ఆన్‌లైన్ ట్రేడింగ్ వర్సెస్ ఆఫ్‌లైన్ ట్రేడింగ్

0 mins read
by Angel One

ఇంటర్నెట్ ప్రవేశపెట్టిన తర్వాత షేర్ ట్రేడింగ్ ఆన్లైన్లో నిర్వహించబడింది. దీనికి ముందు, మీ తరపున కొనుగోలు/అమ్మకం ఆర్డర్లు బ్రోకర్ల ద్వారా జరుపబడేది. బ్రోకర్తో ద్వారా జరిగే దానితో పోలిస్తే ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్, ట్రేడింగ్ను సులభతరం చేస్తుంది. బ్రోకర్లతో కలిగి ఉన్న సాంప్రదాయక ట్రేడింగ్ అకౌంట్ కన్నా, ఏంజెల్ బ్రోకింగ్ వారి ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ఏంజెల్ ఐ” కలిగి ఉండటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ట్రేడింగ్ మధ్య వ్యత్యాసాన్ని చెప్పే కొన్ని పాయింట్లు క్రింద ఇవ్వబడ్డాయి:

  • ట్రేడింగ్
  • సౌలభ్యం
  • మోసం
  • నైపుణ్యం మరియు జ్ఞానం

ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ట్రేడింగ్ అకౌంట్ల మధ్య తేడాలు

  • ట్రేడింగ్:

ఒక ఆన్లైన్ షేర్ ట్రేడింగ్ అకౌంట్తో, వినియోగదారులు వారి స్వంత ఆర్డర్లను ఉంచవచ్చు. మరోవైపు, ఒక ఆఫ్లైన్ అకౌంట్ అంటే వినియోగదారులు ఆర్డర్లు ఉంచడానికి బ్రోకర్ యొక్క సేవలను పొందవలసి ఉంటుంది. బ్రోకింగ్ ఏజెన్సీ పై ఆధారపడి ఉండే ఒక ఆఫ్లైన్ ట్రేడ్లో బ్రోకర్లకు సూచనలు ప్రత్యేకంగా ఇవ్వబడతాయి. మీరు ఒక ఆన్లైన్ అకౌంట్ ద్వారా ట్రేడ్ చేసుకోవడానికి ఎంచుకున్నప్పుడు అటువంటి ఆధారపడటం అనేది ఉండదు.

  • సౌలభ్యం:

ఒక ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఒక ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండి, వారి ఆర్డర్లను వారి ఇంటినుండి లేదా కార్యాలయాలనుండి  సౌలభ్యం మరియు సౌకర్యంతో ట్రాక్ చేసే వ్యక్తులకు ఒక మంచి ఎంపిక. ఒకవేళ వినియోగదారులు స్టాక్ బ్రోకింగ్ సైట్లను యాక్సెస్ చేయలేకపోతే లేదా ఇంటర్నెట్ కనెక్షన్ కు ప్రాప్యత లేకపోతే, వారి బ్రోకర్లతో ఫోన్లో ఆర్డర్లు ఉంచడం మంచిది.

  • మోసం:

ఆన్లైన్ షేర్ ట్రేడింగ్ వినియోగదారులకు లావాదేవీలపై పూర్తి నియంత్రణను అందిస్తుంది కాబట్టి, సంభావ్య మోసాల ప్రమాదం తొలగించబడుతుంది. అనుమతి తీసుకోకుండా బ్రోకర్లు వారి ఖాతాదారుల తరపున ట్రేడ్స్ అమలు చేసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి, ఇది ఆఫ్లైన్ ట్రేడింగ్ను ఎంచుకునే వినియోగదారులకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది.

  • నైపుణ్యం మరియు జ్ఞానం:

వినియోగదారులు ఒక ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ ఎంచుకున్నప్పుడు, వారు అత్యుత్సాహం పొందుతారు. సరైన పరిశోధన చేయకుండా మరియు స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందనే దాని గురించి మరింత అర్థం చేసుకోకుండా, వారు షేర్లను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు, దీని ఫలితంగా భారీ నష్టాలు సంభవించవచ్చు. ఆఫ్‌లైన్ ట్రేడింగ్‌తో ఇది నివారించబడుతుంది ఎందుకంటే బ్రోకర్లకు చాలా సంవత్సరాల అనుభవం మరియు జ్ఞానం ఉంటుంది, బ్రోకింగ్ సేవలు అందించేవారి ద్వారా ఖచ్చితమైన మార్గదర్శకత్వం అందుకున్నందున వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అదృష్టవశాత్తూ, ఆన్‌లైన్ ట్రేడింగ్ సేవలను అందించే సంస్థలు కూడా సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటానికి లోతైన అవగాహన పొందడానికి అకౌంట్ హోల్డర్లకు సహాయపడటానికి పరిశోధన నివేదికలు మరియు ఇతర సాంకేతిక మరియు ప్రాథమిక విశ్లేషణలకు ప్రాప్యతను అందిస్తున్నారు.