డిమాట్ అకౌంట్ నుండి బ్యాంక్ అకౌంట్‍కు డబ్బును ఎలా బదిలీ చేయాలి

కొన్ని దశాబ్దాల క్రితం, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం జూదం ఆడటంతో సమానంగా ఉండేది. మార్కెట్లను ప్రజలు డబ్బుల గుంటగా పరిగణించేవారు, అయితే, ఆర్థిక అవగాహనలో పెరుగుదలతో, క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం భారతదేశంలో విస్తృతమైన ఆమోదాన్ని పొందింది. మ్యూచువల్ ఫండ్స్ వంటి సాధనాల ద్వారా క్యాపిటల్ మార్కెట్లను పరోక్షంగా యాక్సెస్ చేయవచ్చు లేదా నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. నేరుగా పెట్టుబడి పెట్టడానికి, మీరు తప్పనిసరిగా ఒక డిమాట్ అకౌంట్ కలిగి ఉండాలి.

డిమాట్ అకౌంట్ అంటే ఏమిటి?

డిమాట్ అకౌంట్ లేకుండా, క్యాపిటల్ మార్కెట్లలో నేరుగా పాల్గొనడం సాధ్యం కాదు. సెక్యూరిటీలను నిలిపి ఉంచుకోవడం, పర్యవేక్షించడం మరియు నిర్వహించడం కోసం ఇది ఒక ముందస్తు అవసరం. ఒక డిమాట్ అకౌంట్ అనేది షేర్లు లేదా సెక్యూరిటీలను వాటి ఎలక్ట్రానిక్ లేదా డీమెటీరియలైజ్డ్ రూపంలో స్టోర్ చేయడానికి లేదా హోల్డ్ చేయడానికి ఒక ప్రదేశం. మీరు డిటర్జెంట్ సబ్బులలో డీల్ చేసే వ్యాపారి అయితే, మీరు తయారీదారు నుండి సబ్బులను కొనుగోలు చేస్తారు మరియు ఒక గిడ్డంగిలో నిల్వ చేస్తారు. గిడ్డంగి నుండి, మీరు మరింత అమ్మకానికి డిటర్జెంట్ సబ్బులను రిటైల్ స్టోర్లకు సరఫరా చేస్తారు. క్యాపిటల్ మార్కెట్ల విషయంలో, సెక్యూరిటీలు నిల్వ చేయబడే గిడ్డంగి డిమాట్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ మరియు డిమాట్ అకౌంట్లు భిన్నంగా ఉన్నప్పటికీ, చాలామంది రెండు అకౌంట్ల మధ్య లైన్ చెరిపివేస్తూ, ఒకే బ్రోకర్ తో రెండు అకౌంట్లను నిర్వహిస్తారు. ట్రేడింగ్ అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ మరియు డిమాట్ అకౌంట్ మధ్య ఇంటర్ఫేస్. డిమాట్ అకౌంట్లో నిల్వ చేయబడిన సెక్యూరిటీలు ఒక ట్రేడింగ్ అకౌంట్ ద్వారా కొనుగోలు చేయబడతాయి మరియు విక్రయించబడతాయి.

డిమాట్ అకౌంట్ ఎలా పనిచేస్తుంది

డిమాట్ అకౌంట్ సెక్యూరిటీల కోసం ఒక స్టోరేజ్ స్పేస్ మరియు ఎటువంటి క్యాష్ కలిగి ఉండదు. మీరు షేర్లు లేదా డెరివేటివ్స్ వంటి సెక్యూరిటీలను విక్రయించి అమ్మకానికి డబ్బును పొందినప్పుడు డిమాట్ అకౌంట్ నుండి డబ్బును ట్రాన్స్ఫర్ చేయడం అనే ప్రశ్న ఏర్పడుతుంది. సాధారణంగా, బ్రోకరేజీలు బండిల్డ్ డిమాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ ఇస్తాయి. అమ్మకం నుండి వచ్చే ఆదాయాలు ఆటోమేటిక్‌గా లింక్ చేయబడిన ట్రేడింగ్ అకౌంట్‌కు బదిలీ చేయబడతాయి. ఒక అమ్మకం తర్వాత మీ ట్రేడింగ్ అకౌంట్ లో చూపబడటానికి ఆదాయాలకు రెండు రోజుల సమయం పట్టవచ్చు ఎందుకంటే ట్రేడ్లను సెటిల్ చేయడానికి ఎక్స్ఛేంజ్ లు టి + 2 రోజులు తీసుకుంటాయి కాబట్టి. మీరు ట్రేడింగ్ అకౌంట్ లో డబ్బును కలిగి ఉంటే, అది సులభంగా రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ కు బదిలీ చేయబడవచ్చు.

డిమాట్ అకౌంట్  నుండి బ్యాంక్ అకౌంట్ కు నిధులను ఎలా బదిలీ చేయాలి?

