ఒక బ్యాంక్ అకౌంట్ పనిచేసే విధంగానే, ఒక అకౌంట్  నుండి మరొక అకౌంట్‍కు  షేర్లను బదిలీ చేయడానికి ఒక డిమాట్ అకౌంట్‍ను  ఉపయోగించవచ్చు. ఆ ప్రక్రియలో, షేర్ల యాజమాన్యం ఏ విధంగానూ ప్రభావితం కానందున, అది ఒక లావాదేవీ యొక్క అవకాశాన్ని తొలగిస్తుంది మరియు దాని వలన, బదిలీ ఫలితంగా ఏవైనా పన్ను ప్రభావాలు ఎదుర్కోవలసిన అవసరం   ఉండదు. కానీ, ఒక అకౌంట్  నుండి మరొక అకౌంట్‍కు  వారి షేర్స్ బదిలీ చేయవలసిన కొన్ని పరిస్థితులు ఉంటాయి.

ఒక డిమాట్ అకౌంట్  నుండి మరొక డిమాట్ కు షేర్ల బదిలీకి వెనుక ఉన్న అత్యంత సాధారణ కారణం ఒక బ్రోకర్ నుండి వేరొకరికి మారడం. అతని/ఆమె ప్రస్తుత బ్రోకర్ నుండి ఒక అకౌంట్ హోల్డర్ యొక్క అవసరాలు మారితే, అందుకు ఒక కొత్త బ్రోకర్ అవసరం మరియు అందువల్ల ఒక డిమాట్ అకౌంట్ తెరవడం కూడా. అటువంటి సందర్భంలో పాత డిమాట్ అకౌంట్ల నుండి కొత్తదానికి షేర్ల బదిలీ కూడా అవసరమవుతుంది. ఒక బహుళ డీమాట్ అకౌంట్ లను నిర్వహిస్తున్న వ్యక్తి తన అన్ని అకౌంట్లను ఒకే ఫంక్షనల్ అకౌంట్ లోకి విలీనం చేయడానికి ఎంచుకున్న పరిస్థితిలో, పాత అకౌంట్ (ల) నుండి కొత్త దానికి(వాటికి) షేర్ల బదిలీ అవసరం.

ఒక డిమాట్ అకౌంట్ నుండి మరొక డిమాట్ కు షేర్లను ఎలా బదిలీ చేయాలి?

ఒక డిమాట్ అకౌంట్  నుండి మరొక డిమాట్ కు షేర్ల బదిలీ రెండు మార్గాల్లో ఒకదాని ద్వారా చేయవచ్చు, మాన్యువల్ బదిలీ లేదా ఆన్లైన్ బదిలీ ద్వారా.

షేర్ల మాన్యువల్/ఆఫ్‌లైన్ బదిలీ

ఒక డిమాట్ అకౌంట్  నుండి మరొక డిమాట్ కు షేర్ల మాన్యువల్ బదిలీ విషయంలో, కొన్ని ప్రత్యేక నిర్దిష్టతల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మొదట, బదిలీ చేయబడుతున్న షేర్లు డిపాజిటరీ వ్యవస్థలలో నిర్వహించబడుతున్నాయని మరియు నిలిపి ఉంచబడి ఉన్నాయని తెలుసుకోవడం ముఖ్యం. అకౌంట్ హోల్డర్ల షేర్లను నిలిపి ఉంచడానికి అధికారం కలిగిన రెండు డిపాజిటరీలు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్‍డిఎల్) మరియు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సిడిఎస్ఎల్).

షేర్ల బదిలీ విధానం అనేది మీ బ్రోకర్ ఏ డిపాజిటరీకి అనుబంధంగా ఉన్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. అకౌంట్ హోల్డర్ యొక్క ప్రస్తుత మరియు కొత్త బ్రోకర్లు ఇద్దరూ అదే డిపాజిటరీతో అనుబంధంగా ఉంటే, షేర్ల యొక్క ఇంట్రా-డిపాజిటరీ బదిలీ (లేదా ఆఫ్-మార్కెట్ బదిలీ) ఉంటుంది. అయితే, ఇప్పటికే ఉన్న మరియు కొత్త బ్రోకర్లు వివిధ డిపాజిటరీలతో అనుబంధంగా  ఉంటే, షేర్ల యొక్క ఇంటర్-డిపాజిటరీ బదిలీ ఉంటుంది.

ఒక ఇంట్రా-డిపాజిటరీ బదిలీ లేదా ఆఫ్-మార్కెట్ బదిలీ చేయబడినప్పుడు, అకౌంట్ హోల్డర్ తమ డిపాజిటరీ పార్టిసిపెంట్ (డిపి) ద్వారా అందించబడే డెబిట్ ఇన్స్ట్రక్షన్ స్లిప్ లేదా డిఐఎస్ బుక్లెట్ ను ఉపయోగించాలి. ఇంట్రా-డిపాజిటరీ బదిలీ అయితే, అనుసరించాల్సిన దశలు ఇవి:

దశ 1 – బదిలీ చేయవలసిన షేర్ల పేర్లను రికార్డ్ చేయండి. అదనంగా, ఐఎస్ఐఎన్ నంబర్ రికార్డ్ చేయబడాలి, ఇందులో ఐఎస్ఐఎన్ లేదా అంతర్జాతీయ సెక్యూరిటీల గుర్తింపు నంబర్ అనేది ఫండ్స్, ఈక్విటీలు, బాండ్లు, స్టాక్స్, అప్పులు వంటి మరెన్నో సెక్యూరిటీలను గుర్తించడానికి అవసరమైన 12-అంకెల కోడ్. లావాదేవీలు దాని ఆధారంగా ప్రక్రియ చేయబడతాయి కాబట్టి ఐఎస్ఐఎన్ సంఖ్యను సరిగ్గా నమోదు చేయడం అవసరం.

దశ 2 – తదుపరి దశ కోసం, టార్గెట్ క్లయింట్ ఐడి రికార్డ్ చేయబడాలి. ఇది క్లయింట్ యొక్క ఐడి మరియు డిపి యొక్క ఐడి కలిగి ఉన్న 16-అక్షరాల కోడ్.

దశ 3 – ఇది బదిలీ పద్ధతి ఎంపికను కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఒక ముఖ్యమైన దశ. బదిలీ విధానం ఒక ఇంట్రా-డిపాజిటరీ లేదా ఆఫ్-మార్కెట్ బదిలీ అయితే, అప్పుడు “ఆఫ్-మార్కెట్ ట్రాన్స్ఫర్” అనే శీర్షికలో ఉన్న కాలమ్ ని ఎంచుకోవాలి. బదిలీ విధానం ఇంటర్-డిపాజిటరీ అయితే, అప్పుడు “ఇంటర్-డిపాజిటరీ” కాలమ్ ని ఎంచుకోవాలి. ఈ ఎంపికను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.

డిఐఎస్ స్లిప్ పూరించబడిన తర్వాత, తీసుకోవలసిన కొన్ని తుది దశలు ఉన్నాయి:

దశ 4 – నింపబడిన మరియు సంతకం చేయబడిన డిఐఎస్ స్లిప్ అకౌంట్ హోల్డర్ యొక్క ప్రస్తుత బ్రోకర్ కు సమర్పించబడాలి.

దశ 5 – డిఐఎస్ స్లిప్ కోసం రసీదు బ్రోకర్ నుండి సేకరించబడాలి.

ప్రస్తుత బ్రోకర్ కు పాత డిమాట్ అకౌంట్  నుండి అవసరమైన షేర్లను బదిలీ చేయడానికి  మరియు కొత్త బ్రోకర్ కొత్త అకౌంట్ లో షేర్లను అందుకోవడానికి 3-5 వ్యాపార రోజుల మధ్య పడుతుంది. ప్రస్తుత బ్రోకర్ ఈ విధానం కోసం కొన్ని ఛార్జీలు వర్తింపజేయవచ్చు, మరియు రేట్లు ఒక బ్రోకర్ నుండి మరొక బ్రోకర్ కు మారుతూ ఉంటాయి.

