SIP అంటే ఏమిటి మరియు దాని ప్రయోజనాలు

1 min read

SIP అంటే ఏమిటి మరియు దాని ప్రయోజనాలు ఏమిటి?

ఆశీష్ ని కలవండి. తన జీతం పెరుగుదలతో, ఆశిష్ పొదుపు చేయడం ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాడు. రవి, ఆశీష్ యొక్క సహచరుడు మరియు ఏంజెల్ బ్రోకింగ్ లో ఒక చురుకైన ట్రేడర్ SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) లో పెట్టమని  సలహా ఇచ్చాడు. రవి ఈ విధంగా వివరించాడు:

SIP లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి ఒక శిక్షణాత్మక పద్ధతి. మీ సౌకర్యం ప్రకారం నెలవారీ లేదా మూడు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తంలో ఉదాహరణకు రూ. 1000 పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఒక పోర్ట్‌ఫోలియోను నిర్మించవచ్చు.

SIP అనేక ప్రయోజనాలను అందిస్తుంది:

ఇది మీ జేబుకు అంత భారంగా ఉండదు మరియు క్రమశిక్షణ దృఢపరుస్తుంది మరియు కొత్త పెట్టుబడిదారులకు చాలా అనువైనది

ఇది ఇబ్బందులు లేనిది: ఒకసారి ప్రారంభించిన తరువాత, మొత్తం ECS ద్వారా ఆటోమేటిక్ గా మినహాయించబడుతుంది.

మీరు వివిధ ధరలలో మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేస్తారు, కాబట్టి మీరు మార్కెట్ లేదా మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి చింతించవలసిన అవసరం లేదు. ఇది మెరుగైన రాబడులను పొందడానికి మీకు సహాయపడుతుంది. ఏకమొత్తం పెట్టుబడులలో, మీరు కొంత కాలం ఆదా చేసి, తరువాత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. SIPతో, ఆశీష్ మొదటి రోజు నుండే రాబడులు పొందడం ప్రారంభించాడు, కాంపౌండింగ్ యొక్క శక్తిని అనుభవిస్తూ. ప్రయోజనాలను పొందడానికి, ఏంజెల్ బ్రోకింగ్ తో SIPలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించడానికి ఆశీష్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు.