స్టాక్ చార్ట్స్ ఎలా చదవాలి

1 min read
by Angel One

పరిచయం:

సంపద నిర్మించడానికి స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? ఇది శిశువు యొక్క మొదటి అడుగు వేయడంతో ప్రారంభమవుతుంది – ఒక స్టాక్ చార్ట్ ఎలా చదవాలో నేర్చుకోవడం. స్టాక్ పెట్టుబడి పెట్టడానికి ఒక స్టాక్ చార్ట్ అర్థం చేసుకోవడం ప్రాథమికమైనది.

స్టాక్ చార్ట్ అంటే ఏమిటి?

ఒక స్టాక్ చార్ట్ అనేది సమయం వ్యాప్తంగా ఒక కంపెనీ లేదా సూచిక యొక్క ఒక నిర్దిష్ట స్టాక్ యొక్క ధర చార్ట్. X -యాక్సిస్ లో ఉన్నది టైమ్ ఫ్రేమ్ (రోజువారీ, వారానికి, నెలవారీ లేదా వార్షిక) మరియు Y -యాక్సిస్ లో ఉన్నది స్టాక్ ధర. ఇది మార్కెట్లో ఒక నిర్దిష్ట స్టాక్ ఎలా చేస్తోంది అనేందుకు మీరు పూర్తి చిత్రాన్ని పొందటానికి ఇతర సమాచార భాగాలను కూడా సూచిస్తుంది.

స్టాక్ చార్ట్స్ ఎలా చదవాలో మీకు ఎందుకు తెలుసుకోవాలి?

స్టాక్ చార్ట్స్ ఎలా చదవాలో తెలియకుండా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అనేది చీకట్లో షూటింగ్ లాగా ఉంటుంది. ఇందుకోసం మీరు స్టాక్ చార్ట్స్ చదవడానికి కళలో ఆరితేరాలి

  • సకాలంలో విన్నింగ్ స్టాక్స్ ఎంచుకోవడం,
  • వాటిని కొనుగోలు చేయగలగడం,
  • ఒక స్టాక్ ఎప్పుడు విక్రయించాలో తెలుసుకోవడం
  • స్టాక్ వేగవంతంగా విక్రయించబడుతోందా లేదా అది డిమాండ్ లో ఉందా అనేది తెలుసుకోవడం ( ఉధృతంగా కొనుగోలు చేయబడుతోంది)
  • స్టాక్స్ యొక్క ధర కదలికలలో ట్రెండ్లను అధ్యయనం చేయండి – అవి అస్థిరగా ఉన్నాయా లేదా స్థిరంగా ఉన్నాయా  లేదా  అవి నిర్దిష్ట ధర పాయింట్ల వద్ద ప్లాటూ అయ్యాయా

సోర్స్; యాహూ! ఫైనాన్స్

స్టాక్ చార్ట్స్ ఎలా చదవాలి?

ఒక నిర్దిష్ట స్టాక్ ను చూడడం ద్వారా మీరు ప్రారంభించవచ్చు, ఉదాహరణకు, ఐటిసి.

స్టాక్ సింబల్ మరియు ఎక్స్చేంజ్

ఎడమవైపున మీరు కంపెనీ పేరు, దాని స్టాక్ సింబల్ (టిక్కర్ అని కూడా పిలుస్తారు) మరియు షేర్ ట్రేడ్స్ యొక్క ఎక్స్చేంజ్ పేరును కనుగొంటారు.

చార్ట్ వ్యవధి

స్టాక్ చార్ట్ అనేది ఒక కాలంపాటు స్టాక్ ధర యొక్క కదలికను చదవడానికి మీకు ఎంపికను ఇస్తుంది, ఇంట్రాడే నుండి వారానికి, నెలవారీ, వార్షిక మరియు బహుళ-సంవత్సరాల డేటా వరకు.  సాధారణంగా, స్వల్పకాలిక ధర కదలికల గురించి తెలుసుకోవడానికి వ్యాపారులు రోజువారీ మరియు ఇంట్రాడే డేటా కోసం చూస్తారు. స్టాక్ మార్కెట్లు అస్థిరమైనవి కాబట్టి, వారు తక్షణమే ఒక నిర్దిష్ట స్టాక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా లేదా కొన్ని రోజులపాటు ఆపివేయాలనుకుంటున్నారా అని నిర్ణయించుకోవడానికి పెట్టుబడిదారులు సాధారణంగా అటువంటి చార్ట్స్ చూస్తారు. దీర్ఘకాలంలో ట్రెండ్లను గుర్తించడానికి, వారు నెలవారీ లేదా వార్షిక డేటాను చూస్తారు.

ధర మార్పులు

టిక్కర్ సింబల్ పై మౌస్ ని హోవర్ చేసిన మీదట, మీరు  ఒహెచ్ఎల్సి డేటా అని పిలువబడే రోజులో స్టాక్ యొక్క ట్రేడింగ్ కార్యకలాపాల గురించిన కీలక డేటాను చూస్తారు.

  • రోజు యొక్క ఓపెన్: ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు స్టాక్ ధర.
  • రోజు యొక్క ముగింపు: ఒక వ్యాపార రోజు చివరిలో స్టాక్ ధర.
  • రోజు యొక్క ఎక్కువ: రోజులో స్టాక్ యొక్క అత్యధిక ధర.
  • రోజు యొక్క తక్కువ: రోజులో స్టాక్ వర్తకం చేయబడే అతి తక్కువ ధర.

నికర మార్పు

రోజువారీ స్టాక్ చార్ట్ కోసం, స్టాక్ ధర మరియు శాతం మార్పులో నికర మార్పు గ్రీన్ లేదా రెడ్ లో చూపబడుతుంది, ఇది మునుపటి వ్యాపార రోజు మూసివేయబడిన అంకె నుండి ధర పెరిగిపోతుందా లేదా పడిపోతుందా అనేదానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి చిత్రంలో, +0.10 అనేది మునుపటి రోజు మూసివేత నుండి ఐటిసి యొక్క స్టాక్ ధరలో లాభం, మరియు +0.04% అనేది శాతం లాభం. 

మీరు ఒక లైన్ రూపంలో ప్లాట్ చేయబడిన ప్రాథమిక సమాచారాన్ని కూడా కనుగొనవచ్చు (సాధారణంగా ప్లాటింగ్ లైన్ మూసివేసే ధరను మాత్రమే సూచిస్తుంది), ఒక బార్ చార్ట్ (ప్రతి రోజు కోసం ఓహెచ్ఎల్సి డేటాను ప్లాట్ చేస్తుంది) లేదా కొవ్వొత్తి మరియు స్టిక్ చార్ట్స్.

లైన్ చార్ట్ (సోర్స్: యాహూ!ఫైనాన్స్)

కొవ్వొత్తులు మరియు స్టిక్స్ తో చార్ట్ (సోర్స్: యాహూ! ఫైనాన్స్)

ఒక కొవ్వొత్తి మరియు స్టిక్ చార్ట్ ప్రతి రోజు ధరలు ఎంత కదిలాయో మీకు ఒక దృక్పథం ఇస్తుంది. ఈ రకం చార్ట్ (పైన చూపించబడినది) లో, కొవ్వొత్తులు రోజులో ధర కదలిక యొక్క రేంజ్ (మూసివేయడం మరియు తెరవడం) ను సూచిస్తాయి. కాబట్టి కొవ్వొత్తి శరీరం పొడవుగా ఉంటే, ముఖ్యమైన ధర కదలిక ఉందని మీకు తెలుస్తుంది, మరియు కొవ్వొత్తి తక్కువగా ఉంటే, అది ధరల ఒక మరింత టైట్ పరిధిలోకి కదలినట్లుగా చూపుతుంది.   స్టాక్ యొక్క మూసివేత ధర దాని ప్రారంభ ధర కంటే ఎక్కువగా ఉందని, స్టాక్ ధరలో నికర లాభం అని గ్రీన్ కొవ్వొత్తులు చూపుతాయి. ఒక రెడ్ కొవ్వొత్తి తెరవడం నుండి స్టాక్ ధరలో నికర పడిపోవడాన్ని సూచిస్తుంది.

