మూలధన రక్షణ నిధి (క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్) అంటే ఏమిటి?

మూలధన రక్షణ నిధి (క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్) అనేది పెట్టుబడిదారుల మూలధనాన్ని సంరక్షించడంపై దృష్టి సారించే ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. మూలధన సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, ఈ ఫండ్‌లు సాధారణమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

వాటి స్వాభావిక పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ మరియు కొన్ని ఇతర ప్రయోజనాల కారణంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ మార్గాలలో మ్యూచువల్ ఫండ్‌లు ఒకటి అని తరచుగా ప్రచారం చేయబడతాయి. అది నిజమే అయినప్పటికీ, ప్రతికూల మార్కెట్ కదలికలు మరియు అనేక ఇతర అంశాల కారణంగా మీ పెట్టుబడి మూలధనం దాని విలువను కోల్పోయే ప్రమాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈట్టి సందర్భంలో మూలధన రక్షణ నిధి సహాయం చేయగలదు. ఇది ఏమిటి మరియు మీరు దీనిలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? అది తెలుసుకోవడానికి మీరు చదవడం కొనసాగించండి.

మూలధన రక్షణ నిధి (క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్) అంటే ఏమిటి?

మూలధన రక్షణ నిధి అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్, ఇది అధిక రాబడుల కంటే మూలధన సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇది సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్‌ల వలె కాకుండా, తరచుగా మూలధన విలువను పెంచడం ద్వారా మార్కెట్-బీటింగ్ రాబడులను అందించడం దీని లక్ష్యం.

వాటి నిర్మాణాత్మక పెట్టుబడి విధానం అనేది మూలధన రక్షణ నిధుల యొక్క ప్రాథమిక లక్షణాలలో ఒకటి. ఈ ఫండ్‌లు డెట్ మరియు ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ల మిశ్రమంలో పెట్టుబడి పెడతాయి, పెట్టుబడిదారుల మూలధనంలో ఎక్కువ భాగం స్థిర-ఆదాయం మరియు డెట్ సెక్యూరిటీల వైపు ఉంటుంది. మిగిలి ఉన్న కార్పస్‌ను మాత్రమే ఈక్విటీ విభాగంలో పెట్టుబడిగా పెట్టబడుతుంది.

ఫండ్ యొక్క స్థిర-ఆదాయం మరియు డెట్ కాంపోనెంట్ ప్రతికూల మార్కెట్ పరిస్థితులలో కూడా పెట్టుబడిదారుల మూలధనం రక్షించబడేలా చూసుకుంటుంది, అయితే ఫండ్ యొక్క ఈక్విటీ భాగం సాధారణమైన రాబడిని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది.

మరియు, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్స్ క్లోజ్డ్-ఎండ్ ఫండ్స్, అంనే వాటికి స్థిరమైన మెచ్యూరిటీ తేదీ ఉంటుంది. పేర్కొన్న మెచ్యూరిటీ తేదీకి ముందు పెట్టుబడిదారులు తమ వీటిలోని పెట్టుబడులను రీడీమ్ చేయలేరు. ఫండ్ యొక్క రకాన్ని బట్టి, మెచ్యూరిటీ తేదీ 1నుండి 5 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా ఉండవచ్చు.

ఎటువంటి ఆస్తులలో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్స్ పెట్టుబడులు పెడతాయి?

ఇప్పుడు మీకు మూలధన రక్షణ నిధుల యొక్క అర్థం తెలుసు, అవి పెట్టుబడి పెట్టే ఆస్తుల యొక్క రకాలను చూద్దాం.

  • రుణ సాధనాలు (డెట్ ఇన్‌స్త్రుమెంట్స్)

క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్‌లు తమ మూలధనంలో గణనీయమైన భాగాన్ని స్థిర-ఆదాయం మరియు రుణ సాధనాల్లో పెట్టుబడిగా పెట్టడం ద్వారా మూలధన సంరక్షణను ధృవీకరిస్తాయి. మీరు పెట్టుబడి పెట్టే ఫండ్ యొక్క రకాన్ని బట్టి డెట్ సెక్యూరిటీలకు కేటాయింపు శాతం మారవచ్చు; చాలా ఫండ్‌లు తమ కార్పస్‌లో 80% నుండి 90% వరకు రుణం కోసం కేటాయిస్తాయి.

