పరిష్కార ఆధారిత (సొల్యూషన్-ఓరియెంటెడ్) పథకాలు అంటే ఏమిటి?

పదవీ విరమణ లేదా పిల్లల విద్య వంటి నిర్దిష్ట లక్ష్యాల కోసం రూపొందించబడిన సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్‌లు, ఇవి పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉన్న పెట్టుబడి పెట్టడానికి ఒక నిర్మాణాత్మక మార్గాన్ని అందజేస్తాయి. మరింత తెలుసుకోవడానికి చదవండి.

మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి ఉంటే, ఈక్విటీ, డెట్ మరియు హైబ్రిడ్ ఫండ్స్ వంటి అందుబాటులో ఉన్న రకాల గురించి మీకు తెలిసి ఉండవచ్చు. అయితే మీరు ఇంకా సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌ని గురించి తెలుసుకున్నారా? అయితే, ఈ భాగం ప్రత్యేకంగా మీ కోసమే.

రెగ్యులేటరీ బాడీ, SEBI, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (AMC)లు అందించగల రెండు రకాల సొల్యూషన్-ఓరియెంటెడ్ ఫండ్‌లను గురించి ఇలా వివరిస్తోంది: పదవీ విరమణ మరియు పిల్లల నిధులు. పేర్లు సూచించినట్లుగా, ఇవి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి, ఇవి నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాలకు ‘పరిష్కారాలు’ అందజేస్తాయి.

ఈ పథకాలు పెట్టుబడిదారులకు తమ నిర్దిష్ట జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి పెట్టుబడిని ఒక లక్ష్యంగా చేసుకో గల పరిష్కారాన్ని అందిస్తాయి. ఈ వ్యాసం సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి అనే విషయాన్ని, ఇంకా సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క లోతుపాతులను గురించి వివరిస్తుంది.

సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

SEBI ఇటీవల సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అనే కొత్త రకం మ్యూచువల్ ఫండ్‌ను విడుదల చేసింది. ఈ వినూత్న వర్గం మీ పిల్లల విద్య లేదా వివాహానికి నిధులు సమకూర్చడం లేదా మిమ్మల్ని మీ పదవీ విరమణ కోసం సిద్ధం చేయడం వంటి నిర్దిష్ట భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను మీకు అనుకూలంగా మలచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

ఈ సిద్ధాంతం కొంచెం కొత్తగా అనిపించినప్పటికీ, ఇప్పుడు ఈ కేటగిరీ కింద వర్గీకరించబడే వాటిలో పెట్టుబడి పెట్టే ఎంపికలు గతంలో ఈక్విటీ లేదా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ పథకాల ద్వారా అందుబాటులో ఉండేవి. అయితే, ఈ ప్రత్యేక వర్గం ఫండ్ మేనేజర్‌లకు అధిక రాబడిని సాధించడానికి ప్రత్యేక వ్యూహాలను ఉపయోగించుకునే అవకాశాన్ని కలగజేస్తుంది.

సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌తో, మీరు మీ అవసరాలను బట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మరియు డెట్ ఫండ్స్ మధ్య మారవచ్చు. ఫండ్ మేనేజర్‌లు మీ వయస్సు ఆధారంగా వారి వ్యూహాలను సర్దుబాటు చేయవచ్చు, మీకు బాగా సరిపోయేలా ఉండే పెట్టుబడి వ్యూహాలతో ఒక మంచి అనుభవాన్ని అందజేస్తారు. ఈ ఫండ్‌లలో కొన్ని పన్ను ఆదా చేసుకోవడానికి తగిన ప్రోత్సాహకాలను కూడా అందిస్తాయి. ఈ ఫండ్‌లు దీర్ఘకాలం కోసం రూపొందించబడ్డాయి మరియు 5 సంవత్సరాల తప్పనిసరి లాక్-ఇన్ వ్యవధితో ఉంటాయని గమనించడం ముఖ్యం.

