్టల్ లేదా UTIITSL లేదా Protean eGovTechnologies Limited వెబ్‌సైట్‌ల నుండి డౌన్‌లోడ్ చేసుకునే ప్రత్యేక ఫారమ్‌ను ఉపయోగించాలి.

FAQs

ఫారమ్ 49Aని ఎవరు పూరించి సమర్పించగలరు?

భారతీయ పౌరులు, భారతదేశంలో విలీనం చేయబడిన కంపెనీలు మరియు సంస్థలు మరియు భారతదేశంలోని ఇన్‌కార్పొరేటెడ్ ఎంటిటీలు అందరూ శాశ్వత ఖాతా సంఖ్య (PAN) ను పొందేందుకు ఫారమ్ 49A ని పూరించి సమర్పించవచ్చు.

ఫారం 49A ని ఆన్‌లైన్‌లో పూరించవచ్చునా?

అవును. అధీకృత పాన్ ప్రాసెసింగ్ ఎంటిటీలు – UTIITSL మరియు ప్రొటీన్ eGov Technologies Limited రెండూ ఆన్‌లైన్‌లో ఫారమ్ 49A పూరించడానికి మరియు సమర్పించడానికి ఎంపికను అందిస్తాయి.

నా ఫారమ్ 49A అప్లికేషన్ యొక్క స్థితిని నేను ఎలా తనిఖీ చేయగలను?

మీ ఫారమ్ 49A అప్లికేషన్ యొక్క స్థితిని ఫారం సమర్పించబడిన సమయంలో అందించబడిన రసీదు సంఖ్యను ఉపయోగించి ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు.

ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) ఫారమ్ 49A ఉపయోగించి పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునా?

అవును. ప్రవాస భారతీయులు భారతీయ పౌరులుగా ఉన్నంత వరకు, వారు ఫారమ్ 49A ఉపయోగించి పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విదేశీ పౌరులు, నివాసి లేదా నాన్-రెసిడెంట్ అయినా, ఫారమ్ 49AA ద్వారా మాత్రమే PAN కోసం దరఖాస్తు చేసుకోవచ్చును.

ఫారమ్ 49A యొక్క వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం ఎంపిక ఉందా?

అవును. మీరు ఆధార్ ఆధారిత e-KYC ఎంపికను ఎంచుకుంటే, ఫారమ్ 49Aని ప్రాసెస్ చేయడానికి పట్టే సమయం ఆఫ్‌లైన్ పద్ధతితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఎంపిక UTIITSL మరియు Protean eGov Technologies Limited రెండింటిలోనూ అందుబాటులో ఉంది.