చాలా క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్‌లు ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్‌లు మరియు ఏఏఏ(ఆఆఆ)-రేటెడ్ కార్పొరేట్ బాండ్‌లు వంటి తక్కువ-రిస్క్, స్థిర-ఆదాయ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి. ఈ సెక్యూరిటీలు ఫండ్‌కు స్థిరత్వాన్ని అందిస్తాయి మరియు పెట్టుబడి పెట్టిన మూలధనం యొక్క భద్రతను పెంచుతాయి.

  • ఈక్విటీ

ఫండ్ తన కార్పస్‌లోని మిగిలిన భాగాన్ని, దాదాపు 10% నుండి 20% వరకు, ఈక్విటీ విభాగంలో పెట్టుబడి పెట్టబడుతుంది. ఈక్విటీ విభాగానికి నిధుల యొక్క కేటాయింపు ఫండ్ మేనేజర్ యొక్క అభీష్టానుసారం ఉంటుంది, అంటే ఆ మేనేజర్ తన అనుభవం మరియు పరిశోధన ఆధారంగా పెట్టుబడి పెట్టడానికి స్టాక్‌లు మరియు రంగాలను నిర్ణయిస్తారు. ఈక్విటీ వైపు పరిమిత కేటాయింపు చేయడం అనేది మార్కెట్ నష్టాన్ని తక్కువగా ఉంచడంలో సహాయపడుతుంది, అదే సమయంలో పెట్టుబడిదారులను స్టాక్ మార్కెట్ యొక్క సంపద-సృష్టి అనే అవకాశాన్ని ఉపయోగించుకునేలా చేస్తుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్‌లు ఎందు వల్ల మెరుగైనవి?

సాంప్రదాయ ఫిక్సెడ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ(FD)ల) కంటే తరచుగా మూలధన రక్షణ నిధులు మెరుగ్గా పరిగణించబడటానికి ప్రధాన కారణాలలో అధిక రాబడికి గల సంభావ్యత అఏది ఒకటి. మూలధన రక్షణ నిధుల యొక్క ఈక్విటీ భాగం స్టాక్ మార్కెట్ యొక్క సంపద సృష్టి అవకాశాన్ని బహిర్గతం చేస్తుంది, అదే సమయంలో వ్యూహాత్మక ఆస్తి కేటాయింపు అనే వ్యూహాల ద్వారా ప్రతికూల ప్రమాదం తగ్గేలా చేస్తుంది.

అయితే, ఎఫ్‌డీ(FD)ల ద్వారా, మీరు మీ పెట్టుబడిపై స్థిరమైన రాబడిని మాత్రమే పొందుతారు, అధిక రాబడికి అవకాశం ఉండదు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు అందించే వడ్డీ రేట్లు కూడా తరచుగా క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్స్ యొక్క రిటర్న్-జనరేషన్ సంభావ్యత కంటే తక్కువగా ఉంటాయి.

క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్స్‌లో పెట్టుబడి ఎవరు పెట్టాలి?

దూకుడు రాబడి కంటే మూలధన సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చే కన్జర్వేటివ్ పెట్టుబడిదారులు మూలధన రక్షణ నిధులలో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు. పెట్టుబడి పెట్టబడిన మూలధనానికి అధిక స్థాయి భద్రతతో పాటు, ఈ ఫండ్స్ ఈక్విటీ కాంపోనెంట్ కారణంగా మధ్య రకమైఅన్ కాలం నుండి దీర్ఘకాలానికి సాధారణమైన రాబడిని అందిస్తాయి.

ఇందుకు అదనంగా, మొదటి సారి పెట్టుబడిదారులు, పదవీ విరమణ చేసిన వ్యక్తులు మరియు సీనియర్ సిటిజన్లు కూడా మూలధన రక్షణ నిధుల స్థిరత్వం మరియు ఆదాయ-ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆకర్షణీయంమైనవిగా కనుగొనవచ్చు. రిస్క్-దూకుడు పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియో రిస్క్‌ని వైవిధ్యపరచడానికి మరియు వారి పెట్టుబడులకు స్థిరత్వాన్ని అందించడానికి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడాన్ని కూడా ఎంచుకోవచ్చును.

క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్స్‌పై రాబడులకు హామీ ఉంటుందా?

క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్స్‌తో సహా ఎలాంటి మార్కెట్-లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లలో రిటర్న్‌లు హామీ ఇవ్వబడవు. ఈ ఫండ్‌లు కార్పస్‌లో గణనీయమైన భాగాన్ని ప్రభుత్వ బాండ్‌లు, టీ(T)-బిల్లులు మరియు అధిక-రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్‌లు వంటి అధిక-నాణ్యత గల రుణ సాధనాల్లో పెట్టుబడి పెట్టినప్పటికీ, అవి ఇప్పటికీ వడ్డీ మరియు క్రెడిట్ రిస్క్‌లను కలిగి ఉంటాయి.