ఈ కొత్త విధానం పెట్టుబడి పెట్టడానికి ఒక నిర్మాణాత్మకమైన మార్గాన్ని అందిజేస్తుంది, మీ పెట్టుబడులు మీ జీవితంలోని ముఖ్యమైన మైలురాళ్లకు దగ్గరగా ఉండేలా చూస్తాయి. మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తున్నా లేదా మీ స్వంత పదవీ విరమణ కోసం ప్లాన్ చేస్తున్నా, సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్‌లు ఆ ఆర్థిక లక్ష్యాలను మరింత ఖచ్చితత్వంతో చేరుకోవడానికి ఒక వ్యూహాత్మక మార్గాన్ని అందజేస్తాయి.

పరిష్కార-ఆధారిత మ్యూచువల్ ఫండ్‌లలో రకాలు

భారతదేశంలో, నిర్దిష్ట పెట్టుబడి లక్ష్యాలను చేరుకోవడానికి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలచే రూపొందించబడిన వివిధ పరిష్కార-ఆధారిత పథకాలను మీరు కనుగొంటారు. ఈ సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్‌లు వేర్వేరు రూపాల్లో వస్తాయి, ఒక్కొక్కటీ ఒక్కొక ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తాయి.

 1. రిటైర్మెంట్ ప్లానింగ్ మ్యూచువల్ ఫండ్స్

అనేక అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికల ద్వారా పదవీ విరమణ ప్రణాళిక మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ విధానం మీరు ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఈక్విటీ లేదా డెట్ సాధనాల్లో మీ పెట్టుబడులను కేటాయించడానికి మీకు అవకాశాన్ని కలిగిస్తుంది.

ఈ ఫండ్‌ల యొక్క ఒక ముఖ్య లక్షణం వాటికి గల తప్పనిసరి ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్, ఇది ముందస్తు ఉపసంహరణలను నిషేధిస్తుంది. ఈ కఠినమైన నియమం మీకు లాభాలు కలిగే అవకాశాలను పెంచుతూ, ఎక్కువ కాల అవధి వరకు డబ్బును ఆదా చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.

 1. చిల్డ్రన్స్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్

SEBI చే నియంత్రించబడిన, ఈ మ్యూచువల్ ఫండ్‌లు తరచుగా తాము పెట్టుబడి పెట్టిన మూలధనాన్ని పెంచుకునే లక్ష్యంతో ఉన్న వ్యక్తులచే ఎంపిక చేయబడతాయి. ఈ నిధుల నుండి వచ్చే ఆదాయాలు మీ పిల్లల ఉన్నత విద్య కొరకు ఖర్చులు, వివాహ ఖర్చులు లేదా ఇతర ముఖ్యమైన ఆర్థిక అవసరాలు వంటి వివిధ భవిష్యత్తు ఖర్చులకు మద్దతుగా ఉంటాయి.

సొల్యూషన్-ఓరియెంటెడ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు

సొల్యూషన్-ఓరియెంటెడ్ స్కీమ్‌లు వారి ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలనుకునే వ్యక్తుల కోసం ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికలను కలిగి ఉండి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఈ పథకాలు మీ కోసం ఎలా పని చేస్తాయో ఇక్కడ ఇవ్వబడింది:

