CALCULATE YOUR SIP RETURNS

ఆర్డర్ బుక్ మరియు ట్రేడ్ బుక్ మధ్య వ్యత్యాసం

5 min readby Angel One
Share

మీరు ఇప్పుడే ఎఫ్&ఓ మరియు ఈక్విటీలలో ట్రేడింగ్ ప్రారంభించినట్లయితే లేదా ఆన్‌లైన్ ట్రేడింగ్ చేపట్టాలని ప్రణాళిక చేస్తున్నట్లయితే, మీరు ఆర్డర్ బుక్ మరియు ట్రేడ్ బుక్ వంటి నిబంధనలను విని వుంటారు. కాబట్టి, ఈ నిబంధనలు ఏంటి మరియు ఆర్డర్ బుక్ మరియు ట్రేడ్ బుక్ మధ్య వ్యత్యాసం ఏమిటి?

ఆన్లైన్ ట్రేడింగ్లో ఆర్డర్ బుక్ వర్సెస్ ట్రేడ్ బుక్ గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి.

ఆర్డర్ బుక్ వర్సెస్ ట్రేడ్ బుక్

ఏదైనా సెక్యూరిటి లేదా ఆర్థిక సాధనం కోసం కొనుగోలు/అమ్మకం యొక్క ఆర్డర్ల జాబితాను వివరించడానికి ఆర్డర్ బుక్ అనేది ఉపయోగించబడే పదం. ఈ జాబితా మాన్యువల్ లేదా ఎలక్ట్రానిక్గా ఉండవచ్చు, కానీ ఆన్లైన్ ట్రేడింగ్ ప్రపంచంలో ఇది ఇ-లిస్ట్ అని పిలువబడుతుంది. ఒక ఆర్డర్ పెట్టిన ప్రతిసారీ, ధర మరియు పరిమాణంతో సహా అన్ని ఆర్డర్ వివరాలు, ఆర్డర్ బుక్ లో నమోదు చేయబడతాయి. ప్రతి ఆర్డర్ కు కూడా ఒక నిర్దిష్ట సంఖ్యను కేటాయించబడుతుంది, తద్వారా భవిష్యత్తులో దానిని చూడవచ్చు. ఆర్డర్ బుక్ నిజ సమయం నవీకరణలను పొందుతుంది. ఒక ఆర్డర్ యొక్క స్థితి 'అభ్యర్థించబడినది', 'వరుసలో వుంది', 'ఆర్డర్ చేయబడింది', ‘అమలు చేయబడింది’, 'పాక్షిక అమలు చేయబడింది', 'ముగిసింది', 'రద్దు చేయబడింది' లేదా 'తిరస్కరించబడింది' అని ఉండవచ్చు.

ఆర్డర్ అమలు అయినప్పుడు, అది ట్రేడ్ బుక్ లో ప్రవేశిస్తుంది. ఒక ట్రేడ్ సంఖ్య కేటాయించబడును మరియు అమలు యొక్క స్థితి కూడా ట్రేడ్ బుక్ లో జాబితా చేయబడును. ట్రేడ్ బుక్ కూడా ఆర్డర్ బుక్ లాగా ఈక్విటీ మరియు ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌లో ఉపయోగించబడుతుంది.

ఆర్డర్ బుక్ మరియు ట్రేడ్ బుక్ మధ్య ఉన్న ప్రాధమిక వ్యత్యాసం ఏమిటంటే, ఆర్డర్ బుక్ అనేది ఉంచబడిన అన్ని ఆర్డర్ల ప్రతిబింబం, అయితే ట్రేడ్ బుక్ వాస్తవంగా అమలు చేయబడిన ట్రేడ్స్ యొక్క ప్రతిబింబం.

ఆన్ లైన్ ట్రేడింగ్ లో ఆర్డర్ బుక్ వర్సెస్ ట్రేడ్ బుక్ కు సంబంధించిన మరిన్ని వాస్తవాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

ఆర్డర్ బుక్ ఆర్డర్ యొక్క స్థితిని చూపించగలదు, అనగా, సవరణ/రద్దు/పెండింగ్ లేదా అమలు చేయబడిన  ఆర్డర్లు, ట్రేడ్ బుక్ ఒక ట్రేడర్ అమలు చేసిన ఆర్డర్ యొక్క వివరాలను మాత్రమే చూపుతాయి. పెండింగ్ లేదా రద్దు చేసిన ఆర్డర్‌లు ట్రేడర్ బుక్ లో చోటుచేసుకోవు.

ఒక మార్కెట్ ఆర్డర్ అనేది వాస్తవ సమయంలో మరియు ప్రస్తుత మార్కెట్ ధర వద్ద అమలు చేయబడిన ఒక కొనుగోలు/అమ్మకం ఆర్డర్. ఇది సులువైన ఆర్డర్లలో ఒకటి, మరియు  ధర కన్నా ఆర్డర్ అమలు అవ్వటం ముఖ్యం అని అనుకునే పరిస్థితులలో ఇది ఉపయోగిస్తారు. కాబట్టి, అటువంటి ఆర్డర్ ఉంచినప్పుడు, అది ఆర్డర్ బుక్లో రికార్డ్ చేయబడుతుంది మరియు ట్రేడ్ బుక్ లో కూడా అతివేగంగా రికార్డ్ చేయబడుతుంది.

