బుల్ మార్కెట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి

1 min read
by Angel One

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అనేది నిరంతర ప్రక్రియ. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు, మీరు ట్రెండ్ పెరిగే మార్కెట్ నుండి పెరుగుతున్న క్యాపిటల్ ను చూస్తూ, నష్టాలకు వ్యతిరేకంగా మీ పోర్ట్ఫోలియోను హెడ్జ్ చేసుకోవాలి మరియు మార్కెట్లలో అస్థిరత కాలవ్యవధులను మీ ప్రయోజనానికి ఉపయోగించుకోవాలి. వృధ్ధికి అవకాశాలు బుల్ మరియు బేర్ మార్కెట్లు రెండింటిలోనూ ఉన్నాయి. ఈ రెండు రకాల మార్కెట్లు అపాయాలతో నిండినవి. ఏదేమైనా, రిస్క్ మరియు అనిశ్చితతో నిర్ణయాలు తీసుకోవడం ఈక్విటీ పెట్టుబడి యొక్క సారాంశం. నిర్ణయం తీసుకోవడానికి క్రమశిక్షణ, స్థిరత మరియు దృష్టి అవసరం. ఈ లక్షణాలతో ఒక పెట్టుబడిదారుడు బుల్ మార్కెట్ అందించే అవకాశాలను ఉపయోగించుకుంటాడు మరియు అభివృద్ధి చెందుతాడు.

బుల్ మార్కెట్ అంటే ఏమిటి?

మార్కెట్  కొంతకాలం ధరల పెరుగుదలతో ఉండడం అనేది బుల్ మార్కెట్ యొక్క లక్షణం. సాధారణంగా ఈక్విటీ ధరల పెరుగుదలతో సంబంధం కలిగి ఉండే ఒక బుల్ రన్ రియల్ ఎస్టేట్ వంటి ఇతర పెట్టుబడులకూ విస్తరించవచ్చు.

బుల్ మార్కెట్లలో ఎలా పెట్టుబడి పెట్టాలి:

బుల్ మార్కెట్లు సంపద సృష్టించడానికి తగిన అవకాశాన్ని కల్పిస్తాయి. ఇది ముందుగానే స్టాక్స్ కొనుగోలు చేయడం మరియు అధిక రేట్ల వద్ద అమ్మడం ద్వారా పెరుగుతున్న ధరలను సద్వినియోగం చేసుకోవడానికి ఇది అనువైన సమయం. ఒక బుల్ రన్ లో నష్టాలు స్వల్పం మరియు పెట్టుబడిదారుడు రాబడిని సంపాదించడానికి ఎక్కువ సంభావ్యత ఉంటుంది. బుల్ మార్కెట్లో లాభం పొందే కొన్ని మార్గాలు క్రింది విధంగా ఉన్నాయి:

వ్యక్తిగత లక్ష్యాలను అంచనా వేయడంమీ స్వంత లక్ష్యాలను అంచనా వేయడం అనేది తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మొదటి చర్య. ఒక వ్యక్తిగత అంచనా అనేది మీ వయస్సు మరియు మీ పెట్టుబడులను ప్రభావితం చేసే ఇతర కారకాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు, ఒక 30-సంవత్సరాల వ్యక్తి యొక్క రిస్క్-తీసుకునే సామర్థ్యం  ఒక 60-సంవత్సరాల వ్యక్తి నుండి భిన్నంగా ఉంటుంది.  అందువల్ల వారు ఎంచుకునే ఈక్విటీ కూడా మారుతుంది.

లాంగ్ పొజిషన్స్ మీ స్టాక్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం అంటే వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేయడం మరియు ధర పెరిగినప్పుడు అమ్మడం. ధర పెరుగుతుందని ముందుగా గ్రహించి కొనుగోలు చేయబడుతుంది.

బలమైన మూలసింద్ధాంతాలు కల కంపెనీలలో కొనండిఅభివృద్ధి చరిత్ర కలిగిన కంపెనీలలో పెట్టుబడి పెట్టండి. కంపెనీ తయారుచేసే ఉత్పత్తులకున్న డిమాండ్ ను మరియు దాని అమ్మకాలు మరియు ఆదాయాల కోసం తనిఖీ చేయండి.

