షేర్ మార్కెట్ నుండి నెలకు 1 లక్ష ఎలా సంపాదించాలి

స్టాక్స్ లో ట్రేడ్ చేసే ప్రతీ పెట్టుబడిదారుడూ కొత్తవాడైనా, నిపుణుడైనా భారీగా సంపాదించాలానే కలలు కంటాడు. స్టాక్స్ లో సంపాదించడానికి, మీ డబ్బును కాపాడుకుంటూ మంచి రాబడులు ఇచ్చే పెట్టుబడులు చేయడానికి ఒక పటిష్టమైన వ్యూహం కలిగి ఉండాలి. మీరు డబ్బు సంపాదించాలనుకుంటే, స్టాక్ మార్కెట్  తో పాటు దానిని నిర్వహించే కారకాల పై బలమైన అవగాహన అవసరం.

చాలామందికిషేర్ మార్కెట్ నుండి నెలకు 1 లక్ష ఎలా సంపాదించాలి?” అన్న ప్రశ్న ఉంది, దానికి సమాధానం ఇవ్వడానికి ముందు, త్వరగా  ప్రాథమిక అంశాలను చూద్దాం. మొదట, షేర్ మార్కెట్ ఏమిటో అర్థం చేసుకుందాం. ఒక షేర్ మార్కెట్ అనేది ఒక కంపెనీ యొక్క షేర్లు లేదా స్టాక్స్ కొనుగోలు చేసే ఒక ఆన్లైన్ మార్కెట్షేర్మార్కెట్ నిఘంటువులో, పదాలు స్టాక్లు, ఈక్విటీలు మరియు క్యాష్  అనే పదాలు అన్నీ ఒకటే అర్ధం. ఒక కంపెనీ యొక్క షేర్లు / స్టాక్స్ అనేవి ప్రతిరోజూ హెచ్చు తగ్గులు ఉండే నిర్దిష్ట కంపెనీ యొక్క షేర్లను సూచిస్తాయి (రూ 10 నుండి 500 వరకు ఉండే హెచ్చుతగ్గులు).

మీరు షేర్లను కొనుగోలు చేసినప్పుడు ఏం జరుగుతుంది?

మీరు ఒక కంపెనీ యొక్క స్టాక్ కొనుగోలు చేసినప్పుడు, మీరు కంపెనీ వ్యాపారంతో అనుసంధానించబడతారు. ఒకవేళ కంపెనీ లాభం పొందినప్పుడు, దాని స్టాక్స్ ధరలు పెరుగుతాయి మరియు మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం కంటే ఎక్కువ డబ్బు పొందుతారు.

 1. మీరు ఒక షేర్ నుండి ప్రారంభించవచ్చు మరియు మీ బడ్జెట్ ను బట్టి ఎన్ని షేర్లు ఐనా కొనుగోలు చేయవచ్చు
 2. షేర్లను కొనుగోలు చేయడానికి మరియు ఉంచుకోవడానికి మీరు మీ డిమాట్ అకౌంట్లో డబ్బును ఉంచవలసి ఉంటుంది.
 3. మీరు  షేర్లు కొనుగోలు చేసిన మొత్తం కంటే అమ్మేటప్పుడు ఎక్కువ ధర పొందినప్పుడు లాభం పొందుతారు.

ఐతే మరొకవైపు, కంపెనీ యొక్క లాభం తగ్గినా, లేదా అది నష్టం పొందినా  లేదా తగని  కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉన్నా, అప్పుడు షేర్ ధరలు తగ్గవచ్చుమరియు మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులో కొంత భాగాన్ని కోల్పోవచ్చు.

డిమాట్ అకౌంట్ అంటే ఏమిటి?

