భారతదేశంలో ఒకానొకప్పుడు  ట్రేడింగ్ అనేది, ముఖ్యంగా స్టాక్స్ లో, ఒక అధిక-రిస్క్ గేమ్ అని ప్రముఖ విశ్వాసం ఉండేది. పరిశ్రమలలో పనిచేసేవారికి ట్రేడింగ్ వదిలి పెట్టి అందుకు బదులుగా, ఇతర రకాల పెట్టుబడులను కోరుకోవడం ఉత్తమంగా పరిగణించబడేది. అయితే, నేటి యుగంలో, టెక్నాలజీ అనేది దేశంలో ట్రేడింగ్ కు చాలా మొమెంటం ఇచ్చింది.

ఆర్థిక మార్కెట్ల యొక్క ప్రాథమిక అవగాహనతో, ఎవరైనా సరైన వాణిజ్య పద్ధతుల నుండి ప్రతిఫలాలను పొందడం ప్రారంభించవచ్చు. భారతదేశంలో ట్రేడింగ్ గేమ్ ను కొత్తగా ప్రారంభించేవారు సాధారణంగా ఇంట్రాడే ట్రేడింగ్ తో వారి ట్రేడింగ్ అనుభవాన్ని ప్రారంభిస్తారు.

భారతదేశంలో ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏమిటి? 

‘ఇంట్రాడే’ అనే పదం అంటే ‘ఒక రోజులోపు’’ అని అర్ధం. ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఒకే రోజు వ్యవధిలో ట్రేడింగ్ చేస్తున్న కమోడిటీలను కొనుగోలు చేయడం లేదా విక్రయించే వ్యవస్థను సూచిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు విరుద్ధంగా, ఇంట్రాడే ట్రేడింగ్ అంటే మార్కెట్ మూసివేసే సమయంలో వ్యాపారి తన అన్ని వ్యాపారాలను స్క్వేర్ ఆఫ్ చేస్తారు అని అర్థం. ఇంట్రాడే ట్రేడర్లు సాధారణంగా పెట్టుబడి పెట్టకుండా లాభాలు పొందడానికి చూస్తుంటారు. 

భారతదేశంలో ట్రేడింగ్ అకౌంట్లకు ఇటీవలి జనాదరణ వరకు, ప్రొఫెషనల్స్, బ్యాంకులు మరియు ఇతర సంస్థల ద్వారా అవలంబించబడే ఉత్తమమైన పద్ధతిగా ఇంట్రాడే ట్రేడింగ్ పరిగణించబడింది. అయితే, ఈ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ అన్ని బ్యాక్‌గ్రౌండ్ల వ్యాపారులచే నిర్వహించబడుతోంది.

భారతదేశంలో ఇంట్రాడే ట్రేడింగ్ సాధారణంగా ఈక్విటీ మార్కెట్లో ఉన్న స్టాక్స్ లో ట్రేడింగ్ చేయటానికి ఉపయోగించబడుతుంది. అయితే, కమోడిటీలు లేదా కరెన్సీ వంటి ఇతర రకాల సెక్యూరిటీలలో ఇంట్రాడే ట్రేడింగ్ కూడా ఎంతోమంది ప్రాధాన్యతనిచ్చే లాభదాయకమైన ఎంపికలు. 

భారతదేశంలో ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా ప్రారంభించాలి

ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అవసరమైన ప్రాథమిక విషయాలన్నీ ఉండగా, ఇంట్రాడే ట్రేడింగ్ ప్రారంభించడానికి ప్రాసెస్ యొక్క వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

– మొదట, సమయంతో ఒక రఫ్ ఇంట్రాడే ట్రేడింగ్ అభివృద్ధి చేయడం అవసరం, దానిని రిఫైన్ చేయడానికి ట్రేడర్ తగినంత అనుభవాన్ని పొందుతారు, కానీ ఇప్పటికీ సరిగ్గా ప్రారంభించే సమయంలో ఒక రఫ్ స్ట్రాటెజీని రూపొందించడం సిఫార్సు చేయబడింది.

– అప్పుడు, ట్రేడర్ తన ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఎంత క్యాపిటల్ పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాడు అనేది నిర్ణయించాలి. ప్రతి ఫైనాన్షియల్ మార్కెట్ దాని స్వంత ఎంట్రీ క్యాపిటల్ ఆవశ్యకత భాగాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి అతను ప్లాన్ చేసి తదనుగుణంగా కొనసాగాలి.

– డెమో లేదా ట్రయల్ ట్రేడింగ్ అకౌంట్‌తో మీ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటెజీలను ప్రాక్టీస్ చేయండి. ఈ వర్చువల్ ట్రేడింగ్ అకౌంట్లు వర్చువల్ డబ్బుతో మీ వ్యూహాలను ప్రయత్నించే ఎంపికను అందిస్తాయి. ఒక కొత్త వ్యాపారికి ఎలా ప్రారంభించాలి అనేదాని గురించి ఒక చక్కటి అవగాహన కల్పించడానికి అవి ఆదర్శంగా ఉంటాయి. ట్రయల్ మరియు ఎర్రర్ కోసం చాలా అవకాశంతో, ఇంట్రాడే ట్రేడింగ్ లైవ్ నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాన్ని మీరు అభివృద్ధి చేసుకుంటారు.