వాల్యూమ్

మరొక ముఖ్యమైన డేటా పాయింట్ వాల్యూమ్. ఒక సాధారణ రోజువారీ స్టాక్ చార్ట్ లో, మీరు ఒక నిర్దిష్ట వ్యాపార రోజు పై మౌస్ ని హోవర్ చేయడం ద్వారా వాణిజ్య పరిమాణాలను కనుగొనవచ్చు.

రోజువారీ చార్ట్ లో, వాల్యూమ్ అనేది ట్రేడ్ చేయబడిన స్టాక్ యొక్క షేర్ యూనిట్ల సంఖ్య. ఇది ఒక నిర్దిష్ట ధర పాయింట్ వద్ద స్టాక్ కోసం డిమాండ్ ప్రతిబింబిస్తుంది. వ్యాపారాలు తక్కువగా ఉంటే, అప్పుడు పేర్కొన్న ధర పాయింట్ వద్ద స్టాక్ కొనుగోలు లేదా విక్రయించడం ఎక్కువ ఆసక్తి లేదని దీని అర్థం. వ్యాపార పరిమాణాలు ఎక్కువగా ఉంటే, అది కొనుగోలుదారులు మరియు విక్రేతల సక్రియ భాగస్వామ్యాన్ని సూచిస్తుంది.

సరైన దృష్టిలో ధర మరియు వాల్యూమ్ చదవడం

మీరు వాల్యూమ్ లో మార్పు సందర్భంలో ధర కదలికను చదవాలి. అవి రెండూ ఒక స్టాక్ చార్ట్ అర్థం చేసుకోవడంలో కలిసి వెళ్తాయి. గణనీయమైన ధర మార్పు ఉంటే, దానిపై చర్యకు ముందు, మీరు వాల్యూమ్ ను చూడాలి. ధర మార్పు ఒక అసాధారణమైన లేదా ఒక ఆఫ్ కారణంగా ఉండవచ్చు మరియు ఉధృతంగా కొనుగోలు మరియు అమ్మకం కారణంగా కాకపోవచ్చు. కానీ ధర మార్పు అనేదానితో పాటుగా వాల్యూమ్ లో ఒక ముఖ్యమైన పెరుగుదల లేదా తగ్గుదల ఉంటే, అది పెద్ద పెట్టుబడిదారుల ద్వారా షేర్లను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం గురించి మీకు మరింత వాస్తవమైన చిత్రాన్ని ఇస్తుంది. 

ఉదాహరణకు, ముందు రోజు నుండి ఒక స్టాక్ ధరలో 3% డ్రాప్ లేదా 3% లాభం ఉందని ఊహించండి. ఈ సమాచారం ఒక్కటే మిమ్మల్ని హైరానా పరచవచ్చు. కానీ మీరు ట్రేడింగ్ వాల్యూమ్ సగటు కంటే తక్కువగా ఉందని చూస్తే, అది ఒక  ఏదో ఎప్పుడో ఒకటి మార్పు అని మరియు పెద్ద పెట్టుబడిదారులు ఇప్పటికీ బయటే ఉన్నారని మీకు తెలుస్తుంది.

ట్రెండ్ లైన్ చదవడం

స్టాక్ మార్కెట్ చార్ట్స్ ఎలా చదవాలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నవారు బ్లూ లైన్ అంతా దేని గురించి  అని ఆశ్చర్యపోవచ్చు. పైన ఉన్న చిత్రంలో నిండా క్రెస్టులు మరియు ట్రఫ్స్ ఉన్న బ్లూ ట్రెండ్ లైన్, సమయ వ్యవధిలో నిజమైన ధర కదలికను చూపుతుంది. ఒక కంపెనీ యొక్క స్టాక్ యొక్క ధర కదలికలలో మీరు నిర్దిష్ట స్థిరమైన పోకడలను గమనించినప్పుడు, మార్పును వివరించడానికి నిర్దిష్ట ఈవెంట్లు లేదా వార్తలు ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి మీరు లోతుగా వెళ్ళాలి. ఆ అభివృద్ధి అనేది ఇతర అవసరమైన ట్రిగర్స్ తోపాటుగా, కంపెనీ-కేంద్రీకృత, ఆర్థిక వ్యవస్థ కేంద్రీకృత, గ్లోబల్ మాక్రోఎకానమిక్ కారకాలు కారణంగా, లేదా ఒక బేరిష్ (సబ్డ్యూడ్ సెంటిమెంట్) లేదా బుల్లిష్ (అప్బీట్) మార్కెట్ యొక్క ప్రతిబింబముగా గానీ ఉండవచ్చు. ఇది స్టాక్ కొనుగోలు చేయడం లేదా విక్రయించడంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది.