ప్రతి డిమాట్ అకౌంట్  ఒక ట్రేడింగ్ అకౌంట్ కు అనుసంధానించబడి ఉంటుంది, ఇది ఒక బ్యాంక్ అకౌంట్ కు అనుసంధానించబడుతుంది. షేర్లను కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి మీరు మొదట డిమాట్ అకౌంట్ కు బ్యాంక్ అకౌంట్  నుండి డబ్బును బదిలీ చేయాలి. వివిధ రకాల చెల్లింపు పరిష్కారాలు ఉనికిలోకి రావడంతో, అన్ని ప్రధాన చెల్లింపు పరిష్కారాలను ఉపయోగించి ఫండ్ బదిలీని బ్రోకరేజీలు అనుమతిస్తాయి. ప్రతి ప్రధాన బ్రోకరేజ్ మొబైల్, వెబ్‌సైట్ లేదా టాబ్లెట్ వంటి బహుళ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా కార్యకలాపాలను అనుమతిస్తుంది. ప్లాట్‌ఫార్మ్‌ల వ్యాప్తంగా, ఫండ్ బదిలీ కార్యకలాపాలు సాధారణంగా ‘అకౌంట్లు’ లేదా ‘ఫండ్స్’ విభాగాల క్రింద ఉంటాయి. బ్రోకర్ ఆధారంగా ఖచ్చితమైన దశలు కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు కానీ ఎక్కువగా ఒకే విధంగా ఉంటాయి. 

– మీ ట్రేడింగ్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి మరియు ‘ఫండ్స్’ విభాగాన్ని క్లిక్ చేయండి. ‘ఫండ్స్’ విభాగానికి బదులుగా కొన్ని యాప్స్ ‘అకౌంట్స్’ విభాగాన్ని కలిగి ఉండవచ్చు.

– మీరు ‘ఫండ్స్’ విండోలో ఉన్న తర్వాత, రెండు ఎంపికలు ఉన్నాయి—ఫండ్స్ జోడించండి మరియు విత్‍డ్రా చేయండి.

– మీరు డిమాట్ అకౌంట్ నుండి బ్యాంక్ అకౌంట్ కు డబ్బును బదిలీ చేయాలనుకుంటే, ‘ విత్‍డ్రా ‘ ఎంపికపై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా, తాజా సెక్యూరిటీలు కొనుగోలు చేయడానికి మీరు మీ ట్రేడింగ్ అకౌంట్లో డబ్బును జోడించాలనుకుంటే, ‘యాడ్ ఫండ్స్’ ఎంపికను ఎంచుకోండి.

– మీరు ‘విత్‍డ్రా’ ఎంపికను ఎంచుకున్నప్పుడు, మీ ట్రేడింగ్ అకౌంట్లో ఉన్న ట్రాన్స్ఫర్ చేయబడగల మొత్తం వంటి సమాచారాన్ని బ్రోకరేజ్ ప్రదర్శిస్తుంది, మరియు మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న మొత్తం కోసం అడుగుతుంది. మీరు కొన్ని సెక్యూరిటీలను విక్రయించిన తర్వాత మీరు అందుకున్న డబ్బును మాత్రమే బదిలీ చేయగలరు. అనేక మంది ట్రాన్స్ఫర్ చేయబడగల మొత్తంతో హోమ్ పేజీలో ప్రదర్శించబడే మొత్తం ఫండ్స్ అని గందరగోళం పడిపోతారు.

– చాలా బ్రోకరేజీలు ట్రేడింగ్ కోసం కొంత లెవరేజ్ అందిస్తాయి మరియు హోమ్ పేజీలో మొత్తం పరిమితిని ప్రదర్శిస్తాయి. లివరేజ్ పరిమితి మీరు ట్రేడింగ్ అకౌంట్‍కు మీరు జోడించే ఫండ్స్ మరియు డీమాట్ అకౌంట్‍లో మీరు కలిగి ఉన్న సెక్యూరిటీలపై ఆధారపడి ఉంటుంది. మొత్తం ఫండ్ పరిమితి మరియు ట్రాన్స్ఫర్ చేయబడగల మొత్తాలు ఒకటి కావు.

– ‘విత్‌డ్రా’ పేజీలో, మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయాలి. మీరు ట్రేడింగ్ అకౌంట్ కు అనేక బ్యాంక్ అకౌంట్ లను అనుసంధానించి ఉంటే, మీరు డబ్బును అందుకోవాలనుకుంటున్న అకౌంట్ ను మీరు ఎంచుకోవాలి. మీరు సంబంధిత వివరాలను పూరించిన తర్వాత, మీరు ట్రేడింగ్ పాస్వర్డ్ను ఎంటర్ చేసి ట్రాన్స్ఫర్ ప్రారంభించవచ్చు. ఎంచుకున్న ట్రాన్స్ఫర్ విధానం ఆధారంగా, మీ బ్యాంక్ అకౌంట్ లో మొత్తం జమ చేయబడటానికి నిమిషాల నుంచి కొన్ని గంటల సమయం పట్టవచ్చు

ముగింపు

కస్టమర్ ఇంటర్ఫేస్ లో మెరుగుదలతో, డిమాట్ అకౌంట్ కు లేదా దాని నుండి నిధులను బదిలీ చేయడం చాలా సౌకర్యవంతంగా మరియు అవాంతరాలు-లేనిదిగా అయింది. ఫండ్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ మిమ్మల్ని నీరసింపజేయనివ్వకండి, ఒక సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తును నిర్మించడానికి పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి.