ఆన్‌లైన్ ట్రేడింగ్ అంటే ఏమిటి

ఇటీవలి సమయాల్లో, స్టాక్‌లపై ట్రేడింగ్  అనేది ఆన్‌లైన్‌లో షాపింగ్ అంత సులభంగా అయింది. ఒక స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఒక కాఫీ షాప్ లో కూర్చున్న పెట్టుబడిదారు దానిని చేయవచ్చు. దానికి అవసరమైనదల్లా మంచి ఇంటర్నెట్ కనెక్షన్, 3-ఇన్-1 అకౌంట్‌కు సబ్‌స్క్రిప్షన్, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ మరియు బ్యాంక్ అకౌంట్‌లో తగినంత నిధులు.

అదృష్టవశాత్తు, హెక్టిక్ పేపర్ వర్క్ అంతా ఒకే క్లిక్ కు లేదా మొబైల్ స్క్రీన్ పై టచ్ కు వచ్చేసింది. ట్రేడింగ్ కోసం అనేక ఉచిత మరియు చెల్లించబడిన మొబైల్ మరియు వెబ్ అప్లికేషన్లు మరియు పోర్టల్స్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి.

సరైన మార్గంలో చేసినట్లయితే స్టాక్ ట్రేడింగ్ ఆర్థికంగా ఫలదాయకంగా ఉండగలదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం లో మార్కెట్ యొక్క వివిధ హెచ్చుతగ్గుల వెంట ప్రయాణించడం ఉంటుంది. భారతదేశంలో ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్రవేశపెట్టబడినప్పటి నుండి, పెట్టుబడి పెట్టడం సౌకర్యవంతమైంది. దీర్ఘకాలిక సంపద సృష్టించడానికి వస్తే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఒక గొప్ప ప్రత్యామ్నాయం. అయితే, మీరు మీ నైపుణ్యాలను పదును పెట్టుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు.

క్రింద ఆన్‌లైన్ ట్రేడింగ్ గురించి హ్యాండ్స్-ఆన్ సమాచారాన్ని పొందండి:

  • ఆన్లైన్ ట్రేడింగ్ అంటే ఏమిటి.
  • ఆన్లైన్లో ఎలా ట్రేడ్ చేయాలి.

ఆన్లైన్ ట్రేడింగ్ అంటే ఏమిటి

ఆన్లైన్ ట్రేడింగ్ లో ఒక ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ ద్వారా సెక్యూరిటీల ట్రేడింగ్ ఉంటుంది. ఆన్లైన్ ట్రేడింగ్ పోర్టల్‌లు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్‌లు మరియు వస్తువులు వంటి వివిధ ఆర్థిక సాధనాల వ్యాపారాన్ని సులభతరం చేస్తాయి. ఏంజెల్ బ్రోకింగ్ ఏంజెల్ స్పీడ్ ప్రో అందిస్తుంది – ఇది పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు స్టాక్‌లు మరియు ఇతర ఫైనాన్షియల్ సాధనాలను కొనుగోలు / విక్రయించడానికి సహాయపడే ఒక ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్.

ఆన్లైన్లో ఎలా ట్రేడ్ చేయాలి

  • డిమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ తెరవండి:

ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ ప్రారంభించడానికి మీరు ఒక ఆన్‌లైన్ బ్రోకింగ్ సంస్థతో ఒక ఆన్‌లైన్ ట్రేడింగ్ ఖాతాను తెరవాలి. ఏంజెల్ బ్రోకింగ్ తక్కువ నిర్వహణ ఖర్చు మరియు సరసమైన బ్రోకరేజ్‌తో విశ్వసనీయ డిమాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ ల సేవలను అందిస్తుంది. అన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్స్ లో రిజిస్టర్ చేయబడిన మరియు సెబి ద్వారా సర్టిఫై చేయబడిన ఒక బ్రోకర్ ని ఎంచుకోవడం ముఖ్యం

  • అన్ని స్టాక్ మార్కెట్ ప్రాథమిక అంశాలను నేర్చుకోండి:

స్టాక్ మార్కెట్ సరఫరా మరియు డిమాండ్ వ్యవస్థపై పనిచేస్తుంది. ట్రేడ్ చేయడం నేర్చుకోవడం షేర్ మార్కెట్ పెట్టుబడి గురించి మరింత తెలుసుకోవడంతో ప్రారంభమవుతుంది. ఆర్థిక వార్తలు మరియు వెబ్‌సైట్‌లపై దృష్టి ఉంచడం, పాడ్-కాస్ట్‌లను వినడం మరియు పెట్టుబడి కోర్సులు తీసుకోవడం అనేవి అన్నీ సమర్థవంతమైన పెట్టుబడిదారుగా మారడానికి అద్భుతమైన మార్గాలు.

  • ఆన్లైన్ స్టాక్ సిములేటర్ తో ప్రాక్టీస్ చేయండి:

ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ సిములేటర్లు ఆన్లైన్ ట్రేడింగ్ నేర్చుకోవడానికి ఒక గొప్ప మార్గం. ఇది ఒక సిములేటర్ కాబట్టి, మీరు చేసే నష్టాలు మిమ్మల్ని ప్రభావితం చేయవు, అందువల్ల మీరు ఎటువంటి భయం లేకుండా వ్యాపారాన్ని నేర్చుకోవచ్చు.

  • ఒక ప్లాన్ డ్రాఫ్ట్ చేయండి:

మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు, మీ పెట్టుబడి వ్యూహాల ద్వారా ఆలోచించడం చాలా ముఖ్యం. మీరు ఒక నిర్దిష్ట కంపెనీలో ఎంత పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోండి మరియు మీరు భరించడానికి సిద్ధంగా ఉన్న నష్టానికి పరిమితులను సెట్ చేయండి. 

మీరు ఈ అన్ని పాయింట్లను దృష్టిలో ఉంచుకుంటే, ఆన్లైన్ షేర్ ట్రేడింగ్ మీ కోసం సులభమైన మరియు లాభదాయకమైన పని అవుతుంది. విజయవంతమైన ఆన్లైన్ ట్రేడింగ్ కు ప్రాక్టీస్ కీలకమైనది. స్టాక్ ట్రేడింగ్ అనేది దీర్ఘకాలిక పెట్టుబడి మరియు సహనం మరియు పట్టుదల అవసరం.

ఇందులో స్టాక్‌లు, బాండ్‌లు మరియు ఇతర సంబంధిత ఆర్థిక సాధనాలు వంటి సెక్యూరిటీలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం మరియు విక్రయించడం ఉంటుంది. ఈ ప్రయోజనం కోసం, మీకుఒక డిమాట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ అవసరం.

స్టాక్స్ యొక్క కొనుగోలు చేయబడిన యూనిట్లను నిల్వ చేయడానికి ఒక డిమాట్ అకౌంట్ సాధారణ రిపోజిటరీగా పనిచేస్తుంది, అయితే ట్రేడింగ్ అకౌంట్ షేర్ కొనుగోలు మరియు విక్రయించడానికి ప్లాట్ఫార్మ్ గా పనిచేస్తుంది. ట్రేడ్ కు ఫండింగ్ సులభతరం చేయడానికి ట్రేడింగ్ ఖాతాకు ఒక బ్యాంక్ ఖాతా అనుసంధానించబడి ఉంటుంది.

ఆన్లైన్ ట్రేడింగ్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటంటే ఏవైనా స్పష్టీకరణలు లేదా ప్రశ్నల విషయంలో పెట్టుబడిదారు ప్రత్యేకమైన కస్టమర్ కేర్ సహాయం కోరవచ్చు.