సాంకేతిక చార్ట్స్ ఎలా చదవాలో తెలుసుకోవడానికి, మీరు ‘ఇండికేటర్స్’ పై క్లిక్ చేయడం ద్వారా మూవింగ్ సగటు లైన్స్ వంటి సాంకేతిక సూచనలను కూడా ఎంచుకోవచ్చు’. క్లోజింగ్ సగటు లైన్లు ఒక 50 రోజు లేదా 100 రోజుల మూవింగ్ యావరేజ్ వంటి సగటు ధరలు ఎలా కాలంగడిచిన కొద్దీ ఎలా సగటుగా అయ్యాయో మీకు చెబుతాయి.

స్టాక్ ధరల కోసం మద్దతు మరియు నిరోధకతను తెలుసుకోవడం

సోర్స్- యాహూ! ఫైనాన్స్

స్టాక్ చార్ట్స్ స్టాక్ ధర కోసం మద్దతు మరియు నిరోధక స్థాయిలను చూడటానికి మీ కోసం ఒక గొప్ప విజువల్ సాధనం. సాధారణంగా, స్టాక్ ధరలు కదిలి పెరిగి మరియు తగ్గినప్పటికీ, అవి కదులుతున్న ధర బ్యాండ్‌ను అనుసరించవచ్చు లేదా సపోర్ట్ కనుగొనవచ్చు. హైయర్ ఎండ్ న, ఒక ముఖ్యమైన ఈవెంట్ ట్రిగ్గర్ ఆ రెసిస్టెన్స్ స్థాయిలను ఉల్లంఘించడానికి స్టాక్ ధరలను పుష్ చేసే ముందు స్టాక్ ధరలు నిర్ధిష్ట ధర స్థాయిని ఉల్లంఘించి కదలవు అని మీరు కనుగొంటారు. లోయర్ ఎండ్ న, స్టాక్ ధరలు కొంత స్థాయిలో మద్దతు పొందుతాయి. స్టాక్ ధరలు  ఏదో గంభీరమైన సంఘటన లేదా కారణం వలన ఆ స్థాయిలు క్రింద పడే ముందు అనేకసార్లు మద్దతు స్థాయిలను తాకవచ్చు.

ఉదాహరణకు, పైన పేర్కొన్న చార్ట్‌లో, ఐటిసి స్టాక్ ధరలు 245.95 వద్ద మద్దతు మరియు ఆగస్ట్-సెప్టెంబర్ 2019లో 240 వద్ద నిరోధం కనుగొన్నాయి 

ముగింపు:

క్లుప్తంగా చెప్పాలంటే, దాని ప్రాథమికత వద్ద ఒక స్టాక్ చార్ట్ అనేది మార్కెట్లో స్టాక్ యొక్క డిమాండ్ మరియు సరఫరా యొక్క ఒక దృశ్య సమర్పణ, సమయానుగతంగా ధర కదలిక ద్వారా ప్రాతినిధ్యం వహించబడి ఉంటుంది.  మీరు స్టాక్ చార్ట్ ఎలా చదవాలో తెలుసుకున్నప్పుడు, మీరు ట్రెండ్లను స్పాట్ చేయడానికి, కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి వివిధ సాంకేతిక సూచికలతో, స్టాక్ మార్కెట్లో మార్కెట్ భావనను ఒక కీటక-కంటి దృష్టి మరియు డేగ- కంటి దృష్టి రెండింటితో పసిగట్టవచ్చు. ఇది స్టాక్ పనితీరు గురించి బాగా తెలిసిన అంచనాలు వేయడానికి మరియు విన్నింగ్ బెట్స్ ఎంచుకోవడానికి మీకు సహాయపడుతుంది.