మీరు ట్రేడ్ చేసినప్పుడు, మీరు షేర్లను ఎక్కడైనా ఉంచుకోవాలి. ఇటువంటప్పుడు డిమాట్ అకౌంట్ చిత్రంలోకి వస్తుంది. ఒక డిమాట్ అకౌంట్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉన్న షేర్లు మరియు సెక్యూరిటీలను కలిగి ఉంటుంది. డీమ్యాట్ అంటేడీమెటీరియలైజ్డ్ అకౌంట్.” ట్రేడర్లు షేర్లు కొనుగోలు చేసినప్పుడు లేదా డీమెటీరియలైజ్ చేసినప్పుడు  డిమ్యాట్ ఖాతాను తెరవగలరు. డిమెటీరియలైజేషన్ అనేది భౌతిక షేర్ సర్టిఫికెట్లను ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చే ప్రక్రియ. మీరు ఇకపై షేర్ల కోసం అద్భుతమైన డాక్యుమెంటేషన్ అందించవలసిన అవసరం లేదు. ఇది మీరు ఎక్కడినుండైనా నిర్వహించడం, ట్రాక్ చేయడం మరియు యాక్సెస్ చేయడం సులభతరం చేస్తుంది. మీరు ఆన్లైన్లో ట్రేడ్ చేయాలనుకుంటే, మీరు డిపాజిటరీ పార్టిసిపెంట్ (డిపి) సహాయంతో ఒక డిమాట్ అకౌంట్ను తెరవాలి. దీనిలో వాటిని ట్రాక్ చేయడం మరియు ట్రేడ్ చేయడం కూడా సులభం, ముఖ్యంగా ఇప్పుడు షేర్ల వ్యాపారం ఆన్లైన్లో చేయబడుతుంది కనుక.

ఏదైనా బ్యాంక్ లేదా షేర్ బ్రోకింగ్ సంస్థలో ఒక డిమాట్ ఖాతా తెరవవచ్చు.

మీ సాధారణ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్ షేర్ల ట్రేడింగ్ లో ఉపయోగించలేరు.

స్టాక్ మార్కెట్లో వివిధ రకాల ట్రేడింగ్

ఇంట్రాడే ట్రేడింగ్

మీరు కొంత పరిమాణంలో స్టాక్స్ కొనుగోలు చేస్తారు, ఉదాహరణకు 100 స్టాక్స్, మరియు అదే రోజు వాటిని అమ్మివేస్తారు. మీరు కొనుగోలు చేసి, తరువాత అమ్ముతారు. మీరు పెట్టే  పెట్టుబడి శాశ్వతం కాదు, మరియు డబ్బు బ్లాకేజ్ కాదు. మీరు వాటిని కొనుగోలు చేసిన తర్వాత స్టాక్స్ ధర తగ్గితే, మీరు నష్టం పొందుతారు. మీరు వాటిని ఎక్కువకు అమ్మితే, రోజు ముగిసే లోపు లాభం పొందుతారు. ఒక రోజు వ్యవధిలో ఏమైనా జరగవచ్చు.

 1. మీరు ఇంట్రాడే ట్రేడింగ్ తో ఒక రోజులో రూ. 100 నుండి రూ. 10,000 వరకు ఎంతైనా సంపాదించవచ్చు లేదా రూ 20,000 కూడా సంపాదించవచ్చు. కానీ ఇది మీ రిస్క్ ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది.
 2. మీరు పొందే నష్టాలు కూడా అదే మొత్తంలో ఉండవచ్చు
 3. మీరు నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, మరియు మీ బ్యాంకులో డబ్బు ఉంటే, అప్పుడు మీరు ట్రేడ్ను డెలివరీ మోడ్గా మార్చడానికి ఎంచుకోవచ్చు.

డెలివరీ ట్రేడింగ్

మీరు కొంత పరిమాణంలో స్టాక్ యొక్క కొనుగోలు చేసినట్లయితే, 100 యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ అనుకుందాం. మీరు వాటిని తదుపరి రోజు అమ్మవచ్చు లేదా 30 రోజుల తరువాత, ఒక సంవత్సరం లేదా 20 సంవత్సరాల తర్వాత కూడా అమ్ముకోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది మరియు మీకు డబ్బు అవసరం. మీరు షేర్లను కొనుగోలు చేసి ఒక నిర్దిష్ట సమయానికి వాటిని ఉంచుకున్నప్పుడు డెలివేరి ట్రేడింగ్ అవుతుంది. ఒకసారి మీరు వాటిని కొనుగోలు చేసిన తర్వాత, అవి మీ డిమాట్ ఆకాంట్ లో ప్రతిబింబించబడతాయి, ఇక్కడ మీరు కావలసినంత కాలం వాటిని ఉంచవచ్చు.

