పన్ను పొదుపు ఎంపికలు

1 min read
by Angel One

ఆదాయపు పన్ను చట్టం కింద అనేక పన్ను ఆదా పెట్టుబడులు ఉన్నాయి, ఇవి తెలివిగా ఉపయోగించినప్పుడు, ఒకరి యొక్క పన్ను చెల్లింపులు తగ్గించడానికి సహాయపడతాయి.

పిల్లల విద్య, పదవీవిరమణ వంటి మొదలైన మన ప్రత్యేక భవిష్యత్తు వ్యక్తిగత ఆర్ధిక లక్ష్యాలు కొరకు మన డబ్బు పెరగడానికి క్రమంగా పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం. 1961 యొక్క భారతీయ ఆదాయ పన్ను చట్టంలో పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి మరియు పన్ను బాధ్యతను తగ్గించడానికి అనేక పన్ను పొదుపు ఎంపికలు ఉన్నాయి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మీ మొత్తం పన్ను విధించదగిన ఆదాయం నుండి పెట్టుబడి మొత్తం మినహాయించబడుతుంది.

ఇప్పుడు, మనం కొన్ని ఉత్తమ ఆదాయపు పన్ను పొదుపు పెట్టుబడులను మరియు అవి ఒకరికి పన్నులను ఆదా చేసుకోవడానికి ఎలా సహాయపడతాయో చూద్దాం.

చాలా మట్టుకు ముఖ్యమైన ఎంపికలు సెక్షన్ 80C (ఆదాయ పన్ను చట్టం) మరియు దాని ఉప విభాగాల క్రింద వస్తాయి. ఈ అన్ని పెట్టుబడి ఎంపికలకు అందుబాటులో ఉన్న మినహాయింపులు రూ. 1.5 లక్షల వద్ద పరిమితం చేయబడతాయి. మనం వాటిని వివరంగా చూద్దాం.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): తక్కువ రిస్క్ కావాలనుకునే వారికి సెక్షన్ 80C కింద ఉత్తమ పన్ను ఆదా చేసే పెట్టుబడులలో ఒకటిగా PPF పరిగణించబడుతుంది. PPF పెట్టుబడులకు 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది, దీని తర్వాత మీరు ప్రతి ఐదు సంవత్సరాలకు పొడిగించవచ్చు. వడ్డీ రేటు అనేది ఎప్పటికప్పుడు ఆర్ధిక మంత్రిత్వ శాఖచే నిర్ణయించబడుతుంది; ప్రస్తుత రేటు సంవత్సరానికి 7.9 శాతం. PPF యొక్క అత్యంత ఆకర్షణీయమైన లక్షణాల్లో ఒకటి అన్ని స్థాయిలలో పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మినహాయింపు, మినహాయింపు, మినహాయింపు (ఇఇఇ) వర్గం కింద వస్తుంది. దీని అర్థం సెక్షన్ 80C క్రింద మీ PPF అకౌంట్ లో జమ చేసిన డబ్బుకు మాత్రమే మినహాయించబడవు; ఇంకా, జమ చేయబడిన మొత్తం మరియు వడ్డీ కూడా విత్‍డ్రాల్ పై పన్ను రహితంగా ఉంటాయి. ఒక దీర్ఘకాలిక పెట్టుబడి కాలం మరియు దాని పన్ను ప్రయోజనాలతో, PPF దీర్ఘకాలిక పెట్టుబడికి తగినది.