 1. ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లానింగ్: సొల్యూషన్-ఓరియెంటెడ్ స్కీమ్‌లు ముఖ్యమైన భవిష్యత్తు ఖర్చుల కోసం ఆర్థికంగా ప్లాన్ చేసుకోవడానికి సురక్షితమైన ఒక మార్గంగా రూపొందించబడ్డాయి. మీరు మీ పదవీ విరమణ కోసం నమ్మకమైన ఫండ్‌ను ఏర్పరుచుకోవాలని లేదా మీ పిల్లల ఉన్నత విద్య లేదా పెళ్లి కోసం ఆదా చేయాలని చూస్తున్నట్లయితే, కొద్ది కొద్దిగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా గాని లేదా ఈ స్కీమ్‌లలో ఏకమొత్తం డిపాజిట్ల ద్వారా పెట్టుబడి పెట్టడం వలన గాని మీరు గణనీయమైన రాబడిని పొందడానికి ఇవి సహాయపడవచ్చు.
 2. లాక్-ఇన్ పీరియడ్ యొక్క ప్రయోజనం: ఐదేళ్ల సాధారణ లాక్-ఇన్ పీరియడ్‌తో, సొల్యూషన్-ఓరియెంటెడ్ స్కీమ్‌లు మీ పెట్టుబడిని స్వల్పకాలిక స్టాక్ మార్కెట్ అస్థిరతను అధిగమించడానికి అనుమతిస్తాయి, దీర్ఘకాలంలో అధిక రాబడికి మార్గాన్ని సుగమం చేస్తాయి. ఈ ఫీచర్, మార్కెట్ యొక్క హెచ్చు తగ్గులకు తగినట్లుగా మీ పెట్టుబడిని స్థిరీకరించడంలో సహాయపడుతుంది కాబట్టి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
 3. డెట్ మరియు ఈక్విటీ స్కీమ్‌లను ఆఫర్ చేస్తుంది: మీరు సొల్యూషన్-ఓరియెంటెడ్ స్కీమ్‌ల విభాగంలో ప్రధానంగా ఈక్విటీ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే ఫండ్‌లను ఎంచుకుంటే, మీరు గణనీయమైన పెట్టుబడి వృద్ధిని పొందవచ్చు. మీ పెట్టుబడి యొక్క పెరుగుదలకు తప్పనిసరి హోల్డింగ్ వ్యవధి నుండి చెప్పుకో తగ్గ ప్రయోజనాన్ని పొందవచ్చు, ఇది మీ పోర్ట్‌ఫోలియోను ప్రతికూలంగా ప్రభావితం చేసే స్వల్పకాలిక మార్కెట్ ఒడిదుడుకులను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. అదేవిధంగా, రుణాల పరిష్కార-ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ ఫ్రేమ్‌వర్క్ అనేది మీకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఐదు సంవత్సరాల కనీస అవధిలో వచ్చే చక్ర వడ్డీ యొక్క శక్తికి ధన్యవాదాలు, రుణ-ఆధారిత పరిష్కారాలు మీకు మీరు కలిగి ఉన్న ఏవైనా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను పూర్తి చేయడంలో సహాయపడటం ద్వారా ఆకర్షణీయమైన రాబడిని అందిస్తాయి.

పరిష్కార-ఆధారిత పథకాల పరిమితులు

మీరు మీ డబ్బును సొల్యూషన్ ఓరియెంటెడ్ స్కీమ్‌లలో పెట్టాలని నిర్ణయించుకున్నరు అంటే, అది మీ జీవితంలోని పెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక మార్గాన్ని ఎంచుకున్నారు అని అర్ధం. అయితే, ప్రతి మార్గంలోనూ కొన్ని ఎగుడుదిగుడులు ఉంటాయి కాబట్టి మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు వీటి గురించి తెలుసుకోవడం ముఖ్యం. సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌తో మీరు ఎదుర్కోవలసిన పరిస్థితులను గురించి ఇక్కడ ఒక సరళీకృతమైన వివరణ ఇవ్వబడింది.

 1. నిష్క్రియాత్మకంగా ఉండడం (పాసివ్ అప్రోచ్): అనేక పరిష్కార ఆధారిత పథకాలు మార్కెట్‌ను అధిగమించడానికి ప్రయత్నించే బదులుగా ఆ మార్కెట్‌నే అనుసరిస్తాయి. దీనర్థం ఏమిటంటే అవి తరచుగా నిర్దిష్ట మార్కెట్ ఇండెక్స్ యొక్క పనితీరును పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తాయి, ఇవి మార్కెట్‌లోని పెద్ద ఆటగాళ్లపై ఎక్కువగా దృష్టిని పెడతాయి.
 2. అవకాశాలు తప్పి పోవడం: ఈ ఫండ్‌లు సాధారణంగా బాగా స్థిరపడిన కంపెనీలపై దృష్టిని సారిస్తాయి కాబట్టి, మీరు మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉన్న చిన్న, అంతగా తెలియని కంపెనీల్లో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కోల్పోవచ్చు.
 3. ఐదేళ్ల లాక్-ఇన్: తరచుగా, మీరు సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, మీ డబ్బు ఐదు సంవత్సరాల పాటు బంధించబడి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫండ్‌లు సాధారణంగా ఈ వ్యవధి ముగిసేలోపు మీ డబ్బును తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతించవు.
 4. మార్కెట్ సెన్సిటివిటీ: మార్కెట్ ట్రెండ్‌ల కారణంగా మీ పెట్టుబడి విలువ పెరగవచ్చు లేక తగ్గవచ్చు, పరిష్కార ఆధారిత పథకాలతో ఇలాంటి వాటికి మీరు సిద్ధ పడి ఉండాలి.

సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌పై పన్ను: 

మీరు సొల్యూషన్-ఓరియెంటెడ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టినప్పుడు, వాటిపై పన్ను ఏ విధంగా విధించబడుతుందో అర్థం చేసుకోవడం చాలా అవసరం. సరళమైన నిబంధనలు మరియు ప్రత్యక్ష విధానాన్ని ఉపయోగించి దీని అర్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

ఈక్విటీ సొల్యూషన్-ఓరియెంటెడ్ స్కీమ్స్ టాక్సేషన్

 1. స్వల్పకాలిక మూలధన లాభాలు: మీరు మీ ఈక్విటీ సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్‌లను ఒక సంవత్సరం దాటకముందే విక్రయిస్తే, మీరు సంపాదించే లాభంపై 15% పన్ను చెల్లించాలి.
 2. దీర్ఘకాలిక మూలధన లాభాలు: మీ నిధులను ఒక సంవత్సరం పాటు ఉంచిన తర్వాత వాటిని విక్రయిస్తున్నారా? లాభాలపై 10% పన్ను విధించబడుతుంది. అయితే, ప్రభుత్వం ఇటీవల చేసిన సవరణకు ధన్యవాదాలు, 1 లక్ష రూపాయల లాభం మీద పన్ను ఉండదు.

రుణ పరిష్కారం-ఆధారిత పథకాల పన్ను

 1. స్వల్పకాలిక మూలధన లాభాలు: రుణ పరిష్కార-ఆధారిత పథకాలలో, మీరు ఒక సంవత్సరంలోపు విక్రయిస్తే, లాభం మీ ఆదాయానికి జోడించబడుతుంది మరియు మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం మీకు పన్ను విధించబడుతుంది.
 2. దీర్ఘకాలిక మూలధన లాభాలు: మీరు మీ పెట్టుబడిని ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంచినట్లయితే, ఇండెక్సేషన్ తర్వాత లాభంపై 20% పన్ను విధించబడుతుంది. ద్రవ్యోల్బణం కోసం కొనుగోలు ధరను సర్దుబాటు చేయడంలో ఇండెక్సేషన్ అనేది సహాయపడుతుంది, ఇది మీ పన్ను విధించదగిన లాభాలను తగ్గిస్తుంది.

అయినప్పటికీ, ఈ ఫండ్స్ నుండి మీరు పొందే నియమిత కాల డివిడెండ్‌లు ఎలాంటి పన్నును ఆకర్షించవు. ఇది కాలానుగుణంగా పన్ను రహిత ఆదాయాన్ని సంపాదించడానికి వాటిని ఒక ఆకర్షణీయమైన ఎంపికగా చేస్తుంది

సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్‌లను ఎవరు పరిగణనలోకి తీసుకోవాలి?

మీరు సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు, మీకు తగినంత లిక్విడ్ అసెట్స్‌తో దృఢమైన ఆర్థిక పునాది ఉందని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఈ ఫండ్‌లు 5-సంవత్సరాల మార్క్‌ను తాకడానికి ముందు పాక్షిక ఉపసంహరణల ఎంపికను అందించవని గమనించడం ముఖ్యం. అందువల్ల, ఈ ఫండ్‌ల వృద్ధి సామర్థ్యాన్ని నిజంగా ప్రభావితం చేయడానికి, మీరు కాలానికి మించి విస్తరించే ఈ పెట్టుబడి హోరైజన్‌ను లక్ష్యంగా చేసుకోవాలి.

