లార్జ్ క్యాప్ వర్సెస్ స్మాల్ క్యాప్ వర్సెస్ మిడ్ క్యాప్ స్టాక్స్ మధ్య తేడా

1 min read

లార్జ్క్యాప్, మిడ్క్యాప్ మరియు స్మాల్క్యాప్ స్టాక్స్: వ్యత్యాసం ఏమిటి?

అజయ్ స్టాక్ మార్కెట్ కు కొత్త మరియు లార్జ్ క్యాప్, మిడ్క్యాప్ మరియు స్మాల్క్యాప్ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు.

ఏంజెల్ బ్రోకింగ్లో అనుభవం ఉన్న పెట్టుబడిదారుడైన అతని స్నేహితుడు ఆశీష్, మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది కంపెనీ యొక్క ప్రస్తుత షేర్ ధర మరియు స్టాక్స్ యొక్క మొత్తం సంఖ్య ఆధారంగా లెక్కించిన కంపెనీ యొక్క మొత్తం మార్కెట్ విలువ అని వివరిస్తున్నారు. ఉదాహరణకుక్రిస్టల్ ఆర్ట్ పరిశ్రమల షేర్ విలువ 50 రూపాయలు అయితే మరియు ఆ కంపెనీ యొక్క మొత్తం షేర్లు ఒక కోటి అయితే అప్పుడు ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 50 కోట్ల రూపాయలు.

సాధారణంగా మార్కెట్ క్యాప్ కోసం ఎటువంటి స్థిర ప్రమాణం లేదు కానీ దాదాపు 10000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలు లార్జ్ క్యాప్స్ గా పరిగణించబడగా, 10000 కోట్ల రూపాయల కంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలు మిడ్ మరియు స్మాల్ క్యాప్స్ అయి ఉంటాయి.

లార్జ్ క్యాప్స్ అనేవి సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడే స్థిరమైన వ్యాపార నమూనాలతో బాగా స్థాపించబడిన పెద్ద కంపెనీల స్టాక్స్. అవి మీకు మధ్యస్థమైన కాని సురక్షితమైన రాబడిని ఇస్తాయి మిడ్క్యాప్ కంపెనీలు సాధారణంగా పెరుగుతున్న దశలో ఉంటాయి మరియు అవి పెద్ద క్యాప్ గా మారే సామర్థ్యం కలిగి ఉంటాయి. స్మాల్ క్యాప్ కంపెనీలలో సాధారణంగా అప్పుడే మొదలు పెట్టిన కంపెనీలు, చిన్న సైజు అనుభవం ఉన్న కంపెనీలు మొదలగునవి ఉంటాయి. అవి పెద్ద లాభదారులుగా ఉండవచ్చు కానీ సరైన పరిశోధన చేయాలి. అజయ్ ఇప్పుడు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నాడు మరియు ఏంజెల్ బ్రోకింగ్ తో వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.