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS): ఇది సెక్షన్ 80C క్రింద పన్ను ప్రయోజనాలను అందించే విభిన్నమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ను సూచిస్తుంది. ఒక ELSS ప్రాథమికంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతుంది. ఇది మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, మీరు SIP ఎంపికను ఎంచుకుంటే, ప్రతి SIP వాయిదాకు వేరొక మెచ్యూరిటీ తేదీ ఉంటుంది. ELSS యొక్క ప్రయోజనం ఏంటంటే రాబడులు మార్కెట్‌కు లింక్ చేయబడి ఉన్నందున, పోల్చి చూస్తే అధిక రాబడులు అందించే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. అందువల్ల ఇది అత్యంత లాభదాయకమైన పన్ను పొదుపు పెట్టుబడి ఎంపికల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (ULIPలు): ULIP లో పెట్టుబడులు సెక్షన్ 80C క్రింద మినహాయింపుకు అర్హత కలిగి ఉంటాయి. ULIPలు లైఫ్ కవర్ మరియు మార్కెట్-లింక్డ్ రాబడులు రెండింటినీ అందిస్తాయి. ULIPలు ఐదు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటాయి. మీకు లైఫ్ కవర్ అందించడానికి మీ ప్రీమియంలలో ఒక భాగం ఉపయోగించబడుతుంది, మరియు ఇతర భాగం మీకు నచ్చిన ఫండ్స్ లో పెట్టుబడి పెట్టబడుతుంది. మీరు పెట్టుబడి పెట్టడానికి విస్తృత శ్రేణి నుండి ఎంచుకోవచ్చు. పెట్టుబడులపై రాబడి మార్కెట్ అనుసంధానించబడినది. అవి ఫండ్స్ యొక్క పనితీరుపై ఆధారపడి ఉంటాయి. పెట్టుబడి రాబడులు కూడా ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 10 (10D) క్రింద పన్ను నుండి మినహాయించబడతాయి.

సుకన్య సమృద్ధి యోజన: పేరు సూచిస్తున్నట్లుగా, ఈ స్కీం యువ అమ్మాయిల కోసం. ప్రస్తుతం, వడ్డీ రేటు సంవత్సరానికి 8.4 శాతం, సంవత్సరానికి చక్రవడ్డీ చేయబడుతుంది మరియు వార్షికంగా చెల్లించబడుతుంది; ఇది ఒక అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చినప్పుడు మెచ్యూర్ అవుతుంది. ఈ పథకం కింద జమ చేసిన డబ్బు మరియు సంపాదించిన వడ్డీ రెండూ పన్ను రహితంగా ఉంటాయి. కాబట్టి మీరు మీ కుమార్తె యొక్క భవిష్యత్తు సురక్షితం చేసుకోవాలని మరియు ఆదాయ పన్ను పొదుపు ఎంపిక కొరకు చూస్తున్నట్లయితే, ఇది ఆదర్శవంతమైన పెట్టుబడి ఎంపిక.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC): ఇది స్థిరమైన ఆదాయ పెట్టుబడి మరియు చిన్న పెట్టుబడిదారులకు ఉత్తమ పన్ను పొదుపు ఎంపికల్లో ఒకటి. PPF లాగా, ఇది తక్కువ రిస్క్ ఉత్పత్తి మరియు హామీ ఇవ్వబడిన రాబడులు కూడా అందిస్తుంది. NSC రెండు మెచ్యూరిటీ వ్యవధులతో వస్తుంది, ఐదు సంవత్సరాలు మరియు పది సంవత్సరాలు. ఎక్కువ పెట్టుబడి పరిమితి లేదు, కానీ ఇతర 80C పెట్టుబడుల లాగా, అందుబాటులో ఉన్న గరిష్ట మినహాయింపు రూ. 1.5 లక్షలకు పరిమితం చేయబడుతుంది. వడ్డీ రేటు 7.9 శాతం మరియు సంవత్సరానికి చక్రవడ్డీ చేయబడుతుంది.

5- సంవత్సరాల పన్నుఆదా చేసే ఫిక్సెడ్ డిపాజిట్లు: 5- సంవత్సరాల ఫిక్సెడ్ డిపాజిట్లు ఆదాయపు పన్ను చట్టం యొక్క సెక్షన్ 80C క్రింద ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి పన్నుఆదా చేసే ఫిక్సెడ్ డిపాజిట్లు అని కూడా పిలువబడతాయి – ప్రస్తుత వడ్డీ రేటు 6-7.5 శాతం నుండి ఉంటుంది.

నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS): ఇది భారత ప్రభుత్వం ద్వారా నిర్వహించబడే ఒక పెన్షన్ స్కీం. పదవీవిరమణ తరువాత పౌరులకు ఒక సాధారణ ఆదాయం అందించడం అనేది దీని యొక్క ఆలోచన. మీరు రెండు రకాల అకౌంట్లు, టైర్ 1 (తప్పనిసరి), టైర్ 2 (స్వచ్ఛందం) తెరవవచ్చు. ప్రత్యేకంగా టైర్ 1 అకౌంట్ హోల్డర్ల కోసం అనేక పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. మనం అవి చూద్దాం.