పరిమితి ఆర్డర్లు అనేవి ట్రేడర్ ఒక నిర్దిష్ట ధర వద్ద ఆస్తిని కొనడానికి లేదా అమ్మడానికి ఆసక్తి చూపేవి. కాబట్టి, పరిమిత ఆర్డర్లు సాధారణంగా తక్షణ అమలును చూడవు. ఒకవేళ పాక్షిక అమలు ఉంటే, ట్రేడ్ బుక్ అమలు యొక్క పరిధిని నమోదు చేస్తుంది. పాక్షిక అమలును పాక్షిక పూరకం అని పిలుస్తారు, ఇందులో కొన్ని ట్రేడ్ ఆర్డర్లు నిర్దిష్ట/కోరుకున్న ధర వద్ద నింపబడుతుంది. అయితే, పరిమిత ఆర్డర్, అది అమలు చేయబడనప్పుడు, ట్రేడ్ బుక్ లో ప్రతిబింబించబడదు. అది మరొక ఆర్డర్ బుక్ వర్సెస్ ట్రేడ్ బుక్

ఒక స్టాప్ లేదా స్టాప్ లాస్ ఆర్డర్ అనేది ఒక ముందు ఏర్పాటుచేసిన ధర సాధించబడినప్పుడు మాత్రమే మీరు కొనే లేదా అమ్మే ఒక ఆర్డర్. ఆ నిర్దిష్ట ధరను చేరుకున్న తర్వాత, స్టాప్ ఆర్డర్ ప్రభావవంతంగా ఒక మార్కెట్ ఆర్డర్గా మారుతుంది. ఆ సమయం వరకు ఒక నిర్దిష్ట ధర వచ్చే వరకు, ఆ  ఆర్డర్ ట్రేడ్ బుక్ లో  చూపబడవు.

- ట్రేడ్ బుక్ లో లింక్‌లు కూడా ఉన్నాయి కాబట్టి మీరు అమలు చేసిన ప్రతి ఆర్డర్‌కు నగదు / సెక్యూరిటీల సెటిల్మెంట్ ను నిర్వహించవచ్చు. ట్రేడ్ బుక్ లో ఒక రోజులో  అమలు చేయబడిన ప్రతీ ఆర్డర్ యొక్క రికార్డును కలిగి ఉండటం మాత్రమే కాకుండా, ఇది మీకు కొత్త ఆర్డర్లు జోడించడానికి లేదా బుక్ నుండి ఒక ట్రేడ్ ను మూసివేసే అవకాశం కూడా ఇస్తుంది.

ఆర్డర్లు, మరియు వాటిని ట్రేడింగ్ లో ఎలా ఉపయోగించవచ్చు అనే దానిని ఆర్డర్ బుక్ వర్సెస్ ట్రేడ్ బుక్ ను చూసి అర్థం చేసుకోవచ్చు. వెంటనే అమలు చేయబడటం మరియు ట్రేడ్ బుక్ లో ప్రతిబింబించడంవలన ఒక ప్రారంభికుడు మార్కెట్ ఆర్డర్లను సులభం అనుకోవచ్చు. ఒక మరింత తీవ్రమైన ఆన్ లైన్ ట్రేడర్  పరిమితి ఆర్డర్లలో విలువను కనుగొనవచ్చు, మరియు ఇవి అత్యవసరంగా ట్రేడ్ బుక్ లో చూపబడవు.

సారాంశం

ముగింపులో, ఆన్‌లైన్ ట్రేడింగ్‌ను మరింత తీవ్రంగా పరిగణించాలనుకునే ఎవరికైనా ఆర్డర్ బుక్ మరియు ట్రేడ్ బుక్ మధ్య వ్యత్యాసం తప్పనిసరి అవగాహన. ట్రేడింగ్ ఆర్డర్‌ల గురించి మరింత తెలుసుకోవడం మొదట చాలా కష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే వాటిలో చాలా రకాలు ఉన్నాయి. మీరు ఏంజెల్ బ్రోకింగ్‌తో డీమాట్ ట్రేడింగ్ అకౌంట్ తెరిచి, ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో ఆర్డర్ బుక్ వర్సెస్ ట్రేడ్ బుక్ గురించి మరియు వాటిలో ప్రతి దాని గురించి మంచి అవగాహన పొందవచ్చు. మీరు చాలా ప్లాట్ఫారంలలో సున్నితంగా ట్రేడ్ చేయగలరు మరియు పరిశోధనకు ప్రాప్యత పొందగలరు.

Open Free Demat Account!
Join our 3 Cr+ happy customers