షేర్ ట్రేడింగ్ చేయడానికి పరిచయం

1 min read
by Angel One

భారతదేశంలో, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన కంపెనీలు సెబీ (ఎస్ ఇ బి ఐ) వంటి పాలకమండలిచే  నియంత్రించబడతాయి. డిపాజిటరీలు మరియు స్టాక్ ఎక్స్ఛేంజీలు అనేవి ట్రేడింగ్ చేయడానికి మీకు సహాయపడే రెండు ప్రధాన రకం సంస్థలు. డిపాజిటరీలు డీమాట్ అకౌంట్ సృష్టించడానికి సహాయపడతాయి” డీమాట్ అకౌంట్ మరియు స్టాక్ ఎక్స్ఛేంజ్లు షేర్ల వ్యాపారాన్ని సులభతరం చేస్తాయి.

స్టాక్ మార్కెట్లో నియంత్రణ చేసేవారు ఎవరు?

సెక్యూరిటీల మార్కెట్ను నియంత్రించే బాధ్యత ఈ దిగువ సంస్థల ద్వారా పంచుకోబడుతుంది:

  1. డిపార్ట్ మెంట్  ఆఫ్ ఎకనమిక్ అఫ్ఫైర్స్ (డిఇఎ)
  2. డిపార్ట్ మెంట్ ఆఫ్ కంపనీ అఫ్ఫైర్స్ (డిసిఎ)
  3. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ )
  4. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్  ఆఫ్  ఇండియా (సెబీ )

సెబీ గురించి మరింత చెప్పండి?

సెబీ  అనేది సెబీ  చట్టం 1992 యొక్క సెక్షన్ 3 కింద స్థాపించబడిన భారతదేశంలోని నియంత్రణా అధికారి. దాని పాత్రలో ఇవి ఉంటాయి

  1. సెక్యూరిటీలలో పెట్టుబడిదారుల ఆసక్తులను రక్షించడం
  2. సెక్యూరిటీల మార్కెట్ యొక్క అభివృద్ధిని ప్రోత్సహించడం
  3. సెక్యూరిటీల మార్కెట్ను నియంత్రించడం

డిపాజిటరీ మరియు డిపాజిటరీ పార్టిసిపెంట్ (డిపి) అంటే ఏమిటి?

ఒక డిపాజిటరీ అనేది నమోదు చేసుకొనబడిన డిపాజిటరీ పార్టిసిపెంట్ ద్వారా పెట్టుబడిదారుల అభ్యర్థన  మేర ఎలక్ట్రానిక్ రూపంలో సెక్యూరిటీలు (షేర్లు, డిబెంచర్లు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు మొదలైనవి) కలిగి ఉండే ఒక సంస్థ. ఇది సెక్యూరిటీలలో లావాదేవీలకు  సంబంధించిన  సేవలను కూడా అందిస్తుంది. ప్రస్తుతం రెండు డిపాజిటరీలు అంటే, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ ఎస్ డి ఎల్ ) మరియు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ (సిడిఎస్ఎల్ ) సెబీ  తో నమోదు చేయబడ్డాయి. ఒక డిపాజిటరీ పార్టిసిపెంట్ అనేది పెట్టుబడిదారులకు దాని సేవలను అందించడానికి డిపాజిటరీ ద్వారా నియమించబడిన ఏజెంట్. ఉదా: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు సెబీ తో నమోదు చేయబడిన ట్రేడింగ్ మెంబర్లు. ఏంజెల్ బ్రోకింగ్ అనేది  సిడిఎస్ఎల్ తో నమోదు చేయబడిన డిపాజిటరీ పార్టిసిపెంట్.

మీరు ఒక డిపాజిటరీ పార్టిసిపెంట్  లో దేని కోసం చూడాలి?

1. అతి తక్కువ  లావాదేవీ  ఛార్జీలు

2. డీమాట్  నుండి పూల్ కు లేదా ఏదైనా ఇతర డీమాట్ కు  కనీస బదిలీ ఛార్జీలు

3. షేర్లు పూల్  అకౌంట్లో ఉంచబడితే చార్జీలు లేకుండగా ఉండుట

4. ప్రత్యేక డిమాట్ అకౌంట్ అవసరం లేదు

5. పూల్ అకౌంట్లో ఉంచబడిన షేర్లను ట్రేడింగ్ కోసం మార్జిన్ గా ఉపయోగించడానికి అనుమతి

6. డెలివరీ తీసుకోని షేర్ల కోసం T+4 రోజులవరకు వడ్డీ లేకపోవుట, ‘T’ అంటే ట్రేడ్ చేసిన రోజు