కాల్ ఆప్షన్స్ ఉపయోగించండి కాల్ ఆప్షన్లో, పెట్టుబడిదారుడు ఒక నిర్దిష్ట తేదీన స్ట్రైక్ ధర అనే నిర్దిష్ట ధరకు ఒక స్టాక్‌ను కొనుగోలు చేసే హక్కు కలిగి ఉంటాడు. స్టాక్ ధరలు స్ట్రైక్ ధరకు మించి కదిలినప్పుడు, పెట్టుబడిదారుడు తక్కువ స్ట్రైక్ ధరకు స్టాక్ కొనుగోలు చేసే ఎంపిక ఉంటుంది మరియు అప్పుడు దానిని అధిక ధరలో బహిరంగ మార్కెట్లో అమ్మే అవకాశం ఉంది, తద్వారా లాభం పొందుతారు.

పడిపోయిన స్టాక్స్ కొనుగోలు చేయండిబుల్ రన్ కి ముందు ఉండే బేర్ మార్కెట్, స్టాక్స్ వాటి బుక్ విలువకు దగ్గరలో ఉండే ధరకు షేర్లు కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. మీరు ఈ దశలో తక్కువ ధరతో మంచి వృద్ధి కంపెనీల షేర్లను కొనుగోలు చేయవచ్చు.

మీ పోర్ట్‌ ఫోలియోను వైవిధ్యపరచండి మీరు మీ పోర్ట్ఫోలియోకు స్టాక్‌లను జోడించడం ప్రారంభించడానికి ముందు మీ పరిస్థితిని విశ్లేషించండి మరియు స్టాక్స్ లో మాత్రమే కాకుండా బాండ్లు మరియు బ్యాంక్ పొదుపులు వంటి ఈక్విటీ-కాని ఉత్పత్తులలో కూడా పెట్టుబడులు పెట్టండి.

వేర్వేరు స్టాక్  వర్గాలను ఎంచుకోండిస్మాల్ క్యాప్ స్టాక్స్ అసాధారణ వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కానీ తదనుగుణంగా ఎక్కువ రిస్క్ కలిగి ఉంటాయి. ఒక లార్జ్ క్యాప్ స్టాక్ తెలిసిన మార్కెట్ లీడర్. మీ పోర్ట్ఫోలియో వివిధ స్టాక్ వర్గాలు కలిగి ఉండాలి మరియు ఒకే దానిపై దృష్టి పెట్టకూడదు.

వివిధ పరిశ్రమలను ఎంచుకోండిఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు కొన్ని పరిశ్రమలు పెరుగుతాయి మరియు ప్రజలు మళ్ళీ ఖర్చు చేయడం ప్రారంభిస్తారు. హౌసింగ్, ఆటోమొబైల్, టెక్నాలజీ పరిశ్రమ మరియు పారిశ్రామిక పరికరాలు వంటి స్టాక్స్ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి నుండి లాభం పొందే అవకాశం ఉంది.

తప్పులు చేయడం నివారించండి:

ప్రతి పెట్టుబడిదారుడు బుల్ మార్కెట్లో ఈ క్రింది తప్పులు చేయడాన్ని నివారించడానికి ప్రయత్నించాలి:

ట్రేడింగ్ వ్యూహాలతో ప్రయోగాలు చేయడం – ట్రేడింగ్, పెట్టుబడికి నుండి భిన్నంగా ఉంటుంది, ట్రేడింగ్  అనేది తక్కువ వ్యవధిలో లాభాలను కల్పిస్తుంది, అయితే పెట్టుబడులు ధీర్గకాలంలో సంపదను సృష్టిస్తాయి. ట్రేడింగ్ కు అనుభవం మరియు నైపుణ్యం అవసరం మరియు రిటైల్ పెట్టుబడిదారులు దీనిని నివారించాలి.

మార్కెట్ టైమింగ్లు మార్కెట్లు అంచనా వేయడం కష్టం. ఇంకా చాలామంది తక్కువ ధరల వద్ద కొనుగోలు చేయడానికి మరియు ఎక్కువ ధరల వద్ద అమ్మడానికి మార్కెట్ ను టైమ్ చెయ్యడానికి ప్రయత్నిస్తారు. పెద్ద పెద్ద ట్రేడర్లు కూడా అటువంటి వ్యూహాలకు వ్యతిరేకంగా సలహా ఇస్తారు. 

మందను అనుసరించండిబుల్ రన్ లో చాలామంది బలమైన మూలసిద్ధాంతాలు లేనటువంటి మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ లలో పెట్టుబడి పెడతారు. బుల్ రన్ లో మిడ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచిది.

ముగింపు:

స్టాక్ మార్కెట్ దీర్ఘకాలంలో సానుకూల రాబడులను ఇస్తుంది. అయితే, మీరు గరిష్టంగా బుల్ మార్కెట్ నుండి సంపాదించాలని చూస్తున్నట్లయితే, పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి ముందు కొంత సమయం తీసుకోవలసిన అవసరం ఉంది.