అదే సమయంలో, ఫండ్ యొక్క ఈక్విటీ భాగం కూడా మార్కెట్ రిస్క్ మరియు అస్థిరతకు లోబడి ఉంటుంది, ఇది మార్కెట్ పడిపోతే పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఫండ్ మేనేజర్ తీసుకునే పెట్టుబడి నిర్ణయాలు కూడా ఫండ్ ద్వారా వచ్చే రాబడిపై ప్రధానంగా ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల, పెట్టుబడి పెట్టడానికి ముందు ఫండ్ ట్రాక్ రికార్డ్, పెట్టుబడి వ్యూహం మరియు ప్రమాద కారకాలను జాగ్రత్తగా అంచనా వేయడం ఉత్తమం.

నేను క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్‌ని ఏ విధంగా ఎంచుకోవాలి?

సరైన మూలధన రక్షణ నిధిని ఎంచుకోవడానికి అనేక అంశాల గురించి సమగ్ర పరిశోధన మరియు పరిశీలన చెయ్యడం అవసరం. ఫండ్‌లను ఎంచుకునేటప్పుడు మీరు తప్పనిసరిగా పరిగణించవలసిన కొన్ని ముఖ్య అంశాల యొక్క శీఘ్ర అవలోకనం ఈ కింద ఉంది.

  • పెట్టుబడి లక్ష్యం

మూలధన సంరక్షణ అనేది ప్రతీ మూలధన రక్షణ నిధి యొక్క ప్రాథమిక లక్ష్యం. అయితే, ఫండ్ యొక్క పెట్టుబడి లక్ష్యంలో కొన్ని వైవిధ్యాలు ఉండవచ్చు. అందువల్ల, పెట్టుబడి పెట్టడానికి ముందు ఫండ్ యొక్క పెట్టుబడి లక్ష్యం మీ లక్ష్యాలకు సరిపోలుతుందని ధృవీకరించుకోవడానికి ఫండ్ ఆఫర్ డాక్యుమెంట్‌లను క్షుణ్ణంగా చదవడం మంచిది.

  • పెట్టుబడి హొరైజన్

క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్స్ క్లోజ్డ్-ఎండ్ ఫండ్స్ మరియు వివిధ మెచ్యూరిటీ పీరియడ్‌లను కలిగి ఉంటాయి. ఉదాహరణకు, ఒక ఫండ్ ఒక సంవత్సరం మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉండవచ్చు, అయితే మరొకటి మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే మెచ్యూర్ కావచ్చు. ఫండ్‌ను ఎంచుకున్నప్పుడు, దాని మెచ్యూరిటీ వ్యవధి మీ పెట్టుబడి హొరైజన్‌కి సరిపోలుతుందని మీరు నిర్ధారించుకోవాలి.

  • రిస్క్ ప్రొఫైల్

మూలధన రక్షణ నిధుల రిస్క్ ప్రొఫైల్ అనేది వాటి ఆస్తి కేటాయింపు శాతాలు మరియు వాటి మిశ్రమాన్ని బట్టి మారవచ్చు. ఉదాహరణకు, ఈక్విటీలో దాదాపు 20% కార్పస్ పెట్టుబడి పెట్టే ఫండ్ దాని కార్పస్‌లో 10% మాత్రమే పెట్టుబడి పెట్టే ఫండ్ కంటే ఎక్కువ రిస్క్‌తో కూడుకున్నది.

  • ఆస్తి (అసెట్) రేటింగ్‌లు

మూలధన రక్షణ నిధిని ఎంచుకునేటప్పుడు పరిగణించవలసిన మరో ప్రధాన అంశం ఆస్తి రేటింగ్. ఏఏ(AA) మరియు ఏఏఏ(AAA) రేట్ చేయబడిన బాండ్‌లు తక్కువ రేటింగ్‌లను కలిగి ఉన్న బాండ్లతో పోలిస్తే సురక్షితంగా ఉంటాయి.