+ ఒక ట్రేడింగ్ మరియు డీమ్యాట్ అకౌంట్ తెరవండి. మీరు ఇప్పటికే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నట్లయితే, ఇంట్రాడే ట్రేడింగ్‌కు అంకితమైన ఒక ప్రత్యేక ఖాతాను తెరవడం ఉత్తమమైనది.

– బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లేదా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి సంబంధిత ఎక్స్చేంజ్లకు మిమ్మల్ని కనెక్ట్ చేయగల బ్రోకరేజ్ సంస్థను కనుగొనండి, మరియు ట్రేడింగ్ ప్రారంభించండి. భారతదేశంలో ఇంట్రాడే ట్రేడింగ్ యొక్క అత్యంత ముఖ్యమైన భాగాల్లో ఒకటి ఒక విశ్వసనీయ బ్రోకరేజ్ సంస్థతో కనెక్ట్ అవడం.

భారతదేశంలో మీ ట్రేడింగ్ బ్రోకర్‌ను ఎంచుకోవడం 

ఒక సాఫీగా సాగిపోయే ఇంట్రాడే అనుభవం మరియు ఒక అప్రియమైనదానికి మధ్య ముఖ్యమైన వ్యత్యాసం అనేది ఒక సరైన బ్రోకరేజ్ సంస్థ కావచ్చు. భారతదేశంలో ట్రేడింగ్ బ్రోకర్‌ను ఎంచుకోవడానికి ముందు మీరు పరిగణించాల్సిన అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

వేగం

ఒక ఇంట్రాడే బ్రోకర్ గా, మీ రోజువారీ లాభాలు మీ వ్యాపారాలు ఎలా అమలు చేయబడతాయి అనేదానిపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఆదర్శవంతమైన బ్రోకరేజ్ సంస్థ వేగవంతమైన, సాఫీగా సాగిపోయే ట్రేడింగ్ అనుభవాన్ని అందించాలి.

ఫీజులు మరియు కమిషన్లు

కావలసిన మార్కెట్‌కు వ్యాపారిని కనెక్ట్ చేసే వారి సేవలకు బదులుగా, బ్రోకర్లు ఒక ఫీజు లేదా కమిషన్ వసూలు చేస్తారు. అందువల్ల, వారి విలువకు తగిన మరియు పోటీ ఫీజులు మరియు కమిషన్లను అందించే ఒక బ్రోకర్‌ను కనుగొనడం ముఖ్యం.

మద్దతు

ఏదైనా ఇతర రకం వ్యాపారుల కంటే ఎక్కువగా, రోజు మొత్తం వారి వ్యాపారాలతో కనెక్ట్ అయి ఉండటం ఇంట్రాడే ట్రేడర్స్ కు ముఖ్యం. ఇది ట్రేడ్ చేయడానికి ఉత్పన్నమయ్యే ప్రతి చిన్న అవకాశాన్ని ట్రాక్ చేయడానికి వారికి సహాయపడుతుంది. ఒకవేళ డిస్కనెక్షన్ ఉంటే, లేదా తాత్కాలిక సమస్య కూడా ఉన్నట్లయితే, అది నష్టపోవచ్చు. అందువల్ల, సరైన బ్రోకరేజ్ సంస్థ అనేది ట్రేడింగ్ సమస్యల సమయంలో వర్తకులకు తగినంత మద్దతు అందించేది. 

మార్గదర్శకత్వం

ట్రేడింగ్ విషయం గురించి ఇంటర్నెట్‌లో వివిధ రకాల సమాచారం అందుబాటులో ఉంది. అయితే, మీ బ్రోకరేజ్ సంస్థ ఆ విషయంలో ఒక అధికారం అయి ఉండాలి. ఒక ఆదర్శవంతమైన బ్రోకరేజ్ సంస్థ పరిశోధన ఆధారంగా వ్యాపారులకు అవగాహన కల్పిస్తుంది

ముగింపు

ఇంట్రాడే ట్రేడింగ్ ఇంతకు ముందు అసాధారణంగా ఉండి, భారతీయులు ఈ వాణిజ్య పద్ధతిలోకి ప్రవేశించడానికి టెక్నాలజీ అనుమతించింది. కొంత ప్రాథమిక జ్ఞానం మరియు సరైన వ్యూహాలతో, భారతదేశంలోని వ్యాపారులు ట్రేడింగ్ అకౌంట్ తెరవడం ద్వారా ఇంట్రాడే ట్రేడింగ్ ప్రారంభించవచ్చు. చాలా ముఖ్యంగా, మీ ట్రేడింగ్ వెంచర్‌లో మీకు మద్దతు ఇవ్వడానికి ఒక విశ్వసనీయమైన బ్రోకరేజ్ సంస్థను కనుగొనడం ముఖ్యం.

ఏంజిల్ బ్రోకింగ్ భారతదేశంలో ట్రేడర్లకు ఇంట్రాడే ట్రేడింగ్ ప్రారంభించడానికి సహాయపడటానికి వివిధ ఫీచర్లను అందిస్తుంది. ఇది ఒక టెక్నాలజీ-ఎనేబుల్డ్ డీమ్యాట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ అలాగే టెక్నికల్ మరియు ఫండమెంటల్ రీసెర్చ్ గైడెన్స్ అందిస్తుంది. అంతేకాకుండా, ఇది ప్రారంభ ఇంట్రాడే వ్యాపారులకు వారి వ్యూహాలను అమలు చేయడానికి ఒక ట్రయల్ అకౌంట్‌ను అందిస్తుంది.