 1. మీరు, దీర్ఘకాల డెలివరీ మోడ్ను ఒక పెట్టుబడిగా పరిగణించాలి.
 2. 2 సంవత్సరాల వ్యవధిలో అసలు మొత్తం మీద 2 రెట్ల నుండి 40 రెట్ల వరకు రాబడి సాధ్యమవుతుంది.
 3. రకం ట్రేడింగ్ మరింత సురక్షితంగా ఉంటుంది, మరియు సగటు ధోరణి మంచి రాబడి కోసం.
 4. పెట్టుబడి చెడుగా ఉంటే, మీరు 90% వరకు అసాధారణ నష్ట్టాన్నిఎదుర్కోవచ్చు

స్వింగ్ ట్రేడింగ్

స్వింగ్ ట్రేడింగ్ లో, మీరు కొన్ని రోజులు లేదా వారాల వ్యవధిలో స్టాక్ లో లాభాలు పొందడానికి ప్రయత్నిస్తారు. మీరు రోజు కొంత ధర వద్ద స్టాక్ కొనుగోలు చేయండి, మరియు దాని ధర పెరగడానికి వేచి ఉండండి. కొన్ని వారాలు లేదా నెలల తరువాత (6-8 నెలల వరకు), ధర పెరిగినప్పుడు మీరు అమ్మవచ్చు.

 1. మీ కొనుగోలు తర్వాత ధర తక్కువగా ఉంటే, మీరు నష్టపోతారు.
 2. మీరు దానిని అధిక ధరకి అమ్మితే, మీరు 10% నుండి 100% వరకు మంచి లాభం పొందుతారు.
 3. మీరు చేసే లాభం స్టాక్స్ పై ఆధారపడి ఉంటుంది.
 4. మీరు నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, మీరు ఆ స్టాక్ ను ఉంచుకోవచ్చు.
 5. మీరు 30% నుండి 70% వరకు నష్టాన్ని ఎదుర్కోనే ప్రమాదం ఏర్పడవచ్చు

ఆప్షన్ అండ్ ఫ్యూచర్ ట్రేడింగ్

మీరు ఆప్షన్స్ లో  ట్రేడింగ్  చేస్తున్నట్లయితే, మీకు హక్కు ఉంటుంది, కానీ ఒప్పందం ప్రభావం ఉన్న సమయంలో మీరు నిర్దిష్ట ధరలో షేర్లు ట్రేడ్ చేయుటకు బాధ్యత వహించబడదు. తేదీకి ముందు మీ పొజిషన్ మూసివేయబడితే తప్ప, ఫ్యూచర్ కాంట్రాక్ట్  ప్రకారం ఒక నిర్దిష్ట తేదీన ఒక షేర్ కొనుగోలు లేదా అమ్మకం చేయాల్సి ఉంటుంది. కాబట్టి, ఒక ఫ్యూచర్ ముందుగా నిర్ణయించబడిన సమయంలో ఒక అంతర్లీన స్టాక్ కొనుగోలు  లేదా అమ్మడానికి ఒక బాధ్యత, అయితే అప్ప్శన్ ఎటువంటి బాధ్యతలు లేకుండా ఒక స్టాక్ కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి హక్కు. మీరు షేర్ మార్కెట్ ట్రేడింగ్ లో ప్రారంభకులు అయితే, మీరు తగినంత అనుభవాన్ని గడించేవరకు ఆప్షన్స్ మరియు ఫ్యూచర్ ట్రేడింగ్ లో డీల్ చేయడం మంచిది కాదు.

ధర పడిపోయినప్పుడు ప్రజలు స్టాక్స్ ఎందుకు అమ్ముతారు?

ఇప్పటికే కొనుగోలు చేసిన షేర్ల నుండి లాభం బుక్ చేయడానికి

మరింత నష్టం జరగకుండా ఉండడంకోసం, అధిక ధర వద్ద స్టాక్ కొనుగోలు చేసినట్లయితే మరియు ధరలు తగ్గడం ప్రారంభించినప్పుడు. ఎల్లప్పుడూ స్టాక్స్ పట్టుకొని కూర్చుని  ధరలు పెరగడానికి వేచి ఉండే ఎంపిక ఉన్నప్పటికీ, స్టాక్ ధరలు మరింత తగ్గితే, నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది

వారి డబ్బును ఆదా చేయడానికి, మరింత నష్టపోయే భయం నుండి ట్రేడర్లు ప్రాథమికంగా స్టాక్లను అమ్ముతారు

మీరు స్టాక్ మార్కెట్లో ఎంత డబ్బు సంపాదించవచ్చు?