మీకు గల స్వల్పకాలిక లక్ష్యాల దృష్ట్యా, అందుకు బదులుగా మీరు రుణ ఆధారిత ఫండ్‌లను పరిశీలించాలనుకోవచ్చు. మరోవైపు, మీరు సొల్యూషన్-ఓరియెంటెడ్ స్కీమ్‌లను పరిశీలిస్తున్నట్లయితే, ఆలస్యం చెయ్యకుండా త్వరగా పెట్టుబడి పెట్టడం మంచిది. ముందుగానే ప్రారంభించడం వలన మీ పెట్టుబడి పరిపక్వత చెందడానికి సమయం ఎక్కువ ఊంటుంది, ఎక్కువ కాలం పాటు మరింత సంతృప్తికరమైన రాబడిని అందిస్తుంది. ఈ వ్యూహం చాలా ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి కాల అవధి సాధారణంగా ఈ నిధులతో ఉండే అనుబంధిత నష్టాలను తగ్గిస్తుంది.

ముగింపు

సొల్యూషన్-ఓరియెంటెడ్ స్కీమ్‌లు తప్పనిసరిగా ఐదేళ్ల లాక్-ఇన్‌తో వచ్చే క్లోజ్డ్-ఎండ్ ఫండ్‌లు, మీ పెట్టుబడి లక్ష్యాలు ఎక్కువ కాల అవధితో పాటు నిర్దిష్ట లక్ష్యాలను కూడా కలిగి ఉంటే అవి మీకు అనువుగా ఉంటాయి. సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్‌లను ఎంచుకోవడం ద్వారా, మీరు పన్ను ఆదాకు గల అవకాశం నుండి ప్రయోజనం పొందడమే కాకుండా, పొడిగించిన పెట్టుబడి కాల వ్యవధి కారణంగా కూడా ఎక్కువ వృద్ధిని చూడవచ్చు. అయితే, అన్ని పెట్టుబడులు మార్కెట్ నష్టాలను కలిగి ఉంటాయని గుర్తుంచుకోండి.

ఖచ్చితత్వంతో మీరు అదుకోవాలంకుంటున్న మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజే ఏంజెల్ వన్‌తో మీ ఉచిత డీమ్యాట్ ఖాతాను తెరవండి మరియు పరిష్కార-ఆధారిత నిధులతో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి

FAQs

సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

పరిష్కార-ఆధారిత మ్యూచువల్ ఫండ్‌లు పదవీ విరమణ లేదా పిల్లల విద్య వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం రూపొందించబడిన ప్రత్యేక పెట్టుబడి ఎంపికలు. ఇవి ఐదు సంవత్సరాల స్థిర లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటాయి మరియు నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాలను సాధించే లక్ష్యంతో ఉఉంటాయి.

సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌తో అనుబంధించబడిన పన్ను ప్రయోజనాలు ఏవైనా ఉన్నాయా?

అవును, సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వలన కొన్ని షరతులతో కూడిన పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. మీ పెట్టుబడికి వర్తించే నిర్దిష్ట ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి పన్ను సలహాదారుని సంప్రదించడం మంచిది.

సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్‌లు ఉంటాయి?

ఫైనాన్షియల్ మార్కెట్‌లోని ఇతర పెట్టుబడులలాగానే, పరిష్కార-ఆధారిత మ్యూచువల్ ఫండ్‌లు కూడా మార్కెట్ అస్థిరత కారణంగా నష్టాలను కలిగి ఉంటాయి. ఈ ఫండ్స్ పనితీరు మార్కెట్ పరిస్థితులలోని మార్పులకు లోబడి ఉంటుంది.

నేను సొల్యూషన్-ఓరియెంటెడ్ స్కీమ్‌లలో పెట్టుబడిని ఎలా ప్రారంభించగలను?

సొల్యూషన్-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించడానికి, మీరు ఏంజెల్ వన్ వంటి బ్రోకరేజ్ సంస్థతో డీమ్యాట్ ఖాతాను తెరవాలి. మీ ఖాతాను సెటప్ చేసిన తర్వాత, మీరు మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పరిష్కార-ఆధారిత ఫండ్‌ను ఎంచుకోవచ్చు మరియు పెట్టుబడిని ప్రారంభించవచ్చు.