    1. ఒక NPS సబ్‌స్క్రైబర్ గా, మీరు ఆదాయపు పన్ను చట్టం యొక్క సెక్షన్ 80CCD(1) క్రింద మీ స్థూల ఆదాయంలో 10 శాతం వరకు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఈ మినహాయింపు రూ. 1.5 లక్షల పరిమితిని కలిగి ఉంది. ఇంకా, సెక్షన్ 80CCD(1B) కింద ₹ 50,000 వరకు పెట్టుబడి కోసం అదనపు మినహాయింపు అందుబాటులో ఉంది. ఈ మినహాయింపు సెక్షన్ 80CCD(1) కింద అందుబాటులో ఉన్న రూ 1.5 లక్షల కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు NPS కోసం క్లెయిమ్ చేయగల మొత్తం పన్ను మినహాయింపు గరిష్టంగా రూ 2 లక్షలు, కొన్ని షరతులకు లోబడి.
    2. సెక్షన్ 80CCD(2) కింద కార్పొరేట్ రంగం కింద సబ్స్క్రైబర్లకు అదనపు పన్ను ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. యజమాని జమ చేసే డబ్బు జీతం (బేసిక్ + డిఎ) యొక్క 10 శాతం వరకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి మినహాయింపుకు అర్హత కలిగి ఉంటుంది. ఈ మినహాయింపుకు ఎటువంటి డబ్బు పరిమితి లేదు.
    3. పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలు టైర్ 1 అకౌంట్లకు వర్తిస్తాయి. NPS టైర్ 2 అకౌంట్‌కు చేసే జమలు కూడా సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హత కలిగి ఉంటాయి. అయితే, పన్ను ప్రయోజనాలను పొందడానికి మీరు కనీసం మూడు సంవత్సరాల వరకు ఈ ఖాతాను నిలిపి ఉంచవలసి ఉంటుంది.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్: ఈ స్కీమ్ ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసం రూపొందించబడింది. మీరు పెట్టుబడి పెట్టగల గరిష్ట మొత్తం రూ 15 లక్షలు (జాయింట్ హోల్డింగ్ విషయంలో) మరియు రూ 9 లక్షలు (ఒకే హోల్డింగ్ విషయంలో). ఈ స్కీం ఐదు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంది. ఇది అదనపు మూడు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. వడ్డీ ప్రతి త్రైమాసికంలో చెల్లించ బడుతుంది మరియు ప్రస్తుతం 8.6 శాతం ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పై సంపాదించిన వడ్డీ పూర్తిగా పన్ను విధించదగినది. ఒకవేళ వడ్డీ మొత్తం రూ 50,000, కంటే ఎక్కువ ఉంటే, వర్తించే మూలం వద్ద పన్ను మినహాయించబడుతుంది.

లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు: లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించిన ప్రీమియంలు కూడా సెక్షన్ 80C క్రింద మినహాయించబడతాయి. అయితే, మనీ-బ్యాక్ ఇన్సూరెన్స్ ప్లాన్లపై రాబడులు మంచి పెట్టుబడి ఎంపిక కాదు ఎందుకంటే అవి 5-6 శాతం పరిధిలో రాబడులను అందిస్తాయి. ఏ రాబడులు అందించని ప్యూర్ టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ల కోసం చెల్లించబడిన ప్రీమియంలు కూడా పన్ను మినహాయింపుకు అర్హత కలిగి ఉంటాయి.

పైన పేర్కొన్న అన్ని పెట్టుబడులకు కలిపి రూ. 1.5 లక్షల మినహాయింపు పరిమితి ఉందని మీరు గుర్తుంచుకోవాలి. పెట్టుబడులను పరిమితి కంటే ఎక్కువగా చేయవచ్చు, కానీ అవి పన్ను ప్రయోజనాలకు అర్హత కలిగి ఉండవు. ఒక పెట్టుబడిదారు తన 80C పెట్టుబడులలో ప్రతి ఒక్కదానిని జోడించాలి మరియు అతను/ఆమె పన్ను ప్రయోజనాలను ఎలా పెంచుకోగలరో చూడాలి. ఈ పన్ను పొదుపు పెట్టుబడి ఎంపికలను దృష్టిలో ఉంచుకోవడం వలన భవిష్యత్తు లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టేటప్పుడు పన్నులను ఆదా చేసుకోవచ్చు.