ప్రశ్న ఒక సంతృప్తికరమైన సమాధానం పొందడానికి చాలా సాధారణమైనది. మీరు ఎంత డబ్బు తీసుకోవచ్చు అనేది ప్రధానంగా మీరు పెట్టుబడి పెడుతున్న మొత్తంపై ఆధారపడి ఉంటుంది. మీరు 10 నుండి 15 రెట్లు వరకు ట్రేడింగ్ సిస్టమ్స్ నుండి మార్జిన్ పొందుతారు. మీరు ఒక స్టాక్ కొనుగోలు చేసి దానిని 3 నెలల నుండి 3 సంవత్సరాల వరకు కలిగి ఉంటే, మీరు 30% నుండి 5 రెట్లు వరకు రాబడులు పొందవచ్చు.

ఇప్పుడు మనం అర్థం చేసుకున్నట్లుగా, ప్రతి రోజు ఒక స్టాక్  ధర మారుతూ ఉంటుంది. స్టాక్ ను బట్టి, ధరలు 10 పైసా నుండి రూ 1000 వరకు మారవచ్చు. కాబట్టి, మీ నైపుణ్యం అతి తక్కువ ధరను గుర్తించి మరియు అప్పుడు డెలివెరీ ట్రేడింగ్ లో షేర్ కొనుగోలు చేయడం మరియు ధరలు పెరిగినప్పుడు అది అమ్మడం లో ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ కొన్ని రోజుల నుండి ఒక సంవత్సరం వరకు ఉండచ్చు, కానీ మీ రాబడులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది ట్రేడర్ లు ఉపయోగించే అత్యంత సాధారణ ట్రేడింగ్ రకం. 

స్టాక్ మార్కెట్ నుండి డబ్బు ఎలా సంపాదించాలి

ట్రాక్ లో ఉండటానికి మీకు సహాయపడే కొన్ని సాధారణ మార్గదర్శకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

ప్రవర్తనా నియమావళి అనేది కీలకం మీ స్వంత క్రమబధ్ధమైన విధానాన్ని అభివృద్ధి చేయడానికి సమయం తీసుకోండి. మీరు సహనంగా ఉంటూ ఆశాజనకంగా ఉన్న షేర్లలో  క్రమబద్దంగా  పెట్టుబడి పెట్టడం వివేకవంతమైనది. స్టాక్ మార్కెట్ అస్థిరమైనది, మరియు మీరు విషయాలను ఎలా ప్లాన్ చేసుకున్నాసరే, రిస్కులు ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి, మీరు ఎల్లప్పుడూ లెక్కించబడిన రిస్క్ ని తీసుకొని  మరియు హెడ్జింగ్ వంటి అంతర్లీన స్టాక్స్ కు అవసరమైన ఎదురు చర్యను ప్లాన్ చేసుకోవాలి. సహనం మరియు ప్రవర్తనా నియమావళి తో ఉండటం అనేది మీరు పెద్ద చిత్రాన్ని చూడటానికి సహాయపడుతుంది, మరియు ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.

మీ పరిశోధన చేయండి

స్టాక్స్ ట్రేడింగ్ లో ఎవరూ అదృష్టవంతులు కారు; వారు కష్టపడి పని చేయవలసిన అవసరం ఉంది. వారి స్టాక్స్ కొనుగోలు చేయడానికి ముందు మీరు ఒక కంపెనీ గురించి మీ పరిశోధన చేయకపోతే. మీరు పెట్టుబడి పెట్టడానికి ముందు కొంత సమయం పక్కన పెట్టడం మంచిది, ఎందుకంటే అది మంచి పెట్టుబడి పెట్టడానికి మీ అవకాశాలను పెంచుతుంది. స్టాక్స్ ధరను చూడటానికి బదులు ఒక వ్యాపారం మరియు దాని భవిష్యత్తు అవకాశాలను అర్థం చేసుకోవడం మంచిది. మీరు అర్థం చేసుకున్న వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం మంచి ఫలితాలను అందిస్తుంది.

మీ పోర్ట్ ఫోలియోను విస్తరించడం పై పని చేయండి

వివిధ రకాల ఆస్తులను విస్తరించడం ద్వారా మీరు నెమ్మదిగా మీ పోర్ట్‌ఫోలియోను నిర్మించాలి. ఇలా చేయడం ద్వారా, మీరు మీ రాబడిని తక్కువ ప్రమాదంతో ఎక్కువ చేయవచ్చు.

మీరు ఎంచుకునే విభిన్నత రకం మరియు లెవెల్స్ మీపై పూర్తిగా ఆధారపడి ఉంటాయి, మరియు ఎల్లప్పుడూ ఒక పెట్టుబడిదారు నుండి ఇతరులకు మారుతూ ఉంటాయి. ఇది మార్కెట్ యొక్క అస్థిరతను అడ్డుకొనవచ్చు.

ట్రెండ్స్ అనాలోచితంగా అనుసరించకండి

మీరు స్టాక్ కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి తీసుకున్న ఏదైనా నిర్ణయం మీకు మాత్రమే ఉండాలి. అటువంటి నిర్ణయాలు బంధువులు లేదా స్నేహితుల అభిప్రాయాలపై ఆధారపడి ఉండకూడదు, అవి ఎంత సదాశయం కలిగి ఉన్నా సరేమీకు తెలిసిన వ్యక్తులు ఏమి చేస్తున్నారో లేదా ట్రెండ్ ఏమి అని అనిపిస్తున్నాదో కూడా మీ నిర్ణయాలు ప్రభావితం చేయకూడదు. మీ స్వంత ప్రవృత్తి పై ఆధారపడి ఉండండి.

కఠినమైన పర్యవేక్షణ అవసరం

మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని మరియు దానిలో మెరుగ్గా మారాలనుకుంటే, మీరు క్రమం తప్పకుండా వార్తలను ట్రాక్ చేసి మీకు ఆసక్తి ఉన్న కంపెనీల సంఘటనలను అనుసరించాలి. సంఘటనలు కొన్నిసార్లు స్టాక్ ధరలపై ప్రభావం చూపుతాయి. వాటిని దగ్గరగా అనుసరించటం వలన మీకు  ట్రెండ్స్ మరింత అంచనా వేయడానికి ప్రయోజనం లభిస్తుంది. కొన్నిసార్లు మీరు సంఘటనలను మరియు ఒక నిర్దిష్ట కంపెనీ షేర్లపై కలిగి ఉండగల ప్రభావం మధ్య సాధారణ లింకులను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా, మంచి లాభం కూడా స్టాక్ ధరలను అనుకూలంగా ప్రభావితం చేయవచ్చు.

వాస్తవిక అంచనాలు కలిగి వుండండి

మీ అంచనాలు ఎల్లప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండాలి.  ఈక్విటీ మార్కెట్ అకస్మాత్తుగా రాబడులను అందిస్తుంది. ఇది ఎల్లప్పుడూ ప్రతి పెట్టుబడిదారుని  సమయం మరియు సహనం పరీక్షిస్తుంది.  తార్కికంగా చెప్పాలంటే, నిరంతరం చాలా పెద్ద రాబడిని ఇవ్వగల ఆస్తి తరగతులు లేవు.  ప్రకృతి మార్గాల తిరోగమనం ద్వారా నిర్వహించబడుతుంది. అవాస్తవ అంచనాలు తప్పుడు ఊహలకు దారితీస్తాయి, ఇది చెడు నిర్ణయాల రూపంలో చాలా శోకాన్ని కలిగిస్తుంది.

ఒక నిరంతర నియమం ఏంటంటే స్టాక్ మార్కెట్ క్రమం తప్పకుండా ట్రేడర్లు అందరికి ప్రవేశాన్ని మరియు నిష్క్రమణ పాయింట్లను అందిస్తుంది. మీరు ట్రేడ్లో మీ క్యాష్ మొత్తాన్ని ఎన్నడూ పెట్టుబడి పెట్టకూడదు. ఎల్లప్పుడూ కొంత రిజర్వ్ చేసుకోండి. మార్కెట్ సవరణలు, తక్కువ ధరకు ఒక స్టాక్ లో పెట్టుబడి పెట్టడానికి మీకు అవకాశాలు ఇస్తాయి, ఇది ఒక ట్రెండ్ రివర్సల్ తర్వాత మీకు భారీ రాబడులు ఇవ్వగలదు.