షేర్ల ఆన్లైన్ బదిలీ

షేర్ల యొక్క ఆన్లైన్ బదిలీ పరిగణించబడుతున్నట్లయితే, దీనిని కేవలం సిడిఎస్ఎల్ ఉపయోగించి చేయవచ్చు. అకౌంట్ హోల్డర్ సిడిఎస్ఎల్ వెబ్సైట్ సందర్శించి తమని తాము రిజిస్టర్ చేసుకోవాలి. అది పూర్తయిన తర్వాత, ఫారం డిపికి సమర్పించబడాలి. డిపి ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, అకౌంట్ హోల్డర్ తమ స్వంత భవిష్యత్తు బదిలీలు చేయడానికి అనుమతించబడతారు. అనుసరించవలసిన దశలు ఇవి:

దశ 1 – సిడిఎస్ఎల్ వెబ్‌సైట్ యాక్సెస్ చేయబడిన తర్వాత, “ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోండి” లింక్ ఎంచుకోవాలి.

దశ 2 – అవసరమైన వివరాలతో ఫారం నింపడం తదుపరి దశ.

దశ 3 – ఫారం నింపబడిన తర్వాత, “ప్రింట్ ఫారం” ఎంపికను ఎంచుకోవలసి ఉంటుంది. ఫారం ముద్రించబడిన తర్వాత, అది అకౌంట్ హోల్డర్ డిపికి బదిలీ చేయబడుతుంది.

దశ 4 – డిపి ఫారం యొక్క ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, అకౌంట్ హోల్డర్ ఇమెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ పంపబడుతుంది.

దశ 5 – అందించిన పాస్వర్డ్ ఉపయోగించి, అకౌంట్ హోల్డర్ లాగిన్ అవవచ్చు మరియు అవసరమైన షేర్లను బదిలీ చేయడం ప్రారంభించవచ్చు.

మీ ట్రేడింగ్ అకౌంట్‍కు  ఫండ్స్ ఎలా బదిలీ చేయాలి?

ట్రేడింగ్ ప్రారంభించడానికి, తీసుకోవలసిన మొదటి దశ ఒక ట్రేడింగ్ అకౌంట్ ను సృష్టించడం. ఇది ఎందుకంటే వ్యాపారం కోసం మూలధనంగా పనిచేసే నిధులను ట్రేడింగ్ అకౌంట్ కలిగి ఉంటుంది కాబట్టి. ఒక అకౌంట్ లోకి డబ్బును బదిలీ చేయడానికి ప్రాథమికంగా మూడు వేర్వేరు మార్గాలు ఉన్నాయి. పేమెంట్ గేట్వే, ఎన్ఇఎఫ్‍టి/ ఆర్‍టిజిఎస్ సదుపాయం లేదా బ్రోకర్ కు చెక్ / డిడి ద్వారా చెల్లించే ఎంపికను ఎంచుకోవచ్చు.

పేమెంట్ గేట్వే ద్వారా ఫండ్స్ యొక్క తక్షణ బదిలీ 

పేమెంట్ గేట్వే అనేది బదిలీ కోసం సాధారణ వాడే విధానాల్లో ఒకటి. వారి ట్రేడింగ్ అకౌంట్‍కు  నిధులను బదిలీ చేయడానికి ఎవరైనా బ్యాంక్ అకౌంట్ లేదా డెబిట్ కార్డును ఉపయోగించవచ్చు. ఈ పద్ధతి యొక్క అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి ఏంటంటే ఫండ్స్ బదిలీ తక్షణమే చేయబడుతుంది, మరియు వారి అకౌంట్ డిపాజిట్ చేయబడిన క్రెడిట్ ప్రతిబింబించిన వెంటనే ట్రేడింగ్ ప్రారంభించవచ్చు. ప్రతి బదిలీతో, ఒకరికి రూ. 9 (పన్నులు అదనం) ఛార్జ్ ఉంటుంది మరియు బదిలీలు తరచుగా చేయబడితే, ఛార్జీలు గణనీయంగా జోడించబడవచ్చు. సెబీ నిబంధనలు ప్రకారం, నిధులను ఒక అకౌంట్ లోకి బదిలీ చేయడానికి క్రెడిట్ లేదా ఛార్జ్ కార్డులను ఉపయోగించడం వీలుకాదు, డెబిట్ కార్డులు లేదా నెట్ బ్యాంకింగ్ మాత్రమే ఆ ప్రక్రియ కోసం ఉపయోగించవచ్చు.

ఎన్ఇఎఫ్‍టి/ ఆర్‍టిజిఎస్/ ఐఎంపిఎస్ ద్వారా ఫండ్స్ డిపాజిట్ చేయడం

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ బదిలీ (ఎన్ఇఎఫ్‍టి) ద్వారా ఫండ్స్ డిపాజిట్ చేయడం అనేది ఫండ్ బదిలీ యొక్క మరింత పాపులర్ విధానాల్లో ఒకటి. సాధారణంగా, ఒక బ్యాంక్ అకౌంట్ నుండి మరొక బ్యాంక్ అకౌంట్‍కు  బదిలీ చేయడానికి పట్టే సమయం 2-3 గంటలు. అయితే, అదే బ్యాంక్ యొక్క రెండు అకౌంట్ లమధ్య బదిలీ చేయబడితే, ఆ క్రెడిట్ తక్షణమే డిపాజిట్ చేయబడుతుంది. బ్రోకర్ యొక్క అకౌంట్స్ కు బదిలీ చేసేటప్పుడు, బ్రోకర్ యొక్క అకౌంట్ ను బెనిఫీషియరీగా జోడించాలి. పంపబడిన పాస్వర్డ్ మరియు ఒటిపిని పూరించిన తర్వాత, బదిలీ చేయబడుతుంది.  కమోడిటీ అకౌంట్లు అలాగే ఈక్విటీ ట్రేడింగ్ అకౌంట్లలోకి ఫండ్స్ బదిలీ కోసం  ఎన్ఇఎఫ్‍టి ఉపయోగించవచ్చు.  ఆ బదిలీని ఆన్లైన్ లేదా ఒక ఎన్ఇఎఫ్‍టి  చెక్ డిపాజిట్ చేయడం ద్వారా చేయవచ్చు. రెండు ప్రక్రియలకు అదే సమయం అవసరమవుతుంది. ఒక ఎన్ఇఎఫ్‍టి బదిలీ సమయంలో అయ్యే  అదనపు ఛార్జీలు ఉండవు. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‍టిజిఎస్) ఒక ఎన్ఇఎఫ్‍టి బదిలీ  ఉన్నట్లుగానే ఉంటుంది, అయితే రూ. 2 లక్షలకు మించిన మొత్తం కోసం మాత్రమే ఆర్‍టిజిఎస్ ఉపయోగించవచ్చు. ఎన్ఇఎఫ్‍టి మరియు ఆర్‍టిజిఎస్ వంటి బదిలీలను సాధారణ బ్యాంకింగ్ గంటల మధ్య మాత్రమే చేయవచ్చు (9 a.m. నుంచి 6.00 p.m. మధ్య), అయితే ఒక ఐఎంపిఎస్ బదిలీని ఈ గంటలు దాటిన తర్వాత చేయవచ్చు. ఐఎంపిఎస్ బదిలీ తక్షణమే జరుగుతుంది కానీ ఈ సౌకర్యం కోసం అదనపు ఛార్జీలు విధించబడవచ్చు. 

చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫండ్స్ డిపాజిట్ చేయడం  

ఒక ఆఫ్లైన్ ట్రేడింగ్ అకౌంట్ విషయంలో మాత్రమే చెక్ డిపాజిట్ చేయడం ఫండ్స్ బదిలీ చేయవచ్చు. ఒక ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ విషయంలో పేమెంట్ గేట్వే లేదా ఎన్ఇఎఫ్‍టి/ ఆర్‍టిజిఎస్/ ఐఎంపిఎస్ బదిలీ విధానాలను ఉపయోగించడం అవసరం. ఒక ఆఫ్లైన్ బదిలీ విషయంలో, చెక్ ఒక బ్రోకర్ పేరుతో డ్రా చేయబడాలి అని గమనించడం ముఖ్యం. ప్రక్రియ 2-3 రోజులు పడుతుంది మరియు బ్రోకర్ క్లియరింగ్ క్రెడిట్ అందుకున్న తర్వాత మాత్రమే చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ క్రెడిట్ మంజూరు చేయబడుతుంది. చెక్ సంతకం చేసినప్పుడు ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి మరియు వారి అకౌంట్లో  నిధులు సమకూర్చబడి ఉన్నాయని నిర్ధారించుకోవాలి లేదా జరిమానా ఛార్జీలు విధించబడవచ్చు… 

ఒక బ్యాంక్ అకౌంట్ ను ఒక డిమాట్ అకౌంట్ కు ఎలా లింక్ చేయాలి?

ఒక డిమాట్ లేదా ట్రేడింగ్ అకౌంట్ తో బ్యాంక్ అకౌంట్‍ను అనుసంధానించడం విషయంలో, ప్రాథమిక ప్రక్రియ అదే విధంగా ఉండినప్పటికీ, ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు మారగల కొన్ని వివరాలు ఉన్నాయని గమనించడం ముఖ్యం,. ఒక ప్రాథమిక అకౌంట్  మరియు రెండు ద్వితీయ అకౌంట్ లను అనుసంధానించడం సాధ్యమవుతుంది. అన్ని పే-ఔట్ లను ప్రాసెస్ చేయడానికి ప్రాథమిక అకౌంట్  ఉపయోగించబడుతుంది. రెండవ అకౌంట్లు పే-ఇన్లను ప్రాసెస్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఒక డిమాట్ అకౌంట్ తో ఒక బ్యాంక్ అకౌంట్‍ను  అనుసంధానించడానికి, ఇది చేయడం అవసరం:

దశ 1 – అకౌంట్ నిర్వహించబడిన బ్యాంకు యొక్క వెబ్‌సైట్‌ను సందర్శించండి. ప్రాసెస్ ప్రారంభించడానికి అవసరమైన ఫారంను పూరించండి.

దశ 2 – కొన్ని సందర్భాల్లో, పూరించబడిన ఫారం యొక్క ఒక ప్రింట్ అవుట్ తీసుఖుని ఆ అకౌంట్ నిర్వహించబడే బ్యాంక్ ద్వారా అందించబడిన చిరునామాకు పంపవలసి రావచ్చు.

దశ 3 –  ఒక ద్వితీయ అకౌంట్‍ను  జోడించడానికి, ద్వితీయ బ్యాంక్ అకౌంట్  యొక్క అదనపు రుజువు అవసరం. ఒక రద్దు చేయబడిన మరియు వ్యక్తిగతీకరించిన చెక్ (చెక్ పై ముద్రించబడిన పేరు), ఒక బ్యాంక్ పాస్‌బుక్ స్టేట్‌మెంట్ లేదా స్వీయ-సంతకం చేయబడిన బ్యాంక్ స్టేట్‌మెంట్ (ఐఎఫ్ఎస్‍సి కోడ్/ ఎంఐసిఆర్ నంబర్‌తో సహా) అన్నీ రుజువు యొక్క డాక్యుమెంట్లుగా అందజేయబడవచ్చు.