  • ఆస్తి కేటాయింపు (అసెట్ ఆల్లొకేషన్)

పెట్టుబడి లక్ష్యం, రిస్క్ ప్రొఫైల్, ఇన్వెస్ట్‌మెంట్ హోరైజన్ మరియు ఫండ్ మేనేజర్ యొక్క ప్రాధాన్యతలు వంటి అంశాలపై ఆధారపడి మూలధన రక్షణ నిధుల అసెట్ అలోకేషన్ మిశ్రమం (మిక్స్) మారుతూ ఉంటుంది. ఫండ్ యొక్క ఆస్తి కేటాయింపు ఎల్లప్పుడూ మీ లక్ష్యాలకు సరిపోలేలా ఉండాలి.

  • వ్యయ నిష్పత్తి (ఎక్స్పెన్స్ రేషియో)

వ్యయ నిష్పత్తి (ఎక్స్పెన్స్ రేషియో) అనేది మ్యూచువల్ ఫండ్స్ వారి యొక్క అడ్మినిస్ట్రేషన్, ఫండ్ మేనేజ్‌మెంట్ మరియు మార్కెటింగ్ ఖర్చులను కవర్ చేయడానికి విధించే రుసుము. అధిక వ్యయ నిష్పత్తులు మీ రాబడిని తగ్గించగలవు. అందువల్ల, నామమాత్రపు రుసుము విధించే నిధులను ఎంచుకోవడం మంచిది.

ముగింపు

అధిక రాబడి కంటే పెట్టుబడి భద్రత గురించి ఎక్కువ శ్రద్ధ వహించే పెట్టుబడిదారులకు మూలధన రక్షణ నిధులు మంచి పెట్టుబడి ఎంపికలు. ఈక్విటీ విభాగంతో ఎక్కువగా పరిచయం లేని కారణంగా, ఈ ఫండ్స్ ద్వారా రాబడి ఈక్విటీ ఫండ్ల కంటే సాధారణంగాను మరియు తక్కువగాను ఉంటుంది. అందువల్ల, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ఆధారంగా వాస్తవిక రాబడి అంచనాలను సెట్ చేసుకోవడం మంచిది.

FAQs

మూలధన రక్షణ నిధుల కోసం సాధారణ పెట్టుబడి హోరైజన్ ఏది?

మూలధన రక్షణ నిధులు నిర్ణీత మెచ్యూరిటీ తేదీతో ఉండే క్లోజ్డ్-ఎండ్ ఫండ్స్. వీటికి పెట్టుబడి హోరైజన్ మీరు ఇన్వెస్ట్ చేసే ఫండ్ రకాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకు, కొన్ని ఫండ్‌లు 3 సంవత్సరాల మెచ్యూరిటీ అవధిని కలిగి ఉండవచ్చు, అయితే మరికొన్ని ఇంకా ఎక్కువ మెచ్యూరిటీ అవధిని కలిగి ఉండవచ్చు.

ఇతర పెట్టుబడి ఎంపికలతో పోలిస్తే మూలధన రక్షణ నిధులకు ఉన్న ప్రమాదం ఎంత?

మూలధన రక్షణ నిధులు మూలధన సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, అవి మార్కెట్ మరియు క్రెడిట్ రిస్క్ స్థాయిని కలిగి ఉంటాయి. అయితే, ఇతర రకాల మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్స్ యొక్క రిస్క్ ప్రొఫైల్ తక్కువగా ఉంటుంది. వాస్తవానికి, ఇది సాంప్రదాయిక తక్కువ-రిస్క్ స్థిర-ఆదాయ సెక్యూరిటీలు మరియు అధికదూకుడు గల-ఎక్కువ రిస్క్ ఈక్విటీ ఫండ్‌లకు మధ్యన ఉంటుంది.

మూలధన రక్షణ నిధుల పనితీరును ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి?

ఇతర మార్కెట్-లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ మాదిరిగానే, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్స్ పనితీరును అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఫండ్ మేనేజర్ యొక్క నిర్ణయాలు, వడ్డీ రేటు మార్పులు, అంతర్లీన ఆస్తుల పనితీరు, మార్కెట్ అస్థిరత మరియు క్రెడిట్ రిస్క్ ఈ ఫండ్‌లను ప్రభావితం చేసే కొన్ని కీలక కారణాలు.

క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఏవైనా రుసుములు ఉంటాయా?

అవును. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వ్యయ నిష్పత్తి, అడ్మినిస్ట్రేషన్ ఫీజులు మరియు స్టాంప్ డ్యూటీ వంటివి మీకు విధించబడే కొన్ని సాధారణ రకాల ఛార్జీలు.