సర్ప్లస్ ఫండ్స్ మాత్రమే పెట్టుబడి పెట్టండి

ఇంకొక తెలివైన నియమం మిగులు నిధులను మాత్రమే పెట్టుబడి పెట్టడం. సమీప భవిష్యత్తులో మీకు అవసరం లేని డబ్బు ఇందులో పెట్టండి. షేర్ మార్కెట్ తరచుగా హెచ్చుతగ్గులకు లోనవుతుంది కాబట్టి, మీరు నష్టాన్ని ఎల్లప్పుడూ తాత్కాలికంగానే  ఎదుర్కొనే ప్రమాదం ఉంది. స్టాక్ మార్కెట్ పోకడల యొక్క కదలికలు చక్రీయమైనవి. పోకడలలో మార్పులను అర్థం చేసుకోవడానికి మీకు డొమైన్‌లో నైపుణ్యం అవసరం.

మీరు దృష్టి పెట్టవలసిన అంశాలు

 1. షేర్ మార్కెట్లో మీ ప్రవేశ పాయింట్
 2. ఎప్పుడు స్టాక్స్ అమ్మాలి మరియు మార్కెట్ నుండి నిష్క్రమించాలి
 3. మీరు పెట్టుబడి పెట్టిన మూలధనాన్ని ఎలా రక్షించాలి
 4. ఒక ట్రేడ్ తప్పు మార్గంలో వెళుతున్నప్పుడు ఎలా బయటపడాలి 
 5. ట్రేడింగ్ లో ప్రతి ట్రేడర్ నష్టపోతారు. మీరు భరించగలిగే నష్టాన్ని బట్టి స్టాక్లను ఎప్పుడు విక్రయించాలో తెలుసుకోవడం కిటుకు.

ముగింపు

మీరు మీ పెట్టుబడులను సకాలంలో చేస్తే, మీరు స్టాక్ ధర గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఇది మీకు సహాయంగా పెరుగుతుంది. స్టాక్ ధర దిగువకు చేరుకున్నప్పుడు గుర్తించదగినది ఏమిటంటే అప్పుడు మీరు సమయంలో స్టాక్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, తర్వాత ధరలు మళ్ళీ పెరుగుతాయి, సమయంలో, మీరు వాటిని అమ్మవచ్చు. ఇది మొత్తం షేర్ మార్కెట్ నియంత్రించే ప్రాథమిక నియమంధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనండి మరియు అవి ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మండి . ఇది చాలా సులభంగా ఉండవచ్చు, కానీ ఇది అనుసరించడం చాలా కష్టం, ఎందుకంటే ఖచ్చితమైన దిగువ స్థానం గుర్తించడం చాలా కష్టం. కాబట్టి, కొనుగోలు మరియు అమ్మకం చాలా కీలకమైనది అని తెలుసుకోవడం, మరియు మీరు దానిపై పని చేయాలి.

మీరు స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినప్పుడు పైన పేర్కొన్న చిట్కాలు మరియు కిటుకులు అవసరమైన మార్గదర్శకాలు కావచ్చు. మార్కెట్ యొక్క కదలిక కొన్ని సమయాల్లో యాదృచ్ఛికంగా మరియు గందరగోళంగా ఉంటుందని మాకు తెలుసు, ఏదైనా వ్యూహాన్ని అనుసరించడం చాలా కష్టమవుతుంది. కానీ, మీరు నాణ్యమైన స్టాక్లలో పెట్టుబడి పెడితే, అవి ఎల్లప్పుడూ దీర్ఘకాలంలో లాభాలు చూపిస్తాయి.

నిష్క్రమణ ఎప్పుడు చేయాలో మీరు ఎల్లప్పుడూ తెలుసుకోవాలి. సకాలంలో నిష్క్రమించడం ద్వారా మీరు ఈ రోజు ఆదా చేసే డబ్బు సంపాదించిన డబ్బుకు సమానం. పొజిషన్ చాలా అసమానంగా ఉందని మీరు భావిస్తే, నిష్క్రమించడంలో సిగ్గు పడకూడదు.